Hero Vikram
-
సాక్షి స్టూడియోలో విక్రమ్ కి బిర్యానీ ట్రీట్
-
హీరో విక్రమ్‌తో మరోసారి జతకట్టనున్న ఐశ్వర్య రాయ్
క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో దర్శకుడు మణిరత్నం దిట్ట. ఇంతకుముందు రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి కాంబినేషన్లో దళపతి చిత్రం చేసిన ఈయన ఆ తరువాత శింబు, అరవిందస్వొమి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, జ్యోతిక, అదితి రావు తదితరులు కాంబోలో చెక్క చివంద వానం తాజాగా విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాగణంతో పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్స్ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రంలో మాజీ ప్రేమికులైన విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, దీని తర్వాత మరో క్రేజీ కాంబినేషన్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. అదే పొన్నియిన్ సెల్వన్ క్రేజీ కాంబినేషన్. క్లియర్‌గా చెప్పాలంటే నటుడు విక్రమ్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లుగా చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు మణిరత్నం రావణన్ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో చేసే చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్, ఐశ్వర్య రాయ్‌ల కాంబోలో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్ హీరో.. క్లారిటీ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజ' వంటి చిత్రాల తరువాత హ్యాట్రిక్ చిత్రం కోసం వీరిద్దరూ రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం త్రివిక్రమ్ ప్రముక తమిళ హీరో విక్రమ్‌ను సంప్రదించినట్టుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విక్రమ్‌కు సంబంధించిన మేనేజర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. దాంతో పాటు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన తెలిపాడు. ఇక దీంతో మహేశ్ బాబు సినిమాలో విక్రమ్ లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది. అయితే ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. -
ఫస్ట్ లుక్.. పవర్ఫుల్ పోలీస్ ఈజ్ బ్యాక్
సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో ‘చియాన్’ విక్రమ్. కానీ, అపరిచితుడు తర్వాత ఆయనకు సరైన హిట్ లేకుండా పోయింది. దశాబ్దానికి పైగా వరుసగా చిత్రాలు బోల్తా పడుతున్నాయి. గత చిత్రం స్కెచ్ అయితే డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 15 ఏళ్ల క్రితం తనకు సామితో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరితో విక్రమ్ మరోసారి జోడీ కట్టాడు. సామి స్క్వేర్‌గా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను తాజాగా వదిలారు. ఫుల్ మాస్ లోడెడ్‌గా సామి స్క్వేర్ తెరకెక్కినట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది. మాస్ కంటెంట్.. పైగా రేసీ స్క్రీన్ ప్లేతో చిత్రాలను తెరకెక్కించటంలో హరి దిట్ట. అలాంటిది వీరిద్దరి కాంబోలో మళ్లీ చిత్రం వస్తుండటంతో చియాన్‌కి హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమీన్ ఫిలింస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
పవర్ఫుల్ పోలీస్ ‘సామి’ ఈజ్ బ్యాక్
-
చేప తలకాయ కూర ఇష్టంగా తింటా: హీరో
విశాఖ : విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ ఇష్టమైన కూర ఏంటో తెలుసా?. చేప తలకాయ కూర అట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఇంకొక్కడు’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖలో అతడు ఆదివారం సందడి చేశారు. నగరంలోని విమాక్స్ థియేటర్‌కు వచ్చిన విక్రమ్ అభిమానులతో ముచ్చటించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఇంకొక్కడు సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందన్నాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ కథ చెప్పగానే విలన్ ఎవరైతే బాగుంటుందని చాలా చర్చలు జరిగాయని, చివరకు హీరో, విలన్‌గా తానే చేస్తానని చెప్పడంతో దర్శకుడు సరే అన్నారని, ఎప్పటి నుంచో ద్విపాత్రాభినయం చేయాలన్న కల ఈ చిత్రంతో తీరిందన్నాడు. లవ్ (విలన్), అఖిల్ (హీరో) పాత్రలకు మంచి గుర్తింపు వచ్చిందన్నాడు. సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు విక్రమ్ ధన్యవాదాలు తెలిపాడు. తదుపరి చిత్రంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఇక విశాఖ వస్తే చేపల తలకాయ కూర ఇష్టంగా తింటానని తెలిపాడు. -
దర్శకుడైన హీరో విక్రమ్!
హీరో విక్రమ్ ఇప్పుడు దర్శకుడి అవతారమెత్తారు. అదేంటి? శుభ్రంగా హీరోగా చేస్తున్నవాడు... ఇలా దర్శకుడయ్యాడేమిటని నివ్వెరపోకండి! ఆ మధ్య చెన్నై నగరాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తి, జనజీవ నాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. జనం కృతనిశ్చయంతో ఆ కష్టాలను అధిగమించారు. చెన్నై నగర వాసుల్లోని స్ఫూర్తిదాయకమైన ఈ సానుకూల అంశాన్ని ప్రతిఫలిస్తూ, విక్రమ్ ఇప్పుడో పాటను వీడియోగా చిత్రీకరిస్తున్నారు. అలా ఈ హీరో తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. ‘ది స్పిరిట్ ఆఫ్ చెన్నై’ (చెన్నై నగర స్ఫూర్తి) అనే ఈ పాట చిత్రీకరణ కూడా సహజంగానే చెన్నై నగరంలోనే చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా వచ్చి ఇందులో నటించారు. ప్రముఖ రచయిత మదన్ కార్కీ (‘బాహుబలి’లో కిల్కి భాష సృష్టికర్త), రాకేశ్, గానా బాల ఈ పాట రాశారు. 20 మందికి పైగా పాడారు. తమిళ హీరో సూర్య, మలయాళ నటుడు నివిన్ పాలీ, కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్, ఇంకా శివకార్తికే యన్, ప్రభుదేవా, ‘జయం’ రవి, జీవా, భరత్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు వీడియోలో నటించారు. మొత్తానికి, కొన్నేళ్ళ క్రితం మణిరత్నం ‘రావణ్’లో కలసి నటించినప్పటి నుంచి స్నేహితులైన విక్రమ్, అభిషేక్‌లు ఇంతకాలానికి మళ్ళీ కలసి కెమేరా ముందుకు రావడం విశేషమే. -
రాజమౌళి, విక్రమ్ మధ్య టైటిల్ వార్?
-
శంకర్ దర్శకత్వంలో కొత్త హీరో!
ఇక్కడ కుడి పక్క ఫొటోలో కనిపిస్తున్న కుర్రాణ్ణి చూస్తుంటే, హీరో విక్రమ్ గుర్తొస్తున్నారు కదూ. టీనేజ్‌లో ఉన్నప్పుడు విక్రమ్ దిగిన ఫొటోనేమో అని ఊహించుకునే అవకాశం కూడా ఉంది. కానీ, ఇదసలు విక్రమ్ ఫొటో కాదు. ఆయన తనయుడు ధ్రువ్ కృష్ణ ఫొటో. హ్యాండ్సమ్గా ఉన్నాడు కదూ. ధ్రువ్ వెండితెర రంగప్రవేశానికి రంగం సిద్ధమవుతోందని సమాచారం. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా ధ్రువ్ పరిచయమవుతాడని చెన్నయ్ టాక్. శంకర్ వంటి దర్శకుడి చిత్రం ద్వారా పరిచయమైతే తనయుడి భవిష్యత్తు బాగుంటుందని విక్రమ్ భావిస్తున్నారట. ధ్రువ్ కోసం తాను విలన్‌గా చేయడానికి కూడా సిద్ధపడ్డారని సమాచారం. శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘రోబో 2’లోనే విక్రమ్ ప్రతినాయకునిగా నటించనున్నారట. వాస్తవానికి రజనీకాంత్ కథానాయకునిగా, ఆమిర్‌ఖాన్‌ని ప్రతినాయకునిగా అనుకుని శంకర్ ఈ కథ రెడీ చేశారట. కానీ, ఆమిర్ తిరస్కరించడంతో విక్రమ్‌ని శంకర్ అడిగారని, ఆయన ఆనందంగా అంగీకరించారని భోగట్టా. -
కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ'
చెన్నై: సృజనాత్మక దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఐ' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తొలుత మిశ్రమ రివ్యూలకే పరిమితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గత వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఐ మూవీ తమిళనాట కాకుండా బయటకూడా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ చిత్రం కేరళలో కలెక్షన్లలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకూ కేరళ రాష్ట్రంలో ఏ తమిళ చిత్రం కూడా నెలకొల్పని కలెక్షన్ల రికార్డులను ఐ మూవీ సొంతం చేసుకుంది. తెలుగులోకి అనువాదమైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రోజే రూ. 9 కోట్లను వసూలు చేయగా, హిందీలో రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ అన్ లిస్ట్ త్రినాథ్ తెలిపారు. -
'ఐ' సినిమా రివ్యూ
తారాగణం - విక్రమ్, అమీ జాక్సన్, సంతానం, సురేష్ గోపి, రామ్‌కుమార్, మాటలు - శ్రీరామకృష్ణ, పాటలు - సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, ఎడిటింగ్ - ఆంథోనీ, కళ - ముతురాజ్, నిర్మాత - ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్, దర్శకత్వం - శంకర్ ఒక మామూలు కథాంశం, ఇతివృత్తం కూడా దాన్ని మనం ఊహించుకొనే తీరు వల్ల అత్యద్భుతంగా మనోనేత్రం ముందు సాక్షాత్కరించవచ్చు. సృజనశీలురైన దర్శకులకు సర్వసాధారణంగా ఉండే లక్షణం ఇదే! ముఖ్యంగా, తమిళనాడులో మొదలుపెట్టి, ఇవాళ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకుడు శంకర్‌లో తరచూ కనిపించే లక్షణం అది. డొనేషన్లు, అవినీతి లాంటి మామూలు కథల్ని కూడా విజువలైజేషన్ ప్రతిభతో, తన టేకింగ్ సామర్థ్యంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అది ఆయన బలం. ఏ మాత్రం తేడా వచ్చినా, అదే బలహీనత అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క ‘స్నేహితులు’ (తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం) మినహా ప్రతిసారీ ఆ ఊహాశక్తితో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన శంకర్ తాజా కానుక - ‘ఐ’ (...మనోహరుడు). సుదీర్ఘ కాలం నిర్మాణంలో ఉండి, అనేక అవాంతరాలను దాటుకొని, ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ‘భోగి’ నాడు విడుదలైంది ఈ సినిమా. మరి, పెరిగిన అంచనాలను తన సెల్యులాయిడ్ కల్పనా సామర్థ్యంతో శంకర్ అందుకున్నారా? కథ ఏమిటంటే... లింగేశ (విక్రమ్) మంచి బాడీ బిల్డర్. వ్యాయామశాలలో కష్టపడి కసరత్తులు చేసి, ప్రత్యర్థులను కూడా ఎదుర్కొని, మిస్టర్ ఆంధ్రాగా ఎంపికవుతాడు. అలా అనుకోకుండానే ప్రత్యర్థులకు శత్రువు అవుతాడు. ఇంతలో అతను చిరకాలంగా వాణిజ్య ప్రకటనల్లో చూసి ఆరాధిస్తున్న మోడల్ దియా (ఎమీ జాక్సన్) పరిచయమవుతుంది. తోటి మోడల్ జాన్ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొని, అతని వల్ల యాడ్స్ నుంచి తొలగింపునకు గురవుతుంది. ఆ క్రమంలో కొత్త మోడల్‌గా బాడీ బిల్డర్ లింగేశను ఎంచుకొని, అతణ్ణి ‘లీ’గా తీర్చిదిద్దుతుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. లీ ఎదుగుదలను చూసి ప్రత్యర్థి బాడీ బిల్డర్ రవి, జాన్, స్టైలిస్ట్ ఓజ్మా తదితరులు ఓర్వలేకపోతారు. ఆ పరిస్థితుల్లో వారేం చేశారు? అప్పుడు లీ ఏమయ్యాడు? లీ, దియాల ప్రేమ కథ ఏమైంది? మొదలైనవన్నీ మిగతా సినిమా. ఎలా నటించారంటే... ‘ఐ’ చిత్రంలో ఉన్న కీలక పాత్రలు, పాత్రధారులు కొద్దే. కానీ, అందరిలోకీ అత్యధికంగా శ్రమించిందీ, ఎక్కువ మార్కులు కొట్టేసేదీ మాత్రం నిస్సందేహంగా విక్రమ్. కండలు తిరిగిన బాడీ బిల్డర్‌గా, ఆ వెంటనే అందమైన నాజూకు మోడల్‌గా, అటు వెంటనే కండలు కరిగిపోయి - ఒళ్ళంతా వికృతంగా తయారైన గూనివాడిగా విభిన్న ఛాయలున్న పాత్రను ఆయన పోషించారు. నిజం చెప్పాలంటే, ఈ వేర్వేరు షేడ్స్‌లోనూ ఆయన అచ్చంగా అతికినట్లు సరిపోవడమే కాక, ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఒకే చిత్రంలో ఒకదానికొకటి సంబంధం లేని ఇన్ని ఛాయల్ని పోషించడానికి శారీరకంగా, మానసికంగా మూడేళ్ళ పాటు విక్రమ్ పడిన కష్టం, ఆ పాత్రల స్వరూప స్వభావాలకు తగ్గట్లు చూపిన హావభావాలు కచ్చితంగా అవార్డు దక్కించుకోదగ్గవి అనిపిస్తుంది. మోడల్‌గా ఎమీ జాక్సన్ అందంగా ఉన్నారు. కొంతసేపు బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం దక్కించుకున్నారు. హీరో ఫ్రెండ్‌గా సంతానం (తెలుగులో డబ్బింగ్ వాయిస్ ఇచ్చింది కమెడియన్ శ్రీనివాసరెడ్డి) తన పంచ్ డైలాగులతో కాసేపు నవ్విస్తారు. డాక్టర్ వాసుదేవరావుగా సురేష్ గోపి, ఇతరులది పాత్రోచిత నటనకే పరిమితం. సాంకేతిక నిపుణుల పనితీరేమిటంటే... సినిమా 24 క్రాఫ్ట్స్ సమష్టి కృషి అయినప్పటికీ, చాలా కొద్ది సినిమాల్లోనే సాంకేతిక నిపుణులందరి పనితనం, సమష్టి కృషి తెరపై కనిపిస్తుంటుంది. ‘ఐ’ సినిమా కచ్చితంగా 24 క్రాఫ్ట్స్ సమష్టి కృషికి నిదర్శనమే. పి.సి. శ్రీరామ్ కెమేరా వర్క్, లైటింగ్ చేసిన తీరు చైనాలోని వివిధ లొకేషన్స్‌లో, పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ.ఆర్. రెహమాన్ బాణీల్లో వేదనను ధ్వనించే ‘నువ్వుంటే నా జతగా...’ (రచన - రామజోగయ్యశాస్త్రి, గానం - సిద్ శ్రీరామ్, ఇషత్ ్రఖాద్రే), శ్రావ్యంగా వినిపించే ‘పూలనే కునుకేయమంటా...’(రచన- అనంత శ్రీరామ్, గానం - హరిచరణ్, శ్రేయా ఘోషల్) ఆకట్టుకుంటాయి. అలాగే, ద్వితీయార్ధంలో కొన్నిచోట్ల రెహమాన్ నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని గాఢతను పెంచింది. ముతురాజ్ కళా దర్శకత్వ ప్రతిభ దాదాపు ఎకరంపైగా స్థలంలో వేసిన ‘నువ్వుంటే నా జతగా...’ పాటలోని విశాలమైన సెట్లో, అలాగే గూనివాడి డెన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీరామకృష్ణ డబ్బింగ్ డైలాగ్ల్లోనూ పంచ్‌లు బాగానే పడ్డాయి. సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి - యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్లు, మేకప్. ప్రథమార్ధంలో వచ్చే బాలీ బిల్డర్ల ఫైట్, చైనాలో జరిగే సైకిల్ ఫైట్, ద్వితీయార్ధంలో చేతులు కట్టేసిన స్థితిలో హీరో చేసే ఫైట్, క్లైమాక్స్‌కు ముందొచ్చే ట్రైన్ ఫైట్ - ఈ నాలుగూ మాస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సినిమా మొదట్లో వచ్చే ‘పరేషానయ్యా...’ (రచన - సుద్దాల, గానం - విజయ్ ప్రకాశ్, నీతీ మోహన్)లో చేతిలోని మొబైల్ ఫోన్, నీటిలో నుంచి చేప హీరోయిన్గా మారడం లాంటి విజువల్ ఎఫెక్ట్లు (జాతీయ అవార్డు గ్రహీత శ్రీనివాస్ ఎమ్. మోహన్) బాగున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన ‘వీటా’ వారు గూనివాడి వేషానికి వేసిన మేకప్ సహజంగా అనిపిస్తుంది. ఈ వంద కోట్ల పైచిలుకు సినిమాలో చిత్ర నిర్మాణ విలువలూ పుష్కలంగా ఉన్నాయి. ఎలా ఉందంటే... ఒక దిగువ మధ్యతరగతి అబ్బాయి, అందమైన హై సొసైటీ అమ్మాయిల మధ్య సాగే ప్రేమకథ ఇది. అందులోనే పైకి వస్తున్నవాళ్ళ మీద పక్కనున్న ప్రత్యర్థులకు ఉండే ఈర్ష్య, అసూయ, ద్వేషం,ఆ పైన ప్రతీకారం లాంటి అంశాలన్నీ కలగలిపారు. ప్రేమ అనేది బాహ్య సౌందర్యానికి సంబంధించినదా? లేక హృదయ సౌందర్యానికి సంబంధించినదా? అనే మౌలికమైన ఆలోచనను చాలా తెలివిగా వీటన్నిటి మధ్య జొప్పించారు. ఆ సందర్భంలో ఎదురయ్యే వేదనను చూసినప్పుడు ఆ రూపం మీద జుగుప్స కన్నా ప్రేక్షకులకు కూడా కరుణ, జాలి కలుగుతుంది. అయితే, కురూపి, అందగత్తెల ప్రేమ లాంటివి కె.వి. రెడ్డి తీసిన వాహినీ వారి ‘గుణసుందరి కథ’ రోజుల నుంచి బాలకృష్ణ ‘భైరవద్వీపం’ దాకా చాలా జానపదాల్లోనే చూశాం. దాన్ని సోషలైజ్ చేసి, ఆధునిక హంగులు కలిపితే - ‘ఐ’. సినిమా మొదలుపెట్టడమే ఒక కురూపి, అందమైన హీరోయిన్ను ఎత్తుకుపోవడంతో! అలా ఆసక్తికరంగా మొదలైన కథ వర్తమానానికీ, గతానికీ మధ్య తిరిగే స్క్రీన్‌ప్లే విధానంతో ముందుకు నడుస్తుంది. మొదట కాస్తంత ఇబ్బందిగా అనిపించినా, గడుస్తున్న కొద్దీ ఈ రకమైన కథాకథనానికి ప్రేక్షకుడు అలవాటు పడతాడు. ప్రథమార్ధమంతా కాస్తంత నిదానంగా నడుస్తూ, ఫ్లాష్‌బ్యాక్‌లోని ఒక దశను చెప్పడానికే సరిపోతుంది. ద్వితీయార్ధంలో అసలు కురూపి అయిన గూనివాడి రూపం వెనుక ఉన్న అసలు ఫ్లాష్‌బ్యాక్. ఆ తరువాత విలన్లపై ప్రతీకారం విషయానికి వచ్చేసరికి మళ్ళీ చిత్రం ఊపందుకుంటుంది. వెరసి సినిమా కొన్ని ఘట్టాల్లో విజువల్‌గా వండర్ అనిపిస్తుంది. అయితే, ఈ చిత్ర కథలోనూ లాజిక్కులు వెతికితే చాలా లోపాలే కనిపిస్తాయి. ఒక మామూలు మోడల్‌ను నాశనం చేయడానికి అంత పెద్ద కంపెనీ యజమాని అలా రంగంలోకి దిగుతాడా? హీరోయిన్‌తో జాన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నా కోపగించుకోని డాక్టర్ ఆ తరువాత హీరోపై మాత్రం ఎందుకు పగబడతాడు? లాంటి ప్రశ్నలకు జవాబులు వెతికినా దొరకవు. గతంలో ఎప్పుడూ ఒక సందేశంతో ప్రేమ కథను మిళితం చేస్తూ, మరింత అద్భుతాలు చూపిన శంకర్ ఇలాంటి కథను తీశారేమిటని పెదవి విరిచేవారూ ఉంటారు. 3 గంటల ఆరు నిమిషాల ఏడు సెకన్ల నిడివి ఉండడం కూడా సినిమాకు ఒక రకంగా మైనస్సే. మొత్తం మీద దీర్ఘకాలం నిర్మాణంలో ఉండిపోవడం వల్ల పెరిగిపోయిన నిర్మాణవ్యయం, అంతకు మించి పెరిగిన అంచనాలను అందుకోవాలంటే ‘ఐ’లోని విజువల్ వండర్ అంశాలు, సాంకేతిక నైపుణ్యం సరిపోతాయా? లేక సినిమాలో పదే పదే వినిపించే డైలాగ్ లాగా.... ప్రేక్షకులు కూడా.... ‘‘అంతకు మించి...’’ ఆశించామంటారా? అదే ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. - రెంటాల జయదేవ -
హీరోకు చుక్కలు చూపించిన సినిమా
దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఐ' సినిమా ఏ రేంజిలో హిట్టవుతుందో గానీ.. అందులో హీరో విక్రమ్‌కు మాత్రం చుక్కలు చూపించింది. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా తన శరీరబరువును సగానికి తగ్గించుకోవాల్సి వచ్చింది. తనకు విపరీతంగా ఆకలి వేసేదని, తినాలని కూడా అనిపించేదని, ఆకలి ఆపుకోవడం చాలా కష్టంగా ఉండేదని విక్రమ్ అన్నాడు. దాంతో చివరకు పిచ్చెక్కినట్లు అనిపించేదని చెప్పాడు. ఐ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. వాటిలో ఒకటి బాడీ బిల్డర్ పాత్ర. మరొకటి అందవికారంగా కనపడే వ్యక్తి పాత్ర. ఈ పాత్ర కోసమే తాను తిండి మానుకుని, విపరీతంగా జిమ్‌లో వ్యాయామాలు చేయాల్సి వచ్చిందని విక్రమ్ చెప్పాడు. కావాలనుకుంటే స్టెరాయిడ్లు వాడి సులభంగా పెంచుకోవచ్చని, కానీ తానలా చేయదలచుకోలేదని అన్నాడు. దర్శకుడు శంకర్ తనను బరువు తగ్గాలని చెప్పలేదు గానీ, తనంతట తానే అలా చేశానన్నాడు. కావల్సిన లుక్ కోసం తాను ఆకలి చంపుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. కేవలం జ్యూసులు తాగి పొట్ట నింపుకున్నట్లు వివరించాడు. బయటకు వెళ్తే రహస్యం తెలిసిపోతుందని తాను ఎక్కడికీ వెళ్లలేదని తెలిపాడు. ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండేవాడినని, ఇంట్లో కూడా బిర్యానీలు నోరు ఊరించినా.. నోరు కట్టుకున్నానని అన్నాడు. -
'భవిష్యత్ లో తెలుగు సినిమా చేస్తా'
హైదరాబాద్: భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని తమిళ దర్శకుడు శంకర్ అన్నారు. విక్రమ్ హీరోగా తాను తెరకెక్కించిన 'ఐ' సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉన్నానని అన్నారు. భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఇది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మగధీర సినిమా చూసి రాజమౌళి అభిమాని అయ్యాయని శంకర్ అన్నారు. 'ఐ' సినిమా అందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హీరో విక్రమ్, కెమెరామన్ పీసీ శ్రీరాం, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'ఐ' సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. -
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్లో 'ఐ' వివాదం
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్లో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్ కాంబినేషన్లో వచ్చే 'ఐ' సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ నిర్మాతగా 180 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎమిజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సినీ దిగ్గజాలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ రిలీజ్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం సంక్రాతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నిరాశపరిచే విధంగా ఉండనుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జనవరి రెండవ వారంలో విడుదల కానుంది. టాలీవుడ్లో మాత్రం ఆ తేదీన విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక్కడ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం పండగ సమయాల్లో కేవలం డైరెక్ట్ తెలుగు చిత్రాలనే విడుదల చేయాలి. 'ఐ' డబ్బింగ్ మూవీ కావడంతో దానీ విడుదలను వాయిదా వెయ్యాలని ఛాంబర్లో పెద్ద వివాదమే చెలరేగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే గోపాల గోపాల, టెంపర్, రుద్రమదేవి వంటి భారీ చిత్రాలు సంక్రాతి బరిలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో 'ఐ' కూడా విడుదలైతే థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడితేనే మంచిదనే అభిప్రాయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి 'ఐ' సినిమా చూసే అవకాశం ఉండదు.