అత్యంత ఆదరణ కలిగిన చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్‌ ఏదంటే? | IMDb Most Popular Indian Movie And Webseries Of The Year 2024, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

IMDB Ranks-2024: మోస్ట్ పాపులర్ చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్‌ ఏదంటే?

Published Wed, Dec 11 2024 12:53 PM | Last Updated on Wed, Dec 11 2024 1:29 PM

IMDb Most Popular Indian Movie of the Year 2024

తాజాగా ఈ ఏడాది ఐఎండీబీ సినిమా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యంత ఆదరణ కలిగిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్‌ మూవీగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెకండ్‌ ప్లేస్‌లో శ్రద్ధకపూర్‌ సూపర్ హిట్ చిత్రం స్త్రీ-2 నిలవగా.. మూడోస్థానాన్ని విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం దక్కించుకుంది.

ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. అక్షయ్ కుమార్ సైతాన్, హృతిక్ రోషన్ ఫైటర్, మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్, బాలీవుడ్ మూవీ భూల్ భూలయ్యా-3, కిల్, సింగం ఏగైన్, లపట్టా లేడీస్‌ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మొదటిస్థానంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్  నిలిచింది. ఈ జాబితాను ప్రకటిస్తూ ఐఎండీబీ పోస్టర్స్‌ను విడుదల చేసింది.

కాగా.. నాగ్ అశ్విన్- ప్రభాస్‌ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు  రాబట్టింది.  ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించారు.

 

ఐఎండీబీ టాప్-10 చిత్రాలు- 2024

1.కల్కి 2898 ఏడీ

2.స్త్రీ-2

3.మహారాజా

4.సైతాన్

5.ఫైటర్

6. మంజుమ్మెల్ బాయ్స్

7.భూల్ భూలయ్యా-3

8.కిల్

9.సింగం ఏగైన్

10. లపట్టా లేడీస్

టాప్-10 వెబ్ సిరీస్‌లు ఇవే..

1. హీరామండి ది డైమండ్ బజార్
2. మీర్జాపూర్ సీజన్-3
3.పంచాయత్ సీజన్-3
4.గ్యారాహ్ గ్యారాహ్
5. సిటాడెల్ హనీ బన్నీ
6.మామ్లా లీగల్ హ
7.తాజా ఖబర్ సీజన్-2
8. మర్డర్ ఇన్ మహిమ్
9. శేఖర్ హోమ్
10.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement