
క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో దర్శకుడు మణిరత్నం దిట్ట. ఇంతకుముందు రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో దళపతి చిత్రం చేసిన ఈయన ఆ తరువాత శింబు, అరవిందస్వొమి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, జ్యోతిక, అదితి రావు తదితరులు కాంబోలో చెక్క చివంద వానం తాజాగా విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాగణంతో పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్స్ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.
ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రంలో మాజీ ప్రేమికులైన విక్రమ్, ఐశ్వర్యరాయ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, దీని తర్వాత మరో క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. అదే పొన్నియిన్ సెల్వన్ క్రేజీ కాంబినేషన్.
క్లియర్‌గా చెప్పాలంటే నటుడు విక్రమ్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లుగా చిత్రం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు మణిరత్నం రావణన్ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో చేసే చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్, ఐశ్వర్య రాయ్‌ల కాంబోలో చిత్రం మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment