మరోసారి ప్రభాస్‌ పెళ్లి టాపిక్.. శ్యామలా దేవి ఏమన్నారంటే? | Shyamala devi Reacts On Prabhas Marriage Rumours In Social Media | Sakshi
Sakshi News home page

Shyamala devi: ఇకపై సక్సెస్ రాదన్నారు.. పెళ్లి కూడా అంతే: శ్యామలా దేవి

Published Sun, Jul 7 2024 4:24 PM | Last Updated on Sun, Jul 7 2024 6:10 PM

Shyamala devi Reacts On Prabhas Marriage Rumours In Social Media

ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద రూ.800 కోట్ల మార్కును దాటేసింది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా త్వరలోనే వెయ్యి కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఈ సినిమాను మొదటి రోజే వీక్షించిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణం రాజు సతీమణి) ఆనందం వ్యక్తం చేసింది. బుజ్జి కారులో కూర్చుని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద సందడి చేసింది.  అయితే తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలా దేవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ప్రభాస్‌కు పెళ్లికాదని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటలపై ఆమె స్పందించింది.

శ్యామలా దేవి మాట్లాడుతూ..' గతంలో ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావన్నారు. ఇప్పుడు కల్కి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్‌ సినిమాలు ఆడవన్న వారి అంచనాలు కల్కితో తలకిందులయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి కూడా అంతే. కోట్లాది అభిమానుల కోసం ప్రభాస్‌ ఎంతగానో శ్రమిస్తున్నాడు. పెళ్లి చేయాలని మాకు కూడా ఉంటుంది. కానీ సరైన సమయం రావాలి కదా. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్లే జరిగాయి. అలాగే ప్రభాస్‌ పెళ్లి కూడా జరుగుతుంది' అని అన్నారు. కాగా.. గతంలోనూ ప్రభాస్‌ పెళ్లి రూమర్స్‌పై  శ్యామలా దేవి స్పందించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement