లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు.కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. కానీ రెంట్ విధానంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్ షిప్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి సినిమాను చూడొచ్చు. అయితే డబ్బులు కట్టిన 48 గంటల్లోనే సినిమాను చూడటం పూర్తిచేయాలి. మిగిలిన కండీషన్స్ కూడా వర్తిస్తాయి.
తమిళంతో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. జూన్ రెండో వారం నుంచి మాత్రం అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా పొన్నియన్ సెల్వన్ -2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment