Ratnam
-
'ప్రభాస్ పెళ్లయ్యాకే చేసుకుంటా'.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్‌కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb — Prabhas Fan (@ivdsai) April 18, 2024 -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్‌కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్‌గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రత్నం సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది
నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రత్నం. కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తామరబరణి, పూజ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి అన్నది గమనార్హం. కాగా తాజాగా విశాల్ దర్శకుడు హరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రత్నం. నటి ప్రియా భవాని శంకర్ నాయకిగా నటిస్తున్న ఇందులో సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి.స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈచిత్రాన్ని ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని సింగిల్ సాంగ్ ఇటీవల విడుదల చేశారు. తాజాగా రెండవ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఎదనాల అనే పల్లవితో సాగే ఈ మెలోడి పాటను గీత రచయిత వివేక్ రాయగా నటుడు విశాల్, నటి ప్రియా భవాని శంకర్‌లపై చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. రత్నం చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశాల్ ఇంతకుముందు నటించిన మార్క్ ఆంటోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత రాబోతున్న రత్నం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. -
రత్నం రెడీ
వేసవిలో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘రత్నం’. విశాల్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘రత్నం’. ఈ చిత్రంలో ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. హరి దర్శకత్వంలో కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగుతున్నాయి. కాగా ఈ సినిమాను వేసవిలో ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’)కి సీక్వెల్‌గా ‘తుప్పరివాలన్ 2’ చేస్తున్నారు విశాల్. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారట విశాల్. ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. -
అమ్మాయితో వైరల్ వీడియో.. క్షమాపణ కోరిన విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయనతో పాటు మరో అమ్మాయి ఉండటమే... న్యూయార్క్ వీదుల్లో ఆ అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై విశాల్ వెళ్తుండగా అక్కడ కొందరు ఆయన్ను గుర్తుపట్టి పిలుస్తారు... అప్పుడు విశాల్ షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకుని అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు..? వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? అని ఆయన ఫ్యాన్స్ గూగుల్‌లో వెతికారు. కానీ ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ కొందరు ఫైర్ కావడంతో విశాల్ స్పందించారు. విశాల్ క్షమాపణ 'నన్ను క్షమించండి... ఇటీవల వైరల్ అయిన వీడియో గురించి అసలు నిజాన్ని తెలిపేందుకు ఇది సమయం అని నేను అనుకుంటున్నాను. లొకేషన్ ప్రకారం అది కొంచెం వాస్తవం. ఆ వీడియో న్యూయార్క్‌లో తీసిందే. ఆ సమయంలో నేను న్యూయార్క్‌లో ఉన్నాను. రెగ్యూలర్‌గా ప్రతి ఏడాది నేను మా కజిన్స్ వద్దకు న్యూయార్క్ వెళ్తాను. ఏడాది కాలం పాటు సినిమాలకు సంబంధించిన పనులతో నిత్యం బిజీగానే ఉంటాను.. ఆ కష్టాన్ని మరిచిపోయి ఇలా నా కజిన్స్‌తో గడుపుతాను. ఆ వీడియో ఒక ప్రాంక్.. ముందుగా అనుకుని చేసినదే... కావాలనే ఆ వీడియో నేను మొహం దాచుకున్నాను. (ఇదీ చదవండి: బిగ్ బాస్ OTT: బర్రెలక్కతో పాటు సీజన్-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్) అలా చేయాలని ముందే ప్లాన్ ప్రకారం వీడియో తీసి నా ప్రమేయంతోనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై వస్తున్న రూమర్స్ ఇకనైన ఆగుతాయని ఆసిస్తున్నాను. కానీ కొంతమంది ఈ వీడియో వల్ల నా పట్ల ఫైర్ అవుతున్నారు. అయినా, నేను ఎవరినీ ద్వేషించలేను.' అని విశాల్ క్లారిటీ ఇచ్చేశాడు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబినేషన్లో రత్నం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Sorry guys, I guess it's time to reveal the truth about the recent video. Well well well, it's half true in terms of location, yes I am in New York which is my regular retreat place with my cousins, which is a ritual of destressing myself every year after a super chaotic rest of… — Vishal (@VishalKOfficial) December 27, 2023 Is that Actor @VishalKOfficial walking with someone in NYC 🤔 pic.twitter.com/ddMESEuKOq — Ramesh Bala (@rameshlaus) December 26, 2023 -
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
సినిమా అంటే సులభం కాదు – నిర్మాత ఏఎం రత్నం
‘‘రాజకీయం, వ్యాపారం.. ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రూల్స్ రంజన్’. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది.. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
పెన్నుల్లో రాజా..‘రత్నం’!
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్ బ్లాంక్, పార్కర్ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ కలం పుట్టుపూర్వోత్తరాలు ఇవిగో.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలో సిరా పెన్నుల తయారీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి అడుగు పడింది. ఈ ఘనత రత్నం పెన్నుకే దక్కింది. మూడు తరాలుగా రత్నం పెన్నులు తయారై దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పెన్నుల తయారీ కేంద్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం రంగిరీజు వీధిలో ఉంది. స్వాతంత్య్ర సమరానికి ముందు దేశీయంగా పెన్నుల తయారీ రంగంపై తనదైన ముద్ర వేసిన రత్నం సన్స్ కుటీర పరిశ్రమగా ఉంది. ఇక్కడ తయారైన ‘గైడర్’, ఫౌంటెన్ పెన్నులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అనేక మోడల్ పెన్నులు మార్కెట్లోకి వస్తున్నా రత్నం సన్స్ పెన్నుకున్న ప్రాచుర్యం ఇప్పటికీ తగ్గలేదు. భారతావనిలో ప్రప్రథమంగా రత్నం పెన్ను రాజమహేంద్రవరంలో 1932లో కోసూరి రత్నం ఆవిష్కరించారు. రత్నం మరణానంతరం అతని రెండో కుమారుడు కోసూరి వెంకటరమణమూర్తి, మూడో తరంలో రత్నం మనుమలు గోపాలరత్నం (గోపీ), చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు. రత్నం పెన్ను పుట్టుపూర్వోత్తరాలు.. స్వాతంత్య్రానికి పూర్వం సిరా పెన్నులు విడిభాగాలు విదేశాల నుంచి రప్పించుకుని కొంతమంది తయారుచేసే వారు. ఒకసారి అప్పటి ఉమ్మడి గోదావరి జిల్లాకు కృష్ణమాచార్య అనే సబ్ జడ్జి కలం కిందపడి పాళీ వంగిపోయింది. 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీ అది. స్వర్ణకారుడైన కేవీ రత్నం, సోదరుడు సత్యం కొత్త పాళీని తయారుచేసి ఇచ్చారు. వీరి ప్రతిభను చూసి సబ్జడ్జికి ముచ్చటేసింది. ముడిసరుకు తాను తెప్పిస్తానని కలాల తయారీ చేపట్టమని సబ్‌జడ్జి రత్నంను ప్రోత్సహించారు. అలా 1932లో రత్నం పెన్నులు మార్కెట్లోకి ప్రవేశించాయి. కాలక్రమంలో వెండి, బంగారంతో పెన్నులు తయారుచేస్తూ రత్నం పెన్నులకు ఒక బ్రాండ్‌ను తీసుకువచ్చారు. గాంధీ మెచ్చిన పెన్ను అప్పట్లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్ప రాజమహేంద్రవరంలో మూడు రోజులు మకాం చేసి దగ్గరుండి రెండు పెన్నులు తయారుచేయించుకుని తీసుకువెళ్లారు. ఒక పెన్నును ఆయన గాంధీజీకి బహూకరించారు. పెన్నును వాడి చూసిన గాంధీ మెచ్చుకుని స్వదస్తూరితో అభినందనల లేఖ రాసి 1935 జూలై 16న రత్నంకు పంపించారు. ‘‘ప్రియమైన రత్నం.. కుమారప్ప ద్వారా ఫౌంటెన్ పెన్ను పంపినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి. బజారులో దొరికే విదేశీ కలాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం’’.. అంటూ అభినందిస్తూ వార్ధా నుంచి రత్నంకు లేఖ పంపించారు. అంతేకాదు.. ప్రముఖులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. సినీ నటులు ఎన్టీరామారావు నుంచి చిరంజీవి వరకు రత్నం పెన్ను వినియోగించి ఆయన్ను అభినందించిన వారే. విదేశాల నుంచి యంత్రాల దిగుమతి 1930లో ఇంగ్లాండ్ నుంచి రత్నం దిగుమతి చేసుకున్న లెగ్ ఆపరేటర్ మెషిన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మైఫోర్డ్ మెషీన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అలాగే, పెన్నుల తయారీకి రబ్బర్ చెట్టు పాలు నుంచి తయారుచేసే మెటీరియల్ గుజరాత్ నుంచి, ఇరిడియమ్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మార్పులకు అనుగుణంగా పెన్నుల తయారీలోను మార్పులు తీసుకురావాలని డిమాండ్ వచ్చిందని రత్నం మనుమడు గోపీ చెప్పారు. కానీ, నాడు తాత జాతీయభావంతో ఏర్పాటుచేసిన ఈ పెన్నులో ఎటువంటి మార్పులు చేయకూడదనే ఉద్దేశంతో అదే ఒరవడిని కొనసాగిస్తున్నామన్నారు. వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పెట్టుబడి, రెక్కల కష్టం చేతికొస్తే చాలని సరిపెట్టుకుంటున్నామని ఆయన వివరించారు. కాగా, ఈ పెన్నుల కోసం ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 1948లో తొలిసారి యునైటెడ్ కింగ్డమ్ హై కమిషనర్ సర్ ఆల్డ్బాల్క్ పెన్నుకు ఆర్డర్ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని కార్యాలయం నుంచి 10 పెన్నుల ఆర్డర్ రాగా వాటిని పంపించారు. అందులో ఒక పెన్ను జర్మనీ చాన్సలర్‌కు ప్రధాని అందజేశారు. ప్రపంచంలోనే తొలి సూక్ష్మ పెన్నుకూ శ్రీకారం 3.5సెం.మీ.ల పొడవు, 1.7 గ్రాముల బరువుతో రత్నం సన్స్ తయారుచేసిన పెన్ను ప్రపంచంలో అతిచిన్న పెన్నుగా 2012 అక్టోబర్‌లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ పెన్నులో 2.22 క్యారెట్ల బంగారం పాళీ వాడారు. 5 గ్రాముల బంగారుతో తయారుచేసిన పెన్నుపై భరతమాత, జాతీయ జెండా, జాతిపిత గాంధీ చిత్రాలను చెక్కి భారతీయతను ప్రతిబింబింపజేశారు. రత్నం సన్స్‌లో అంగుళం మొదలు 36 అంగుళాల సైజు వరకూ రత్నం పెన్నులు తయారుచేస్తున్నారు. విభజనకు ముందున్న కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల సంస్కృతిని అద్దంపట్టేలా గోదావరి వంతెన, తిరుపతి గోపురం, కాకతీయుల శిలాతోరణంతో ఒక కలాన్ని తయారుచేశారు. రూ.300లు నుంచి రూ.35వేల వరకూ.. స్టీల్ పాళీతో తయారుచేసిన రత్నం పెన్ను తొలినాళ్లలో రూ.2.25లు ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.3,500 వరకూ లభిస్తోంది. బంగారం పాళీలతో తయారుచేసిన పెన్ను రూ.3,000 నుంచి రూ.35వేలు వరకూ లభిస్తున్నాయి. కాగా, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే బాల్ పెన్నుల పోటీని తట్టుకుని ఇప్పటికీ రత్నం పెన్ను నిలుస్తోంది. జర్మనీ చాన్సలర్‌కు మోదీ కానుక ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్ యాంజిలా మార్కల్‌కు ప్రధాని మోదీ.. రత్నం సన్స్ తయారుచేసిన సిరా పెన్నును ఢిల్లీలో బహూకరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలనే తలంపుతో నాడు గాంధీజీ కూడా రత్నం తయారుచేసిన స్వదేశీ పెన్నును ఉపయోగించారని ప్రధాని ఆమెకు వివరించడం విశేషం. పెన్నుల తయారీలో మూడోతరం గోపి, చంద్రశేఖర్ ప్రోత్సాహం కావాలి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాస్త గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. ఇప్పటివరకూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగానే దీనిని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించి విద్యుత్, పన్ను మినహాయింపుల్లో రాయితీలు ఇస్తే బాగుంటుంది. అలాగే, మేం ఎలాంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంబించం. కావల్సిన వారు నేరుగా వచ్చి పట్టుకెళ్తారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. మాకు ఎలాంటి వెబ్సైటూ లేదు. కొనుగోలుదారుల మౌఖిక ప్రచారమే మాకు వెబ్సైటు. – వెంకటరమణమూర్తి, రత్నం కుమారుడు -
చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ కాళ్లు పట్టుకున్న రత్నం
-
పిల్లలను అమ్మినా కొనుగోలు చేసినా నేరమే
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: పిల్లలను అమ్మినా..కొనుగోలు చేసినా శిక్షార్హులేనని జిల్లా శిశుసంరక్షణ శాఖఅధికారి లక్ష్మణ్ హెచ్చరించారు మెదక్ మండలం వాడిపంచాయతీ పరిధిలోని మెట్టుతండాకు చెందిన దేవ్‌సోత్ అనిత, రవిదంపతులకు మూడో కాన్పులో సైతం ఆడపిల్ల పుట్టిందని గతనెల పసిపాపను విక్రయించిన విషయంపై ఇటీవల సాక్షి దినపత్రికలో ‘ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు’ అనేశీర్షిక వార్త ప్రచురితం అయింది. ఈ కథనానికి స్పందించిన జిల్లా శిశుసంరక్షణ అధికారులు సోమవారం తండాకు వచ్చి పసిపాపను విక్ర యించిన విషయంపై తల్లితండ్రులను ఆరాతీశారు. మగబిడ్డ పుడుతుందను కుంటే ఆడపిల్ల పుట్టిందని ఇప్పటికే తమకు ఇద్దరు ఆడసంతానం ఉన్నందున పోషించే స్థోమతలేక విక్రయించామని పాపతల్లి తండ్రులు తెలిపారు. కొనుగోలు చేసిందెవరో తమకు తెలియదని రూ. 4 వేలుఇచ్చి కనిపించకుండా తీసుక పోయారని అనిత అధికారుల ముందు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన జిల్లా అధికారి రత్నం మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడుగురిని విక్రయించారని తెలిపారు. అందులో ఎక్కువగా కౌడిపల్లి మండలంలో జరుగుతున్నాయన్నారు. త్వరలో గిరిజనతండాల్లో పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలను కాపాడేందుకు అన్నిచర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల తల్లితండ్రులకు సరైన అవగాహన లేకనే ఇలాజరుగుతోందన్నారు. పాపను ఎవరికి విక్రయించారో చెప్పకుంటే పోలీసుస్టేషన్లో కేసుపెట్టి కొనుగోలు చేసిన వారినుంచి పసిపాపను రప్పిస్తామని ఆయన అనిత దంపతులను హెచ్చరించారు. కొనుగోలు చేసిన వారువెంటనే శిశువును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాప అవసరం ఉంటే అధికారి కంగా దత్తత తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం అనిత, రవిదంపతుల మొదటి సంతానం స్వర్ణను బాలసదనంలో చేర్పించి ఉచిత చవువుకోసం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ తార్య మాట్లాడుతూ మెట్టుతండాలో అంగన్వాడి కానీ, పాఠశాలకానిలేక నిరక్షరాస్యత పెరుగుతుందని అధికారులకు చెప్పారు. దీంతో ఈ విషయాన్ని తమప్రాజెక్టు అధికారిద్వార జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసెకెల్లి తండాలో అంగన్వాడీ సెంటర్‌తోపాటు, ప్రాథమిక పాఠశాలను సైతం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హమీఇచ్చారు. కార్యక్రమంలో సీడీపీవో విజయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ వింద్యారాణి, సిబ్బంది విఠల్, సర్పంచ్ తార్య తధితరులున్నారు. -
చేవెళ్లలో రచ్చరచ్చ
చేవెళ్ల/ చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: ‘బట్టలూడదీసి కొడతా.. మీ సంగతి చూస్తా..’ అంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం చేవెళ్లలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా మారింది. ఎమెల్యే చేవెళ్లకు ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ రచ్చరచ్చ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. సభ ప్రారంభించబోతుండగా ఎంపీడీఓ చేతులోనుంచి మైకును మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి తీసుకున్నారు. శంకర్‌పల్లిలో గురువారం నిర్వహించిన రచ్చబండలో కాంగ్రెస్ నాయకులను పరుష పదజాలంతో దూషిం చినందుకు ఎమ్మెల్యే రత్నం క్షమాపణ చెప్పాలని, అప్పటివరకూ కార్యక్రమం జరగనిచ్చేది లేదన్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘కాంగ్రెస్ నాయకులను దుర్భాషలాడతావా.. ఎమ్మెల్యే హోదాకు తగునా...కులాల మధ్య చిచ్చు పెడతావా... బట్టలూడదీసి కొట్టు చూద్దాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతుగా వేదిక వద్దకు చేరుకున్నారు. కోపోద్రిక్తులైన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా టీడీపీ నేతల వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను వేదికకు దూరంగా తీసుకెళ్లారు. నేనెవరి జోలికీ పోను.. నా జోలికి వస్తే ఊర్కోను : ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ఆందోళన కొనసాగి స్తుండగానే ఎమ్మెల్యే రత్నం వివరణ ఇచ్చారు. శంకర్‌పల్లిలో తనను అవమానిం చడానికి, విమర్శించడానికి ప్రయత్నించిన వారిని ఉద్దేశించే అలా అన్నాను తప్ప కాంగ్రెస్ నాయకులందర్నీ అనలేదన్నారు. అసభ్య పదజాలంతో దూషించలేదన్నారు. తాను ఎవరి జోలికీ పోనని, తన జోలికి ఎవరైనా వస్తే ఎలా ఊరుకుంటానని అన్నారు. పరిస్థితులను బట్టి అలా అనాల్సి వచ్చింది తప్ప, కావాలని అనలేదని వివరించారు. దీంతో ఇరువర్గాలు శాంతించడంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. కొనసాగుతున్న సీఎం ఫొటో లొల్లి ‘రచ్చబండ’లో ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీలో సీఎం ఫొటో వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఫొటో ఫ్లెక్సీల్లో కనిపించకూడదంటూ రచ్చబండ వేదికవద్ద తెలంగాణవాదులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాక్రమానికి ముందే నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం బొమ్మ కనిపించకూడదంటూ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్తా, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.బాల్‌రాజ్ తదితరులు ఫ్లెక్సీని తొలగిం చడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అంతలోనే తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీనివాస్, అంజయ్య తదితరులు వేదికమీదకు దూసుకువచ్చి ఫ్లెక్సీని చించివేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. చివరికి బ్యానర్లో ఉన్న సీఎం బొమ్మను కనిపించకుండా మలి చివేయడంతో వివాదం సద్దుమణిగింది. -
9,632 హెక్టార్లలో పంటల నష్టం
చేవెళ్ల, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 9,632 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విజయకుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని కేసారంలో ఎమ్మెల్యే రత్నం, ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి తదితర అధికారులతో కలిసి వర్షాలతో నష్టపోయిన క్యారెట్, పత్తి పంటలను పరిశీలించారు. రైతు సుజాతను నష్టం వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలోనే జేడీఏ విజయకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాల కారణంగా మొక్కజొన్న, పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 9,632 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో పత్తి 2,751 హెక్టార్లలో, వరి 3,587 హెక్టార్లలో, మొక్కజొన్న 2,272 హెక్టార్లలో నష్టపోయినట్లు అంచనా వేశామని పేర్కొన్నారు. జిల్లాలో 2లక్షల 965 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, ఈ ఖరీఫ్‌లో దానికంటే అధికంగా 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంటలు రైతులు సాగుచేశారని స్పష్టం చేశారు. పత్తి 55వేల హెక్టార్లు, మొక్కజొన్న 45వేల హెక్టార్లు, కందిపంట 32వేల హెక్టార్లు, వరిపంట 22వేల హెక్టార్లలో సాగు చేసినట్లు వివరించారు. అక్టోబరు మాసంలో సాధారణం వర్షపాతం జిల్లాలో 97 మిల్లీమీటర్లుండగా, 187 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వ్యవసాయాధికారులు మరోసారి గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పూర్తి వివ రాలను వారంరోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలి పారు. పంటలను పరిశీలించినవారిలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఏడీఏ దేవ్‌కుమార్, ఏఓలు విజయభారతి, సంజయ్, ఏఈఓ లు విజయభారతి, రాఘవేందర్, టీడీపీ జిల్లా అధికా ర ప్రతినిధి ఎస్.వసంతం, దామరగిద్ద సర్పంచ్ మధుసూదన్, టీడీపీ మండల అధ్యక్షుడు శేరి పెంటారెడ్డి, కార్యదర్శి రాంచంద్రయ్య తదితరులున్నారు. మిగిలిన పంటల రక్షణకు ఐదు సాంకేతిక బృందాలు ఈ ఖరీఫ్‌లో మిగిలిన పంటలను రక్షించుకోవడానికి ఐదు సాంకేతిక బృందాలను (టెక్నికల్ మొబైల్ టీమ్స్) నియమించినట్లు జేడీఏ విజయకుమార్ తెలిపారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి వర్షాలకు తట్టుకొని నిలిచిన పంటల దిగుబడిని పెంచడానికి అవసరమైన సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తారని పేర్కొన్నారు. వీరిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, సీనియర్ వ్యవసాయాధికారులు, ఏడీలు ఉంటారని వివరించారు.