ఫస్ట్ లుక్‌.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ | Saamy Square First Look Motion Poster Out | Sakshi
Sakshi News home page

Published Thu, May 17 2018 8:26 PM | Last Updated on Thu, May 17 2018 8:29 PM

Saamy Square First Look Motion Poster Out - Sakshi

స్వామి స్క్వేర్‌లో విక్రమ్‌

సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌ హీరో ‘చియాన్‌’ విక్రమ్‌. కానీ, అపరిచితుడు తర్వాత ఆయనకు సరైన హిట్‌ లేకుండా పోయింది. దశాబ్దానికి పైగా వరుసగా చిత్రాలు బోల్తా పడుతున్నాయి. గత చిత్రం స్కెచ్‌ అయితే డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 15 ఏళ్ల క్రితం తనకు సామితో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన దర్శకుడు హరితో విక్రమ్‌ మరోసారి జోడీ కట్టాడు. సామి స్క్వేర్‌గా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను తాజాగా వదిలారు. ఫుల్‌ మాస్‌ లోడెడ్‌గా సామి స్క్వేర్‌ తెరకెక్కినట్లు ఫస్ట్‌ లుక్‌ చూస్తే అర్థమౌతోంది. మాస్‌ కంటెంట్‌.. పైగా రేసీ స్క్రీన్‌ ప్లేతో చిత్రాలను తెరకెక్కించటంలో హరి దిట్ట. అలాంటిది వీరిద్దరి కాంబోలో మళ్లీ చిత్రం వస్తుండటంతో చియాన్‌కి హిట్‌ గ్యారెంటీ అని ఫ్యాన్స్‌ సంతోషంలో ఉన్నారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. తమీన్‌ ఫిలింస్‌ చిత్రాన్ని నిర్మి‍స్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement