
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
కల్కి సినిమా రిలీజైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు సైతం అదే జోరును కొనసాగించింది. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా పలువురు టాలీవుడ్ సినీ తారలు అతిథి పాత్రల్లో మెరిశారు.
The force is unstoppable…❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/fjhnE8KWIB
— Kalki 2898 AD (@Kalki2898AD) June 30, 2024
Comments
Please login to add a commentAdd a comment