ఇలాంటి ఛాన్స్‌ కోసమే ఎదురు చూశా: ది రాజాసాబ్ హీరోయిన్ | Malavika Mohanan on Telugu debut with Prabhas In 'The Raja Saab' Movie | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: 'ప్రభాస్‌తో సినిమా ఛాన్స్.. నాలో ఎక్కడా లేని ఉత్సాహం'

Oct 23 2024 5:43 PM | Updated on Oct 23 2024 5:50 PM

Malavika Mohanan on Telugu debut with Prabhas In 'The Raja Saab' Movie

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ హారర్‌ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రభాస్ బర్త్‌ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్‌ మోషన్ పోస్టర్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పుట్టినరోజున ది రాజాసాబ్ అప్‌డేట్‌ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్‌ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అవకాశం రావడంపై స్పందించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. తెలుగులో నా మొదటి సినిమానే ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. 

కాగా.. ఇటీవల తంగలాన్‌ మూవీతో అలరించిన మాళవిక మోహనన్.. ది రాజాసాబ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో మొదటి సినిమానే రెబల్ స్టార్‌తో కలిసి నటించడం ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే. ప్రభాస్‌ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ ఏడాదిలో యుద్రా సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది తంగలాన్ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement