కల్కితో కాసుల వర్షం.. 11 రోజుల్లోనే ఆ మార్క్‌ దాటేసింది! | Prabhas Kalki 2898 AD Movie 11 Days Worldwide Box Office Collections, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Collections: కల్కి మేనియా.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వచ్చాయంటే!

Published Mon, Jul 8 2024 2:04 PM | Last Updated on Mon, Jul 8 2024 3:09 PM

Prabhas kalki 2898 AD Movie Collections After 11 Days

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గతనెల 27న విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా.. అంతేస్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి విడుదలైన 11 రోజుల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరనుంది.

సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. మూడు ప్రాంతాల మధ్య జరిగే పోరాటాన్ని కల్కిలో చూపించారు. ఇందులో అమితాబ్ నటన, కమల్‌ హాసన్‌తో సీన్స్‌ అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పార్ట్‌-2 కూడా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement