అమ్మాయితో వైరల్‌ వీడియో.. క్షమాపణ కోరిన విశాల్‌ | Vishal Says Apology On The Viral New York Viral Video With Mystery Woman - Sakshi
Sakshi News home page

అమ్మాయితో వైరల్‌ వీడియో.. క్షమాపణ కోరిన విశాల్‌

Published Thu, Dec 28 2023 6:34 PM | Last Updated on Thu, Dec 28 2023 7:06 PM

Vishal Apology Say His Viral Video - Sakshi

కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయనతో పాటు మరో అమ్మాయి ఉండటమే... న్యూయార్క్ వీదుల్లో ఆ అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై విశాల్‌ వెళ్తుండగా అక్కడ కొందరు ఆయన్ను గుర్తుపట్టి పిలుస్తారు... అప్పుడు విశాల్‌ షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకుని అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు..? వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటి..? అని ఆయన ఫ్యాన్స్‌ గూగుల్‌లో వెతికారు. కానీ ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ కొందరు ఫైర్‌ కావడంతో విశాల్‌ స్పందించారు.

విశాల్‌ క్షమాపణ
'నన్ను క్షమించండి... ఇటీవల వైరల్‌ అయిన వీడియో గురించి అసలు నిజాన్ని తెలిపేందుకు ఇది సమయం అని నేను అనుకుంటున్నాను. లొకేషన్‌ ప్రకారం అది కొంచెం వాస్తవం. ఆ వీడియో న్యూయార్క్‌లో తీసిందే. ఆ సమయంలో నేను న్యూయార్క్‌లో ఉన్నాను. రెగ్యూలర్‌గా ప్రతి ఏడాది నేను మా కజిన్స్‌ వద్దకు న్యూయార్క్‌ వెళ్తాను. ఏడాది కాలం పాటు సినిమాలకు సంబంధించిన పనులతో నిత్యం బిజీగానే ఉంటాను.. ఆ కష్టాన్ని మరిచిపోయి ఇలా నా కజిన్స్‌తో గడుపుతాను. ఆ వీడియో ఒక ప్రాంక్‌.. ముందుగా అనుకుని చేసినదే... కావాలనే ఆ వీడియో నేను మొహం దాచుకున్నాను.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ OTT: బర్రెలక్కతో పాటు సీజన్‌-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్‌)

అలా చేయాలని ముందే ప్లాన్‌ ప్రకారం వీడియో తీసి నా ప్రమేయంతోనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోపై వస్తున్న రూమర్స్‌ ఇకనైన ఆగుతాయని ఆసిస్తున్నాను. కానీ కొంతమంది ఈ వీడియో వల్ల నా పట్ల ఫైర్‌ అవుతున్నారు. అయినా, నేను ఎవరినీ ద్వేషించలేను.' అని విశాల్‌ క్లారిటీ ఇచ్చేశాడు.  కోలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ హరి- విశాల్‌  కాంబినేషన్‌లో రత్నం అనే  సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement