హీరోలను ఢీ కొట్టే రేంజ్‌ అనుష్క సొంతం | Actress Anushka Shetty Birthday Special Story On Her Life, Career And Movies In Telugu- Sakshi
Sakshi News home page

Anushka Shetty Birthday Special: హీరోలను ఢీ కొట్టే రేంజ్‌ అనుష్క సొంతం

Published Tue, Nov 7 2023 9:25 AM | Last Updated on Tue, Nov 7 2023 12:30 PM

Anushka Shetty Birthday Special - Sakshi

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో  హీరోల‌కు స‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె న‌టించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్  చేశాయి. రీసెంట్‌గా అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే  కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా. అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా  హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్‌లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. 

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది.

అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా 'భాగమతి-2' ని యూవీ క్రియేషన్స్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్.

అనుష్క బర్త్‌డే.. స్ఫెషల్‌ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement