బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్! | Anushka Shetty reveals why she took a break after Baahubali | Sakshi
Sakshi News home page

Anushka Shetty: అందువల్లే పాన్‌ ఇండియా మూవీలో నటించలేదు: దేవసేన కామెంట్స్ వైరల్!

Published Thu, Sep 7 2023 6:47 PM | Last Updated on Thu, Sep 7 2023 7:54 PM

Anushka Shetty reveals why she took a break after Baahubali - Sakshi

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కశెట్టి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించింది. మిస్ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టితో చాలా రోజుల గ్యాప్‌ తర్వాత అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టితో కలిసి తెరపై మెరిశారు. పి. మహేశ్ బాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అ పాన్‌ ఇండియా మూవీ బాహుబలి-2 తర్వాత పెద్దగా చిత్రాల్లో కనిపించలేదు. ఆ విషయంపై అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోవడంపై తొలిసారి స్పందించింది. 

(ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!)

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-1, బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దేవసేన మెప్పించిన అనుష్క ఈ చిత్రం తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్‌లో ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాత 2018లో భాగమతితో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన నిశ్శబ్దంలో కనిపించింది. దీంతో పాన్‌ ఇండియా మూవీస్‌లో ఎందుకు నటించలేదనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన అనుష్క ఈ విషయంపై తొలిసారి క్లారిటీ ఇచ్చారు. 

అనుష్క మాట్లాడుతూ..'నేను బాహుబలిని చేసిన తర్వాత భాగమతి సినిమాకు ఓకే చెప్పా. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే ఆ సమయంలో అది నాకు చాలా అవసరం. అందువల్లే ఆ సమయంలో  పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదు. భవిష్యత్తులో మరిన్నీ ప్రాజెక్టులు చేయాలంటే బ్రేక్ తప్పనిసరి అనిపించింది. కొంత సమయం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ఎలాంటి స్క్రిప్ట్‌ వినలేదు. కానీ మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అది ఏ భాషలోనైనా కావొచ్చు.' అని తెలిపింది. చాలా రోజుల తర్వాత మిస్ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ప్రేక్షకులను అలరించింది భామ. చెఫ్ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. 

(ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్.. ఇప్పటికే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement