breaking news
The Raja Saab Movie
-
మరీ ఇన్ని ఫ్లాపులా! ఇది దురదృష్టమా లేదంటే?
ఏ హీరో ఏ దర్శకుడు ఏ నిర్మాత.. ఫ్లాప్ అవ్వాలని సినిమా తీయరు. జనాల్ని అలరించాలనే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కంటెంట్ లోపమో సరైన సమయంలో రిలీజ్ కాకపోవడమో అనుకున్నన్నీ థియేటర్లు దొరక్కపోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకటి రెండుసార్లు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ తీసిన మూవీస్ తీసినట్లు పోతుంటే ఏమనుకోవాలి? టాలీవుడ్లో ఓ ప్రముఖ నిర్మాత ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు? ఇంతకీ ఎవరాయన? అసలేం జరుగుతోంది?పైన చెప్పినందంతా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ గురించే. గత మూడేళ్లలో ఈ సంస్థ నుంచి 15 వరకు సినిమాలు వచ్చాయి. వీటిలో రెండు మూడు తప్పితే మిగతావన్నీ కూడా విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొన్నవే! గతంలో గూఢచారి, కార్తికేయ 2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ సంస్థ.. 2022 డిసెంబరులో 'ధమాకా'తో బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ మూవీ కంటెంట్‌పై విమర్శలున్నప్పటికీ కొన్ని అంశాలు కలిసిరావడంతో హిట్ అయిపోయింది. దీని తర్వాత నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్‌కి అస్సలు కలిసి రావట్లేదు.2023లో రిలీజైన సినిమాల్లో పవన్ కల్యాణ్-సాయితేజ్ నటించిన 'బ్రో' ఘోరంగా ఫెయిలైంది. గోపీచంద్ 'రామబాణం', నాగశౌర్య 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి', సుమ కొడుకు రోషన్ 'బబుల్గమ్' చిత్రాలూ ఫ్లాప్ అయ్యాయి. 2024లో గోపీచంద్ 'విశ్వం', శ్రీ విష్ణు 'స్వాగ్', రవితేజతో 'ఈగల్', 'మిస్టర్ బచ్చన్', నరుడి బ్రతుడు నటన తదితర మూవీస్ వచ్చాయి. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. గతేడాదీ(2025) ఈ నిర్మాణ సంస్థ నుంచి తెలుసు కదా, మనమే, మిరాయ్, మోగ్లీ మూవీస్ వచ్చాయి. వీటిలో తేజ సజ్జా 'మిరాయ్' మాత్రమే హిట్ అయింది. కాస్తోకూస్తో డబ్బులు రాబట్టగలిగింది. మిగిలన వాటి విషయంలో సేమ్ సీన్ రిపీట్.ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'రాజాసాబ్' అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పీడకలే మిగిల్చింది. ఎందుకంటే గత రెండు మూడేళ్లలో చాలా సినిమాలతో కోల్పోయిన డబ్బు.. ఈ మూవీతో తిరిగొచ్చేస్తుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆశపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. రిలీజైన తొలిరోజే ప్రభాస్ చిత్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితంగా రన్ ముగిసేసరికి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు.సాధారణంగా ఒకటో రెండో ఫ్లాపులు వస్తే సరే ఎక్కడో తప్పు జరిగింది అనుకోవచ్చు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటే.. తప్పు కాదు పెద్ద పొరపాటే జరుగుతోందని కచ్చితంగా చెప్పొచ్చు. గతంలో నిర్మాత విశ్వప్రసాదే పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేగంగా 100 సినిమాలు చేయడం తమ టార్గెట్ అని అన్నారు. తన టీమే కథలన్నీ వింటుంది అని కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఈ తప్పిదాలే ఇన్ని ఫ్లాపులకు కారణమవుతున్నాయా అనే సందేహం కలుగుతోంది!ప్రస్తుతానికైతే ఈ నిర్మాణ సంస్థ చేతిలో మిరాయ్ 2, జాంబీరెడ్డి 2, రాజుగారి గది 4, కార్తికేయ 3, గూఢచారి 2 తదితర చిత్రాలున్నాయి. వీటిపై కాస్తోకూస్తో హైప్ అయితే ఉంది. మరి వీటితో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇస్తారా? అనేది చూడాలి? -
'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్
ఈ సంక్రాంతి రేసులో మొదటి విడుదలైన మూవీ ‘ది రాజాసాబ్’.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కవ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అవసరం లేకున్నా హీరోయిన్స్‌ను ముగ్గురుని తీసుకోవడం.. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ లేకపోవడంతో మైనస్ అయింది. అయితే, ఫ్యాన్స్ సూచన మేరకు సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి మరికొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇంతలో మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే. ఇప్పటి వరకు రూ. 250 కోట్ల మేరకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. రాజాసాబ్ మూవీపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎన్నో డిజాస్టర్ సినిమాలతో దెబ్బతిన్న ఆ సంస్థ ఈ మూవీతో గట్టెక్కుతుందని భావించారు. కానీ, రాజాసాబ్ తెచ్చిన నష్టాలు నిర్మాతను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో ఆ సంస్థను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో సినిమా ప్లాన్ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నదే.. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్‌కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. 'స్పిరిట్' హక్కులుఇదే సమయంలో స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. అలా రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్‌ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషకం గురించి నిర్మాతతో చర్చించలేదట. -
ఫ్యాన్స్‌ను మెప్పించిన 'రెబల్ సాబ్' వచ్చేశాడు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్' నుంచి మరో వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే..అయితే, అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్న 'రెబల్ సాబ్' సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ఆడియో వర్షన్ విడుదలైన తొలి 24 గంటల్లో ఈ పాటకు దాదాపు 14.92 మిలియన్ వ్యూస్, 335.4K లైక్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సంజిత్ హెగ్డే, బ్లేజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. -
నిధితో ప్రభాస్ రొమాంటిక్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్
డార్లింగ్ ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి సహన సహనా అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా సహనా సహనా ఫుల్ వీడియో సాంగ్ వదిలారు. 'సహనా సహనా నా సఖి సహనా.. కలలో నిన్నే చూశానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. తమన్ అందించిన ఈ ట్యూన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. సింగర్ విశాల్ మిశ్రా ఆలపించాడు. ఈ పాటలో ప్రభాస్.. నిధి అగర్వాల్‌తో రొమాంటిక్ స్టెప్పులేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే జనవరి 9న విడుదలైన రాజాసాబ్ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వం వహించిన చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
పోలీసులకు నిర్మాత ఎస్కేఎన్ ఫిర్యాదు.. ది రాజాసాబ్ వల్లేనా?
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకుని అవమానపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూలత వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా.. ఇటీవల ది రాజాసాబ్ మూవీ రిలీజ్ తర్వాత ఎస్కేఎన్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్కేఎన్ ఆ తర్వాత కనిపించలేదని విమర్శలు చేశారు. కొందరు సోషల్ మీడియాలో ఎస్కేఎన్ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపైనే తనపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియా హ్యాండిళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వచ్చిన ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Producer @SKNonline has lodged a formal complaint at the Cyber Crime Police Station against certain social media handles that were impersonating him and posting derogatory and misleading remarks targeting the film and its actors. Such malicious acts are intended to create… pic.twitter.com/4pjlxhh9Ek— Telugu Film Producers Council (@tfpcin) January 23, 2026 -
దిల్ మాంగే మోర్ అనేలా 'ది రాజాసాబ్' వీడియో సాంగ్
ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ నుంచి "దిల్ మాంగే మోర్" పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. మాళవిక మోహనన్ ఫైట్ సీన్‌తో ప్రారంభమయ్యే ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాసర్ల శ్యామ్, అద్వితీయ ఓజ్జల రాసిన ఈ సాంగ్‌ను నకాష్ అజీజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో మాళవిక మోహనన్ గ్లామర్‌తో పాటు తనదైన స్టైల్లో ఫైట్స్‌తో అదరగొట్టింది. -
పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?
'వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' అనేది పాత సామెత అయ్యిండొచ్చు. కానీ ఏ తరానికి అయినా కచ్చితంగా పనికొచ్చేదే. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు వరసగా గ్లామరస్ మూవీస్ చేస్తారు. కొన్నాళ్లకు పూర్తిగా తెరమరుగైపోతుంటారు. కొందరు మాత్రం తన తలరాత మారుతుందని చెప్పి కొన్ని ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంటారు. తీరా చూస్తే అవి అడియాశలు అవుతుంటాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)స్టార్ హీరో సినిమాలో నటించారని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. అందుకు తగ్గట్లే చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ అదృష్టం కలిసొచ్చి ఫేట్ మారేది మాత్రం అతికొద్ది మందికే. మరికొందరికి మాత్రం ఘోరమైన దురదృష్టం తప్పితే మరొకటి మిగలదు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అలానే పవన్ కల్యాణ్, ప్రభాస్‌లపై బోలెడంత నమ్మకం పెట్టుకుంది. నాలుగేళ్ల విలువైన సమాయాన్ని వెచ్చించింది. మరో సినిమా చేయలేదు. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.2017లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2022 వరకు తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఎనిమిది సినిమాల వరకు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. 2019లో అలా పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటించే ఛాన్స్ నిధికి వచ్చింది. లాక్డౌన్, పవన్ రాజకీయాల వల్ల సినిమా చాలా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ చిత్రం నిధికి ఏ మాత్రం ఉపయోగపడలేదు.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్)రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్'లోనూ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్గా చేసింది. దాదాపు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం తనకు ఫేట్ మార్చేస్తుందని, హిట్ అవుతుందని నిధి చాలా నమ్మింది. కానీ బ్యాడ్ లక్. ఇది కూడా ఫ్లాప్ అయింది. సరేలే ఈ రెండు మూవీస్ ఫెయిలైతే అయ్యాయి అనుకోవచ్చు. వీటిలో నిధి అగర్వాల్ పాత్రలు ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా ఉండవు. దీంతో ఈ విషయంలోనూ ఈమెకు పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు.నిధి అగర్వాల్ ఇప్పటికైతే ఏ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు అయితే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక, శ్రీలీల, భాగ్యశ్రీ, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వీళ్లు కాకుండా రుక్మిణి వసంత్, మృణాల్ ఠాకుర్ లాంటి బ్యూటీస్.. స్టార్ హీరోలకు మెయిన్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి ఈ ముద్దుగుమ్మలని దాటుకుని నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటుందా? అనేది చూడాలి. ఒకవేళ లేదంటే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పరంగా వెనకబడిపోయే ప్రమాదముంది!(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్) -
సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్
చాలామంది హిట్టు కొట్టగానే సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు, ఫ్లాప్ రాగానే ఒక్కసారిగా డీలా పడిపోతారు. అయితే ఈ జయాపజయాలను ప్రభాస్ అస్సలు లెక్క చేయడంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ "ది రాజాసాబ్". ఇందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. చతికిలపడ్డ రాజాసాబ్మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అన్నింటికంటే ముందుగా దిగింది. భారీ అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. నెగెటివ్ టాక్ వల్ల మంచి కలెక్షన్స్ రాబట్టలేపోయింది. అయితే ప్రభాస్ వీటినేవీ పట్టించుకోడంటోంది నిధి అగర్వాల్.తలదూర్చడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడు. తన పనేదో తను చేసుకుపోతాడు. ఫేక్‌గా ఉండలేడు. చాలా మంచి వ్యక్తి. ఆయనంత హుందాగా నేను ఉండగలనా? అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ, ఆయనతో కలిసి పని చేశాక మరో విషయం అర్థమైంది. తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడు.ప్రభాస్‌ను కలిస్తే..ఎవరైనా సరే.. ఆయన్ను కలిసినప్పుడు తను ఓ స్టార్ హీరో అన్న విషయమే మర్చిపోతారు. ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటాడు. దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్ గురించి అసలు పట్టించుకోడు అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. చదవండి: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోలింగ్ పట్టించుకోనంటున్న బ్యూటీ -
వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!
ఏ హీరో.. ఏ దర్శకుడు.. ఏ నిర్మాత కూడా ఫ్లాప్ సినిమాని తీయాలనుకోరు. కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. కొన్నిసార్లు మాత్రం కాంబినేషన్ ప్రకటించినప్పుడే సందేహాలు వస్తుంటాయి. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అవి నిజమవుతుంటాయి. రీసెంట్ టైంలో 'రాజాసాబ్' ఓ ఉదాహరణ. ప్రభాస్ విషయంలో పలుమార్లు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది? ప్రభాస్ ఏం చేస్తున్నాడు?'బాహుబలి' ముందు వరకు ప్రభాస్ ఓ సాధారణ హీరోనే. చెప్పుకోవడానికి కొన్ని హిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే రాజమౌళితో ఈ మూవీ చేశాడో.. దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని నిలబెట్టుకునే క్రమంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది. తెలిసో తెలియకో ప్రభాస్ కొన్ని తప్పటడుగులు వేశాడు, ఇప్పటికీ వేస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది.ఎందుకంటే పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత ఏ హీరో అయినా సరే తనకు సూట్ అయ్యే దర్శకుల్ని, స్టోరీల్ని ఎంచుకుని సినిమాలు చేయాలి. అప్పుడు రేంజ్ పెరిగేందుకు అవకాశముంటుంది. క్రేజ్ ఉంది కదా అని తొందరపడకూడదు. ప్రభాస్ కూడా ఇలానే స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం లేని కొందరు మిడ్ రేంజ్ దర్శకులకు అవకాశాలిచ్చి తన విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడా అనిపిస్తుంది!'బాహుబలి' తర్వాత ఒకేఒక్క సినిమా తీసిన సుజీత్‌కి ప్రభాస్ అవకాశమిచ్చాడు. మూవీకి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఎందుకో ఆడియెన్స్‌కి మూవీ పూర్తిస్థాయిలో నచ్చలేదు. దీంతో యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' అయితే డార్లింగ్ ఫ్యాన్స్‌కి పీడకలగా మిగిలిపోయింది. ప్రభాస్ లాంటి నటుడిని పెట్టుకుని ఇలాంటి సినిమానా తీసేది అని దర్శకుడు రాధాకృష్ణని విమర్శించని వాళ్లు లేరు. తర్వాత వచ్చిన 'ఆదిపురుష్' అయితే ఇంకా దారుణం. కథ పరంగా పెద్దగా కంప్లైంట్స్ లేనప్పటికీ ప్రభాస్‌ని చూపించిన విధానం, మూవీలో ఉపయోగించిన గ్రాఫిక్స్‌పై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్‌ని ప్రభాస్ అభిమానులు ఎంతలా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సలార్, కల్కి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడని ఫ్యాన్స్ సంతోషించేలోపు.. 'రాజాసాబ్'తో ప్రభాస్‌కి మారుతి మర్చిపోలేని ఫ్లాప్ ఇచ్చాడు. కథ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ అస్సలు వర్కౌట్ కాలేదు. మూవీలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ తలని వేరే బాడీకి అతికించినట్లు ఉన్న కొన్ని సీన్స్ అయితే విపరీతమైన ట్రోలింగ్కి కారణమయ్యాయి. ఈ సినిమాలన్నీ గమనిస్తే.. పాన్ ఇండియా చిత్రాలు తీసిన అనుభవం లేని రాధాకృష్ణ, మారుతి లాంటి దర్శకులకు అవకాశమిచ్చిన ప్రతిసారీ ప్రభాస్ దారుణమైన ఫలితాలు చూశాడు. ఇకనుంచైనా కాస్త అనుభవమున్న డైరెక్టర్స్‌తో, ఆలస్యమైనా సరే మంచి కాన్సెప్ట్ మూవీస్ చేస్తే బెటర్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'స్పిరిట్', హను రాఘవపూడి తీస్తున్న 'ఫౌజీ' ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. -
'రాజే యువరాజే' వీడియో సాంగ్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' నుంచి 'రాజే యువరాజే' వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. సినిమాలో నిధి అగర్వాల్‌తో పరిచయం అయిన సమయంలో ఈ పాట ఉంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల అయింది. అయితే, డార్లింగ్ ఫ్యాన్స్ ఆశించినంత రేంజ్లో మూవీ మెప్పించలేదు. -
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
‘సినీ ప్రేక్షకులు మారిపోయారు. కేజీయఫ్, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్, ఎలివేషన్ ఉన్న సినిమాలకు తప్ప.. మిగతావాటిని చూసేందుకు థియేటర్స్‌కు రావడం లేదు’ అని మొన్నటిదాకా మన దర్శకనిర్మాతలు చెప్పిన మాటలివి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంకాంత్రికి తెలుగు ఆడియన్స్ తేల్చేశారు.కొట్టడాలు.. నరకడాలు లేకున్నా.. స్వచ్ఛమైన వినోదాన్ని అందించేలా సినిమా తీస్తే.. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తామని మరోసారి నిరూపించారు. ఈ సంక్రాంతికి తెలుగులో వరుసగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మూడు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినా .. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.ముందుగా హిట్ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ప్రీమియర్ షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న చిత్రం ‘మనశంకర వరప్రసాద్’. ఈ నెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అనగనగ ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా విజయాల బాట పడ్డాయి.ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే..ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఈ మూడింట్లోనూ గొప్ప కథేలేం లేవు. నిజం చెప్పాలంటే.. అసలు కథే లేదు. అయినా కూడా ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈ సినిమాల్లో కథ లేకున్నా..రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చునేలా చేసే స్వచ్ఛమైన వినోదం ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి తరలి వెళ్తున్నారు.చిరంజీవి కాబట్టి మన శంకరవరప్రసాద్ హిట్ అయిందని అనుకుంటే.. మిగతా రెండు సినిమాల్లోని హీరోలకు అంతపెద్ద ఫ్యాన్ ఫాలోయింగే లేదు. సినిమాలోని వినోదమే వారిని కాపాడింది. ఇక స్టార్ హీరో ఉంటేనే థియేటర్స్‌కి జనాలు వస్తారు అనుకుంటే ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ అతిపెద్ద విజయం సాధించాలి. కానీ అది జరగలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వినోదం ఉన్నా..ప్రేక్షకులను ఆ డోస్ సరిపోలేదు. అందుకే బాక్సాఫీస్ రేసులో కాస్త వెనకబడింది. సంక్రాంతి కాబట్టే ఈ సినిమాలు ఆడుతున్నాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కామెడీ చిత్రాలు ఏ సీజన్లో వచ్చినా చూస్తారు. పండగక్కి వస్తే.. ఇంకాస్త ఎక్కువ మంది చూస్తారు. అయితే ప్రతిసారి యాక్షన్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాలు కూడా వస్తే.. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సంక్రాంతి సినిమాలతో అర్థమైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే దమ్ము ఫ్యామిలీ డ్రామాల్లోనే ఉంది. అందుకే ఇక నుంచి మనవాళ్లు యాక్షన్‌తో పాటు వినోదాత్మక కథలపై కూడా దృష్టిపెడితే మంచిది. -
'రాజాసాబ్' హిట్ సాంగ్ వీడియో విడుదల
ప్రభాస్- మారుతి మూవీ ది రాజాసాబ్ నుంచి హిట్ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది. -
ది రాజాసాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆదిపురుష్ కంటే తక్కువే..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్‌ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మూడేళ్ల కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది
‘‘ది రాజా సాబ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా కోసం యూనిట్ అంతా మూడేళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారని భావిస్తున్నాం. ఈ సినిమాలో నన్‌గా నేను చేసిన బెస్సీ రోల్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను’’ అని నిధీ అగర్వాల్ తెలిపారు. ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల అయింది. ఈ నేపథ్యంలో నిధీ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘ది రాజా సాబ్’లో తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా చూపించారు మారుతిగారు. ప్రభాస్‌గారు తానో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో విశ్వప్రసాద్‌గారు రాజీ పడలేదు. ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఒకే సమయంలో చేశాను. ఈ సినిమాల షూటింగ్స్, ప్రయాణం వల్ల నిద్ర కూడా ఉండేది కాదు. ఆ టైమ్‌లో ‘రాజా సాబ్’ మేకర్స్ సెట్లో నన్ను బాగా చూసుకునేవారు. అందుకే నేనంటే సెట్లో అందరికీ ఇష్టమని ప్రభాస్‌గారు చెప్పారు. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని కోరుకున్నాను. ఎందుకంటే... మేమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు. -
'ప్రభాస్'ను ఒంటరిని చేశారా..? వాళ్లందరూ ఎస్కేప్
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'ది రాజా సాబ్'.. జనవరి 9న అందరికంటే ముందే సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే, సినిమాలో కొన్ని సీన్స్ తొలగించి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కూడా అన్నారు. దీంతో మారుతి వెంటనే సరిచేసి రెండోరోజే రీవర్షన్ చేశారు. దీంతో సినిమాపై మళ్లీ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇంతలో పండగ సినిమాలన్ని వరుసగా వస్తున్నాయి. దీంతో రాజాసాబ్ కొన్ని స్క్రీన్స్ కోల్పోతూ వచ్చింది. అయితే, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు సినిమాకు ప్రమోషన్ కరువైంది. సినిమా విడుదల ముందురోజు వరకు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లేకపోవడంతో కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. సినిమాకు ఎటూ పాజిటీవ్ వస్తుంది కాబట్టి.. కనీసం ఈ వీకెండ్ వరకు అయినా కాస్త ప్రమోషన్స్ జోష్ పెంచితే బెటర్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.ప్రభాస్ దర్శకుల స్పందన కరువురాజా సాబ్ రిలీజ్ తర్వాత కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ మమ అనిపించింది. ఆ తర్వాత కేవలం సోషల్‌మీడియాకే పరిమితం అయ్యారు. ప్రభాస్ అందుబాటులో లేడు కాబట్టి కనీసం తన పాత దర్శకులతో వీడియో బైట్స్, కామెంట్స్ అయినా చేపించుకోలేకపోయారు. పాన్ ఇండియా రేంజ్లో పేరున్న దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సుజీత్ వంటి వారందరికి ప్రభాస్‌తో మంచి స్నేహమే ఉంది. వాళ్లతో కలిసి ఆయన పనిచేశారు కూడా.. కానీ, వాళ్లు కూడా రాజా సాబ్ గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపారు. రాజా సాబ్ సినిమాను రీకట్ చేసిన తర్వాత చాలా బాగుందని టాక్ వస్తుంది. కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ, సరైన ప్రమోషన్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ సినిమా గురించి మాట్లాడకపోవడం కాస్త డ్యామేజ్‌ను పెంచాయని ఎక్కువగా వినిపిస్తుంది.ఎస్కేఎన్.. ఎస్కేప్రాజా సాబ్ విడుదలకు నిర్మాత ఎస్కేఎన్ భారీ డైలాగ్స్ పేల్చాడు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తనదైన స్టైల్లో పండగ..పండగ..రాజాసాబ్ పండగ అంటూ హైప్ పెంచాడు. అంతటితో ఆయన ఆగలేదు తన చొక్కా చించి మరీ రాజాసాబ్ పోస్టర్‌ను ఫ్యాన్స్‌కు చూపించి తన భక్తిని చూపించాడు. సినిమా విడుదల తర్వాత కనీసం ఆయన కూడా రాజాసాబ్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే, సంగీత దర్శకులు తమన్ గతంలో రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు మూవీ ప్రమోషన్‌కు ఎవరూ రాలేదు. అప్పుడు స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెబుతూ కాస్త ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు కనీసం తమన్‌ను మరోసారి రంగంలోకి దింపినా బాగుండు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్ వరకు అయినా సరే మారుతి, తమన్, ఎస్కేఎన్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపి ప్రమోషన్స్ చేస్తే కాస్త కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాజా సాబ్ రూ. 220 కోట్లకు దగ్గరలో ఉన్నాడు. -
ఆ సీన్స్‌లో ప్రభాస్ నటన అద్భుతం అంటున్నారు: దర్శకుడు మారుతి
‘‘ది రాజా సాబ్’ వంటి సినిమా చేయడం అంత సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్‌లోకి వెళ్లాడనే విషయాన్ని విజువల్‌గా స్క్రీన్‌పై చూపించడం చాలా కష్టం. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాను 40 రోజుల్లోనే రాసిన నేను, ‘ది రాజా సాబ్’ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రెండు నెలలు స్క్రిప్ట్ రాశాను. ఈ సీన్స్ గురించి నేను, ప్రభాస్‌గారు మాట్లాడుకున్నాం... ‘పెన్‌తో రాస్తున్నావా? లేదా గన్‌తో రాస్తున్నావా? డార్లింగ్’ అన్నారు ప్రభాస్‌గారు.ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ స్టార్ట్ కాకముందే నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల వసూళ్లు సాధించింది. మా ‘రాజా సాబ్’ ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ⇒ ‘ది రాజాసాబ్’లో సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఓ కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత సమయం పడుతుందని ముందే ఊహించాం. ‘కొత్త ప్రయత్నం చేశాం డార్లింగ్... ప్రేక్షకులకు చేరువ కావడానికి కొంత టైమ్ పడుతుంది.. నువ్వు ప్రశాంతంగా ఉండు’ అని ప్రభాస్‌గారు చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మేం ట్రైలర్లో చూపించిన ప్రభాస్‌గారి ఓల్డ్ గెటప్ సీన్స్ లేవని కొందరు ఫ్యాన్స్ అన్నారు. దీంతో ఈ సీన్స్‌ను యాడ్ చేశాం. కొత్త సీన్స్ యాడ్ చేశాక, సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని ప్రభాస్‌గారు అన్నారు.⇒ ప్రభాస్గారిలాంటి పాన్ ఇండియా హీరోతో సాదా సీదా హారర్ కామెడీ సినిమా చేయకూడదనే ఈ సినిమాలో సైకలాజికల్, మైండ్ గేమ్ ఎలిమెంట్స్ యాడ్ చేశాను. తొలిసారి చూసినప్పుడు ఈ సినిమా నచ్చుతుంది. రెండోసారి కూడా చూస్తే ఈ సినిమాలోని కాన్సెప్ట్ లోతుగా అర్థం అవుతుంది. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటే అనుకున్నది సాధించవచ్చనే సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించాం.హాస్పిటల్ సీన్లో రాజా సాబ్ పాత్ర తనకు బుర్ర తిరిగిపోతుందని ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు నానమ్మపై ప్రేమతో దెయ్యంపై గెలుస్తాడు. వేదికపై నేను చాలెంజ్ చేయలేదు. హాస్పిటల్ ఎపిసోడ్లో ప్రభాస్‌గారి నటన అద్భుతంగా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాను. నేను చెప్పినట్లుగానే రిలీజ్ తర్వాత ఆ సీన్లో ప్రభాస్‌గారి నటన అద్భుతం అని అందరూ అంటున్నారు. ⇒ నేను చిరంజీవిగారి ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తే నా లైఫ్ సర్కిల్ ఫుల్ అయిపోయినట్లుగా భావిస్తాను. -
సినిమా చూడలేకపోయా.. ఏడ్చేశా : ‘ది రాజాసాబ్’ డైరెక్టర్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్ రిలీజ్ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్ రిలీజ్ రోజు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
200 కోట్ల క్లబ్లో ‘ది రాజాసాబ్’
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్ర భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసిన ‘రాజాసాబ్’... నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ని విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టడం చూసి ట్రేడ్ వర్గాలు షాకవుతున్నాయి. అయితే ప్రభాస్ స్థాయికి ఈ కలెక్షన్స్ తక్కువే కానీ.. పోటీలో చిరంజీవి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో రావట్టడం గొప్ప విషయం.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ "రాజా సాబ్" హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. -
భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎంతంటే?
డార్లింగ్ ప్రభాస్ నటించిన ఫస్ట్ అండ్ లేటెస్ట్ హారర్ మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు రాబట్టింది.మూడురోజుల్లో ఎంతంటే?అయితే తర్వాతి రోజు నుంచి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.183 కోట్లు కోట్లు మాత్రమే వసూలు చేసింది. చూస్తుంటే పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. పైగా సోమవారం (జనవరి 12) నాడు చిరంజీవి మన శంకర వరప్రసాద్ రిలీజైంది. ఈ సినిమా బ్లాక్భస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రాజాసాబ్ వసూళ్లకు పెద్ద దెబ్బే పడేట్లు కనిపిస్తోంది. సినిమామరి సంక్రాంతి బరిలోని సినిమాల పోటీని తట్టుకుని రాజాసాబ్ నిలుస్తాడా? ఫైనల్‌గా ఎన్నికోట్ల మేర కలెక్షన్స్ రాబడతాడో చూడాలి! ది రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే.. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. A festival treat turned BOX OFFICE CARNAGE ❤️🔥❤️🔥#TheRajaSaab crosses 183+ Crores Worldwide Gross in just 3 days 🔥🔥&Gears up for the Sankranthi festive week with massive audience love ❤️❤️#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy… pic.twitter.com/KW6pv2nGkZ— People Media Factory (@peoplemediafcy) January 12, 2026 చదవండి: ది రాజాసాబ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రభాస్‌కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్‌కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్ సినిమా టైటిల్ ముందు The అనేది యాడ్ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్ కొనసాగినట్లే కనిపిస్తోంది...R అక్షరం వల్లే..ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన మూవీ ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా టైటిల్ రాజాసాబ్ ఆర్ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. నెగెటివ్ టాక్ప్రభాస్ నటించిన సెకండ్ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్ అని భారీ బడ్జెట్ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.సాహసం చేస్తాడా?ఇలా ఆర్ లెటర్‌తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్‌ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్ తీసుకుంటాడా? అన్నది చూడాలి! -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ మీట్లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్‌లో ప్రభాస్‌ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్‌లో షో సరైన టైమ్‌లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్‌కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ను టీజర్, పోస్టర్స్‌లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు. THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026 -
'ది రాజా సాబ్' స్పెషల్ మీట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)
-
చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్.. ప్రభాస్‌కు నో.. కారణం ఇదేనా?
సంక్రాంతి పండగ సందర్భంగా 'మన శంకర వరప్రసాద్‌గారు, ది రాజా సాబ్' చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ప్రీమియర్స్ లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. బయ్యర్లకు చుక్కలు కనిపించాయి. అయితే, కొన్ని గంటల్లోనే చిరంజీవి సినిమాకు ప్రీమియర్స్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీఓ విడుదల చేశారు. ఈ అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రభాస్ సినిమాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.నాకు సంబంధం లేదు: మంత్రితాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకి రాలేదని పేర్కొన్నారు. నాకు తెలియకుండానే జీవోలు ఇచ్చారని సంచలన కామెంట్ చేశారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం లేని నిందలు తనపై వేయకండి అంటూ ఆవేదన చెందారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు 2 రోజుల ముందే తెలంగాణ నుంచి ప్రత్యేక జీవో వచ్చేసింది. 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ వేసుకునేందుకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధర రూ. 600 రూపాయలుగా నిర్ణయించింది. ఆపై నైజాంలో ఎన్ని ప్రీమియర్స్ షోలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా సానుకూలంగా అవకాశం కల్పించింది. అయితే,రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్‌కు రాత్రి 10.30 దాటినా ప్రత్యేక జీవో రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.ప్రభాస్ ఫోన్ కాల్ చేయకపోవడంతో..ప్రభాస్, చిరంజీవి సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ GO జారీ వెనుకున్న కీలక అధికారి రాజా సాబ్ గురించి కలత చెందాడట. ప్రభాస్ తనను నేరుగా సంప్రదించకపోవడంతో ఆయన బాధపడ్డారని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ మొదటి నుంచి రాజకీయ విషయాలకు దూరంగా ఉంటారని తెలిసిందే.., కానీ ఆ అధికారి అతని నుండి నేరుగా కాల్ వస్తుందని ఆశించారని.. దీని కారణంగానే జీఓ విషయంలో ఆలస్యం అయిందని ఒక వర్గం ప్రచారం చేస్తుంది.రాజా సాబ్ నష్టం వెనుక నిర్మాత దిల్ రాజు ఉండవచ్చని కూడా కొందరు పేర్కొంటున్నారు. అతని వ్యాపార ప్రత్యర్థి నైజాం ఏరియాలో రాజా సాబ్ సినిమా పంపిణీదారుడిగా ఉన్నారట. అతన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, అతను ప్రభుత్వంలోని తనకు తెలిసిన సన్నిహితులతో గేమ్ ప్లాన్ చేశారని మరికొందరు ఆరోపించారు.ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా విమర్శలు ఉన్నాయి. పలు రాజకీయ కారణాలతో జీఓను విడుదలను ఆలస్యం చేస్తూ వచ్చారని, పదేపదే మరో ఐదు నిమిషాలు అంటూ కాలక్షేపం చేశారని అంటున్నారు. అయితే, రాత్రి 10 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ చేయడంతో వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చివరి నిమిషంలో జీఓ విడుదల చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో, అబద్ధమో తేలాల్సి ఉంది.చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్.. కారణం ఇదేనా..?టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలౌతుందటే.. వారిని వేర్వేరుగా చూడటం ఏంటి అంటూ ఇతర హీరోల అభిమానులు కూడా మండి పడుతున్నారు. అయితే, మన శంకర వర ప్రసాద్‌గారికి బెనిఫిట్స్ దొరకడం వెనుక నిర్మాత సాహు గారపాటి పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో ఆయనకు స్నేహం ఉందట. చాలా కాలంగా ఇరు కుటుంబాలు స్నేహంగా ఉండటం వల్లనే సకాలంలో జీఓను ఆయన తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు రకాలుగా రాజా సాబ్ అంశంలో వైరల్ అవుతుంది.మంత్రికి చెప్పకుండా జీఓ ఎవరిచ్చారు..?రాజా సాబ్, చిరంజీవి సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు విషయంలో జీఓ ఎవరిచ్చారో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా ఆయన ఇవ్వాల్సిన అనుమతులు ఎవరిచ్చారనేది రాజకీయ వర్గల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు. ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డి అనఫీషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారంటూ ప్రచారం ఉంది. ఆయన నేతృత్వంలో ఇదంతా జరిగిందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. -
‘శరచ్చంద్రికా తేజయామిని..’ చాలా మందికి అర్థం కాలేదు
‘‘నేను లిరిసిస్ట్‌గా 2012లో కెరీర్ స్టార్ట్ చేస్తే, అప్పట్నుంచి నంది అవార్డులు లేవు. మన ప్రతిభకు అవార్డులు కొలమానం కాదని భావిస్తాను. ఒకవేళ అవార్డ్స్ వస్తే అవి బోనస్’’ అని చెప్పారు ప్రముఖ గీత రచయిత కేకే (కృష్ణకాంత్). నేడు (శనివారం) కేకే పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘2025లో నేను పాటలు రాసిన 22 చిత్రాల నుంచి 45 పాటలు విడుదలయ్యాయి. 2025లో నాకు చాలెంజింగ్‌గా అనిపించిన పాట ‘ది రాజాసాబ్’ సినిమాలోని ‘సహనా సహనా’. ఇక ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌గార్లు కలిసి డ్యాన్స్ చేసిన ‘సలామ్ అనాలి’ (‘వార్ 2’ సినిమా) పాట రాయడం సంతోషంగా అనిపించింది. రజనీకాంత్‌గారి ‘కూలీ’ సినిమాలోని ‘మౌనిక’ పాట తెలుగు వెర్షన్ రాశాను. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలోని అన్ని పాటలు రాశాను. ‘మిరాయ్’ చిత్రంలోని ‘వైబ్ ఉంది’ సాంగ్ యూట్యూబ్‌లో 130 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లింది. ప్రభాస్, నాని, శ్రీవిష్ణుగార్లు నన్ను నమ్మి అవకాశం కల్పిస్తున్నారు. నేను ప్రభాస్‌గారి అభిమానిని. కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాలకు పాటలు రాస్తే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు ప్రభాస్‌గారి వరుస చిత్రాలకు (సాహో, రాధేశ్యామ్, సలార్, ఫౌజి) పాటలు రాయడం హ్యాపీ. ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’, ఎన్టీఆర్‌గారి ‘ఎన్టీఆర్ నీల్’, విజయ్ సేతుపతి ‘పూరీ సేతుపతి’ సినిమాలతో పాటు చాలా సినిమాలకు పాటలు రాస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పాటల్లో ఇంగ్లిష్ పదాలు తక్కువగానే ఉంటాయి. ‘ది రాజాసాబ్’లో ‘శరచ్చంద్రికా తేజయామిని..’ పాట రాశాను. చాలామందికి ఈ పదాలు అర్థం కాలేదు. అర్థం కాలేదని తెలుగు రాయకుండాపోతే మన భాషను మర్చిపోతాం. అయితే ట్రెండ్‌నూ ఫాలో అవుతాను’’ అని చెప్పారు. -
'ది రాజా సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అధికారిక ప్రకటన
ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ గత సినిమాల కంటే కాస్త తక్కువగానే కలెక్షన్స్ వచ్చాయి. రాజా సాబ్ సినిమా విషయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాలో చూపించలేదంటూనే.. అవసరం లేకున్నా సరే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజా సాబ్ సక్సెస్‌మీట్‌లో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 112 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ల బుకింగ్ భారీగా జరుగుతుందన్నారు. చాలామంది తమ కుటుంబంతో పాటుగా థియేటర్‌కు వెళ్తున్నారని గుర్తుచేశారు. హరర్, ఫాంటసీ చిత్రాలకు సంబంధించి ఫస్ట్ డే ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. -
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి
'రాజాసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదు. ట్రైలర్లో ప్రభాస్‌ను ఓల్డ్ గెటప్‌లో చూపించాం. థియేర్లో ఆ సీన్స్ ఎక్కడ? అని వెతికే క్రమంలో కథ ఎవరికీ ఎక్కలేదు' అన్నాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్ ప్రభాస్‌ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. 'రాజాసాబ్.. కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్ థియేటర్లో ప్రీమియర్స్ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. సారీమారుతి మాట్లాడుతూ.. విమల్ థియేటర్ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్.మూడేళ్ల కష్టంనెక్స్ట్.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్‌ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్‌కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దుఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.రియల్ రాజాసాబ్ట్రైలర్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించాం. సినిమాలో ఆ సీన్స్ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్ జత చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం నుంచి రియల్ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.చదవండి: మాట మీద నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి -
తెలుగు సినిమాలకు 'ప్రీమియర్ షోలు' అవసరమా?
టాలీవుడ్లో గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిన్నా పెద్దా సంబంధం లేదు. దాదాపు ప్రతి సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. వీటి వల్ల చిన్న సినిమాలకు కాస్త ప్లస్ అవుతోంది గానీ పెద్ద చిత్రాలకు మాత్రం మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే ఊహించని దానికంటే మైనస్ అవుతుంది. ఏ చిత్రమైనా సరే ప్రీమియర్ షోలు వేయడం నిజంగా అవసరమా?పది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలోనూ ఒకటో రెండో థియేటర్లు ఉండేవి. ప్రతివారం చిన్నా పెద్దా సినిమాలు అందులో రిలీజయ్యేవి. టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉండేది కాదు. స్టార్ హీరోల మూవీస్ అయినా చిన్న హీరోల చిత్రాలైనా ఒకటే రూల్. కాకపోతే పేరున్న హీరోల సినిమాలకు కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చేవి. అప్పట్లో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు లాంటి హంగామా ఉండేది కాదు. అంతా ప్రశాంతం. అప్పట్లో కథలు కూడా ప్రేక్షకులు తమని తాము సినిమాల్లోని ఆయా పాత్రలతో పోల్చి చూసుకునేలా ఉండేవి.కానీ ఇప్పుడు నగరాల్లో తప్ప ఊళ్లలో థియేటర్లు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. సిటీల్లో అయినా గ్రామాల్లో అయినా వీకెండ్ వస్తేనే చాలా తక్కువ మంది ప్రేక్షకులు.. థియేటర్ వైపు చూస్తున్నారు. మరీ బాగుంది అనిపిస్తే తప్పితే సినిమాకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. టికెట్ ధరల్లోనూ చిన్న పెద్ద సినిమాలకు బోలెడంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రి లేదంటే వేకువజామున షోలు వేస్తున్నారు. వీటి వల్ల బోలెడంత నెగిటివిటీ ఏర్పడుతోంది.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')మనసు ప్రశాంతంగా ఉంటేనే సినిమాని ఆస్వాదించగలం. రాత్రివేళల్లో దాదాపు అందరూ నిద్రపోయే సమయాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. థియేటర్‌కి వచ్చి చూసే ప్రేక్షకుల్లోనూ చాలామందికి అది నిద్రపోయే టైమ్ అయ్యిండొచ్చు. వాళ్లు మూవీని నిద్ర మబ్బుతో చూడటం, సినిమాలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, రివ్యూలు చెప్పడం వల్ల మరింత చేటు జరుగుతోంది. అదే రిలీజ్ రోజు ఉదయాన్నే సినిమా చూస్తే బాగలేకపోయినా మూవీ కూడా పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అని అనిపించే అవకాశముంది.కానీ గత కొన్నాళ్ల నుంచి తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టిన బడ్జెట్ ఎలాగైనా రాబట్టేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్నారు. వందల వందల రూపాయల టికెట్ ధరలకు అదనంగా పెంచేస్తున్నారు. దీనివల్ల సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుడు.. థియేటర్‌కి వెళ్తాడేమో గానీ సగటు మధ్య తరగతి ప్రేక్షకుడు.. ఇంతింత ఖర్చు చేసి ఇప్పుడు వెళ్లడం అవసరమా? ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాంలే అని తనలో తానే అనుకుంటున్నాడు. ఇదేదో ఒకటి రెండుసార్లు జరిగితే పర్లేదు. అలవాటు అయిపోతే మాత్రం అలాంటి ప్రేక్షకుడిని తిరిగి థియేటర్‌కి తిరిగి రప్పించడం కష్టం. ప్రస్తుతం అలానే చాలామంది థియేటర్లకు దూరమైపోయారు. ప్రీమియర్ షోలే ఇలాంటి వాటికి ప్రధాన కారణమవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రీమియర్ షోలు వేయాలి, టికెట్ ధరలు పెంచేయాలని అనుకుంటున్నారు తప్పితే సరైన కంటెంట్‌తో వద్దాం. సాధారణ ధరలకే టికెట్స్ అమ్ముదాం అని మాత్రం ఆలోచించట్లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్) -
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్ కాపీ కొట్టి.. ఒరిజినల్ కంపోజర్కే దొరికిపోయాడు. తమన్ లేటెస్ట్గా ది రాజాసాబ్ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్‌తో కలిసి స్టెప్పులేశాడు.కాపీ కొట్టాడా?అయితే ఈ పాట ఒరిజినల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్.. తన ఒరిజినల్ సాంగ్ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్‌లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజాసాబ్ రిలీజ్ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Vidojean (@vidojean) చదవండి: నావాడిని కలిసానోచ్.. రోహిణి -
ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్'
'నాన్న-పులి' కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఏం చెప్పినా నిజాయితీగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే రిస్క్. వందల కోట్లతో డీల్ చేసే సినిమా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులతో పరాచకాలు ఆడకూడదు. ఎందుకంటే దక్షిణాదిలో కొందరు దర్శకులు సినిమాలతో బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ తమ క్రియేటివిటీతో థియేటర్‌కి వచ్చేవాళ్లని మోసం చేస్తున్నారు. తాజాగా వచ్చిన 'రాజాసాబ్'తో మరోసారి అలాంటిదే రిపీటైంది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)'రాజాసాబ్'నే తీసుకుందాం. ప్రభాస్.. ఓల్డ్ గెటప్‌ని ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ట్రైలర్లో చూపించారు. ఈ గెటప్‌కి అదిరిపోయే డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్ ఉందని ఊరించి అభిమానులకు ఆశలు పెంచేశారు. కట్ చేస్తే మూడు గంటల సినిమాలో దీనికి సంబంధించిన ఒక్క సీన్ లేదు. కథకు అడ్డొస్తుందని తీసేశారా? సీక్వెల్ కోసం దాచుకున్నారా? తెలియదు. ఇప్పుడొచ్చిన ఫస్ట్ పార్ట్‌లో ఇది ఉండదు అని ఫిక్సయినప్పుడు.. ప్రమోషన్లలో వీటిని ఉపయోగించడం అవసరమా? అసలు సినిమాకు కాస్తోకూస్తో హైప్ ఏర్పడిందే ఈ లుక్ వల్ల. అలాంటి ఈ గెటప్ సీన్స్ తీసేస్తే.. ప్రేక్షకుల్ని మోసం చేసినట్లేగా!గతంలోనూ ఇలాంటి షాకులే స్టార్ హీరోల సినిమాలతో దర్శకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళ దర్శకుడు శంకర్.. చాన్నాళ్ల క్రితమే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'రోబో' తర్వాత విక్రమ్ హీరోగా 'ఐ' అనే స్ట్రెయిట్ సినిమా తీశాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో విక్రమ్ బీస్ట్(జంతువు గెటప్)లా కనిపించడం చూసి అంతా వావ్ అని ఆశ్చర్యపోయారు. లుక్కే ఇంత బాగుందంటే సినిమాలో ఆయా సీన్స్ ఇంకెలా ఉంటాయోనని తెగ ఊహించేసుకున్నారు. కట్ చూస్తే పాటలో ఒకటి రెండు సీన్స్‌లో మాత్రమే దీన్ని చూపించి మోసం చేశారు!(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)మహేశ్ బాబు 'స్పైడర్' సినిమా నుంచి తొలి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు.. మెషీన్ స్పైడర్‌ని చూపించి హైప్ ఇచ్చారు. కానీ దీన్ని సినిమాలో ఎక్కడా పెట్టలేదు. ప్రమోషన్ కోసమే చేసింది ఇది అని అభిమానులు, ప్రేక్షకులకు ముందే చెప్పి ఉంటే బాగుండేది. కానీ మూవీ టీమ్ అలా చేయలేదు. తీరా సినిమా రిలీజయ్యా ప్రేక్షకులు.. చాలా డిసప్పాయింట్ అయ్యారు. దర్శకుడిని గట్టిగా తిట్టుకున్నారు.రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లో గోల్డెన్ వాచీలని హైలైట్ చేసి చూపించారు. దీంతో చాలామంది ఆడియెన్స్.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అని రకరకాల థియరీలు వేసుకున్నారు. అది వాచీల స్మగ్లింగ్ కోసమే అని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీరా రిలీజైన తర్వాత మూవీ చూస్తే ఈ వాచీల కాన్సెప్ట్‌కి సినిమాలో అసలు ప్రాధాన్యమే లేదు. ఇది తెలిసి చాలామంది ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఇలా పలుమార్లు పలువురు దర్శకులు.. ఫస్ట్ లుక్‌తో ఒకలా, మూవీలో ఆ కాన్సెప్ట్ మరోలా చూపించి మోసం చేశారు!(ఇదీ చదవండి: జనవరి 10.. టాలీవుడ్ భయపడుతోందా?) -
'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)
-
'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?
ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం రాత్రి ప్రీమియర్లతో షోలు మొదలయ్యాయి. అయితే హారర్ ఫాంటసీ మూవీతో డార్లింగ్ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అభిమానులకు అంతో ఇంతో నచ్చింది కానీ సగటు ప్రేక్షకుడి నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఇలాంటి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? మార్కెట్లో వినిపిస్తున్న నంబర్స్ ఏంటి?ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ అని అన్నారు గానీ ఇందులో హిప్నాటిజం, మైండ్ గేమ్, సైకాలజీ, ప్యారలల్ వరల్డ్.. ఇలా చాలా అంశాల్ని చూపించి వివరించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. దీని వల్లే మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. అలా అని బుకింగ్స్ ఏం డల్లుగా లేవు. తొలిరోజు డీసెంట్ నంబర్స్ నమోదయ్యాయి.(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)ప్రీమియర్లు, తొలిరోజు కలిపి 'రాజాసాబ్' చిత్రానికి రూ.55-60 కోట్ల మధ్య నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. మూవీ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తే, దానిబట్టి వసూళ్ల విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోకి ఈ కలెక్షన్ అనేది ఊహించిన దానికన్నా తక్కువే అని చెప్పొచ్చు. అసలు నంబర్స్ వస్తే ఎంతనేది క్లారిటీ వస్తుంది.'రాజాసాబ్' స్టోరీ విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!) -
'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!
బిర్యానీ వండాలంటే పక్కా ప్లానింగ్ ఎంత అవసరమో.. దాన్ని తినాలన్నా అలాంటి ప్లానింగే ముఖ్యం. 'రాజాసాబ్' పరిస్థితీ ఇలానే తయారైంది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జనవరి 9న అని పక్కాగానే ప్లాన్ చేసుకున్నారు. తీరా థియేటర్లలోకి వచ్చే చివరి నిమిషం వరకు అంతా గందరగోళమే. మొత్తం ఆదరాబాదరానే. ఇంతకీ 'రాజాసాబ్' విషయంలో ఏమేం తప్పిదాలు జరిగాయి?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)తెలంగాణలోని ప్రీమియర్స్ ప్లానింగ్ ఘోరంగా ఫెయిలైంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు జీవో ముందే వచ్చేసింది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. తెలంగాణకు వచ్చేసరికి రిలీజ్ రోజు(జనవరి 09న) వేకువజామున జీవో జారీ అయింది. 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్స్ ఉంటాయని ప్రకటించారు. కానీ అటు జీవో రాకపోవడంతో విడుదలకు కొన్ని గంటల ముందు వరకు నిర్మాతలు.. బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సెన్సార్ త్వరగానే పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు గానీ నైజాంలో ప్రీమియర్స్, రెగ్యులర్ బుకింగ్స్ విషయంలో ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.ప్రమోషనల్ కంటెంట్ విషయంలోనూ 'రాజాసాబ్' టీమ్ సరైన ప్లానింగ్ చేసుకోలేదా అనిపించింది. ఎందుకంటే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి కాస్తోకూస్తో హైప్ వచ్చేలా చేశారు కానీ పాటలు మాత్రం ఎందుకనో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ విడుదలకు చాలా రోజులు ముందుగానే చేసేశారు. ప్రభాస్ పాల్గొన్న ఒకే ఒక్క ఇంటర్వ్యూని విడుదలకు ముందురోజు వరకు ఆన్లైన్లో వదల్లేదు. 'నాచో నాచో' అనే పాట కేవలం హిందీ, తమిళంలోనే రిలీజ్ చేశారు. తెలుగులో సినిమా చేస్తూ తెలుగు వెర్షన్ పాట లేకపోవడం ఏంటో?(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)'రాజాసాబ్' కోసం దాదాపు నాలుగున్నర గంటల ఫుటేజీ చిత్రీకరించామని స్వయంగా దర్శకుడి మారుతినే బయటపెట్టారు. తీరా చూస్తే మూడు గంటల సినిమాకే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రభాస్.. ముసలి గెటప్‌లో కనిపించి, చేసే ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా తీసేశారు. కథకు అవసరమా లేదా అని ముందే ఆలోచించి ఉంటే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు ఉండేవి కాదుగా! అసలు ప్రభాస్ ఓల్డ్ గెటప్ వల్లే మూవీపై కాస్త హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే లేదని తెలిసి అందరూ నిరుత్సాహపడుతున్నారు.తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలోనూ మూవీ టీమ్ ప్లానింగ్ బెడిసికొట్టిందనే చెప్పొచ్చు. సింగిల్ బెంచ్‌కి వెళ్లి అనుకూలంగానే ఉత్తర్వులు తెచ్చుకున్నారు కానీ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల పంపు మెమోని తెలంగాణ హైకోర్టు ఇప్పుడు సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లు అమ్మాలని బుక్ మై షోని ఆదేశించింది. గత నెలలో 'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు హంగామా జరిగినప్పుడే.. 'రాజాసాబ్' టీమ్ అలెర్ట్ అయి, సరైన నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ అలా చేయలేకపోయారు. (ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?) -
'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్
ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు, నిర్మాతలకు షాకిచ్చింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షోని ఆదేశించింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నం.120 ప్రకారం 350లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ పేర్కొంది.అలానే పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని, అలానే అధికారుల తీరుపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని మండిపడింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని స్వయంగా మంత్రి చెప్పినా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు, అధికారుల్ని ప్రశ్నించింది.టికెట్ ధరల పెంపు కోసం మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలని సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. -
టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'రాజాసాబ్' జనవరి 9న విడుదలైంది. అయితే, తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పబట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు ప్రశ్నించింది.టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాశంగా మారింది.తెలంగాణలో ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు. జనవరి 9 నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, 12 నుంచి 18వ తేదీ వరకు ఆ ధరలను సడలించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపింది. -
'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. సినిమా బాగుందా బాగోలేదా అనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ డీటైల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.'రాజాసాబ్' విడుదలకు కొన్ని నెలల ముందే ఓటీటీ హక్కుల్ని జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. రూ.160 కోట్లకు అన్ని భాషల హక్కుల్ని దక్కించుకుందని సమాచారం. నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది భాషలకు సంబంధించి ఫిబ్రవరి తొలివారంలో స్ట్రీమింగ్ ఉండొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగానే అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్)'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.ఇకపోతే 'రాజాసాబ్'కి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. 'రాజాసాబ్ సర్కస్ 1935' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. మరోవైపు ప్రమోషన్లలో చూపించిన ప్రభాస్ వృద్ధుడి గెటప్, దానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని సినిమా నుంచి తీసేశారు. కావాలని తీసేశారా? లేదంటే సీక్వెల్ కోసం దాచుంచారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ) -
ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్
ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్ టీమ్.. ప్రభాస్‌ను మోస్ట్ హ్యాండ్సమ్ లుక్‌లో చూపించారు. సినిమాలో డార్లింగ్ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.అటు వింటేజ్ లుక్.. ఇటు ఓల్జ్ ఏజ్ లుక్టీజర్, ట్రైలర్లో ప్రభాస్‌ను ఓల్డ్ ఏజ్ లుక్‌లో చూపించారు. సినిమాకు హైప్ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్ లుక్, ఇటు ఓల్జ్ ఏజ్ లుక్‌లో ప్రభాస్‌ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది. సినిమాఅయితే ఈ సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్‌లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaab https://t.co/EZYyncCc8R— Abhi063 (@Ab0612ish) January 9, 2026 View this post on Instagram A post shared by Movie Mirchi (@movie_mirchi___) First scam in 2026This look 😭😭pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్
-
ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
-
రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.థియేటర్లో మొసళ్లు?అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్ అని నినాదాలు చేస్తున్నారు. అదీ సంగతి!ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్లోనూ ఆ క్లిప్ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు. సినిమారాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైంది. Prompt crt ga eyaledu bhai adu screen atu side untey seats etu side pettadu https://t.co/mlcCuWnGui— Nikkar Narayana ™ (@urstrulynikkar1) January 8, 2026Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026Ehh mental nakoduluu crocodile 🐊 ni sav dengaru climax lo edi USA ani chepandra vadikii 🥵🥵🥵😭😭💥💥💥💥💥#RajaSaab pic.twitter.com/e7Io1fZ1PZ— Virat Kohli (@Kranthi_1322) January 8, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)
-
‘ది రాజాసాబ్ 2’ కూడా ఉంది.. టైటిల్ ఇదే!
పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ చిత్రాలన్నింటికి పార్ట్ 2 ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలకు సీక్వెల్ కథలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి ‘ది రాజాసాబ్’ కూడా చేరింది. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'ది రాజాసాబ్' ఈరోజు(జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంది. ( చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)పార్ట్ 2కి ‘రాజాసాబ్ సర్కస్: 1935’గా టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. రాజాసాబ్ సినిమా ఎండింగ్లో సీక్వెల్‌కి లీడ్ ఇస్తూ ప్రభాస్ లుక్‌ని పరిచయం చేశారు. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చనే చర్చ నడుస్తోంది. ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలు రాజాసాబ్‌లో చూపించలేదు. అవన్నీ పార్ట్ 2లో చూపించే అవకాశం ఉంది. 'ది రాజాసాబ్'లో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో సీక్వెల్ ప్రకటన ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది.సీక్వెల్ వివరాలు, షూటింగ్ షెడ్యూల్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ది రాజాసాబ్నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్రచన-దర్శకత్వం: మారుతిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళనిఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జనవరి 9,2026ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటించిన తొలి హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో రాజాసాబ్‌పై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 9)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ(The Raja Saab Movie Review)లో చూద్దాంకథేంటంటే..రాజు అలియాస్ రాజాసాబ్(ప్రభాస్)కి నాన్నమ్మ గంగాదేవి(జరీనా) అంటే ప్రాణం. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి సోకడంతో ఏ విషయానైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని..అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి..తాత కోసం రాజాసాబ్ సిటీకి వెళ్తాడు. అక్కడ బ్లెస్సీ(నిధి అగర్వాల్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన భైరవి(మాళవిక మోహన్)..రాజాసాబ్తో ప్రేమలో పడుతుంది. ఆమె ద్వారా తాత నర్సాపూర్ అడవిలో ఉన్న ఓ కోటలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత రాజాసాబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? చనిపోయిన తాత ఆత్మ ఆ కోటలోనే ఎందుకు ఉంది? కనకరాజు నేపథ్యం ఏంటి? దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగా... సామాన్యురాలిగా ఎందుకు బతకాల్సి వచ్చింది? ఈ కథలో గంగరాజు(సముద్రఖని) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే( The Raja Saab Movie Review). ఎలా ఉందంటే..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా అనగానే మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్లే మారుతిపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ని స్టైలీష్ లుక్‌లో చూపించడమే కాకుండా ఆయనలో దాగిఉన్న కామెడీ యాంగిల్‌ని చాలాకాలం తర్వాత మరోసారి బయటకు తీశాడని మారుతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరకంగా ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను మాత్రం మారుతి పూర్తిగా అందుకోలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగానే కథను రాసుకున్నా.. దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెటుకోనే కొన్ని అనవసరపు సన్నివేశాలను ఇరికించి..అసలు కథకి అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది.ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పినట్లుగా ఇది నాన్నమ్మ-మనవడి కథే. నేపథ్యం కూడా కాస్త కొత్తగానే ఉంది. అయితే ఈ కథని గందరగోళం లేకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే సినిమా బాగుంది అనిపించినా.. ఓవరాల్‌గా మాత్రం ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మారుతి రాసుకున్న కామెడీ సన్నివేశాలు.. ప్రభాస్ నటన ఆ లోపాన్ని కాస్త కప్పిపుచ్చాయనే చెప్పాలి. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ మెండుగానే ఉన్నా.. ఒకటి,రెండు సీన్లు తప్ప మిగతావేవి భయపెట్టలేదుకమెడియన్ సత్య కోటలోకి అడుగుపెట్టే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాంగ్‌తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం కాసేపు నాన్నమ్మ-మనవడిల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్లడం..అక్కడ బ్లెస్సీ, భైరవిలతో ప్రేమాయణం..ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతూనే..మధ్యలో గంగరాజు పాత్రని చూపిస్తూ.. ఆయనకు తాతకు మధ్య ఏదో సంబంధం ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపించారు. ఇక తాత నేపథ్యం చెప్పినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కనకరాజు-గంగాదేవి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. (Positives And Negatives In Rajasaab Movie)ఇక ద్వితీయార్ధంలో కథనం మొత్తం అడవిలొ ఉన్న కోట చుట్టూనే తిరుగుతుంది. ఆ కోట నుంచి బయటకు వెళ్లేందుకు హీరో బృందం ప్రయత్నించడం.. వారిని తాత ఆత్మ అడ్డుకోవడం.. ఈ క్రమం వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలు మారుతి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమ్ మూవీని గుర్తుకు చేస్తాయి. హారర్ కంటే కామెడీ, రొమాంటిక్ సీన్లే బాగా పేలాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఆస్పత్రి సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించారు. ఇంతకు ముందుకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ..నాన్నమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజాసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచ్‌లు, ఫైట్స్ అన్నీ వింటేజ్ ప్రభాస్‌ని గుర్తు చేస్తాయి. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీశాడు. ఆస్పత్రి సీన్లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాళవికకు కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ధి పాత్రకు అంత ప్రాధాన్యతలేదు.. నిడివి కూడా చాలా తక్కువే. నాన్నమ్మ గంగాదేవిగా జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం పండించాడు. నటనకు స్కోప్‌లేదు. ఎక్కువగా గ్రాఫిక్స్‌లోనే ఆయన్ని చూపించారు. ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేశ్, సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. కానీ వాటి ప్లేస్మెంట్ సరిగా కుదర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతిఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనిపించింది. ఆర్ట్‌వర్క్ బాగుంది. అయితే కోట సెట్ అనే విషయం తెలిసిపోతుంది. సహజత్వం లోపించింది. ఎడిటర్ తన కత్తెరకు బాగానే పని చెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి నిడివి( 3 గంటల 9నిమిషాలు) తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఖర్చు విషయంలో ఎక్కగా తగ్గలేదని సినిమా చూస్తే అర్థవమవుతుంది.- అంజిశెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ది రాజాసాబ్ మేకర్స్‌కు బిగ్ షాక్..!
ది రాజాసాబ్ మూవీ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. కాగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. -
ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత..!
ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8న ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.విమల్ థియేటర్ లోకి దూసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ తెలంగాణ లో ప్రీమియర్ షోస్ లేకపోయినా... థియేటర్ కి వచ్చిన అభిమానులుమీడియా కోసం విమల్ లో ప్రత్యేక షో ఏర్పాటుఅభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం తో మీడియా షో తాత్కాలికంగా నిలిపివేత#TheRajasaaab #Prabhas #RajaSaab pic.twitter.com/9Eg9nu8BLF— Anji Shette (@AnjiShette) January 8, 2026 -
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్‌లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రీమియర్స్‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్‌తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు.సెకండాఫ్‌లో కూడా అలరించిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొసళ్లతో ఫైట్ అదిరిపోయిందని పోస్ట్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అని రాసుకొస్తున్నారు. ప్రభాస్ ఫర్మామెన్స్తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. చివరి 40 నిమిషాల్లో ఎస్ఎస్ తమన్ బీజీఎం అద్భుతమని అంటున్నారు. Hospital sequence ➡️ crocodile fight ➡️ climax 🔥The last 30 minutes are the SOUL of the film.#Prabhas delivers a performance with par excellence 👌 Trying something different and nailing it.Brilliant writing by @DirectorMaruthi 👌 Truly surprising!@MusicThaman is the…— Suresh PRO (@SureshPRO_) January 8, 2026 #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026 -
తెలంగాణలో 'ది రాజాసాబ్' ఫ్యాన్స్‌కు నిరాశ..
తెలంగాణలో 'ది రాజా సాబ్' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్ బాధతో థియేటర్స్ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు.'ది రాజా సాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్ ధరల పెంపునకు ఛాన్స్ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్ మొదలు కాలేదు. కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ప్రభాస్‌కు తొలిసారి.. ‘ది రాజాసాబ్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ హారర్ ఫాంటసీ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజాసాబ్ గురించి పది ఆసక్తికరమైన విషయాలు..ప్రభాస్‌కి తొలి సినిమా: ప్రభాస్ కెరీర్లో చేస్తున్న తొలి హారర్ ఫాంటసీ కామెడీ చిత్రమిది. బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ తన రూట్ మార్చి వింటేజ్ లుక్‌లో ఫ్యాన్స్‌ని అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలో మొదటిసారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు . మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్‌కి జోడీగా నటించారు. అతిపెద్ద సెట్: ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని అజీజ్ నగర్లో హవేలి సెట్‌ను నిర్మించారు. దాదాపు 40,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెట్, భారతదేశంలో హారర్ జోనర్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్‌గా రికార్డ్ సృష్టించింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ నాయర్ ఈ సెట్‌ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేశారు. ఈ సెట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరిగిందట. భారీ రన్‌టైమ్: ఈ సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు.థ్రిల్ చేసేలా ఫాంటసీ ఎలిమెంట్స్: ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంది. సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ వెల్లడించారు.23 కోట్లతో మొసలి సీన్ : ఈ సినిమాలో మొసలితో ప్రభాస్ చేసే ఫైట్ సీన్ అదిరిపోతుందట.ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్ కోసం హీరోయిన్ మాళవికా మోహనన్ 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చిందట. ‘ఒకవైపు చలికి చర్మం మొత్తం మొద్దుబారిపోతున్న ఫీలింగ్ కలిగేది. అదే సమయంలో మొసలి దాడి చేస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలన్నారు. ఆ నీళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అందరూ అందులోకి దిగి షూట్ చేస్తున్నారు. పెయింట్, కెమికల్స్, వాడిపారేసిన వస్తువులు అన్నీ అందులో ఉన్నాయి. ఆ నీటిలోనే 3 రోజులు షూట్ చేశాం. అదొక వింత అనుభవం’ అని ఓ ఇంటర్వ్యలో మాళవిక చెప్పుకొచ్చింది. రూ.450 కోట్ల బడ్జెట్.. ప్రభాస్‌కి తక్కువే: ఈ సినిమా కోసం పిపుల్స్ మీడియా దాదాపు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేసిందట. ఇందులో అత్యధికంగా రెమ్యునరేషన్లకే కేటాయించాల్సి వచ్చిదంట. అయితే ప్రభాస్ మాత్రం గత సినిమాల కంటే తక్కువ పారితోషికం తీసుకొని ఈ సినిమా చేశాడు. ప్రతి సినిమాకు రూ. 120-150 కోట్లు తీసుకునే ప్రభాస్.. రాజాసాబ్‌కి మాత్రం రూ.100 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. ఇక విలన్‌గా నటించిన సంజయ్ దత్ రూ. 6 కోట్లు, డైరెక్టర్ మారుతి రూ. 18 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే.. మాళవికా రూ. 2 కోట్లు, నిధి అగర్వాల్ రూ. 1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ. 3 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.ఫస్ట్ టైటిల్ ఇదే: ఇది బామ్మ-మనవడి కథ. ఇందులో బామ్మ కూడా ఓ హీరోనే అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాసే ఈ సినిమా కథను రివీల్ చేశాడు. ఇందులో బామ్మ భర్త విలన్. అనుకోని పరిస్థితుల్లో హీరో పాడుబడ్డ మహల్‌కు వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకనేది సినిమా చూడాలి.ఈ సినిమాకు ముందుగా రెండు, మూడు టైటిల్స్ అనుకున్నారట. రాజా డీలక్స్, రాజా అనే టైటిల్ అనుకున్నారట. రాజా అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ పూర్తి చేసి.. చివరకు ‘ది రాజాసాబ్’ని ఫిక్స్ చేశారు. సినిమా అధికారిక టైటిల్ ని 2024 జనవరిలో ప్రకటించారు.విలన్‌గా సంజయ్: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో ప్రభాస్ తాతగారి ఘోస్ట్ పాత్ర పోషించారు . ప్రభాస్‌తో ఆయన క్లాష్ సీన్స్ హైలైట్ అవుతాయని టాక్.తమన్ సంగీతం: ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ముఖ్యంగా ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఉన్న సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బీజీఎం అయితే ఓ రేంజ్లో ఉంటుందట. తమన్ తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని దర్శకుడు మారుతితో పాటు ప్రభాస్ కూడా అన్నారు. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జోరుగా సాగుతున్నాయి .జనవరి 8న ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు భారీగా పెరిగాయి.ప్రీమియర్స్‌కి టికెట్ ధర ఏకంగా రూ. 1000 గా ఫిక్స్ చేశారు. -
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే.. తర్వాత టాక్ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువఅయితే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్‌లోకి లాగుతున్నారు. సందీప్ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్ రెడ్డితో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.ఆర్ఆర్ఆర్ నుంచి..ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో, కింగ్డమ్ అప్పుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో, శివ రీరిలీజ్ సమయంలో రాంగోపాల్ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్ నాన్న రిలీజ్ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్ హీరోహీరోయిన్లు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లను ఇంటర్వ్యూ చేశాడు. బుల్లెట్ పాయింట్ ప్రశ్నలుఅందరూ సందీప్‌నే యాంకర్‌గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్ పాయింట్స్‌లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్ అవడం మరో విశేషం. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి బాలీవుడ్‌లోనూ బజ్ క్రియేట్ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్‌కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం! చదవండి: 23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే -
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ప్రభాస్ గారు గ్లోబల్‌స్టార్
‘‘ప్రభాస్‌గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఆయన సినిమాలు విదేశాల్లోనూ విడుదల అవుతున్నాయి. ప్రభాస్‌గారు గ్లోబల్‌స్టార్. ‘ది రాజాసాబ్’ సినిమా చేసే విషయంలో నాకు ఒత్తిడి లేదు అని చెప్పలేను. అయితే సినిమా చూసుకున్నాను. హీరో క్యారెక్టర్‌తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ ను కూడా సినిమాలో చూస్తారు. ప్రభాస్‌గారిని ఎలా చూడాలని ఆడియ న్స్ అనుకున్నారో అలానే చూస్తారు’’ అని చెప్పారు దర్శకుడు మారుతి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ , రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్‌దత్ మరో ప్రధాన పాత్రలో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మారుతి మాట్లాడుతూ– ‘‘నేడు మా సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. ప్రభాస్ ఫ్యా న్స్ ఎంత సంతోషంతో థియేటర్స్‌కి వెళ్తారో, అంతకు రెట్టింపు ఆనందంతో బయటకు వస్తారు’’అని చెప్పారు. ‘‘హ్యూజ్ హారర్ ఫాంటసీ చిత్రంగా ‘ది రాజాసాబ్’ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈ పండక్కి ఏడు సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. దీంతో థియేటర్స్‌ను షేర్ చేసుకోకతప్పదు’’ అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘‘ప్రభాస్‌గారి ఓవరాల్ పెర్ఫార్మె న్స్ ను ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు తమన్ . ‘‘ఈ నెల 9 నుంచి మా సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని పేర్కొన్నారు కృతీ ప్రసాద్. -
'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్'.. చెప్పిన తేదీకి థియేటర్లలో రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ సమస్య తీరలేదు. నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు(జనవరి 07) వాదనలు జరిగాయి. తీర్పు రిజర్వ్‌లో పెట్టారు. 09వ తేదీన ఉదయం తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000)రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు.. 'జన నాయగణ్' చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేశారు. వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందనుకుంటే.. రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే జనవరి 05న సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని సెన్సార్ సభ్యులు.. మూవీ టీమ్‌కి చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించేలా చూడాలని పేర్కొంది. తాజాగా ఈ విషయమై బుధవారం (జనవరి 07) ఇరువర్గాల మధ్య వాదనలు జరిగాయి.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)'జన నాయగణ్ చూసిన సభ్యుల్లో ఒకరు.. సినిమాలోని కొన్ని సీన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రివిజన్ కమిటీ పరిశీలించాలి. తర్వాతే తదుపరి దశకు వెళ్తుంది. మరిన్ని మార్పులు చేయాల్సి వస్తే అది చట్ట ప్రకారం జరుగుతుంది. మూవీ చూసిన తర్వాత అప్పుడు సర్టిఫికెట్ మంజూరా చేస్తాం. మళ్లీ సమీక్షించాలని అవసరం లేదని మీరు(మూవీ టీమ్) కోర్టుకి వచ్చి చెప్పలేరు. చిత్రాన్ని ప్రస్తుతానికి నిలిపి ఉంచాలని సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం అందించారు. నిర్మాతలకు కూడా జనవరి 05న ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుంది. అందుకు మరో 15 రోజులు పడుతుంది. దీనికి అంగీకారమైతే కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు పడుతుంది' అని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్.. కోర్టులో తన వాదనలు వినిపించారు.'మీరు చెప్పినట్లే ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా' అని కోర్టు ప్రశ్నించగా.. సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వచ్చాయని, కమిటీ నిర్ణయానికి ఛైర్ పర్సన్ కట్టుబడి ఉంటారని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇకపోతే 'జన నాయగణ్' నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ తరఫు న్యాయవాది పరాశరన్ తన వాదనలు వినిపించారు.'మూవీకి సంబంధించిన ఏదైనా సరే 'ఈ-సినీ ప్రమాణ్' పోర్టల్ ద్వారా తెలియజేయాలి. కానీ సెన్సార్ వాళ్లు అలా వ్యవహరించలేదు. తమ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలున్నాయి. అంటే 4:1 నిష్పత్తిలో ఉంది. మెజార్టీ నిర్ణయం పాజిటివ్‌గానే ఉంది. అలాంటప్పుడు మరోసారి రివ్యూ కోసం ఎలా పంపుతారు? చట్టప్రకారం సెన్సార్ బోర్డ్ తమ విధులని పూర్తిగా విస్మరించింది' అని పరాశరన్ అన్నారు.ఈయన వాదనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్.. సినిమాని మరోసారి సమీక్షించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఛైర్ పర్సన్‌కి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని అన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఆశా.. తీర్పుని రిజర్వ్ చేశారు. జనవరి 9న తుది ఉత్తర్వులు వెల్లడించనున్నారు. రిలీజ్ తేదీన తుది తీర్పు అంటే.. ఒకవేళ మూవీ టీమ్‌కి అనుకూలంగా వచ్చినా సరే అదే రోజున షోలు పడతాయా? లేదంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు 14వ తేదీకి మూవీ ఏమైనా వాయిదా పడుతుందా అనేది చూడాలి? ఒకవేళ విడుదల తేదీ మారితే మాత్రం 'రాజాసాబ్'కి పోటీ తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల విషయంలోనూ లైన్ క్లియర్ అయ్యే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?) -
జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు చెదిరే టికెట్ ధరల పెంపు కోసం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ముందురోజు అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 లోపు వేసే స్పెషల్ షో కోసం ఏకంగా రూ.1000 ధర పెట్టుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అలానే జనవరి 9 నుంచి తర్వాత పదిరోజుల పాటు కూడా భారీగా పెంపు ఇచ్చింది.రిలీజ్ రోజు (జనవరి 09) నుంచి తర్వాత 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌ల్లో రూ.200 వరకు ఒక్కో టికెట్‌పై పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ చిత్ర నిర్మాతలు.. హైకోర్టు నుంచి టికెట్ రేట్ల పెంపుపై ఉత్తర్వులు తెచ్చుకున్నారు.దాదాపు రెండు మూడేళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా, మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. -
‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?
జనవరి 9... ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న డేట్ ఇది. ఆ రోజే ‘ది రాజాసాబ్’ థియేటర్స్‌లోకి రాబోతున్నాడు. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే జనవరి 8న ప్రీమియర్స్‌తో ప్రభాస్ అబిమానుల సందడి ప్రారంభం కానుంది. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ ఫాంటసీ మూవీ కావడంతో రాజాసాబ్(The Raja Saab)పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.పట్టుమని పది కూడా లేవు.. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటికే వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలావరకు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. కానీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు మాత్రం పట్టుమని పది కూడా లేవు. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్పటివకు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2, పఠాన్, జవాన్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ, దురంధర్ చిత్రాలు మాత్రమే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయితే ఇవన్నీ భారీ యాక్షన్ సినిమాలే. పాన్ ఇండియా ప్రేక్షుకులు మెచ్చే కంటెంట్‌తో విజువల్ వండర్స్‌గా వాటిని తెరకెక్కించారు. కానీ ది రాజాసాబ్ హారర్ కామెడి ఫాంటసీ. ఈ జోనర్ చిత్రాలు ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ రాజాసాబ్ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి హారర్-రొమాంటిక్ ఎంటర్టైనర్గా చరిత్రకెక్కుతుంది.ఆశలన్నీ ప్రభాస్‌పైనే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా రూ. వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే..బాక్సాఫీస్ షేక్ అవ్వాలిసందే. ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు(బాహుబలి 2: రూ.1800 కోట్లు, కల్కి: రూ.1100 కోట్ల) రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. యావరేజ్ టాక్ వచ్చిన సలార్, సాహో వంటి సినిమాలు కూడా ₹400-700 కోట్ల రేంజ్ లో నిలిచాయి. రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్ చిత్రానికి కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్ల వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండు, మూడు వందల కోట్లు గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ‘రాజా సాబ్’ ఆయన కెరీర్లో మరో రూ.1000 కోట్ల శిఖరాన్ని చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న.రూ. 100 కోట్లు అంత ఈజీకాదు..అయితే రాజాసాబ్ రూ. 1000 కోట్ల క్లబ్ చేరడం మాత్రం అంత ఈజీకాదు. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు తెలుగులో మరో ఆరు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బడాస్టార్ల పోటీని తట్టుకొని రాజాసాబ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తాడనేదానిపై సినిమా ఫలితం ఆదారపడి ఉంటుంది. ప్రభాస్(Prabhas)కు కలిసొచ్చే అంశాలు ఏంటంటే.. పండగ సీజన్, మిగతా హీరోలతో పోలిస్తే.. పాన్ ఇండియాలో ఆయనకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం. అయితే రాజాసాబ్‌కి హిట్ టాక్ వచ్చినా.. పుష్ప 2 లాగా కేవలం వారం రోజుల్లో రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం కష్టమే. ‘ధురంధర్’ లాగా లాంగ్ రన్ సాధిస్తే మాత్రం ఈజీగా రూ. 1000 కోట్ల మార్కుని అందుకుంటుంది. (ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలను GrabOn టీమ్ పరిశీలించి, క్రాస్-వెరిఫై చేసి, ధృవీకరించింది) -
హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట
మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్‌బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్‌లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్‌లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్‌తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ని నేడు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్‌ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్‌గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్‌ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
హైకోర్టుని ఆశ్రయించిన 'రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్' నిర్మాతలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి. గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఏ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు లేదని తేల్చేశారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్లపై హైకోర్టులో బుధవారం (డిసెంబరు 07) విచారణ జరగనుంది.ఇకపోతే 'రాజాసాజ్' నిర్మాతలు.. తెలంగాణ ప్రభుత్వాని టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల గురించి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రీమియర్ల కోసం మల్టీప్లెక్స్‌ల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800కు విక్రయించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్-మల్టీప్లెక్స్‌ల్లో ప్రీమియర్ల కోసం రూ.600 ధరకు విక్రయించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంలో అటు హైకోర్టు, ఆపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! ) -
పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే
ప్రతిసారి సంక్రాంతి బరిలో రెండో మూడో సినిమాలు వస్తుండేవి. ఈసారి మాత్రం డబ్బింగ్‌లతో కలిపి ఏకంగా ఏడు మూవీస్ బరిలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుందోనని హీరోల కంటే అభిమానులకే చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా తగ్గేదే లే అంటున్నారు. వీళ్లే కాదు దాదాపు 12 మంది హీరోయిన్లు కూడా ఈ పండక్కే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్లందరికీ హిట్ చాలా కీలకం.(ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?)మొదటగా ప్రభాస్ 'రాజాసాబ్'.. ఈ శుక్రవారం(జనవరి 09) థియేటర్లలోకి రానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. నిధి విషయానికొస్తే తెలుగులో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తోంది గానీ 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే చెప్పుకోదగ్గ హిట్ లేదు. గతేడాది వచ్చిన 'హరిహర వీరమల్లు'పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ అన్నీ అడియాశలయ్యాయి. చేతిలో ఇది తప్పితే మరొక ప్రాజెక్ట్ అయితే లేదు. హిట్ అయితేనే కెరీర్ పరంగా కాస్త ఫుష్ ఉంటుంది లేదంటే కష్టాలు మళ్లీ మొదటికొస్తాయి. మాళవిక విషయానికొస్తే.. తమిళ, మలయాళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇందులో అందచందాలు చూపించేందుకు అస్సలు మొహమాట పడలేదు. ఇది హిట్ అయితే టాలీవుడ్లో మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడుతోంది. రిద్ధి కుమార్ విషయానికొస్తే.. గతంలో ప్రభాస్ చేసిన 'రాధేశ్యామ్'లో చిన్న పాత్ర చేసింది. ఇప్పుడు హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకుబోతోంది. తెలుగులో ఈమెకు మరో ఛాన్స్ రావాలంటే ఈ చిత్రం హిట్ అవ్వాల్సిందే.రాబోయే సోమవారం(జనవరి 12) చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఈమె అడపాదడపా తెలుగులో మూవీస్ చేస్తోంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో సరైన హిట్ లేదు. బాలకృష్ణ కొత్త మూవీ కోసం ఈమెని తీసుకున్నారని ప్రకటించారు గానీ ఇప్పుడు బడ్జెట్, కథ మార్పు వల్ల బదులుగా మరో హీరోయిన్ని పెట్టే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. నయన్ టాలీవుడ్ కెరీర్‌కి ప్లస్ అవ్వాలంటే చిరు మూవీ హిట్ కావాలి.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)13వ తేదీన రానున్న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్. ఆషిక విషయానికొస్తే కన్నడ అమ్మాయి. కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఫ్లాప్. కానీ నాగార్జున 'నా సామి రంగ'లో అవకాశమొచ్చింది. హిట్ అందుకుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో ఇప్పుడీ మూవీతో వస్తోంది. ఈమె నటించిన మరో తెలుగు చిత్రం 'విశ్వంభర' కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ రెండు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డింపుల్ విషయానికొస్తే.. గత ఎనిమిదేళ్లలో తెలుగులో ఆరు మూవీస్ చేసింది. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది హిట్ అయితే మరో ఛాన్స్ వస్తుంది. లేదంటే అంతే సంగతి!14న రానున్న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి హీరోయిన్. తెలుగులోనే ఈమె హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశముంది. ఇదే రోజున శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' కూడా రిలీజ్ కానుంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. సంయుక్త కూడా తెలుగులో సర్, బింబిసార, విరూపాక్ష చిత్రాలతో హిట్ అందుకుంది. కానీ డెవిల్, అఖండ 2తో ఫెయిల్యూర్స్ చవిచూసింది. ఈ మూవీ హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్న సాక్షి వైద్యకు కూడా ఈ చిత్రం సక్సెస్ కావడం ముఖ్యమే.డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే.. 9వ తేదీన వచ్చే 'జన నాయకుడు'లో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె తెలుగు తెరకి దూరమై చాలా రోజులైంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో అవకాశాలు రావొచ్చు. అలానే తెలుగు దర్శకుల దృష్టిలోనూ పడొచ్చు. ఇదే మూవీలో మమిత బైజు కీలక పాత్ర చేసింది. ఈ చిత్రంతో హిట్ అందుకుంటే ఈమెకు దక్షిణాదిలో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ. 10వ తేదీన రానున్న 'పరాశక్తి'లో శ్రీలీల హీరోయిన్. ఈమె కూడా తెలుగులో వరస సినిమాలు చేసింది గానీ ఒకటో రెండో మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూవీ హిట్ అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే కాస్త కష్టమవ్వొచ్చు!(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్) -
‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్‌దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌గా ఎలా మారాడు?)ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్టైమ్నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
ముగ్గురు భామలతో నాచే.. నాచే...
‘నాచే నాచే...’ అంటూ ముగ్గురు భామలతో ఆడి పాడుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాచే నాచే...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని ముంబైలో నిర్వహించారు. ఈ పాటలో నిధి, మాళవిక, రిద్దీలతో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ, జాట్, మిరాయ్’ వంటి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్‌గారితో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమా నిర్మించాం’’ అని తెలిపారు.‘‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చె΄్పాను’’ అన్నారు రిద్దీ కుమార్. ‘‘పెద్దలతో పాటు పిల్లలకు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు మాళవికా మోహనన్. ‘‘రాజా సాబ్’లో వీఎఫ్ఎక్స్ సహజంగా ఉంటాయి. స్క్రీన్ మీద సన్నివేశాలు చూస్తుంటే నిజమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిధీ అగర్వాల్ పేర్కొన్నారు. నటీనటులు జరీనా వాహబ్, బొమన్ ఇరానీ మాట్లాడారు. -
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్‌కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్‌కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్‌కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14) -
ప్రభాస్ ది రాజా సాబ్.. ఫుల్ గ్లామరస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నచ్చేనచ్చే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి. Gear up for the MOST GROOVING MADNESS in theatres this Sankranthi 💥💥💥#NacheNache song promo is out now ❤️🔥❤️🔥❤️🔥Full song from Jan 5th 😎🙌🏼A @MusicThaman Musical Vibe 🎧 #TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/WgwCLbXaF9— People Media Factory (@peoplemediafcy) January 3, 2026 -
2026నే టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎవరికి కలిసొస్తుందో?
గతేడాది చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు.. థియేటర్లలో కనిపించలేదు. కారణం ఏదైనా గానీ ఈ ఏడాది మాత్రం తలో రెండుసార్లు కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా 2026నే టార్గెట్ చేశారు. ఒకటి రెండు కాదు 10కి పైగా భారీ బడ్జెట్ లేదా బజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలంటే 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు'. వీటిలో ప్రభాస్ చిత్రానికి ట్రైలర్స్‌తో బజ్ వచ్చింది. హారర్ కామెడీ కాబట్టి క్లిక్ అయ్యే ఛాన్సుంది. చిరంజీవి మూవీని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేసి తీశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ బట్టి చూడాలా వద్దా అని చాలామంది డిసైడ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ)వీటి తర్వాత అంటే మార్చిలో ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు రాబోతున్నాయి. నాని 'ప్యారడైజ్', రామ్ చరణ్ 'పెద్ది'.. ఒకరోజు గ్యాప్‌లో థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ప్రస్తుతం బోలెడంత హైప్ ఉంది. కంటెంట్ కూడా అదే రేంజులో ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ గ్యారంటీ.ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. దీనిపై రీమేక్ అని రూమర్ చాన్నాళ్లుగా వస్తుంది. టీమ్ మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు హైప్ పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయి. జూన్ లేదా జూలైలో చిరంజీవి నుంచి ఈ ఏడాది మరో మూవీ వచ్చే అవకాశముంది. అదే 'విశ్వంభర'. ఇప్పటికే ఇది రిలీజైపోవాలి. కానీ గ్రాఫిక్స్ వచ్చిన ఘోరమైన విమర్శల దెబ్బకు ఆలస్యమైపోయింది. ఈ మూవీపై అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు.ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే భారీ సినిమాల్లో ప్రభాస్ 'ఫౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగన్'. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ కూడా పెద్దగా రాలేదు. అలా అని బజ్ లేదనుకుంటే పొరపాటే. హైప్ అయితే చాలానే ఉంది. ప్రభాస్ది పీరియాడికల్ వార్ డ్రామా కాగా.. తారక్‌ది మూవీ. ఇవి ఏ మాత్రం క్లిక్ అయినా సరే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ గ్యారంటీ.పైనవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ఇవి కాకుండా ఈ ఏడాది రిలీజయ్యే వాటిలో డకాయిట్, స్వయంభు, గూఢచారి 2, రౌడీ జనార్ధన, వృషకర్మ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో అడివి శేష్వి రెండున్నాయి. ఇతడి నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయిపోయింది. కానీ గట్టిగానే హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.మరోవైపు నిఖిల్ చేసిన పీరియాడికల్ డ్రామా 'స్వయంభు', విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', నాగచైతన్య 'వృషకర్మ'పై ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు గానీ కంటెంట్‌తో హిట్ కొట్టే ఛాన్సులు వీటికి చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: 'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. ఇది రీమేకేగా) -
రాజాసాబ్, చిరంజీవి.. తెలంగాణలో జీవో తెచ్చేదెవరు?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్ ట్రైలర్ రావడంతో ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. జనవరి 4న మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్‌తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల టికెట్ ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్గా అఖండ-2 మూవీకి టికెట్ ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు. అలాంటిది ఇప్పుడు టికెట్ రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్ ధరలు పెంపు అనేది లేకుండా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు. -
'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్
ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్‌గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్‌లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్‌లో వైరస్ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్ జోన్లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 ❤️🔥This one’s all about the impact @BomanIrani is going to create 🔥#TheRajaSaab#TheRajaSaabOnJan9th #Prabhas pic.twitter.com/3kWJddv1qd— The RajaSaab (@rajasaabmovie) January 2, 2026 -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్..!
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ మూవీ రిలీజ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్‌పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.ఎవరికి ఎంతంటే?మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
అందుకే ‘రాజాసాబ్’ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్‌తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్‌కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్‌తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
పెద్ద హీరోల సినిమాలు.. ఓవర్సీస్లో కనిపించని సంక్రాంతి జోరు
సంక్రాంతి సినిమాలకు ఓవర్సీస్లో అనుకున్నంత రేంజ్లో బజ్ లేదని తెలుస్తోంది. చాలా సినిమాలు రేసులో ఉన్నప్పటికీ ప్రీబుకింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, జన నాయకన్ ప్రీమియర్స్ అడ్వాన్స్ టికెట్లు ఓపెన్ చేశారు. కానీ, ట్రేడ్ వర్గాలు అంచనా వేసినంత రేంజ్లో ముందస్తు బుకింగ్స్ జరగడం లేదు.జనవరి 8న ది రాజా సాబ్తో పాటు జన నాయకన్ ప్రీమియర్లలో విడుదల కానుంది. ఆపై జనవరి 11న మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్స్‌లోకి రానున్నాడు. వీటిలో ది రాజా సాబ్ 342 ప్రదేశాలలో 1,021 స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. అయితే, ఇప్పటికీ కూడా కేవలం 3లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, ప్రభాస్ నటించిన మునుపటి చిత్రాలు కల్కి, సలార్ చిత్రాలు వరుసగా 4 మిలియన్లు, 2.5 మిలియన్ల కలెక్షన్స్ ప్రీమియర్ బుకింగ్‌ల ద్వారానే వచ్చాయి. కానీ, రాజా సాబ్‌కు అలాంటి పరిస్థితి లేదు. విడుదలకు మరో ఆరురోజులు మాత్రమే వుంది. దీంతో కనీసం 1 మిలియన్ మార్క్ వరకు చేరుకోవడమే కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓవర్సీస్లో 119 ప్రదేశాలలో 423 స్క్రీన్స్లకు సంబంధించిన టికెట్లు ఓపెన్ అయ్యాయి. అయితే, ఇప్పటికి లక్ష డాలర్లు మాత్రమే వసూలు చేసి.. 4వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో జన నాయగన్ మూవీతో విజయ్ దూసుకుపోతున్నాడు. తన నటించే చివరి సినిమా కావడంతో ఓవర్సీస్లో ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటింది. కారణాలు ఇవే..సంక్రాంతి సినిమాల అమెరికా ప్రీమియర్ ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి ప్రధాన కారణాలు సినిమాలపై మిశ్రమ అంచనాలు ఉండటమేనని చెబుతున్నారు. ఆపై టికెట్ ధరలు పెరగడం, ప్రమోషన్లలో పెద్దగా జోరు చూపించకపోవడం ఆపై పెద్ద స్టార్ సినిమాలు ఉన్నప్పటికీ, ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను బలంగా ఆకర్షించలేకపోయాయి. ఒక్కో టికెట్ ధర 30 డాలర్లకు (2,700) మించే ఉండటంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా వెనుకడుగు వేస్తున్నారు. మొత్తం మీద, అమెరికాలో సంక్రాంతి సినిమాల ప్రీ-బుకింగ్స్ తగ్గడానికి మార్కెట్ పరిస్థితులతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా ప్రభావం చూపాయి. -
ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్
-
రాజాసాబ్: 'రాజే.. యువరాజే' సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాతో 2026కి స్వాగతం పలుకుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్‌మీడియాలో మంచి హైప్ వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా ది రాజాసాబ్ నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. రాజే యువరాజే సాంగ్'రాజే యువరాజే' పాటను రిలీజ్ చేశారు. ఎటువంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో సాంగ్ మాత్రమే బయటకు వదిలారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఒకేరోజు రెండు సర్ప్రైజ్లుకాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో డార్లింగ్ ప్రభాస్ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపించాడు. అయితే ప్రభాస్‌ను ముందువైపు నుంచి చూపించకుండా బ్యాక్‌సైడ్ ఫోటో మాత్రమే వదిలారు. దెబ్బలతో ఉన్న ప్రభాస్ ఓపక్క సిగరెట్, మరోపక్క మందు తాగుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి నిన్న మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన దానికంటే ఇందులో కథని మరింత రివీల్ చేశారు. విజువల్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. దీని దెబ్బకు మూవీపై హైప్ కూడా కాస్త పెరిగింది. ట్రైలర్‌కి హిట్ టాక్ రావడం ఏమో గానీ దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. మారుతి ఇంటికి ఓ సర్ప్రైజ్ పంపించారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో 'రాజాసాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసిన తనని విమర్శించొచ్చని చెబుతూ కొండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు.(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడిపోతున్న ప్రభాస్ అభిమానులు.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విటర్లో బయటపెట్టాడు. ఓ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ట్రైలర్‌కే ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్నారంటే.. మూవీ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకెన్ని పార్సిల్స్ పంపిస్తారో ఏంటో?'రాజాసాబ్' మూవీ జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ముందురోజు రాత్రి అంటే 8వ తేదీన రాత్రి ప్రీమియర్ల వేయనున్నారు. ఈ సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)Meerentraaa intha violent ga unnaru… Address ichindi vere danikiMeeru ila kooda vaadeskuntunnaru 🤣🤣 https://t.co/8EJ1KZhH9y— The RajaSaab (@rajasaabmovie) December 30, 2025 -
గిఫ్ట్‌గా చీర ఇచ్చిన 'ప్రభాస్'.. ఎందుకో చెప్పిన హీరోయిన్
'ది రాజాసాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరాఠీ బ్యూటీ రిద్ది కుమార్ మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ గిఫ్ట్‌గా ఒక చీరను ఇచ్చారని చెప్పిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అదే చీరను ఈ కార్యక్రమం కోసం కట్టుకొని వచ్చానని ఆమె చెప్పింది. అయితే, రిద్ది కుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమెకు చీర గిఫ్ట్‌గా ప్రభాస్ ఎందుకు ఇచ్చాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు వచ్చాయి. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు కారణం చెప్పింది.ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆయనకు ఒక గిఫ్ట్‌ను ఇచ్చానని అందుకు రిటర్న్‌గా ఒక చీరను ఇచ్చారని రిద్ది కుమార్ ఇలా చెప్పారు. 'మూడేళ్ల క్రితం నేను రాజా సాబ్ సెట్లో ఎంట్రీ ఇచ్చిన నాడే ప్రభాస్ పుట్టినరోజు.. ఆయనకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్నాను. ఆ సమయంలో కుదరలేదు. తర్వాత దీపావళి ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కర్ణుడి స్టోరీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రభాస్‌కు ఇచ్చాను. నిజజీవితంలో కూడా ప్రభాస్ స్వభావం కర్ణుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయనకు ఆ బుక్ ఇచ్చాను. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా నాకు హనుమాన్ చాలీసా పుస్తకంతో పాటు కొన్ని చాక్లెట్స్, వైట్ శారీ ఇచ్చారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. నాటి నుంచి ఆ హనుమాన్ చాలీసా బుక్ నా బ్యాగ్‌లోనే ఉంది. అయితే, కొద్దిరోజుల తర్వాత కల్కి సినిమాలో కర్ణుడిగా ప్రభాస్ నటించారని తెలిసి ఆశ్చర్యపోయాను.' అని రిద్ది కూమార్ చెప్పారు.ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. -
యూత్ హార్ట్ బ్రేక్ అయ్యేలా 'నిధి అగర్వాల్' (ఫోటోలు)
-
'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?) -
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
-
ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. నిధి అగర్వాల్ ట్వీట్
ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రభాస్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్‌కి మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు మరింత సంతోషపడిపోయేలా నిధి అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.'రాజాసాబ్'లో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్. చిత్ర ప్రమోషన్లో భాగంగా '#ఆస్క్ నిధి' పేరుతో ట్విటర్లో అభిమానులతో ముచ్చటించింది. మిగతా ప్రశ్నలు, సమాధానాలు ఏమో గానీ ఓ ఆన్సర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అని అడగ్గా.. హీరోలుగా ప్రభాస్-పవన్ కల్యాణ్ ఉంటారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా.. హీరోయిన్గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది.అయితే ఈ ట్వీట్ చేసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిధి అగర్వాల్‌కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయిగా అని మాట్లాడుకుంటున్నారు. నిజ జీవితంలో ఈ మల్టీస్టారర్ సెట్ అవుతుందా అంటే సందేహమే. ప్రభాస్ ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ. పవన్ మరోవైపు రాజకీయాలతో బిజీ. కాబట్టి నిధి కల కలాలానే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు.'రాజాసాబ్' సినిమాలో నిధి అగర్వాల్ బెస్సీ అనే పాత్ర చేసింది. ఇందులో ఈమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని నిధి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ 'రాజాసాబ్'పై పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం నిధికి రాబోయే రోజుల్లో తెలుగులో అవకాశాలు కష్టమే?PK sir PRABHAS sir NIDHHI me SRV #AskNidhhi #TheRajaSaab https://t.co/CG1GzbHyEV— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025 -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్‌పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్‌పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్‌గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్‌గా ఉంటుందిలే అనుకొని సింపుల్‌గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్‌గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్‌గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్‌గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
స్పిరిట్ డైరెక్టర్‌కు క్రేజీ ట్యాగ్ ఇచ్చిన రెబల్ స్టార్.. రాజమౌళికి కూడా!
రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్తో రెడీ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌పై అంచనాలు పెంచేశాయి. ఈ సందర్భంగా ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.ఈవెంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనిచేసిన వారిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. మీతో పని చేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అని సుమ ప్రశ్నించింది.దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. నాగ్ అశ్విన్‌కు స్ట్రాంగ్ అని.. ప్రశాంత్ నీల్‌కు బ్యూటీఫుల్ పర్సన్‌గా.. ఎస్ఎస్ రాజమౌళిని జీనియర్ గారు..మారుతి అయితే క్యూట్ అని అన్నారు. అలాగే హనురాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని.. సుజీత్ ఫుల్ స్మార్ట్ అని.. పూరి జగన్నాధ్‌ను జీనియస్‌గా అభివర్ణించారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కల్ట్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగాతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి స్పిరిట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
-
ప్రభాస్‌ను చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళికి ప్రతి డైరెక్టర్ రుణపడి ఉన్నామని తెలిపారు. ఇవాళ చాలామంది పాన్ ఇండియా అని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నామంటే కారణం ఆయనే అన్నారు. నిజంగా టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగమని తెలిపారు.నా లాంటి మిడ్ రేంజ్ సినిమాలు తీసే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారని మారుతి తెలిపారు. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి ఒక పెద్ద కటౌట్ అందించారని అన్నారు. ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్స్‌ను తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. అంతేకాకుండా హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మారుతి. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. నా వెనకాల ఉన్నది మామూలు శక్తి కాదు.. ఆయన కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోవడం కాదు.. తన లైఫ్ పెట్టేశారని అన్నారు. సినిమాతో ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేమన్నారు. ఆ ప్రతి రూపమే ఇవాళ మన ఎదురుగా కూర్చుందని ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Emotional Moment ♥️😭#Prabhas𓃵 #Maruthi pic.twitter.com/HcS6TB1Gmc— Addicted To Memes (@Addictedtomemez) December 27, 2025 టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగం.టాలీవుడ్ డైరెక్టర్లంతా @ssrajamouli కి రుణపడి ఉన్నాము.. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి మాకు ఇచ్చినందుకు – డైరెక్టర్ #Maruthi #Prabhas𓃵 #RajaSaab pic.twitter.com/0HPAVKG6CZ— greatandhra (@greatandhranews) December 27, 2025 -
ది రాజాసాబ్ హీరోయిన్‌కు ప్రభాస్ గిఫ్ట్.. అంతా నీవల్లే అంటూ ఎమోషనల్..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ రిద్ది కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. నీ వల్లే నేను ది రాజాసాబ్‌లో మూవీ నటిస్తున్నానని తెలిపింది. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చిన ప్రభాస్‌కు రుణపడి ఉంటానని తెలిపింది. ఈ రోజు ఈవెంట్‌కు మీరు నాకిచ్చిన శారీనే ధరించానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ రోజు కోసం మూడేళ్లుగా ఈ శారీని కట్టుకోలేదని భావోద్వేగానికి గురైంది. నా లైఫ్‌లో నీలాంటి పర్సన్ పరిచయం కావడం నా అదృష్టమని రిద్ధికుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. Riddhi కి Saree ఇచ్చిన ప్రభాస్.. She reveals it on stage! I'm wearing the saree that you gave me I saved it for 3 years Just to wear it tonightGrateful to have you in my life.#Prabhas #RiddhiKumar pic.twitter.com/8BXLXdj16Z— M9 NEWS (@M9News_) December 27, 2025 Thank you #riddhikumar gaaru 3 years wait chesi Ee day kosam ah saree wear chesaru 🫡🫡🫡🫡🫡🫡#TheRajaSaab pic.twitter.com/QSIQiF510G— PrabhasPandu (@Dreamer_998) December 27, 2025 -
సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి: ప్రభాస్
‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తుండిపోయా. ఈ సినిమాలో నాతోపాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ–మనవడి కథ’’ అని ప్రభాస్ తెలిపారు. ఆయన హీరోగా రూ పొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. శనివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నేను, మారుతి కలిసినప్పుడు అన్నీ యాక్షన్ సినిమాలు అయిపోతున్నాయి... ఫ్యాన్ ్సని ఎంటర్టైన్ చేయాలన్నాను. ఫైనల్‌గా ఈ హారర్ కామెడీ సెట్ అయింది. నేనైతే మారుతిగారి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్‌ని పెన్ తో రాశావా? గన్ తో రాశావా? నిజం చెప్పు డార్లింగ్ (మారుతి). కొత్తపాయింట్ ఇది. ఈ సినిమాకి విశ్వప్రసాద్‌గారు హీరో. మూడేళ్లపాటు ఈ మూవీ తీసినప్పుడు.. అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ అవుతున్నా మేమైనా భయపడ్డాం కానీ ఆయన భయపడలేదు.. ఏంటి సార్ మీ ధైర్యం (నవ్వుతూ).ఈ మూవీ అనుకున్నప్పుడు తమన్ ఒక్కడే చేయగలడు... ఈ లెవల్ ఆర్ఆర్ చేయగలిగేవారు ఎవరున్నారు మనకి ఇండియాలో అనుకున్నాం. కెమెరామేన్ కార్తీక్‌గారు అద్భుతమైన వర్క్ చేశారు. రామ్–లక్ష్మణ్, సాల్మోన్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మనకి పదిహేనేళ్ల తర్వాత వినోదం అందిస్తున్నారు మారుతిగారు. మరి... చూసుకోండి. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి... మా ‘ది రాజా సాబ్’ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సీనియరే (సంక్రాంతి పోటీలో ఉన్న సీనియర్స్).సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేం... సీనియర్స్ తర్వాతే మేం’’ అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘రాజా సాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్‌గారు, మరొకరు విశ్వప్రసాద్‌గారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌గారు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్‌గారు తెలియడం మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. రాజమౌళిగారు కష్టపడి చేసినపాన్ ఇండియా ప్రయత్నం మా అందరికీ ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. మూడేళ్లు కష్టపడి నిర్మించాం’’ అని పేర్కొన్నారు. క్రియేటివ్ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులుపాల్గొన్నారు. -
కొత్త సంవత్సరం... జోరుగా హుషారుగా...
క్యాలెండర్లో కొత్త సంవత్సరం కనిపించే సమయం ఆసన్నమైంది. అలాగే టాలీవుడ్ వెండితెర కూడా ప్రేక్షకులకు జోరుగా హుషారుగా సినిమాలు అందించేందుకు సిద్ధమైంది. ఆడియన్స్‌కు మస్త్ మజానిచ్చే సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. సో... జనవరిలో సినిమాల జాతర అనొచ్చు. మరి... న్యూ ఇయర్ రోజు ఏయే సినిమాలు రెడీ అవుతున్నాయి... సంక్రాంతి బరిలో నిలిచిన స్టార్స్ సినిమాలు, వాటి ఫైనల్ రిలీజ్ డేట్లపై ఓ లుక్ వేయండి.మీలాంటి యువకుడి కథ శ్రీనందు, యామినీ భాస్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్‌ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబరు 12న ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమా విడుదల కావడంతో ‘సైక్ సిద్ధార్థ్’ను జనవరి 1కి వాయిదా వేశారు. ఓ కుర్రాడి ప్రేమ, వ్యాపారం, వ్యాపారంలో అతని ఫెయిల్యూర్, అతని కెరీర్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నరసింహా, ప్రియాంకా, రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ, సాక్షి ఆత్రీ చతుర్వేది ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.వన వీర అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘వన వీర’. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్రిస్మస్ ఫెస్టివల్‌కు ఆరేడు సినిమాలు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను జనవరి 1కి వాయిదా వేశారు.అలాగే ఈ సినిమాకు తొలుత ‘వానర’ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ సెన్సార్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ‘వన వీర’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నందు విలన్ రోల్ చేశారు. కోన వెంకట్, సత్య, ఆమని, ‘ఖడ్గం’ పృథ్వీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఓ కుర్రాడి ప్రేమ, ఆ కుర్రాడి బైక్ దొంగతనం జరగడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలిసింది.సీఐడీ ఆఫీసర్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ సినిమాకు రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మించిన ఈ సినిమా జనవరి 2న రిలీజ్ కానుంది. యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీనివాస్, రాజేంద్రన్, అషు రెడ్డి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వరుస మిస్సింగ్ కేసులను సీఐడీ శివానీ రాథోడ్ ఎలా సాల్వ్ చేసింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివానీగా సన్నీ లియోన్ నటించారు.చేయని తప్పుకు నిందిస్తే... బాలనటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. తాను తప్పు చేయకపోయినా ఊరు ఊరంతా హీరోని నిందిస్తే, ఆ హీరో తనపై పడిన నిందను ఎలా తుడిపేసుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఎమ్. మమత, ఎమ్. రాజరాజేశ్వరిల సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మించారు. రాకేశ్ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ది రాజా సాబ్ రెడీ జనవరి నెల అంటే సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా పండగ. వెండితెరపై ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో ముందుగా రాజా సాబ్‌గా ప్రభాస్ థియేటర్స్‌లోకి వస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపోందిన ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇందులో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ హారర్ కామెడీ సినిమా ప్రధానంగా తాతా–మనవడి ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో తాతగా సంజయ్ దత్, మనవడిగా ప్రభాస్ నటించారని తెలిసింది. అలాగే వారసత్వపు ఆస్తి అనేది కూడా ఈ సినిమాలోని ప్రధాన కథాంశమని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమౌతోంది. మన శంకర వరప్రసాద్‌గారు వస్తున్నారు చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్‌గా చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, శశిరేఖ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలు భార్యాభర్తలుగా కనిపిస్తారు. హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, క్యాథరీన్, వీటీవీ గణేశ్ ఇతర పాత్రల్లో నటించారు.ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ తొలిసారిగా సిల్వర్‌స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబినేషన్లో ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కూడా ఉంది. ఈ పాట అభిమానులకు వెండితెరపై ఓ ఫీస్ట్ అనే చెప్పవచ్చు. అలాగే చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఈ సినిమాలో విలన్స్‌పై చేసే ఫైట్ కూడా హైలైట్‌గా ఉండనుందని సమాచారం. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి పండక్కి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు రవితేజ. ఆ విజ్ఞప్తి ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. హాస్యనటుడు సత్య, వెన్నెల కిశోర్, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామసత్య నారాయణ అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. రవితేజ, డింపుల్ హయతి భార్యా భర్తలుగా కనిపిస్తారు. ఆల్రెడీ వివాహం చేసుకున్న రామసత్యానారాయణ స్పెయిన్ వెళ్లడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం కావడం, అలా పరిచయమైన అమ్మాయి రామసత్యనారాయణ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయడం వంటి ఆసక్తికర, వినోదాత్మక సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నారీ నారీ నడుమ మురారి! ఒకే ఆఫీసులో మాజీ ప్రేమికురాలు, ప్రజెంట్ లవర్ ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో చూడొచ్చంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన ఈ వినోదాత్మక చిత్రం జనవరి 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.రాజుగారి కథ ఏంటో! ‘అనగనగా ఒక రాజు’ అంటూ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో వినోదాల విందు పంచబోతున్నాం అంటున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో నటించిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమ, పెళ్లి, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుసాయని తెలిసింది. ఓం శాంతి శాంతి శాంతిః భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు... వంటి అంశాలతో రూపోందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. సృజన్ ఎర్రబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్, కిశోర్, బాల సౌమిత్రి నిర్మించిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది.ఇలా జనవరి నెలలో రిలీజ్ కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.⇒ 2025లో రీ రిలీజ్‌ల హవా జోరుగా సాగింది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం’, నాగార్జున ‘శివ’, మహేశ్‌బాబు ‘ఖలేజా’, ప్రభాస్ ‘వర్షం’ వంటి టాప్ హీరోల సినిమాల రీ–రిలీజ్లు బాగానే జరిగాయి. ఇక 2026 ఏడాది ప్రారంభంలోనే రీ–రిలీజ్‌ల హవా మొదలైపోయింది. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ సినిమా 2026 జనవరి 1న రీ రిలీజ్ కానుంది.అలాగే మహేశ్‌బాబు హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ 4కే వెర్షన్‌ను న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందుగానే... అంటే ఈ డిసెంబరు 31న రీ రిలీజ్ కానుంది. అంటే... జనవరి 1న కూడా ‘మురారి’ సినిమా థియేటర్స్‌లో ఉంటుంది. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సోనాలీ బ్రిందే హీరోయిన్గా నటించారు. ఎన్. దేవీ ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపీ నందిగం ఈ సినిమాను నిర్మించారు.ఆల్కహాల్ వాయిదా?‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’. ఈ కామెడీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమాకు మెహర్ తేజ్ దర్శకుడు. ఓ వ్యక్తి జీవితం ఆల్కహాల్ వల్ల ఏ విధంగా ప్రభావితమైంది? అతను ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఎలా ఉండేవాడు? ఆ తర్వాత అతని ప్రవర్తన ఏ విధంగా మారింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. రుహానీ శర్మ, నిహరిక ఎన్.ఎమ్, సత్య, గిరీష్ కులకర్ణి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. మరి... జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కాకపోతే అదే నెలలోనే మరో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారా? లేక వేరే నెలలో డేట్ ఫిక్స్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.అనువాదాలూ రెడీఅనువాద సినిమాలు కూడా ఈ జనవరి నెలలో బాగానే ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తీకేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో శ్రీలీల, అధర్వ, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ లీడ్ ల్స్‌లో నటించిన ‘గత వైభవం’ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో రూపోందింది. ఈ సినిమా కన్నడ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్‌ను జనవరి 1న రిలీజ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రేమ, పునర్జన్మ వంటి అంశాల నేపథ్యంలో పోందిన ఈ సినిమాకు సునీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని అనువాద చిత్రాలు కూడా ఈ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి
సెలబ్రిటీలు స్టేజీ ఎక్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెంట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?#TheRajaSaab రెండు వేల రూపాయలు కొల్ల కొట్టే సినిమాఅలా అవ్వకపోతే నేను మీరు కలిపి ఇద్దాం..!#Prabhas pic.twitter.com/UlRXWfji7f— Telugu70mm (@Telugu70mmweb) December 27, 2025 -
మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రభాస్.. 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్ సినిమా ‘ది రాజా సాబ్’.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నేడు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్బంగా ఇదే గ్రౌండ్లో 220 ఫీట్ల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.మీడియాకు పూర్తిగా దూరంగా ఉండే ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం చాలా కాలం తర్వాత వేదికపైకి రానున్నారు. 'సలార్' సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా డార్లింగ్ కనిపించారు. కానీ, మరే ఈవెంట్లో ప్రభాస్ కనిపించలేదు. బహిరంగ వేదికలపై కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. తమ హీరోను చూసి చాలా ఏళ్లు అవుతుందని అభిమానులు కోరుతూ ఉండటంతో రాజా సాబ్ ఈవెంట్లో ఆయన పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ కూడా తెలిపారు. ఈ లెక్కన సుమారు 3ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ వేదికపైకి రానున్నారు. -
రాజే యువరాజే...
క్రిస్మస్ పండగని పురస్కరించుకుని ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రాజే యువరాజే...’ అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రభాస్ క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధీ అగర్వాల్‌తో ప్రేయర్ చేయించుకోవడం వంటివి ఈ ప్రోమోలో చూపించారు.త్వరలోనే పూర్తి పాటని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే జనవరి 9న విడుదల కానుంది. -
శివాజీ వల్గర్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన రాజాసాబ్ బ్యూటీ..!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందించింది. లులు మాల్లో జరిగిన సంఘటన తర్వాతే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పడంపై నిధి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. బాధితురాలిదే తప్పని నిందించడం మానిపులేషన్ అవుతుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ ప్రెస్ మీట్లో శివాజీ లులు మాల్లో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. నిధి అగర్వాల్‌కు అలా జరిగిన తర్వాతే తాను ఈ కామెంట్స్ చేశానని సమర్థించుకున్నారు.అంతకుముందు దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు. ఈవెంట్లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవద్దని.. అంతా బయటికి కనిపించేలా రావొద్దంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినీతారలతో పాటు యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ అనసూయతో పాటు సింగర చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటరిచ్చారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది.క్షమాపణలు చెప్పిన శివాజీ..తన కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందని.. అంతేకానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ రెండు పదాల వల్లే సారీ చెబుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు. -
సంక్రాంతి బరిలో 'డబ్బింగ్' రిస్క్ అవసరమా?
సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి సీజన్ బంగారు బాతులాంటిది. దీన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ప్రతి పండక్కి ఒకటి రెండు లేదంటే మూడు మూవీస్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి లిస్టు చాలా పెద్దగా ఉంది. తెలుగులోనే బోలెడు చిత్రాలు అనుకుంటే తమిళ డబ్బింగ్‌లు పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎవరికీ రిస్క్?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)ఈసారి సంక్రాంతికి మొదటగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ నటించిన ఈ మూవీ.. లెక్క ప్రకారం డిసెంబరులో రానుందని ప్రకటించారు. కొన్నిరోజులకే ప్లాన్ మార్చేసి పండగ బరిలో దింపారు. జనవరి 9న థియేటర్లలో రిలీజ్. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి పోటీగా తమిళ హీరో విజయ్ చివరి మూవీ 'జన నాయగణ్' ఉంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అనే టాక్ బలంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలుగులో జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే తమిళనాడులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడాలి?ఈ రెండొచ్చిన మరుసటి రోజు అంటే 10వ తేదీన 'పరాశక్తి' రాబోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. జయం రవి, అధర్వ కీలక పాత్రలు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ లేదు. తెలిసిన ముఖాలు ఉన్నాయి తప్పితే ఒకవేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఎంతమేరకు ఆకట్టుకుంటుందో? ఈ రెండు మాత్రమ సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ బొమ్మలు.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)వీటి తర్వాత 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న వాటిలో ప్రభాస్ది తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్‌గా చేసుకుని తీసిన చిత్రాలే. కాబట్టి వీటిలో ఒకటి రెండయినా హిట్ అయ్యే అవకాశముంది. అన్ని సక్సెస్ అందుకున్న మంచిదే. ఒకవేళ అదే జరిగితే మాత్రం తమిళ డబ్బింగ్లని ఎవరూ ఆదరించారు.అయితే జన నాయగణ్, పరాశక్తి చిత్రాల్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. కాస్త ఆలస్యం రిలీజ్ చేయడం లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి ఈసారి లిస్టు అయితే దాదాపు ఏడు సినిమాలతో చాలా పెద్దగా ఉంది. మరి వీటిలో ఎవరు ఎవరిని రిస్క్‌లో పెడతారు? ఎవరు పైచేయి సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?) -
ది రాజాసాబ్ మూవీపై రూమర్స్.. నిర్మాత ట్వీట్ వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌ను మారుతి డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా.. సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. రెబల్ స్టార్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.రెబల్ స్టార్ మూవీ కావడంతో టాలీవుడ్లో అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్ డీల్స్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీ డీల్‌తో పాటు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలు అందుకోలేకపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రూమర్స్‌పై ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారిందిమా అతిపెద్ద సినిమా అయిన ది రాజాసాబ్ అంతర్గత లెక్కల గురించి బయటికి చెప్పలేమని నిర్మాత వెల్లడించారు. మా సినిమాకు థియేటర్లలో రిలీజ్ తర్వాత వచ్చే లెక్కలను అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపారు. సినిమా రంగం అనేది దశలవారీగా మారుతూ ఉంటుందన్నారు. ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయని అన్నారు. థియేటర్లలో మాత్రమే అసలైన నంబర్స్ వస్తాయని వెల్లడించారు. అయినప్పటికీ కూడా మా సినిమా ఈ రోజు అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను సాధించిందని విశ్వప్రసాద్ ట్వీట్లో రాసుకొచ్చారు. ది రాజాసాబ్‌కు పోలికలు అనవసరమని రూమర్స్‌ను కొట్టిపారేశారు నిర్మాత. కాగా.. ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. There’s a lot of noise around the business of our biggest film.We don’t discuss internal spends or numbers publicly. What truly matters to us and the fans is the theatrical impact. Post release, we will officially share the worldwide box-office figures.Cinema moves in phases.…— Vishwa Prasad (@vishwaprasadtg) December 21, 2025 -
ప్రభాస్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. పోలీసుల యాక్షన్..!
ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఈవెంట్ వివాదానికి దారితీసింది. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా హీరోయిన్ను చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. కొందరు ఏకంగా ఆమె తాకేందుకు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్లో హీరోయిన్‌కు భద్రత కల్పించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈవెంట్‌కు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.అసలేం జరిగిందంటే..ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
నిధి అగర్వాల్‌పై చేతులు.. వీళ్లు మగాళ్లు కాదంటూ చిన్మయి ఫైర్
ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిధి అగర్వాల్ కనీసం తన కారు వద్దకు కూడా చేరుకోవడం కష్టమైంది. అయితే, అక్కడ ఉన్న బౌన్సర్లు అక్కడున్నవారిని వెనక్కి నెట్టి చివరకు నిధి అగర్వాల్‌ను కారు ఎక్కించారు. దీంతో నిధి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తే.. సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందిచారు. నిధి అగర్వాల్‌కు ఎదురైన సంఘటన చాలా దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జంతువుల కంటే హీనంగా ఉన్నారంటూ చిన్మయి భగ్గుమంది. ఇలాంటి మానవ మృగాలను భూమిపై ఉంచకుండా మరో గ్రహానికి పంపించాలని కోరింది. Pack of men behaving worse than hyenas.Actually why insult hyenas. Put ‘likeminded’ men together in a mob, they will harass a woman like this. Why doesnt some God take them all away and put them in a different planet? https://t.co/VatadcI7oQ— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025Vultures Disguised As Fans; Prabhas Starrer "The Raja Saab" Actress Nidhhi Agerwal, was literally gets Mobbed and Crushed by Fans at a Song Launch event in Hyderabad on Wednesday.#NidhhiAgerwal #Prabhas #Hyderabad #TheRajaSaab #SahanaSahana pic.twitter.com/omOzynRQcj— Surya Reddy (@jsuryareddy) December 17, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ది రాజాసాబ్ ప్రీమియర్స్ షోలు వేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయని సాంగ్ లాంఛ్ ఈవెంట్లో వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. JAN 8th - PremieresPre Release Event in Hyderabad #TheRajaSaab— The RajaSaab (@rajasaabmovie) December 17, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు. -
నిధి అగర్వాల్‌తో 'రాజాసాబ్' డ్యాన్స్.. ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సెకండ్ సాంగ్ ప్రోమోతాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది. It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025 -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి
ప్రభాస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల సంక్రాంతి బరిలో ఉంచారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడు మారుతి వద్దని అభిమానులు గోలగోల చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ దర్శకుడిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే అలా తిట్టకపోతే తాను 'రాజాసాబ్' తీసేవాడిని కాదని మారుతి చెప్పుకొచ్చాడు.'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ రెండో సీజన్.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు వచ్చిన మారుతి.. తనపై వచ్చిన విమర్శల గురించి, ట్రోల్స్ గురించి ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇప్పుడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో పాల్గొన్న నటి ప్రగతి.. రీసెంట్‌గానే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కూడా గెలుచుకుంది. ఈమె గురించి కూడా మారుతి మాట్లాడారు.(ఇదీ చదవండి: రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?)'నటి ప్రగతి గారికి ఇదో ఎమోషనల్ డే అని అర్థమైంది. మేడమ్.. మిమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారని ఏం అనుకోవద్దు. ఎందుకంటే అలా తిట్టకపోతే మీరు గోల్డ్ మెడల్ సాధించేవారు కాదు. నేను 'రాజాసాబ్' తీసేవాడిని కాదు. ట్రోలర్స్ నిజంగా పనులన్నీ మానుకుని మనకోసం టైమ్ కేటాయించి, పాజిటివిటీ అంతా చంపుకొని, బ్రెయిన్‌లోకి నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని నాలుగు తిట్లు తిడుతున్నారు. పాపం వాళ్ల దగ్గరున్న నెగిటివిటీనే పంచుతున్నారు''వాళ్ల దగ్గర నాలుగు బూతు మాటలు.. నాలుగు తిట్లు మాత్రమే ఉంటాయి. అవే పంచుతున్నారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ చూసినప్పుడు.. ఒరేయ్, ఇది తప్ప మీ దగ్గర ఇంకేమీ లేదా అనుకుంటాను. ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోండి. మీరు కూడా మిమ్మల్ని తిట్టేవాళ్లని ఎతుక్కోండి. లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా ట్రోలర్స్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటే, మేము ఎదుగుతూ ఉంటాం. మీరు మాత్రం అక్కడే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల నెగిటివ్ కామెంట్స్ చేసే వారందరికీ చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము.. మేము సాధించలేం' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో మిస్ అవుతున్న 'నవ్వు') -
'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)
-
భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ది రాజాసాబ్ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ ఓటీటీ డీల్‌పై అభిమానులతో పాటు ఆడియన్స్‌లోనూ సస్పెన్స్ ఆసక్తి నెలకొంది. ఇటీవలే జియో హాట్ స్టార్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మరి ఈ డీల్ విలువ ఎంతనే దానిపై ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ది రాజాసాబ్ మూవీ హక్కులను దాదాపు రూ.140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఫర్మామెన్స్ ఆధారంగా ఈ డీల్ మరింత పెరగొచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రిజల్ట్‌ను బట్టి ఈ డీల్ విలువ దాదాపు రూ.150 నుంచి 200 కోట్లకు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాథమికంగా కుదుర్చుకున్న డీల్ కంటే జియో హాట్ స్టార్ అదనంగా మరింత మొత్తాన్ని నిర్మాతలకు చెల్లించాల్సి రావొచ్చు. -
థాయ్‌ల్యాండ్ ట్రిప్‌లో 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)
-
అఖండ- 2 వాయిదా, రాజా సాబ్పై ఎఫెక్ట్.. నిర్మాత క్లారిటీ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రభావం చిన్న సినిమాలపై పడనుంది. డిసెంబర్ నెలలో మోగ్లీ, శంబాల, ఛాంపియన్ వంటి చిన్న సినిమాలు ఉన్నాయి. వీటితో పాటుగా అఖండ బరిలోకి దిగితే నష్టపోయేది ఆయా నిర్మాతలే.. అయితే, తాజాగా అఖండ2 గురించి ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్ స్పందించారు.అఖండ వాయిదా.. దురదృష్టకరంవిడుదలకు ముందు సినిమాలు ఆగిపోవడం దురదృష్టకరమని విశ్వ ప్రసాద్ ఆవేదన చెందారు. 'కొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో ఇలా ఆగిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పరిశ్రమలోని ఇతర వ్యక్తులపై ప్రభావం చూపడం మరింత దురదృష్టకరం. పెద్ద సినిమాల విడుదల తేదీలను దృష్టిలో ఉంచుకుని చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ, ఇలా చివరి నిమిషంలో విడుదలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం నన్ను చాలా కలవరపెట్టింది. ఇటువంటి చర్యలను అందరూ ఖండించాలి. ఇలా అర్థాంతరంగా వాయిదా వేయడం అనేది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, సాంకేతిక నిపుణులు ఈ వ్యవస్థలోని వేలాది మంది జీవనోపాధిపై కూడా ప్రభావితం చూపుతుంది. ఫైనాన్స్ చేసే వారు ఇలా చివరి నిమిషంలో అంతరాయం కలిగించకుండా ఏదైనా స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించడం చాలా అవసరం. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా తగిన చట్టపరమైన చర్యలను వాటాదారులు కూడా రూపొందించాల్సి వుంటుంది. ఒక సినిమా విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న సరే ముందుగానే వాటిని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇరువురిపై ఉంది. అన్ని సమస్యలు దాటుకొని అఖండ 2 పెద్ద ఎత్తున విడుదల కావాలని ఎదురుచూస్తున్నాము’ అని ట్వీట్ చేశారు.రాజాసాబ్.. వడ్డీతో సహా క్లియర్ చేస్తాంరాజాసాబ్ విడుదల చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయని నిర్మాత విశ్వ ప్రసాద్ అన్నారు. అనుకున్న సమయానికే సినిమా ఉంటుందన్నారు. రాజాసాబ్ కోసం సేకరించిన పెట్టుబడులన్నీ అంతర్గత నిధుల ద్వారా పూర్తిగా క్లియర్ చేయబడతాయని ఆయన తెలిపారు. పెట్టుబడికి సంబంధించిన వడ్డీ కూడా త్వరలోనే క్లియర్ అవుతుందన్నారు. సినిమా వ్యాపారం ప్రారంభించగానే ఇవన్నీ క్లియర్ చేయబడుతాయని ఆయన అన్నారు. ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా రాజాసాబ్ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు 'రాజాసాబ్' ఓటీటీ డీల్ క్లోజ్
ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి నుంచి 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం తొలుత ట్రైలర్, తర్వాత ఓ పాటని రిలీజ్ చేశారు. అలానే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఓటీటీ డీల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్)ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీసిన హారర్ ఫాంటసీ మూవీ ఇది. కొన్నాళ్ల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కంటెంట్ ఏంటనేది చూచాయిగా క్లారిటీ వచ్చేసింది. హారర్, ఎంటర్టైన్మెంట్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టింది. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉండిపోయింది.ఇప్పుడన్నీ సమస్యలన్నీ క్లియర్ కావడంతో 'రాజాసాబ్' డిజిటల్ హక్కుల్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ.. భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి 6 వారాలకు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే 8 వారాలకు కుదుర్చుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
బుకింగ్ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్'
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ టైమ్ ఫిక్స్ అయింది. లెక్క ప్రకారం ఈ వారమే థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి రావాలని నిర్ణయించుకుని.. విడుదల తేదీని జనవరి 9కి మార్చారు. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్నిరోజుల క్రితం రిలీజైన తొలి పాట మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా యూఎస్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఓ విషయంలో ఫ్యాన్స్‌కి క్లారిటీ వచ్చేసింది.'రాజాసాబ్' ఓవర్సీస్కి సంబంధించిన టికెట్లని తాజాగా ఆన్లైన్లో పెట్టేశారు. ఈ క్రమంలోనే మూవీ రన్ టైమ్ ఎంతో బయటపడింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చింది. గతంలో మూడున్నర గంటలకు పైనే ఉండొచ్చని అన్నారు. ఇప్పుడు ఫైనల్‌గా ఈ టైమ్‌కి ఫిక్సయ్యారనమాట.(ఇదీ చదవండి: నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు)గత కొన్నేళ్లలో అర్జున్ రెడ్డి, పుష్ప 2, యానిమల్ తదితర చిత్రాలు 3 గంటలకు పైగా రన్ టైమ్‌తోనే థియేటర్లలోకి వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. అవన్నీ డిఫరెంట్ జానర్స్. 'రాజాసాబ్' కూడా 3 గంటలకు పైనే ఉన్న పెద్ద మూవీ. కంటెంట్ పరంగా మెప్పిస్తే పర్లేదు లేదంటే మాత్రం చూసే ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశముంది. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త టెన్షన్. మరి 3 గంటల పాటు టీమ్ ఏ రేంజులో మెప్పిస్తారో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకత్వం వహించారు. హారర్ ఫాంటసీ కామెడీ కథతో దీన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పెట్టింది. సంక్రాంతి బరిలో తొలుత రాబోతున్న సినిమా ఇదే. తర్వాత మిగతా చిత్రాలు థియేటర్లలోకి వస్తాయి.(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్) -
ప్రభాస్ ది రాజా సాబ్.. అత్తారింటికి దారేది నటుడి స్పెషల్ పోస్టర్..!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం " ది రాజా సాబ్". ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ ఇరానీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా.. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. -
ప్రభాస్ 'రాజాసాబ్'లో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ నటి మాత్రం.. హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకుంది. తర్వాత ఎంక్వైరీ చేసి నమ్మకం తెచ్చుకుంది. ఈ మొత్తం విషయాన్ని స్వయంగానే సదరు నటి బయటపెట్టింది. ఆ మూవీ 'రాజాసాబ్' కాగా.. నటి పేరు రిద్ధి కుమార్. ఇంతకీ అసలేం జరిగింది?మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్.. 'లవర్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. 2018లో వచ్చిన ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరో. దీని తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లో తలో మూవీ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2022లో వచ్చిన 'రాధేశ్యామ్'లో అతిథి పాత్రలో కనిపించింది. అనంతరం హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రిద్ధి చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)''రాజాసాబ్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్కేన్.. నాకు ఓసారి కాల్ చేశారు. మేం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం. నిన్ను హీరోయిన్గా అనుకుంటున్నాం అని చెప్పారు. మొదట ఇదంతా నేను నమ్మలేదు. ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. మా మేనేజర్ని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని క్లారిటీ వచ్చింది. తర్వాత లుక్ టెస్ట్, ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు' అని రిద్ధి కుమార్.. 'రాజాసాబ్'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. రిద్ధి కుమార్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా వేశారు. జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా తొలి పాట రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌తో పాటు రిద్ధి కుమార్ కనిపించింది.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)Riddhi - Her being Part of #TheRajaSaab: 😂❤️🔥Got Call from SKN garu: “We’re making Film with #Prabhas, we want you as Heroine.” Thought it was a prank! Called my manager to verify. They asked “Do you know Prabhas?” I said “Yes of course!” Gave look test, auditioned & Here I'm. pic.twitter.com/Latj2XAXbI— Prabhas (@HereForDarling) November 25, 2025 -
పొంగల్ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్సాబ్ పేరుతో ఈ ఫుల్ సాంగ్‌ను(The Raja Saab First Single) విడుదల చేశారు. ఈ పాట రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఊపేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
రాజాసాబ్: విజిల్స్ వేయించే సాంగ్ వస్తోంది!
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలు చేస్తున్నాడు. హను రాఘవపూడితో 'ఫౌజీ', సందీప్‌రెడ్డి వంగాతో 'స్పిరిట్', నాగ్ అశ్విన్‌తో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్, ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2', మారుతితో 'ది రాజాసాబ్' సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వీటిలో ది రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్లో రిలీజవుతుందని మొదట్లో ప్రకటించారు. ఫస్ట్ సాంగ్కానీ, పలు కారణాల రీత్యా దాన్ని వాయిదా వేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ది రాజాసాబ్ నుంచి ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ మాత్రమే చూశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాబోతుందని అప్డేట్ వదిలారు. నవంబర్ 23న రెబల్ సాంగ్ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు (#TheRajaSaab First Single #RebelSaab Release Date). విజిల్ కొట్టించేలా..ఈ పాట మీతో విజిల్ కొట్టించేలా ఉంటుందంటూ ప్రభాస్ పోస్టర్ కూడా షేర్ చేశారు. అందులో ప్రభాస్ ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్ మూవీ విషయానికి వస్తే ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. Here comes #TheRajaSaab STYLE 😎Bringing you the MOST WHISTLE WORTHY TREAT #RebelSaab Song on NOV 23rd 🔥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @Bomanirani @vishwaprasadtg… pic.twitter.com/ceNYsGcCZ4— People Media Factory (@peoplemediafcy) November 21, 2025 చదవండి: అమల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా? -
ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్లో ఫ్యాన్స్!
ప్రస్తుతం హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతుంది. ఒక సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించి.. షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas ) మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలను ప్రకటించి..అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఎప్పుడో ప్రకటించినవే. ఆయన చేతిలో ఇంకా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ది రాజాసాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది.ప్రస్తుతం ఆయన పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్ రిలీజ్ తర్వాత స్పిరిట్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. మరోవైపు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఇవీ కాకుండా ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్..తాజాగా ఇంకో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొరియోగ్రాఫర్‌కి చాన్స్..ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్(Prem Rakshit)తో ప్రభాస్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడట. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇప్పుడీ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది . ఇప్పటికే ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయడానికి దాదాపు రెండేళ్ల సమయంలో పట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ది రాజాసాబ్ షూటింగ్ సమయంలోనే ప్రేమ్ రక్షిత్..ప్రభాస్‌కి కథ చెప్పాడట. అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. టెన్షన్లో ప్రభాస్ ఫ్యాన్స్ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయన సినిమా కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి భారీ హిట్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ కల్కి మినహా మిగతా చిత్రాలన్నీ బాహుబలి స్థాయిలో విజయం సాధించలేదు. ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడుకి చాన్స్ ఇచ్చి ప్రభాస్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే ఇందులో ప్రభాస్ నటించడని.. ఇదొక యానిమేషన్ సినిమా అని, ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించడానికే ఓకే చెప్పినట్లు టాక్. ఇందులో వాస్తవం ఏంటనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
ఫుల్ బిజీగా...
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్‌ఫుల్‌గా 23 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ 2002 నవంబరు 11న విడుదలైంది. ఈ చిత్రాన్ని జయంత్. సి పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్ కుమార్ నిర్మించారు. కాగా, హీరోగా ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తాజా చిత్రాల్లో ఒకటైన ‘ది రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. ఇక ఈ సినిమా కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలోని పీరియాడికల్ సినిమా ‘ఫౌజి’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇంకా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న ‘స్పిరిట్’ చిత్రం త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి 2’ (‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్) చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభం కానుంది. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు కొత్త సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు ప్రభాస్. -
'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
గతేడాది 'కల్కి'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది 'కన్నప్ప'లో అతిథి పాత్రలో మెరిశాడు. బాహుబలి రీ రిలీజ్ వల్ల మరోసారి థియేటర్లలోకి వచ్చాడు. కానీ స్ట్రెయిట్ మూవీ మాత్రం రాలేదు. లెక్క ప్రకారం డిసెంబరు 5న 'రాజాసాబ్' రావాల్సింది. కానీ సంక్రాంతికి వాయిదా వేశాడు. జనవరి 9న రిలీజ్ అని అధికారికంగానే ప్రకటించారు. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వాయిదా అనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.'రాజాసాబ్' సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. ఇవి చూసుంటే ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగానే ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే పని జరుగుతోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఈసారి కూడా ఆలస్యమయ్యేలా ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఖండించిన నిర్మాత.. చెప్పినట్లుగానే జనవరి 9న మూవీ రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)డిసెంబరు 25వ తేదీ కల్లా సినిమా తొలి కాపీ రెడీ అయిపోతుందని, అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని.. పనిలోపనిగా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశారు. దీంతో వాయిదా ఏం లేదులే అని ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హారర్ ఫాంటసీ కథతో తీశారు. భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో ఉండే పాటలు, ఫైట్స్, రొమాన్స్ లాంటివి కూడా ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ అని ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రధారి. తమన్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్) -
మరో సీక్వెల్లో ప్రభాస్.. రెండేళ్లు ఆగాల్సిందే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆయన నటించిన ది రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పౌజీ’(Fauzi) సినిమా చేస్తున్నాదు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నాడు. మరోవైపు సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ కూడా చేయబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా మరో సీక్వెల్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అదే ది రాజాసాబ్ 2.మారుతి స్టైల్ నచ్చి..మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమా చేశాడు. ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సీక్వెల్‌పై స్పష్టత ఇచ్చాడు. ‘రాజాసాబ్ 2’ ఉంటుందని.. కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని.. థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయని ఓ ప్రెస్మీట్లో ఆయన చెప్పారు. అయితే అప్పటికీ మారుతి కథ సిద్ధం చేయలేదు. కానీ ప్రభాస్ మాత్రం మారుతితో మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపించాడట. దీంతో మారుతి ఇటీవల రాజాసాబ్ 2 స్టోరీకి సంబంధించిన లైన్‌ని ప్రభాస్‌కి చెప్పాడట. అది బాగా నచ్చడంతో ‘చేసేద్దాం డార్లింగ్’అని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.రెండేళ్ల వరకు ఆగాల్సిందే..ప్రభాస్ ఇప్పుడు పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే..వెంటనే ‘స్పిరిట్’చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఆ తర్వాత సలార్ 2 లేదా కల్కి 2 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు దాదాపు రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే ప్రభాస్ మరో కొత్త సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే రాజాసాబ్ సీక్వెల్ ఉన్నా.. రెండేళ్ల తర్వాత దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభాస్‌తో సినిమా కాబట్టి మారుతి కచ్చితంగా ఆగుతాడు. అందులో నో డౌట్. ది రాజాసాబ్ రిలీజ్ తర్వాత రిజల్ట్‌ని బట్టి పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్‌లో ఉన్న పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్‌కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రాజాసాబ్ ట్రైలర్ బ్లాక్ బస్టర్.. రూ. 1000 కోట్లు పక్కా
-
సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’
సంక్రాంతి పండగ టాలీవుడ్‌కి అతి ముఖ్యమైనది. యావరేజ్ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్లో పొంగల్ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్‌ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్‌లైన్. ట్యాగ్‌లైన్ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక మిగిలిన డేట్స్ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్ లేదు. దసరాకి ఈ సినిమా అప్డేట్ వస్తుంది. ఓ పాటను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అప్పుడైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా పొంగల్ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందో చూడాలి. -
ది రాజా సాబ్ ట్రైలర్..ఈ ఫోటోలు చూశారా?
-
ప్రభాస్ డార్లింగ్స్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్‌కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్‌గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్‌గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
'ది రాజా సాబ్' ట్రైలర్.. ప్రభాస్ పోస్ట్ వైరల్
కల్కి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి ప్రకటన చేశారు. ప్రభాస్ రాయల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ శుభవార్త అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించారంటూ ప్రశంసలు దక్కాయి.‘ది రాజా సాబ్’ (The Raja Saab) ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయింత్రం ఆరు గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా ప్రకటించారు. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగానే ప్రభాస్‌ను చూపించానని మారుతి అన్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ మూవీలో వచ్చే 40 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని కూడా దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం సుమారు 3గంటల పాటు రన్ టైమ్ ఉంటుందన్నారు.దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. The wait of millions finally comes to an end 💥💥#TheRajaSaabTRAILER will be out on September 29th at 6PM.A ROYAL entry into a world of FUN, FEAR and a whole lot of Majestic Experiences ❤️🔥#TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_… pic.twitter.com/9q8WcHXSj2— Director Maruthi (@DirectorMaruthi) September 28, 2025 -
ట్రైలర్ రెడీ
ఫ్యాన్స్‌కు దసరా ట్రీట్ రెడీ చేస్తున్నారు హీరో ప్రభాస్. ఫ్యాంటసీ అండ్ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో ప్రభాస్ పరిచయ పాట చిత్రీకరణ జరిగింది.కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గ్రీస్ దేశంలో జరుగుతుందని, అక్కడ ప్రభాస్‌తో పాటు లీడ్ హీరోయిన్స్ పాల్గొనగా కొన్ని పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించి వచ్చారు. ఇక ఈ దసరా పండక్కి, ‘ది రాజాసాబ్’ సినిమా ట్రైలర్ విడుదల కానుందని తెలిసింది.ఈ ట్రైలర్ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయని, నిడివి మూడు నిమిషాలకు పైనే ఉంటుందని సమాచారం. ఇలా ఈ దసరా పండక్కి ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు ప్రభాస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
రెబల్ స్టార్ రాజాసాబ్...మిరాయ్‌ని మరిపిస్తాడా?
ఓ వైపు పెద్ద పెద్ద హీరోల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వస్తున్న చిత్రాలు ఊరించి ఊరించి ఉస్సురుమనిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేని స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాయి. అది మరీ వింత కాకపోయినా ఈ మధ్య తరచుగా జరుగుతుండడమే గమనార్హం. మరీ ముఖ్యంగా బలమైన నెట్ వర్క్,సమర్ధులైన సాంకేతిక నిపుణులు పనిచేసిన భారీ చిత్రాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక అప్రతిష్ట పాలవుతున్నాయి. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్ గానీ, హరి హర వీరమల్లు, కన్నప్ప లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో చిన్న చిత్రాల్లోని గ్రాఫిక్స్ కళ్లప్పగించేలా చేస్తూ సినిమాని బ్లాక్ బస్టర్‌గా మారుస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు మిరాయ్(Mirai Movie) కూడా జేరింది. విడుదలైన రోజు నుంచి మిరాయ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు సమీక్షలు కూడా సాధిస్తోంది. ఈ చిత్రం బృందంలో సాంకేతికత పాత్ర భారీగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, హాలీవుడ్‌లోని అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ కంపెనీలతో సమానమైన అవుట్‌పుట్‌ను మిరాయ్ బృందం అందించగలిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఇదంతా హైదరాబాద్‌లోనే స్థానికంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నియమించిన టీమ్ ఈ అద్భుతమైన ఆవిష్కరణను అందించడం.ట్రైలర్ విడుదలైనప్పుడే వీక్షకులు అందరూ అవుట్‌పుట్‌కి ఆశ్చర్యపోయారు నేడు, సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ ముందు పక్షి ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, రాముడి సీన్లు...తెరపైన ఆవిష్కృతమవుతుంటే.. ప్రేక్షకులు ఆ అద్భుతమైన గ్రాఫిక్స్ పనితీరుని కళ్లప్పగించి చూస్తుండటం కనిపిస్తోంది. ఇటీవల అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పరిశ్రమలలోని టాప్ కంపెనీల నుంచి కూడా నమ్మదగిన విఎఫ్ఎక్స్ అవుట్‌పుట్‌ను పొందడంలో తరచుగా విఫలమవుతున్న పరిస్థితిలో హైదరాబాద్‌లోని సాంకేతిక నిపుణులే దీనిని సాధించగలగడం మరింత ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ లో ఎటువంటి అస్పష్టత రాకుండా కూడా చిత్రబృందం చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, పరిమిత వనరులతోనే టీమ్ మిరాయ్ ఈ అద్భుతమైన అవుట్‌పుట్‌ను సాధించడం గమనార్హం.ఈ సినిమా సాధించిన అనూహ్య విజయం రాబోయే మరో అగ్రహీరో ప్రభాస్ భారీ చిత్రం రాజా సాబ్(The Raja Saab) ను చర్చనీయాంశంగా మారుస్తోంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న రాజాసాబ్ కూడా మిరాయ్ ను అందించిన అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రానుంది. రెబల్ స్టార్ అభిమానులు ఈ చిత్రానికి కూడా అదే రకమైన అవుట్‌పుట్ ను ఊహిస్తున్నారు. దాంతో ఆ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజా సాబ్ ఒక హర్రర్ డ్రామా, దీనిని చాలా వరకూ సెట్లోనే చిత్రీకరించారు దాంతో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కూడా బాగుంది మిరాయ్ లాగే దీనికి కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ జతగూడితే...ప్రభాస్ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టే అయి ఇక అభిమానులకు రికార్డుల పండగే అని చెప్పొచ్చు. -
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు: మారుతి
హారర్ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్‌ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు. పిచ్చిమాటలు, బూతులుతాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్‌ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడుచొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను. రూ.400 కోట్లతో రాజాసాబ్బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్‌కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి. చిల్లర పనులు చేయొద్దుఅందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
ప్రభాస్ ది రాజాసాబ్.. ట్రైలర్ రిలీజ్‌పై బిగ్ అప్డేట్!
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer. Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025 -
రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ది రాజాసాబ్ వాయిదా!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. మిరాయి ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన ఆయన ది రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. జనవరి 9న ది రాజాసాబ్ విడుదల చేస్తామని వెల్లడించారు. టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీతో తెరకెక్కిస్తున్నామని అన్నారు. దీంతో రెబల్ స్టార్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఇప్పటికే పొంగల్ బరిలో చాలా చిత్రాలు ఉన్నాయి. వాటితో ది రాజాసాబ్ పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. -
డబుల్ బొనాంజ
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ఇతర హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 17) నిధీ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘ది రాజాసాబ్’లోని ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.దసరాకి టైటిల్: నిధీ అగర్వాల్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈ దసరా పండగకి రానుంది. ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకత్వంలో పుప్పల అప్పలరాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ ఎవరూ ఊహించని కొత్తపాత్రలో కనిపిస్తారు. ఈపాత్రలో ఆమె కనబరిచే నటన ఆమె కెరీర్లో మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుంది’’ అని పుప్పల అప్పలరాజు పేర్కొన్నారు. ఇలా రెండు సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజ ట్రీట్ ఇచ్చారు నిధీ అగర్వాల్. -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ది బెంగాలీ ఫైల్స్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే తేదీకి రిలీజ్ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్ కావాల్సిన విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను అరుణ్ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్?నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్‌కు ఆలస్యమౌతోంది. సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమౌతున్న అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.సత్యలోకానికి పయనం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్‌లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్‌కి థియేటర్స్‌లోకి వస్తుందని ఆడియన్స్ ఊహించారు. కానీ సమ్మర్లో కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్ రాజీ పడకుండాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్‌ను మేకర్స్ కేటాయించారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే.ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్ నటించారని టాక్.ఆలస్యంగా రాజాసాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.పండక్కి రానట్లే! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే రైల్వేపోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్ నవీన్‌చంద్ర కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంటాయని తెలిసింది.సంబరాలు ఎప్పుడు? సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.స్వయంభూ నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్. కానీ భారీ వీఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్ (బంగారు రాజదండం) నేపథ్యంలో ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం.ఓం శాంతి శాంతి శాంతిః తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.భార్యాభర్తల కథ లావణ్యా త్రి పాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా ఈ ఏడాదిలో రిలీజ్‌కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ది రాజాసాబ్ హీరోయిన్‌కు ప్రభాస్ సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాదు.. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు. అది సెట్లో అయినా.. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు. అలా ఇప్పటికే షూటింగ్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్‌కు భోజనం పంపించారు మన ప్రభాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రభాస్‌తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది.ది రాజాసాబ్‌లో నిధి..ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్?ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ప్రయాణించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌కు ఏకంగా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది. గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్గా నిధి అగర్వాల్ కనిపించింది.Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 12, 2025 -
భాగ్యనగరంలో భారీ సెట్స్.. స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఇక్కడే నివాసం ఉంటుంటారు (ఇతర భాషల వాళ్లు మినహా). సినిమా షూటింగ్‌లకు అనువైన స్టూడియోలు ఇటు భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చిత్రీకరణలు జరుపుతుంటారు మేకర్స్. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగచైతన్య, రామ్ పోతినేని, విజయ్ సేతుపతి, సాయిదుర్గా తేజ్, తేజా సజ్జా, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషా రుగా పాల్గొంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఎవరెక్కడ? షూటింగ్లో పాల్గొంటున్నారో ఆ విశేషాలేంటో చూద్దాం...అజీజ్ నగర్లో రాజా సాబ్ ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మారుతి. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందట.. మరో పది శాతం చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి ఈ సినిమాకి ఎంతో కీలకం కానున్న గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టనున్నారట మారుతి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘గబ్బర్ సింగ్’ (2012) చిత్రం మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్ ΄ాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల ఈ సినిమా పతాక సన్నివేశాలు పూర్తయినట్లు ప్రకటించారు మేకర్స్. క్లైమాక్స్‌లో భాగంగా నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. డ్రాగన్ జోరు ‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు దర్శకుడు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జూన్ 25న విడుదలకానుంది. శంకరపల్లిలో పెద్ది రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో(2021) బ్లాక్‌బస్టర్ అందు కున్న బుచ్చిబాబు సానా ‘పెద్ది’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ΄ాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే భాగ్యనగరం సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీలపై ఈ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రత్యేకమైన సెట్లో... ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో ΄ాటు వంద కోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీని తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, ఇతర తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మిస్టీక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఫిజికల్‌గానూ కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ‘తండేల్’ తర్వాత నాగచైతన్య, ‘విరూ΄ాక్ష’ తర్వాత కార్తీక్ వర్మ కాంబినేషన్లో రానున్న ‘ఎన్సీ 24’ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ముచ్చింతల్‌లో ఆంధ్ర కింగ్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, కన్నడ హీరో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్–భాగ్యశ్రీలతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూ΄÷ందిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌గా నటించిన ఉపేంద్రకి వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో... విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ ΄ాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతితో ΄ాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో ΄ాల్గొంటున్నారట. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. బూత్ బంగ్లాలో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అఖిల్, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే కొద్ది రోజులు షూటింగ్లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇందుకుగల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అఖిల్‌కి జోడీగా ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తుక్కుగూడలో సంబరాలు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రోహిత్ కేపీ. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 25న ప్రేక్షకులముందుకు రానుంది. పతాక సన్నివేశాల్లో యోధ ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా ‘హను–మాన్’ (2024) చిత్రంతో ΄ాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న మరో ΄ా¯Œ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ‘మిరాయ్’ చిత్రం 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న విడుదలకానుంది. శంకరపల్లిలో తెలుసు కదా ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం, వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూ΄÷ందుతోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా హీరో హీరోయిన్లతో ΄ాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు నీరజ కోన. దీ΄ావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలు పైన పేర్కొన్నవి కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
సంక్రాంతి బరిలో..?
వచ్చే సంక్రాంతి పండక్కి రాజా సాబ్ థియేటర్స్‌కు రానున్నాడా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్నది తాజా టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రాజా సాబ్తో పూరి సాబ్
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రానుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు ప్రభాస్ కానీ, అటు పూరి జగన్నాథ్ కానీ ఎక్కడా స్పందించ లేదు. ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుసపాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాల్లో నటిస్తున్నారు.ఇక విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. కాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లోకి పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్, పూరి, చార్మీ కలిసి మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.రాజా సాబ్తో పూరి సాబ్ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. పుట్టినరోజు ప్రత్యేకం... ‘ది రాజా సాబ్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూలై 29) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్రం నుంచి సంజయ్ దత్ ప్రత్యేక ΄ోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఆ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సంజయ్ దత్ బర్త్ డే కావడంతో స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. దక్షిణాది సినిమాలతో సంజయ్ దత్ బిజీగా ఉన్న సంజయ్ దత్.. బాలీవుడ్‌లోనూ 'బాఘి 4', 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్- 2' ఆగస్టు 1 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba - @DuttSanjay a very Happy Birthday 💥💥Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/PFgPzOnqea— The RajaSaab (@rajasaabmovie) July 29, 2025 -
నటులలో మేకవన్నె పులులున్నారు: హీరోయిన్
సినిమా పరిశ్రమలో తనకు అనిపించింది మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి గట్స్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో మాళవిక మోహన్(Malavika Mohanan) ఒకరు. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా 'ది రాజాసాబ్' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా నటించిన 'పేట' చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ భామ తొలి చిత్రంతోనే పెర్ఫార్మెన్స్తో అదరగొట్టి సినీ ప్రముఖల దృష్టిలో పడ్డారు. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ తదితర చిత్రాల్లో నటించి, తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రం ది రాజాసాబ్తోపాటు తమిళంలో కార్తీకి జంటగా 'సర్దార్–2' చిత్రంలోనూ నటిస్తున్నారు. తాను అనుకున్నది నిర్మొహమాటంగా వ్యక్తం చేసే ఈమె ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఆడ, మగ అనే తారతమ్యం ఉండకూడదన్నారు. అయితే అది ఇక్కడ చాలా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటులకు దొరికే మర్యాద నటీమణులకు ఇక్కడ ఇవ్వరని పేర్కొన్నారు. పారితోషికం విషయంలోనూ సమానత్వం లేదని పేర్కొన్నారు. హీరోలకు పారితోషికం అడిగినంత ఇస్తున్నారనీ, హీరోయిన్లకు మాత్రం తగ్గించి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ పక్షపాత ధోరణి మారాలన్నారు. ఇకపోతే సినిమాలో కొందరు నటులు ఉన్నారనీ, వారు మహిళల మధ్య మంచి వారిగా కనపించే ప్రయత్నం చేస్తారన్నారు. అలాంటి మేకవన్నె పులులు సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగును బయట పెడతారని అన్నారు. అలా గత 5 ఏళ్లుగా ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న పలువురు నటులను తాను చూశానని పేర్కొన్నారు. వాళ్లంతా బుద్ధిమంతులు అని భావించరాదనీ ఏయే సమయాల్లో నటీమణులతో మంచిగా ఉండాలన్నది వారికి బాగా తెలుసన్నారు. కానీ, కెమెరా వెనుక వారు ఎలా మారుతారు అన్నది తాను కళ్లారా చూశానని నటి మాళవిక మోహన్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారోగానీ, ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
'రాజాసాబ్'పై కొత్త రూమర్స్.. మరోసారి తప్పదా?
కొన్నాళ్ల ముందు రిలీజైన 'రాజాసాబ్' టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబరు 5న మూవీ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సినిమా మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లెక్క ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 10న 'రాజాసాబ్'ని థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం మిగిలిన సీన్స్ అన్ని పూర్తిచేసే పనిలో టీమ్ అంతా ఉంది. త్వరలో సాంగ్స్ చిత్రీకరణ కోసం ఫారిన్ కూడా వెళ్లనున్నారు. అలాంటిది ఇప్పుడు 'రాజాసాబ్' సంక్రాంతికి రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)'రాజాసాబ్' ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ వాయిదా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థల డిసెంబర్ డీల్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే ఏడాది జనవరికి అయితే ఒకటి రెండింటివి ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే 'రాజాసాబ్' దెబ్బ పడే ప్రమాదముంది. ఎందుకంటే డిసెంబరులో సోలో తేదీని వదులుకుని.. సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ తగ్గిపోతాయి. అలా కాదని డిసెంబరులోనే వస్తారా అనేది చూడాలి.మరోవైపు బాలకృష్ణ 'అఖండ 2'.. సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ తేదీ కూడా మారి డిసెంబరుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ vs బాలయ్య అవుతుందేమో? మరోవైపు డిసెంబర్ 5నే బాలీవుడ్ నుంచి 'ధురంధర్' అనే మూవీ రిలీజ్ కానుంది. దీని వల్ల ప్రభాస్ మూవీకి ఇబ్బంది ఏం ఉండదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుందేమో?(ఇదీ చదవండి: ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ) -
రాజాసాబ్ బ్యూటీ.. విజయ్ దేవరకొండ మూవీతో డెబ్యూ ఇవ్వాల్సిందట!
తన ప్రత్యేకమైన స్టయిల్, స్వతంత్ర భావనతో ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించే మాళవిక మోహనన్ త్వరలోనే టాలీవుడ్లో స్టార్‌గా వెలుగొందనుంది. ఆ విషయాలే మీకోసం.. రాజాసాబ్ బ్యూటీ..మాళవిక మోహనన్ (Malavika Mohanan) కొన్ని తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తాజాగా ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో నాయికగా నటించడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. మాళవిక తండ్రి కె.యు. మోహనన్ కూడా సినీరంగానికే చెందినవాడు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి ఎన్నో సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించారు.తండ్రితో లొకేషన్‌కి..మాళవిక.. కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగింది, చదువుకుంది కూడా అక్కడే. కేవలం చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కాని, అసలు ఆసక్తి సినిమాలవైపే! ఒకసారి తండ్రి మోహనన్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుండగా, ఆమె లొకేషన్‌కు వెళ్లింది. ఆ యాడ్‌లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తిఆమె నటనపై చూపిన ఆసక్తిని గమనించిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా మాళవిక కెరీర్ మొదలైంది. ‘పట్టమ్ పొలే’ అనే మలయాళ చిత్రం ఆమె మొదటి సినిమా. ఆ సినిమా సమయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మాళవిక తన దుస్తులను తానే డిజైన్ చేసుకుంది. అక్కడి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి, ‘ది స్కార్లెట్ విండో’ అనే పేరుతో తన బ్రాండ్ ప్రారంభించింది.ధైర్యం ఎక్కువే!మాళవిక చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పెడుతుంటే, కొందరు నెటిజన్లు తప్పుడు కామెంట్లు పెట్టారు. మర్యాదగా, పద్ధతిగా ఉండాలని సూచనలు ఇచ్చారు. దానికి స్పందనగా పద్ధతిగా చీర వేసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కూడా షార్ట్, చిన్న చొక్కా ఉండడంతో మరింత సెన్సేషన్ అయింది. ‘ఒక ఆడపిల్ల ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే బెటర్’ అని కౌంటరిచ్చింది.విజయ్ దేవరకొండతో మూవీభవిష్యత్తులో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్‌గా మారాలనేది ఆమె ఆశ. రింగులు అంటే మాళవికకి చాలా ఇష్టం. వందల సంఖ్యలో రింగులు కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – తెలుగులో ఆమెకి వచ్చిన మొదటి అవకాశం ‘రాజా సాబ్’ సినిమా కాదు. మొదట విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు ‘హీరో’.తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంసూపర్ స్టార్ రజనీకాంత్ అంటే మాళవికకి విపరీతమైన అభిమానం. ఆయనతో ‘పేట’ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎంతో థ్రిల్ అయ్యిందట! అలాగే విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకమని మాళవిక చెప్పింది. ‘ఒక్క సినిమాలో కనిపించినా చాలు – తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా అభిమానించే ప్రేక్షకులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది’ అని చెప్పింది. ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ప్రభాస్తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ – ‘షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ప్రభాస్ ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వచ్చేది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది తినగలిగేంత పెద్ద పరిమాణంలో వంటలు వచ్చేవి. భోజనం బాగా నచ్చినా, అంత తినలేకపోయా’ అని తెలిపింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ – మాళవిక చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బిల్డింగ్‌లో పెరిగారు. అందుకే తనకి అత్యంత సన్నిహితుడిగా విక్కీని భావిస్తానని చెబుతుంది. మలయాళ అమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండే చేపల కూర అంటే విపరీతమైన ఇష్టం. డైటింగ్‌ను పక్కనపెట్టి, షూటింగ్ లేనప్పుడు తల్లి బీనా చేత వండించుకుని, ఆ చేపల కూర తింటూ ఆనందపడుతూ ఉంటుంది.చదవండి: ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా -
రాజా సాబ్ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను : సంజయ్ దత్
‘‘వెంకీ సార్, సుప్రీత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ‘కేడీ: ది డెవిల్’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్గా ప్రేమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సంజయ్ దత్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్ రీష్మా నానయ్య, కేవీఎన్ ్ర΄÷డక్షన్ బిజినెస్ హెడ్ సుప్రీత్ మాట్లాడారు. -
ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్‌పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు. -
ప్రభాస్ రెమ్యునరేషన్లో భారీ కోత.. ‘రాజాసాబ్’కి ఎంతంటే?
టాలీవుడ్లో నిన్నా మొన్నటి దాకా నెంబర్ వన్ హీరో అంటే తడుముకోకుండా చెప్పగలిగిన పేరు ప్రభాస్(Prabhas). దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ స్టార్ డమ్‌ని మిగిలిన హీరోలకు అందనంత స్థాయికి తీసుకెళ్లిపోయాయి. టాలీవుడ్ ను దాటేసి పాన్ ఇండియా స్థాయికి ఎగబాకిన క్రేజ్‌తో ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అటు రెమ్యునరేషన్ పరంగా గానీ, అఖిలభారత స్థాయి ఇమేజ్ పరంగా గానీ చూస్తే టాప్‌లో నిలిచాడు ప్రభాస్. అయితే ఇదంతా ఇప్పుడు గతం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల తర్వాత ప్రభాస్ నెంబర్ వన్ స్థానం బీటలు వారింది. ఆ స్థానానికి అల్లు అర్జున్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. ఈ నేపధ్యంలో రెమ్యునరేషన్ పరంగానూ ప్రభాస్ తగ్గాడనే వార్త ఒకటి సినిమా పరిశ్రమలో వినిపిస్తోంది.భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో ముందుండే ప్రభాస్, మళ్లీ హారర్ కామెడీ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab Movie) అనే సినిమాతో తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. హాస్య చిత్రాలకు పేరొందిన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ అందుకున్న పారితోషికం గురించి వినిపిస్తున్న వార్తలు ప్రభాస్ నెంబర్ వన్ స్థానాన్ని చర్చనీయాంశంగా మార్చాయి.బాహుబలి తర్వాత సాధారణంగా ఒక్క సినిమాకు రూ.150 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడట ప్రభాస్, అలాంటిది ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా రూ.50 కోట్ల తగ్గింపుని ఆయన అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ముందు విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా భారీగా వసూళ్లు సాధించలేకపోవడం, ప్రభాస్ నటన, గెటప్ కూడా తీవ్రంగా ట్రోలింగ్‌ను ఎదుర్కొనడం వంటి వాటి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.ఏదేమైనా ఇది ప్రభాస్ నెం1 స్టార్ ఇమేజ్‌ని సందేహాస్పదం చేసేదే. అయితే రెమ్యునరేషన్లో తగ్గింపును అంగీకరిస్తూన్న కొందరు ప్రభాస్ అభిమానులు చెబుతున్న ప్రకారం...ఇది ఇమేజ్‌కు సంబంధించినది కాదు. ‘ది రాజా సాబ్’ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. ఇదే సంస్థ ఆదిపురుష్ ను కూడా నిర్మించింది. కాబట్టి ఆది పురుష్ ద్వారా నష్టాలను ఎదుర్కున్న నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభాస్ తన వంతుగా ఈసారి కొంచెం వెనక్కి తగ్గారని అంతే తప్ప ఆయన క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గింపు లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పుష్ప సిరీస్‌తో మంచి దూకుడు మీదున్న బన్నీ... అట్లీ సినిమాకు భారతీయ సిని చరిత్రలోనే ఎవరూ అందుకోనంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభాస్ ఇలా వెనుకడుగు వేయడం టాలీవుడ్ నెం1 ఫైట్‌ను ఆసక్తిగా మారుస్తోంది.ఇక ది రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. రొమాంటిక్ హారర్ కామెడీగా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మారుతి కి ఇది ఓ పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ కానుండగా, నిర్మాతగా టీ.జి. విశ్వప్రసాద్ వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదల తేదీని డిసెంబర్ 5, 2025 గా ప్రకటించారు. ఈ సినిమా మరోసారి తమ హీరో సత్తా ఏంటో చూపించనుందని ప్రభాస్ అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. -
‘నన్ను పెళ్లి చేసుకో’ అని కోరిన అభిమాని.. హీరోయిన్ ఫన్నీ రిప్లై
‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్‌గా అడిగితే తడబడే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్లాంటి అమ్మాయిలైతే అదే స్పీడుతో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగాడు... అంతే... ‘నాకు దెయ్యాలంటే భయం’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాళవిక. అలా ఎందుకు చెప్పారంటే, అతని ‘ఎక్స్’ ఖాతా పేరు ‘ఘోస్ట్’ అని ఉంది. ఆ పేరుని వాడుకుని, ఇలా సరదాగా మాళవిక చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. ఏకంగా రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. హారర్, కామెడీతో పాటు విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ సాంగ్‌ను మారుతి ప్లాన్ చేసినట్లు చేస్తోంది. ఓ ఫుల్ మాస్ సాంగ్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారు. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్ టీమ్‌ను దాదాపు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు టాలీవుడ్ బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ మరో ప్లాన్‌కు రెడీ అయ్యారు. తమన్‌తోనే ఓ ప్రత్యేక సాంగ్‌ను కంపోజ్ చేయనున్నారట. ముగ్గురు హీరోయిన్లతో చేసే పాటకు తమన్ తన రేంజ్లో అదిరిపోయే సంగీతం కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ది రాజాసాబ్ టీమ్‌కు దాదాపు రూ.5 కోట్ల రూపాయలు సేవ్ అయినట్లే. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తమన్ ఎలాంటి బీట్స్ అందిస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తమన్ హై టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. కాగా.. ది రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.#Prabhas to Groove with Three Heroines in a Special Song!👉 The shooting of #RajaSaab is nearly complete, with just two songs left to be filmed.👉 Initially, the team had planned a high-energy remix of a popular old Hindi classic. However, the music rights came with a… pic.twitter.com/OnBKt4x2FL— PaniPuri (@THEPANIPURI) June 18, 2025 -
టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఉంది: ది రాజాసాబ్ హీరోయిన్
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ ది రాజాసాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అయితే తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఆస్క్ మాళివికా పేరుతో ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్స్ అడిగి ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఓ నెటిజన్ మీరు నెక్ట్స్ మూవీ ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటున్నారు? ఆ దర్శకుడితోనే ఎందుకు? అని ప్రశ్నించాడు. దీనికి మాళవిక ఊహించని ఆన్సరిచ్చింది. ప్రస్తుతం నా దగ్గర పెద్ద లిస్టే ఉంది.. కానీ నేను రాజమౌళితో సార్‌తో పని చేయడం తనకిష్టమని తెలిపింది. ఇది చూసిన నెటిజన్స్ త్వరలోనే మీ కోరిక నెరవేరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))కాగా.. గతేడాది తంగలాన్ మూవీతో మెప్పించిన మాళవిక కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. I have a long list but if I had to pick one maker right now I would love to work with Rajamouli sir! ☺️ https://t.co/Mvovp1TzOd— Malavika Mohanan (@MalavikaM_) June 18, 2025 -
ది రాజా సాబ్ టీజర్.. ఆ డైలాగ్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఈ టీజర్‌లోని ఓ డైలాగ్‌ను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో ది రాజాసాబ్ టీజర్‌లోని డైలాగ్‌ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్‌ను కూడా ట్రాఫిక్ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్‌పై వస్తున్న విజువల్స్‌ను ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలోని కొన్ని సీన్స్‌ను కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా పోలీసులు చేసినా ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.మారుతి రియాక్షన్..ఈ వీడియో చూసిన ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా ఫర్ఫెక్ట్.. మా సినిమా డైలాగ్‌ను పాజిటివ్ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Yes sir perfect... thank u for using our footage in positive manner— Director Maruthi (@DirectorMaruthi) June 17, 2025 #HYDTPweBringAwareness📢ℋℯ𝓁𝓁ℴ... ℋℯ𝓁𝓁ℴ....!బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025 -
ఆ టైమ్‌లో నాకు ప్రభాస్ ఒక్కడే సపోర్ట్‌గా నిలిచాడు: మారుతి
‘‘నేను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్లో(ప్రభాస్–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. కానీ, అలాంటి టైమ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్‌గారు. అందుకే ‘ది రాజా సాబ్’ ను ఒక సవాల్‌గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని డైరెక్టర్ మారుతి తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. (చదవండి: 'ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు'.. ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్!)హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ–‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడు’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి’’ అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘ది రాజా సాబ్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి, కెమేరామేన్ కార్తీక్ పళని, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడారు. -
'ది రాజా సాబ్పై నెగెటివ్ క్యాంపెయిన్'.. నిర్మాత ఎస్కేఎన్ షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.అయితే ఇవాళ నిర్వహించిన టీజర్ ఈవెంట్‌కు నిర్మాత ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ టీజర్‌తో పాటు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారని ఆరోపించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నెగెటివ్ చేసినా నిర్మాత.. టీజర్ చూశాక రేపటి నుంచి పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్‌ను నమ్మలేదు. తన బెస్ట్ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవుతుంది' ఎస్కేఎన్ కామెంట్స్ చేశారు. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఎవరా? నిర్మాత టాలీవుడ్లో చర్చ మొదలైంది.(ఇది చదవండి: 'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్))ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రభాస్ 'ది రాజాసాబ్' HD మూవీ స్టిల్స్
-
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' టీజర్ విడుదల
-
'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్)
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' (The RajaSaab) టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ హారర్ కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే వారి అంచనాలకు మించే ఈ చిత్రం ఉండొచ్చని చెప్పవచ్చు. సంగీతం తమన్ అందించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. -
ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్‌తో 'మారుతి' అనుబంధం
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). సోమవారం టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్ వద్ద ప్రభాస్, మారుతి కటౌట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్‌లో మారుతి పెరిగారు. ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి. మన డార్లింగ్‌ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.' అని ఆయన అన్నారు.MACHILIPATNAM - Siri complex (krishna Kishore in past)This is the place where my father once had a small banana stall…Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope :) I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్.. టైమ్ ఫిక్స్ చేసిన డైరెక్టర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్‌ను తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో' అంటూ టైమ్ ఫిక్స్ చేశారు.టీజర్‌పై అధికారిక ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.All SET darlings Hope u all ready 💖 Let's rock from tomorrow 10.52 am#TheRajaSaabTeaser pic.twitter.com/Q2aGbYAcnU— Director Maruthi (@DirectorMaruthi) June 15, 2025 -
అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి
సాక్షి, మచిలీపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్‌గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. హారర్ జానర్అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ (Prabhas)తో ద రాజా సాబ్ (The Raja Saab Movie) అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్‌కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. బొమ్మలు గీసుకునేవాడినినేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్‌బుక్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నా.. అంచనాలు పెంచేసిన మారుతిరాజా సాబ్ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని రాజాసాబ్‌పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్ (ట్విటర్)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్‌స్టాప్, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్.. ఇలా పలు సినిమాలు చేశాడు. Still feels like yesterday :)#PremaKathaChitram Memories are fresh in my mind….♥️ And now even more excited for this anniversary… because after a long time stepping back into that zone again…..But this time it’s a horror fantasy.I promise #TheRajaSaab will be a celebration… https://t.co/naoZekmCBH— Director Maruthi (@DirectorMaruthi) June 7, 2025 చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు -
'ది రాజాసాబ్' నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). తాజాగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ వంటి అంశాలను ఒక పోస్టర్‌తో చిత్ర యూనిట్ తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 16న ఉదయం 10:52గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. రీసెంట్గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్ టీజర్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తిచేశారట. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.తాతా మనవళ్ళుగా ప్రభాస్‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. వాస్తవంగా ఈ సినిమా విడుదల ఏప్రిల్ 10న రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉండటంతో వాయిదా పడింది. ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా ఉన్నాయట. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది.ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025


