Aishwarya Rai Touches Mani Ratnam Feet At PS2 Promotion Event, Video Goes Viral - Sakshi
Sakshi News home page

PS2 Promotions: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్‌.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు

Published Wed, Apr 26 2023 1:15 PM | Last Updated on Wed, Apr 26 2023 1:23 PM

Aishwarya Rai Touches Mani Ratnam Feet At PS2 Promotion Event - Sakshi

దిగ్గజ దర్శకుడు మణితర్నం అంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌కు ఎంత గౌరవమో అందరికి తెలిసిందే. అతన్ని తన గురువులా భావిస్తుంది. ఐశ్వర్యను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది మణిరత్నమే. 1997లో ఇరువన్‌(తెలుగులో ఇద్దరు) చిత్రంతో ఐశ్వర్య ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మణిరత్నం, ఐష్‌ కాంబోలో గురు, రావణ్‌, పొన్నియన్‌ సెల్వన్‌ 1 లాంటి చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన పొన్నియన్‌ సెల్వన్‌ 2(పీఎస్‌ 2) విడుదలకు సిద్దం కాబోతుంది. ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప‍్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. 

ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. తాజాగా ముంబైలో కూడా ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అరుదైన సంఘటన జరిగింది. తన గురువులా భావించే మణిరత్నం  కాళ్లకు నమస్కరించింది ఐశ్వర్య రాయ్‌. ప్రమోషన్‌ ఈవెంట్‌లో మణిరత్నం మాట్లాడుతూ... పొన్నియన్‌ సెల్వన్‌లో ‘నందిని’పాత్రకు ఐశ్వర్య అయితేనే న్యాయం చేస్తుందనిపించింది. ఆమెను అడిగిన వెంటనే ఓకే చెప్పింది’అని చెబుతుండగా.. ఐశ్వర్య ఎమోషనల్‌ అయింది. వెంటనే స్టేజ్‌పై నుంచి లేచి అందరి ముందు మణిరత్నం కాళ్లుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement