Interesting Facts About Sara Arjun Who Plays The Role Of Teenage Nandini In Ponniyin Selvan - Sakshi
Sakshi News home page

Who Is Sara Arjun: పీఎస్‌ 2లో జూనియర్‌ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

Published Sun, Apr 30 2023 3:12 PM | Last Updated on Sun, Apr 30 2023 4:19 PM

PS 2: Interesting Facts About Sara Arjun Who Plays The Role Of Teenage Nandini - Sakshi

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’రెండో భాగం పీఎస్‌ 2  ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. పార్ట్‌ 1తో పోలిస్తే పార్ట్‌ 2 చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్‌. ఈ చిత్రంలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్‌ నటించిన సంగతి తెలిసిందే.

(చదవండి: విజయ్‌ దేవరకొండ, అఖిల్‌ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’! )

పార్ట్‌2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అందులో టీనేజ్‌ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్‌ ఆర్టిస్ట్‌. ఆమె ఎవరో కాదు.. సారా అర్జున్‌. ఈమె ఎవరంటారా? అదేనండి.. విక్రమ్‌, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్‌. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని చెప్పాలి. 2011లో విడుదలైన ఈ చిత్ర మంచి విజయం సాధించింది. అప్పుడు సారా వయసు కేలవలం ఐదేళ్లు మాత్రమే.

(చదవండి: సోషల్‌ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక)

ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది సారా. ఇక పొన్నియన్‌ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించింది. సినిమాలో ఐశ్వర్యరాయ్‌, త్రిష​,ఐశ్వర్య లక్ష్మీ, శోభిత లాంటి అందగత్తెలు ఉన్నా.. సారా అర్జున్‌ వారికి ఎక్కడా తగ్గకుండా తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించింది.  ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు  ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement