విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్రమ్ కెరియర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తంగలాన్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్యపరంగా కూడా సుమారు రూ. 110 కోట్లు రాబట్టిన తంగలాన్ బాలీవుడ్‌లో కూడా తాజాగా విడుదలైంది. అక్కడి సినీ అభిమానులు కూడా విక్రమ్ నటనకు ఫిదా అవుతున్నారు. అయితే, తాజాగా తంగలాన్ ఓటీటీ ప్రకటన గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని నెట్‍ఫ్లిక్స్ ప్రకటించినట్లు ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. అయితే, అదే నిజమని ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియాలో తంగలాన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. సెప్టెంబర్ 20 తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో మాత్రమే తంగలాన్ విడుదల తప్పకుండా అవుతుందని సమాచారం. అయితే, హిందీ వర్షన్ మాత్రం ఒక వారం గ్యాప్‌తో రిలీజ్ కానున్నట్లు టాక్.
కథేంటి..?
గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment