Director Hari
-
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
రత్నం కథ ఇదే.. అందరికి నచ్చే హీరో ఎవరంటే: హరి
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్‌తో భరణి,పూజా చిత్రాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని, వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు. -
'గుడ్ లక్ స్టూడియోస్'ని ప్రారంభించిన నటుడు సూర్య (ఫొటోలు)
-
సరికొత్త ఫీచర్స్‌తో స్టూడియో నిర్మాణం.. బిజినెస్‌లో స్పీడు పెంచిన హీరోయిన్
పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయకుమార్ నిరూపిస్తున్నారు. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రియమైనా నీకు, మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాల్లో కనిపించిన ఆమె 2002లో దర్శకుడు హరితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి భర్తతో పాటుగా వ్యాపార రంగంలో రాణిస్తుంది. కోలీవుడ్‌లో పక్కా మాస్ కమర్షియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న దర్శకుడు హరి. ఈయన గత ఏడాది 'గుడ్ లాక్' పేరుతో ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాల కోసం చెన్నైలో స్టూడియోను ఏర్పాటు చేశారు. ఆది ఇప్పుడు ద్విగ్విజయంగా తొలి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగిడింది. ఈ సందర్భంగా ఈ కపుల్స్ తన యూనిట్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. గుడ్ లక్ స్టూడియో మొదటి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన స్టూడియోను మరింత ఆధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. 5.1 మిక్సింగ్, డబ్బింగ్ వసతులను సమకూర్చినట్లు తేలిపారు. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నానన్నారు. ఇలా మొత్తం మూడు స్టూడియోలను ఈ కపుల్స్ నిర్వహిస్తున్నారు. వాటి బాధ్యతలు ఎక్కువగా ప్రీతా చూసుకుంటారు. కాగా ప్రస్తుతం విశాల్ హీరోగా రత్నం చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి ప్రియభవానీ శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్య క్రమాలు జరుపుకుంటోంది. పక్కా మాస్ మసాలా కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దర్శకుడు హరి, విశాల్ హీరోగా ఇంతకు ముందు భరణి, పూజై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో తాజా చిత్రం రత్నంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించడం గమనార్హం. ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. View this post on Instagram A post shared by Pritha Hari (@pritha10hari) -
సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్
పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయకుమార్ నిరూపించారు. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించిన ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్ కూతుర్లలో ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ తరువాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు, వంటి చిత్రాల్లో నాయకిగా నటించారు. ఆ తరువాత 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. నటనకు దూరంగా ఉంటున్న ప్రీత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సోదరి శ్రీదేవి ఇతర స్నేహితురాళ్లతో కలిసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ లైవ్‌లో ఉంటున్న ప్రీత ఇతర వ్యాపారంలోనూ బిజీగా వున్నారు. ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. వీరితో పాటు స్థానిక సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో పక్క ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్‌లో వున్నారు. -
విశాల్ భారీ యాక్షన్ మూవీ.. విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది డైరెక్టర్ హరితో యాక్షన్ సినిమా అంటే మామూలుగా ఉండదు. వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ మూవీ అంటే అభిమానులకు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మోడ్‌లో రాబోతోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూసి మాస్ లవర్స్‌లో భారీ అంచనాలు పెరిగాయి. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. రత్నం ఫస్ట్ షాట్ టీజర్, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్లో విశాల్ యాక్షన్ మూవీ థియేటర్లోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది. -
అమ్మాయితో వైరల్ వీడియో.. క్షమాపణ కోరిన విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయనతో పాటు మరో అమ్మాయి ఉండటమే... న్యూయార్క్ వీదుల్లో ఆ అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై విశాల్ వెళ్తుండగా అక్కడ కొందరు ఆయన్ను గుర్తుపట్టి పిలుస్తారు... అప్పుడు విశాల్ షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకుని అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు..? వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? అని ఆయన ఫ్యాన్స్ గూగుల్‌లో వెతికారు. కానీ ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ కొందరు ఫైర్ కావడంతో విశాల్ స్పందించారు. విశాల్ క్షమాపణ 'నన్ను క్షమించండి... ఇటీవల వైరల్ అయిన వీడియో గురించి అసలు నిజాన్ని తెలిపేందుకు ఇది సమయం అని నేను అనుకుంటున్నాను. లొకేషన్ ప్రకారం అది కొంచెం వాస్తవం. ఆ వీడియో న్యూయార్క్‌లో తీసిందే. ఆ సమయంలో నేను న్యూయార్క్‌లో ఉన్నాను. రెగ్యూలర్‌గా ప్రతి ఏడాది నేను మా కజిన్స్ వద్దకు న్యూయార్క్ వెళ్తాను. ఏడాది కాలం పాటు సినిమాలకు సంబంధించిన పనులతో నిత్యం బిజీగానే ఉంటాను.. ఆ కష్టాన్ని మరిచిపోయి ఇలా నా కజిన్స్‌తో గడుపుతాను. ఆ వీడియో ఒక ప్రాంక్.. ముందుగా అనుకుని చేసినదే... కావాలనే ఆ వీడియో నేను మొహం దాచుకున్నాను. (ఇదీ చదవండి: బిగ్ బాస్ OTT: బర్రెలక్కతో పాటు సీజన్-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్) అలా చేయాలని ముందే ప్లాన్ ప్రకారం వీడియో తీసి నా ప్రమేయంతోనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై వస్తున్న రూమర్స్ ఇకనైన ఆగుతాయని ఆసిస్తున్నాను. కానీ కొంతమంది ఈ వీడియో వల్ల నా పట్ల ఫైర్ అవుతున్నారు. అయినా, నేను ఎవరినీ ద్వేషించలేను.' అని విశాల్ క్లారిటీ ఇచ్చేశాడు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబినేషన్లో రత్నం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Sorry guys, I guess it's time to reveal the truth about the recent video. Well well well, it's half true in terms of location, yes I am in New York which is my regular retreat place with my cousins, which is a ritual of destressing myself every year after a super chaotic rest of… — Vishal (@VishalKOfficial) December 27, 2023 Is that Actor @VishalKOfficial walking with someone in NYC 🤔 pic.twitter.com/ddMESEuKOq — Ramesh Bala (@rameshlaus) December 26, 2023 -
గుడి దగ్గర స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఇబ్బందిపడ్డ భక్తులు
విశాల్ కొత్త సినిమా షూటింగ్ తమిళనాడులోని వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయం సమీపంలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలిరోజు విశాల్‌తోపాటు హీరోయిన్ ప్రియాభవాని శంకర్, కమెడియన్ యోగిబాబు తదితరులు పాల్గొన్నారు. షూటింగ్ కోసం కోట ఆలయం సమీపంలో తాత్కాలిక వేలూరు సౌత్ పోలీస్‌స్టేషన్ సెట్‌ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి:హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) హీరోయిన్ బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఖైదీలని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న సీన్స్ తీశారు. దర్శకుడు హరి నేతృత్వంలోని ఈ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే షూటింగ్ లొకేషన్ చుట్టూ జిమ్ బాయ్స్ బైటాయించి ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను అడ్డుకోవడంతో వీళ్లందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) -
కొత్త సినిమా ప్రకటించిన విశాల్, హీరోయిన్ ఎవరంటే?
హీరో విశాల్ ఇటీవల వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. నటి రీతూ వర్మ నాయకిగా, ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో విశాల్ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు తుప్పరివాలన్–2 చిత్రాన్ని చేస్తున్నారు. కాగా విశాల్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన నటించే 34వ చిత్రం. ఈ చిత్రానికి కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ స్టూడియో, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతకుముందు ఈయన హరి సింగం 1, 2, వేంగై చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విశాల్, దర్శకుడు హరి కాంబోలో ఇంతకుముందు తామరభరణి, పూజై వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ఈ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రం శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నటుడు విశాల్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు ఇందులో నటి ప్రియా భవానీ శంకర్ నాయకిగా నటించనున్నట్లు, నటుడు యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ను తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథాచిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. చదవండి: నిత్యామీనన్ ఇంట్లో విషాదం -
8ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్
చెన్నై: సీనియర్ దర్శకుడు, పాటల రచయిత, సంగీత దర్శకుడు, నటుడు గంగై అమరన్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. 55 చిత్రాలకు పని చేసిన ఆయన, 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. గంగై అమరన్ కలం నుంచి జాలువారిన పలు పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతునే ఉన్నాయి. సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, దర్శకుడు వెంకట్ ప్రభు తండ్రి అయిన ఈయన 2013 నుంచి నటనకు దూరంగా ఉన్నారు. కాగా తాజాగా అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంలో గంగై అమరన్ అతిథి పాత్రలో నటించడం విశేషం. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడికరన్ పట్టి ఎస్.శక్తివేల్ నిర్మిస్తున్నారు. చదవండి : దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్ -
ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో పోలీసుల కస్టడీలో తండ్రీ కొడుకుల హత్య ఆరోపణల కేసులో ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాలకృష్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసుల సవాళ్లు, వారి ధైర్యసాహసాలను హైలైట్ చేసిన చిత్ర దర్శకుడిగా పేరుగాంచిన హరి ఇకపై అలాంటి సినిమాలను చేయనంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) జయరాజ్, బెన్నిక్స్ దారుణ హత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదు. కొద్దిమంది అధికారుల కారణంగా, మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2, సింగం-3, సామి, సామి-2 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి; ఆందోళనలు) తమిళనాడులో పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగం హీరో సూర్య ఈ సంఘటనను వ్యవస్థీకృత నేరంగా పేర్కొనగా, ప్రముఖ నటి కుష్బూ దీనిపై విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వరకర్త డి ఇమ్మన్ కూడా ఈ అమానవీయ హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ భారతదేశపు జార్జ్ ఫ్లాయిడ్స్ అంటూ ఇమ్మన్ ట్వీట్ చేశారు. కాలా దర్శకుడు పా రంజిత్ స్పందిస్తూ పోలీసుల క్రూరత్వానికి మరో ప్రాణం కోల్పోకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఎలాంటి భయం లేకుండా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్న ప్రతీ పోలీసు అధికారిని నేరస్థుడిగా భావించాలన్నారు. వీరితోపాటు హీరోయిన్లు సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక, అలాగే హీరో విష్ణు విశాల్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల దారుణాన్ని ఖండించారు. కాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్ (59), ఆయన కుమారుడు బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీరు మరణించడం కలకలం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా, తీవ్రంగా హింసించి, చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
నిర్మాతలకు సహకరిద్దాం
‘‘నిర్మాతలు బావుంటేనే సినిమా ఇండస్ట్రీ బావుంటుంది. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి సినిమాలు ప్రారంభమయ్యాక నిర్మాతలకు సహకరిద్దాం’’ అని కోరుతున్నారు తమిళ దర్శకుడు హరి. సూర్యతో ఆరు, ‘సింగం’ సిరీస్, విక్రమ్‌తో సామి, సామి స్క్వేర్ వంటి చిత్రాలను తెరకెక్కించారు హరి. ప్రస్తుతం మరోసారి సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాశీ ఖన్నా హీరోయిన్. నిర్మాతలకు సహాయపడటం కోసం ఈ సినిమాకు హరి పారితోషికానీ 25 శాతం తగ్గించుకోనున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారాయన. ఇలా చేస్తే నిర్మాతలకు సహాయపడినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే తమిళ హీరో హరీష్ కల్యాణ్ (‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించారు) కూడా తన పారితోషికాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూడా తన రెమ్యూనరేషన్లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఆరు నుంచి ఆరు
హీరో సూర్య, దర్శకుడు హరిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ ఆల్రెడీ ‘ఆరు, వేల్ (తెలుగులో ‘దేవా’) ‘సింగం’ సిరీస్‌లో మూడు సినిమాలు.. ఇప్పటివరకూ మొత్తంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ‘ఆరు’ సినిమాతో కలసిన ఈ కాంబినేషన్ ఆరో సినిమా కోసం చేతులు కలపబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ నిర్మించనుందట. అయితే సూర్య, హరి చేయబోయే చిత్రం ‘సింగం’ సిరీస్ సీక్వెల్ కోసం కాదు. ‘వేల్’ సీక్వెల్ అని చెన్నై టాక్. మరోవైపు సీక్వెల్ కాదు.. ‘వేల్’ సినిమా తరహాలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందనే వార్త వినిపిస్తోంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియా ఆనంద్, సమీరా రెడ్డి యాక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ‘యన్‌జీకే’, కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పుకున్నారు సూర్య. దాంతో పాటుగా హరి చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారని ఊహించవచ్చు. -
అపరిచితుడు తర్వాత సామి
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి’ పేరుతోనే తెరకెక్కిన చిత్రం నేడు విడుదల కానుంది. ఇందులో కీర్తీ సురేష్, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సామి’ సినిమా సెన్సార్ కాదు.. రిలీజ్ కాదు అని కొందరు రూమర్లు క్రియేట్ చేశారు. వాటిని అధిగమించి సెన్సార్ పూర్తి చేసుకుని సుమారు 600 నుంచి 700 థియేటర్లలో ఈ రోజు సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు హరి. ఈ సినిమా రషెస్‌ని ఫ్యామిలీతో కలిసి చూసిన విక్రమ్ ఎమోషన్ అయి, హరిని హగ్ చేసుకున్నారట. ‘నా కెరీర్లో ‘అపరిచితుడు’ చిత్రం తర్వాత ‘సామి’ బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. నాకు మైలురాయి చిత్రం ఇచ్చారు’ అని ఎమోషనల్ అయ్యారట. ఈ విషయం తెలిసి మేం హ్యాపీగా ఫీలయ్యాం. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ కాబోతోందనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. మదర్ సెంటిమెంట్‌యాక్షన్, దేవిశ్రీ ప్రసాద్‌గారి పాటలు.. అన్నీ హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. విక్రమ్, హరి పాల్గొన్నారు. -
పవర్ఫుల్ పోలీస్ పాత్రలో విక్రమ్
‘లక్ష్మీ నరసింహా’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ పవర్ పుల్ పోలీసాఫీర్‌గా నటించిన ఆ సినిమా తమిళ సినిమాకు రీమేక్. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘సామి’ సినిమాను తెలుగులో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సామి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ఇటీవలే తమిళ్ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్చేశారు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్వామి స్క్వేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సింగం సిరీస్‌ల సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ హరి.. మరోసారి పవర్ఫుల్ పోలీస్ కథతో రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళ్లో సామి స్క్వేర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సామి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అటు రాజమండ్రికి 3 కిలోమీటర్లు.... ఇటు న్యూఢిల్లీకి 1984 కిలోమీటర్లు... మధ్యలో విక్రమ్. ఎవరి కోసమో కాపు కాస్తున్నట్టు, చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఈ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి విక్రమ్ అలా ఎందుకు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. -
ఫస్ట్ లుక్.. పవర్ఫుల్ పోలీస్ ఈజ్ బ్యాక్
సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో ‘చియాన్’ విక్రమ్. కానీ, అపరిచితుడు తర్వాత ఆయనకు సరైన హిట్ లేకుండా పోయింది. దశాబ్దానికి పైగా వరుసగా చిత్రాలు బోల్తా పడుతున్నాయి. గత చిత్రం స్కెచ్ అయితే డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 15 ఏళ్ల క్రితం తనకు సామితో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరితో విక్రమ్ మరోసారి జోడీ కట్టాడు. సామి స్క్వేర్‌గా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను తాజాగా వదిలారు. ఫుల్ మాస్ లోడెడ్‌గా సామి స్క్వేర్ తెరకెక్కినట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది. మాస్ కంటెంట్.. పైగా రేసీ స్క్రీన్ ప్లేతో చిత్రాలను తెరకెక్కించటంలో హరి దిట్ట. అలాంటిది వీరిద్దరి కాంబోలో మళ్లీ చిత్రం వస్తుండటంతో చియాన్‌కి హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమీన్ ఫిలింస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
పవర్ఫుల్ పోలీస్ ‘సామి’ ఈజ్ బ్యాక్
-
మరోసారి పోలీస్ పవర్ చూపించడానికి..
తమిళ సినిమా: కోలీవుడ్‌లో పోలీసు కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. అయితే అలాంటి పోలీస్ కథా చిత్రాల్లో సామి చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకుంటే నటుడు విక్రమ్‌కు స్టార్ ఇమేజ్ను ఆపాదించిన అతి కొద్ది చిత్రాల్లో సామి ఒకటి. అదేవిధంగా నటి త్రిషను అగ్రనటిగా నిలబెట్టిన చిత్రం సామినే. కమర్శియల్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన సామి చిత్రం ఒక సంచలనం. దానికి సీక్వెల్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విక్రమ్, హరి కాంబినేషనల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రేజీ తార కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తోంది. మరో హీరోయిన్గా ముందు నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలగి పెద్ద వివాదానికి తెరలేపిన నటి త్రిష మళ్లీ నటించడానికి సమ్మతించినట్లు ప్రచారం జరుగుతోంది. నటుడు బాబీసింహా విలన్‌గా నటిస్తున్నారు. ఇందులో విక్రమ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఆయన పోలీస్ కమిషనర్‌గా కనిపించనున్నారు. అలా పోలీస్ అధికారిగా విక్రమ్ ఈ చిత్రంలో దుమ్మురేపనున్నార ని సమాచారం. దర్శకుడు హరి యాక్షన్ సన్నివేశాలను బ్రహ్మాండంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను గురువారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత దర్శకుడు హరి మరోసారి సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది సింగం పార్ట్ 4 అవుతుందనే ప్రచారం వైరల్ అవుతోంది. -
ఎస్ ఫర్ సూర్య
సినిమా పేరు ‘ఎస్’ ఫర్ ‘సింహం’. కనపడే సింహాలూ కనిపించని సింహాలనూ చూశాం. కానీ ఖాకీ సినిమాలకు లేటెస్ట్ కేరాఫ్ అడ్రస్ సూర్య. రెండు సూపర్ హిట్ సింగంల తర్వాత ముచ్చటగా మూడో హిట్ కోసమే ఈ సినిమా.. సింగంతో సూర్య ప్రయాణమే ఈ కథనం... నీతి నిజాయతీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పోలీసాఫీసర్ల కథలు సిల్వర్ స్క్రీన్‌కి కొత్త కాదు. చెప్పాలంటే ఇటు సౌత్ అటు నార్త్‌లో బాగా అరిగిపోయిన ఫార్ములా ఇది. స్క్రీన్‌ప్లే చిక్కగా ఉంటేనే ఈ అరిగిపోయిన ఫార్ములా కాసుల వర్షం కురిపిస్తుంది. ఆసక్తికరమైన ట్విస్టులు, చమక్కులు పెట్టే నేర్పు దర్శకుడికీ, ‘ఈ పోలీస్ సూపర్’ అనేలా పెర్ఫామ్ చేయగల సత్తా హీరోకీ ఉండాలి. హీరో సూర్య– దర్శకుడు హరిలకు ఆ దమ్ము ఉంది. ‘సింగమ్’కి ముందు ఈ ఇద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. విడివిడిగానూ చాలా సినిమాలే చేశారు. కానీ, ‘సింగమ్’కి ముందు ‘సింగమ్’ తర్వాత అని చెప్పుకునేలా వీళ్ల మార్కెట్ మారిపోయింది. అందుకే మొదటి పార్ట్‌తో వదల్లేదు. రెండో పార్ట్ తీశారు. అది కూడా సూపర్. మూడో పార్ట్ కూడా చేశారు. గురువారం మూడో సింగమ్ కూడా వచ్చేసింది. అసలు ‘సింగమ్’ ఎప్పుడు మొదలైంది? హీరోకి 25... దర్శకుడికి 10! అది 2009. హీరో సూర్య అప్పటికి 24 సినిమాలు చేసేశారు. వాటిలో ‘శివపుత్రుడు’ ఒకటి. ఎమోషనల్గానూ సూర్య యాక్ట్ చేయగలడని ప్రూవ్ చేసిన సినిమా అది. ‘గజిని’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ కూడా ఈ హీరోలో మంచి విషయం ఉందని నిరూపించాయి. ఇక, ‘ఆరు’, ‘వేల్’ అయితే మంచి మాస్ హీరో ఉన్నాడని చూపించాయి. ఈ రెండు సినిమాలకూ హరి దర్శకుడు. మాస్ సినిమాలు తీస్తే హరినే తీయాలన్నంతగా ఆయనకు పేరు వచ్చింది. దాంతో సూర్య–హరి కాంబినేషన్ అంటే హిట్ అనే పేరు పడిపోయింది. ఇద్దరికీ అండర్స్టాండింగ్ కూడా కుదిరింది. అందుకే ఎక్కడో ఓ మూల సూర్య 25వ సినిమా తానే చేస్తే బాగుంటుందని హరికి అనిపించి ఉంటుంది. అయితే అప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సూర్య 25వ సినిమా అనే వార్త బయటికొచ్చింది. ఆ తర్వాత ఓ ఫైన్ డే సూర్య కోసం స్టోరీ రెడీ చేశానని, తన 25వ సినిమాకి నేనే దర్శకుణ్ణి అని హరి చెప్పారు. అలా ‘సింగమ్’ మొదలైంది. ఇది హరికి పదో సినిమా. సూర్యకు 25వ సినిమా కాబట్టి, న్యాచురల్‌గా అంచనాలు పెరిగాయి. 2009 ద్వితీయార్థంలో షూటింగ్ మొదలుపెట్టారు. 2010 ఫిబ్రవరిలో ట్రైలర్ రిలీజ్ చేశారు. అంతకుముందు ‘కాక్క కాక్క’ (తెలుగులో వెంకటేశ్ నటించిన ‘ఘర్షణ’)లో సూర్య పోలీస్‌గా కనిపించినా అతను క్లాస్ పోలీస్. ఇక్కడ ఊర మాస్. ట్రైలర్ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. పైగా సూర్య చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. సింహంలాంటి వేగం, చురకత్తిలాంటి చూపులు, పంచ్ డైలాగులు... చిన్న ట్రైలర్లో ఇవన్నీ చూపించేశారు హరి. దాంతో అంచనాలు పెరిగిపోయాయి. ఒకవైపు సింహం వాడి... మరోవైపు వేసవి వేడి! 2010 మే 28... ‘సింగమ్’ విడుదలైంది. సినిమాల రిలీజుకు సమ్మర్ మంచి సీజన్. పిల్లలకు సెలవులు. సుమారు 20 శాతం కలెక్షన్స్ వాళ్లిచ్చేస్తారు. మాస్ సినిమాలంటే పడి చచ్చిపోయేవాళ్లు, సూర్య ఫ్యాన్స్ మాగ్జిమమ్ చూసేస్తారు. ఓ 60, 70 శాతం వసూళ్లు వాళ్లే ఇస్తారు. లేడీస్ వాటా కూడా కొంత ఉంటుంది. సినిమా బాగుంటే చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూస్తారు. ‘సింగమ్’కి అదే జరిగింది. మొదటి రోజే హిట్ టాక్. పోలీస్ అంటే ‘దురైసింగమ్’ (తెలుగులో ‘నరసింహ’ం)లా ఉండాలన్నారు. ‘సింగమ్’లో సూర్య పాత్ర పేరిది. కథ చాలా చిన్నది. చిన్న పల్లెటూరికి చెందిన దురైసింగమ్ సిటీకి వస్తాడు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగడు. వృత్తిని దైవంగా భావిస్తాడు. సమాజంలోని చీడపురుగులను ఏరిపారేస్తాడు. ఈ పాయింట్ చుట్టూ హరి అల్లిన సన్నివేశాలు, దురైసింగమ్గా సూర్య నటన హైలైట్. హీరో–విలన్ల ఎత్తుకు పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. ఇవి సినిమాని నిలబెట్టేసాయి. అప్పటి సూర్య మార్కెట్‌కి తగ్గట్టుగా సుమారు 15 కోట్ల రూపాయల ఖర్చుతో తీశారు. దాదాపు 65 కోట్లు వసూళ్లు సా«ధించింది. తెలుగులో ‘యముడు’గా విడుదలై, ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. అందుకే ‘సింగమ్’ అంటే సూర్య– హరిలకు స్పెషల్ లవ్. దీన్ని ఇలానే వదలకూడదు.. మరిన్ని సింహాలను తెర మీదకు వదలాలను కున్నారు. అలా సెకండ్ పార్ట్ స్టార్ట్. మూడేళ్ల తర్వాత రెండో సింహం ‘సింగమ్’ చేశాక సూర్య–హరి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. రెండో భాగం మొదలుపెట్టే లోపు సూర్య దాదాపు ఏడు సినిమాలు చేసేశారు. అయితే ‘సింగమ్’ ఇచ్చినంత రిజల్ట్‌ని అవేవీ ఇవ్వలేకపోయాయి. మరోవైపు హరి పరిస్థితి కూడా అంతే. ఆయన చేసిన ఒకే ఒక్క సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఇలాంటి టైమ్‌లో మళ్లీ ఇద్దరూ సినిమా చేయాలనుకున్నారు. 2012లో రెండో సింహానికి శ్రీకారం చుట్టారు. 2013 జూలై 5న విడుదలైంది. డబుల్ మాస్... ఫస్ట్ పార్ట్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రేయసితో ఊరు వెళతాడు దురైసింగమ్. కానీ, అది ఉత్తుత్తి రాజీనామా. సెకండ్ పార్ట్‌లో ఎన్.సి.సి. టీచర్‌గా చేస్తుంటాడు. అండర్ కవర్ డి.ఎస్.పి అన్నమాట. సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని అంతం చేయాలనే మిషన్ మీద పని చేస్తుంటాడు. వాటి వెనక ఉన్నది అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అని కనుగొంటాడు. కానీ, టీచర్ ముసుగు నుంచి బయటకు రావాల్సి వస్తుంది. దురైసింగమ్ పోలీసాఫీసర్ అని తెలిశాక విలన్లకూ అతనికీ మధ్య అసలు యుద్ధం మొదలవుతుంది. అక్కణ్ణుంచి సినిమా ఊపందుకుంటుంది. చివరికి విలన్ని పట్టుకుని జైలులో పెట్టడంతో సినిమాకి ఎండ్ కార్డ్ పడుతుంది. ఫస్ట్ పార్ట్‌కన్నా సెకండ్ పార్ట్ మరింత మాస్‌గా ఉంటుంది. పవర్ఫుల్ డైలాగ్స్ రూపంలో సూర్య అరుపులు, అతను కొట్టే దెబ్బలకు విలన్ల అరుపులు, మధ్యలో రిలీఫ్ కోసం అనుష్కతో లవ్ ట్రాక్, హన్సిక వన్ సైడ్ లవ్, అంజలి ఐటమ్ సాంగ్‌తో సెకండ్ పార్ట్ మాస్‌కి ఎక్కేసింది. దాంతో సూపర్ హిట్టయింది. తెలుగులో ‘యముడు–2’గా వచ్చి, ఇక్కడా హిట్టయింది. ఆరంభం వాయిదా... విడుదల వాయిదా! ఎప్పుడైతే రెండు భాగాలు హిట్టయ్యాయో అప్పుడు ‘సింగమ్’ ఓ బ్రాండ్ అయిపోయింది. మూడో భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ‘సింగమ్’ ప్రేమికులు ఎదురు చూశారు. సెకండ్ పార్ట్ విడుదలైన ఏడాదికి (2014) మూడో భాగానికి అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి సినిమాని మొదలు పెట్టాలనుకున్నారు. 2015 డిసెంబర్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అదే సమయంలో చెన్నైలో భారీ తుపాను. వేరే దారి లేక షూటింగ్‌ను వాయిదా వేశారు. విచిత్రంగా సినిమా విడుదల కూడా పలుమార్లు వాయిదా పడింది. గతేడాది దీపావళికి విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత క్రిస్మస్కి అనుకున్నారు. అదీ మిస్సయింది. ఈలోపు 2016 అయిపోయింది. 2017 రానే వచ్చింది. జనవరిలో విడుదల చేయాలనుకుంటే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ వివాదం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకవేళ వాయిదాల పర్వం లేకపోయి ఉంటే మొదటి భాగానికీ, రెండో భాగానికీ ఉన్నట్లుగానే రెండో భాగానికీ మూడో భాగానికీ మూడేళ్లు గ్యాప్ ఉండేది. వాయిదాల వల్ల నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. ఏదైతేనేం గురువారం ‘సింగమ్ 3’ విడుదలైంది. తిరుగు లేని సింహం ఈసారి దురైసింగమ్ మిషన్ ఏంటంటే... మంగళూరులో ఓ కమిషనర్ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరు? అని ఛేదించడంతో పాటు అక్కడ జరుగుతున్న అక్రమాల వెనక ఉన్న వ్యక్తి ఎవరు? అని తెలుసుకుని అతని సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి దురైసింగమ్ ఏం చేశాడు? అనేది కథ. ముందు అనుకున్న తేదీకి విడుదలై ఉంటే, రెండింతల క్రేజ్ ఉండేది. వాయిదాల మీద వాయిదా ఓ మైనస్. ఈ విషయాన్ని స్వయంగా సూర్య కూడా ఒప్పుకున్నారు. అయినప్పటికీ పాజిటివ్‌గానే ఉన్నట్లు పేర్కొన్నారు. వాయిదా ఎఫెక్ట్ కాస్త కనిపించినా రానున్న రోజుల్లో ‘సింగమ్’కి తిరుగుండదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగింది. అది చాలు సినిమా నిలబడటానికి. అన్నట్లు ‘సింగమ్’ దూకుడు ఇంతటితో ఆగదు. ‘సింగమ్ 4’ కూడా ఉంటుంది. సౌత్‌లో సీక్వెల్స్ తక్కువ. హిందీలో మాత్రం మూడు, నాలుగు, ఐదు.. ఇలా తీస్తుంటారు. ఉదాహరణకు ‘గోల్మాల్’. సౌత్‌లో ‘సింగమ్’ సిరీస్ ఆ రికార్డ్‌ని సొంతం చేసుకుంటుందని చెప్పొచ్చు. మరి.. నాలుగో భాగం ఎప్పుడు? వెయిట్ అండ్ సీ. విడుదలకు ముందే 100 కోట్లు! ‘సింగమ్’ మొదటి భాగం బడ్జెట్ 15 కోట్లు. రెండో భాగాన్ని 45 కోట్లతో తీశారు. ఈ సిరీస్‌కి వచ్చిన ఆదరణ దృష్ట్యా మూడో భాగాన్ని దాదాపు 65 కోట్లతో తీశారు. కానీ, విడుదలకు ముందే సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఎలాగంటే... తమిళనాడు బిజినెస్ 41 కోట్లు, తెలుగు 18 కోట్లు, ఓవర్సీస్ 15.5 కోట్లు, కేరళ–కర్నాటక 9 కోట్లు, అన్ని భాషల శాటిలైట్ రైట్స్ ఇంచుమించు 22 నుంచి 25 కోట్లు, తమిళ మ్యూజికల్ రైట్స్ 1 కోటీ 75 లక్షలు. ఇవన్నీ కూడితే 115 నుంచి 120 కోట్లు పై చిలుకే. ఇతర భాషల్లో సింగమ్ ‘సింగమ్’, ‘సింగమ్2’ తెలుగులో డబ్ అయ్యాయి. ‘సింగం’ హిందీలో రీమేక్ అయింది. మాస్ హీరో అజయ్ దేవగణ్‌తో రోహిత్ శెట్టి తెరకెక్కించారు. సుమారు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హిందీ ‘సింగమ్’ 140 కోట్ల రూపాయలు వసూలు చేయడం రికార్డ్. బాక్సాఫీస్‌కి పూనకం పట్టిందా అని ఆశ్చర్యపోయారంతా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయిన నేపథ్యంలో రెండో భాగం తీశారు. అయితే దీనికీ, తమిళ సీక్వెల్‌కీ సంబంధం లేదు. వేరే కథతో ‘సింగమ్ రిటర్న్స్’ తీసి మళ్లీ హిట్ సాధించారు. ‘సింగమ్’ కన్నడ రీమేక్ ‘కెంపెగౌడ’లో సుదీప్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. తమిళంలోలానే కన్నడంలోనూ సినిమా సూపర్ హిట్. ‘కెంపెగౌడ’ వసూళ్ల సునామీ సృష్టించింది. బెంగాలీలో ‘షోత్రు’ పేరిట రీమేక్ అయిన ‘సింగమ్’ అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. అరిగిపోయిన ఫార్ములాకి ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే తయారు చేసుకుంటే హిట్ ఖాయం అని ‘సింగమ్’ సిరీస్ నిరూపించింది. – డి.జి. భవాని -
జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన నటుడు
కోలీవుడ్‌లో కమర్షియల్ చిత్రాలకు చిరునామా దర్శకుడు హరి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సామి, తామిరభరణి, ఆరు, సింగం, పూజై, సింగం-2 ఇలా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ పూర్తిగా మాస్ మసాలా చిత్రాలే. వాటిలోనూ రమ్యమైన ప్రేమ, వినోదభరిత సన్నివేశాలంటూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా జాగ్రత్త పడడం హరి స్పెషాలిటి. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ తెలుగులోకి అనువాదం అయి అక్కడి ప్రేక్షకులను అలరించడం మరో విశేషం. తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్‌హిట్ చిత్రం లక్ష్మినరసంహా తమిళంలో హరి దర్శకత్వం వహించిన సామి చిత్రానికి రీమేక్అన్నది గమనార్హం. కాగా తాజాగా సూర్య హీరోగా ఎస్-3 పేరుతో సింగంకు మూడో భాగాన్ని తెరకెక్కించారు. అనుష్క, శ్రుతీహసన్ లాంటి ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సింగం, సింగం-2ల కంటే మరింత అదుర్స్‌గా ఉంటుందని అంటున్న దర్శకుడు హరితో సాక్షి చిట్‌చాట్ ప్ర. ఎస్-3 చిత్రం ఎలా ఉండబోతుంది? జ. నా చిత్రాలు కమర్షియల్ ఫార్ములాలోనే ఉంటాయన్నది తెలిసిందే. సింగం, సింగం-2 చిత్రాల కంటే ఎస్-3 మరింత భారీ హంగులతో ఉంటుంది. కాక్కక్కాక, సింగం, సింగం-2 చిత్రాల తరువాత సూర్యను నాలుగో సారి పోలీస్ అధికారిగా చూపించడం అంటే అంత ఈజీ కాదు. అయినా ఆయన్ని చాలా కొత్తగా చూపించాను. ప్ర. ఎస్-3 చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఏమి చెప్పనున్నారు? జ. ఇందులో అంతర్జాతీయ సమస్యను చూపబోతున్నాం. దేశ సమైక్యతను, గొప్పతనాన్ని చెప్పనున్నాం. నా చిత్రాలు కమర్షియల్‌గా ఉంటాయంటారు. అందువల్ల ఈ సారి కమర్షియల్ అంశాలతో పాటూ కుటుంబ సమేతంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలన్న లక్ష్యంగా ఎస్-3ని తరకెక్కించాను. ప్ర. చిత్ర భారీతనం గురించి? జ. ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల కంటే అత్యధిక రోజులు చిత్రీకరించిన చిత్రం ఎస్-3. ఈ చిత్రాన్ని 125 రోజులు చిత్రీకరించాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు రొమేనియా, ఆస్ట్రేలియా, మలేషియా, వంటి విదేశాల్లోనూ షూటింగ్ నిర్వహించాం. ప్ర. సూర్యను గత చిత్రాలకు భిన్నంగా చూపించడానికి తీసుకున్న జాగ్రత్తల గురించి? జ. సూర్య ఇందులో పోలీస్ యూనిఫాం లేకుండా కొంత భాగం, యూనిఫాంతో కొంత భాగం కనిపిస్తారు. ఆయన డ్రస్సింగ్ స్టయిల్, యాక్టింగ్ అన్నీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. ప్ర. హీరోయిన్లు, అనుష్క, శ్రుతీహాసన్‌ల గురించి? జ. అనుష్క చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చిత్రానికి చాలా కీలకంగా ఉంటుంది. ఇక శుత్రీహాసన్ది చాలా డేరింగ్ పాత్ర. అదే సమయంలో గ్లామర్‌కు కొరత ఉండదు. ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడో విషయం చెప్పాలి. ఎస్-3 చిత్ర ప్రారంభానికి ముందే అనుష్కను కలిసి ఈ చిత్రంలో మీ పాత్ర ఎంత ఉంటుందో చెప్పలేను. మీరు నటిస్తారా? అని అడగ్గా సింగం చిత్ర కుటుంబంలో నేను ప్రధాన వ్యక్తినని, అందువల్ల ఒక గంట అయినా నేనీ చిత్రంలో నటించడానికి రెడీ అని అనుష్క అన్నారు. ప్ర. చిత్రంలో హైలైట్స్ గురించి? జ. హైలైట్స్ గురించి చెప్పాలంటే 8 ఎయిర్‌పోర్టులలో చిత్రాన్ని చిత్రీకరించాం. ఇక పోరాట సన్నివేశాలు, చేజింగ్స అంటూ చిత్రం వేగంగా సాగుతుంది. ఐటమ్ సాంగ్‌లో నటి నీతుచంద్రా నటించారు. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ప్ర. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని అన్నారట? జ; అవునా? అలా ప్రచారం జరుగుతోందా? నిజం చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నటించిన టెంపర్ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. నాలుగైదు సార్లు ఎన్టీఆర్‌ను కలిశాను కూడా. ఇంకా చెప్పాలంటే ఆయనతో చిత్రం చేయాలన్నది నా కోరిక. ఆయనకు కథ కూడా చెప్పాను. అయితే అది సెట్ కాలేదు. ప్ర. తెలుగులో చిత్రం చేస్తారా? జ. చేయాలని ఆశగా ఉంది. అందుకే తెలుగు భాషను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్ర. టాలీవుడ్లో మీకు ఇష్టమైన దర్శకుడు? జ : అలా చెప్పడం చాలా కష్టం. చాలా దర్శకులంటే ఇష్టం. లెజెండ్ చిత్రాన్ని బోయపాటి శ్రీను, టెంపర్ దర్శకుడు పూరి జగన్నాధ్, శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇలా చాలా మంది దర్శకులు అద్భుతంగా చేస్తున్నారు. -
సింగంతో హ్యాట్రిక్
సింగంతో హ్యాట్రిక్‌కు అందాల భామ అనుష్క సిద్ధం అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. గత ఏడాది చివరిలో లింగా చిత్రం నిరాశనే మిగిల్చినా ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్నై అరిందాల్ చిత్రం హిట్ అవడంతో అనుష్క ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇందుకు మరో కారణం ఆమె ఎంతో కష్టపడి కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ లాంటి సాహోసోపేతమైన విద్యల్లో శిక్షణ పొంది నటించిన చారిత్రక కథా చిత్రం రుద్రమదేవి. త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత అత్యంత భారీ చిత్రం ప్రపంచ సినిమా ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి విడుదలకు రెడీ అవుతోంది. ఇలా వరుసగా 2015లో తన చిత్రాలు విడుదల కానుండడంతో చాలా ఎగ్జైటింగా ఎదురు చూస్తున్నారు. అంతే కాదు మరో రెండు కొత్త చిత్రాలు అనుష్కను వరించడం ఆమెకు ఏడాది స్పెషల్ కానుంది. తమిళంలో నటుడు సూర్యతో సింగం, దానికి కొనసాగింపుగా వచ్చిన సింగం-2, చిత్రాలు ఘన విజయం సాధించి అనుష్క మార్కెట్‌ను పెంచాయి. సింగంకు మరో సీక్వెల్ అంటే సింగం-3 కు సూర్య దర్శకుడు హరి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని హరి స్వయంగా వెల్లడించారు. ఇందులో సూర్య మరోసారి పవర్ఫుల్ పోలీసు అధికారిగా గర్జింజనున్నారని సమాచారం. సింగం, సింగం-2లో సూర్యతో రొమాన్స్ చేసిన అనుష్క మరోసారి సింగంలో డ్యూయెట్లు పాడనున్నారన్నది తాజా సమాచారం. తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ నిర్మించనున్న చిత్రంలో అనుష్క నటించనున్నారు. ఈమె ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం అనుష్క దుబాయ్‌లో రిలాక్స్ అవుతున్నారు. ఈ నెల మూడవ వారంలో తిరిగొచ్చి ప్రకాష్ చిత్రంలో నటించనున్నారని సమాచారం. -
సూర్యతో ఐదోసారి
నటుడు సూర్యతో ఐదో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు హరి. ఇంతకుముందు వీరి కలయికలో ఆరు, వేల్, సింగం, సింగం-2 చిత్రాలు రూపొందాయి. ఇవన్నీ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. మరో విషయం ఏమిటంటే నటుడు విజయ్ చిత్రం (తమిళ్)తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన హరి సూర్యతోనే అధిక చిత్రాలు చేశారు. ప్రస్తుతం విశాల్ హీరోగా పూజై చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పక్కా మాస్ మసాలా చిత్రమే. ఇది దీపావళికి తెరపైకి రానుంది. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ తనకు తెలిసింది కమర్షియల్ చిత్రాల రూపకల్పనేనన్నారు. పూజై కమర్షియల్ చిత్రం అయినా కుటుంబ సమేతంగా చూసి ఆనందించేదిగా ఉంటుందన్నారు. పూజై చిత్రాన్ని 100 రోజుల్లో షూటింగ్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుని 90 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. ఈ క్రెడిట్ విశాల్‌కే దక్కుతుందన్నారు. పూజై చిత్రం విడుదల తరువాత సూర్య హీరోగా చిత్రం తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. వీరి కాంబినేషన్లో సింగం -3 తెరకెక్కనున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి హరి వద్ద ప్రస్తావించగా సూర్యతో రూపొందించనున్న చిత్రం స్క్రిప్ట్ ఇంకా సిద్ధం చేయలేదని, కథ తయారైన తరువాత వివరాలు తెలియచేస్తానన్నారు. సూర్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత మలయాళ దర్శకుడు విక్రమన్‌తో ఒక చిత్రం చేయనున్నారు. ఆ తరువాతనే హరి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే ఈ చిత్రం సెట్‌పైకి వచ్చే అవకాశం ఉంది. విజయ్, అజిత్ హీరోలుగా కూడా చిత్రాలు చేస్తానంటున్నారు దర్శకుడు హరి. -
హరితోనే సంతృప్తి
దర్శకుడు హరి దర్శకత్వంలో నటిస్తే పనిలో సంతృప్తి కలుగుతుందని నటుడు విశాల్ వ్యాఖ్యానించారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. పాండియనాడు, నాన్‌శిగప్పు మనిదన్ చిత్రాల కథానాయకుడిగా, నిర్మాతగా వరుసగా విజయం సాధించిన నటుడు విశాల్. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు తామరభరణి అనే సక్సెస్ఫుల్ చిత్రం వచ్చింది. తాజాగా పూజై చిత్రం రూపొందింది. నటుడు విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈమెకిది తమిళంలో మూడో చిత్రం కాగా నిర్మాతగా విశాల్‌కు మూడో చిత్రం కావడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల మార్కెట్లోకి విడుదలయ్యాయి. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో దీపావళికి విడుదల చేయనున్నట్లు నటుడు విశాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ పూజై చిత్రం తన కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా పేర్కొన్నారు. ఏడేళ్ల తరువాత హరి దర్శకత్వంలో పూజై చిత్రం చేశానని చెప్పారు. ఎమ్జీఆర్ లాంటి వారు హరి దర్శకుల మధ్య హరి ఎమ్జీఆర్ లాంటివారని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎమ్జీఆర్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారన్నారు. అదే విధంగా దర్శకుడు హరి తన చిత్రాల వల్ల సైకిల్ స్టాండ్‌లో టోకెన్లు ఇచ్చే వారి వరకు అందరు సంతోషంగా ఉండాలని భావిస్తారన్నారు. పూజై చిత్రంలో నటి రాధిక, సితార సూరి తదితర ప్రముఖ నటీనటులు నటించారన్నారు. ముఖ్యంగా సత్యరాజ్‌తో కలిసి నటించడం సంతోషకరంగా పేర్కొన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ కోయంబత్తూర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం పూజై అని తెలిపారు. పూజై లాంటి మంచి కమర్షియల్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని శ్రుతిహాసన్ వ్యాఖ్యానించారు. -
మగాడినంటున్న విశాల్
చిత్రానికి పేరు చాలా ముఖ్యం. పేరు వినగానే చిత్రం చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో రేకెత్తించాలి. ఈ విషయంలో చాలా మంది ప్రత్యేక శ్రద్ధ చూపడంలేదనే అపవాదు కోలీవుడ్‌లో ఉంది. నటుడు విశాల్ ఈ విషయంలో ప్రత్యేకమనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన చిత్రాల పేర్లు పరిశీలిస్తే పాండియనాడు, నాన్ శిగప్పు మనిదన్ తాజాగా నటిస్తున్న పూజై అన్నీ క్యూరియాసిటీని కలిగించే విధంగా ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాలకు తానే నిర్మాత. హరి దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న పూజై చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి చేపట్టిన చిత్రానికి సంబంధించే విశాల్ మగాడినంటున్నారు. అంటే ఈ చిత్రానికి ఆంబళై అనే టైటిల్‌ను నిర్ణయించారన్నమాట. ఆంబళై అంటే మగాడు అని అర్థం. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు మదగజరాజా అనే చిత్రం తెరకెక్కింది. మంచి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ విశాల్‌తో రొమాన్స్ చేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం విశాల్, సుందర్.సి కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటించనున్నారు.