Ponniyin Selvan 2
-
లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!
సౌత్ సినీ ప్రపంచంలో త్రిష ఒక అద్భుతమైన తార. సుదీర్ఘ విరామం తర్వాత త్రిష మళ్లీ మళ్లీ యాక్టివ్‌గా మారింది. త్రిష చివరిగా తెరపైకి వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. సిరీస్‌లోని రెండు చిత్రాలలో త్రిష తన నటనతో ప్రశంసలు అందుకుంది. త్రిష- విజయ సేతుపతి జంటగా నటించిన 96 సినిమా ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లోకి రీమేక్ చేయబడింది. ఈ సినిమా ద్వారా రామ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించగా జానుగా త్రిష ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష- విజయ్ సేతుపతి తమ నటనతో రామ్- జానుగా గుర్తింపు పొందారు. తమిళ్లో వచ్చిన ఈ సినిమాను చూసిన వారెవరూ వారిద్దరి పాత్రల్ని ఎప్పటికీ మరిచిపోరని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు) సినిమా క్లైమాక్స్ సీన్లో అత్యంత హృదయాన్ని హత్తుకునే సన్నివేశం ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు పలికిన సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆ సీన్‌ని పరిశీలిస్తే.. త్రిష, విజయ్ సేతుపతిలు ముద్దుల సీన్ లేకుండా కనిపించారు. బదులుగా, వారు తమ ముఖాలపై చేతులు ఉంచారు. అయితే స్క్రిప్ట్ ప్రకారం విజయ్ సేతుపతి, త్రిష ఈ సన్నివేశంలో లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. అందుకు త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమాలో మాత్రం ఈ సీన్ మారిపోయింది. దానికి కారణం విజయ్ సేతుపతి. ఈ సినిమాలో కిస్సింగ్ సీన్స్ చేయడానికి విజయ్ సేతుపతి సంకోచించాడు. ఆ సీన్ చేయడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దుల సన్నివేశాలు చేయడు. ఇదే విషయాన్ని ఆయన డైరెక్టర్లకు ముందే చెబుతాడట. సేతుపతిలాగే అజిత్, సూర్య, శివకార్తికేయన్ వంటి నటులు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి నిరాకరించే నటులే. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తర్వాత విజయ్‌తో త్రిష నటిస్తున్న చిత్రం లియో కాగా విజయ్ సేతుపతి బాలీవుడ్ చిత్రం జవాన్ విజయంతో దూసుకుపోతున్నాడు. -
జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు వసూళ్లు సాధించి ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని సినీ ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. ఈ రికార్డ్ స్థాయిలో వసూళ్లతో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాన్ని అధిగమించింది. పొన్నియన్ సెల్వన్-2 బాక్సాఫీస్ వద్ద రూ.345 కోట్లు వసూళ్లు చేయగా.. తాజాగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. పొన్నియిన్ సెల్వన్ -2లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. అత్యధిక వసూళ్లలో మూడోస్థానం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా జైలర్ నిలిచింది. ఆ లిస్ట్‌లో షారుఖ్ ఖాన్ పఠాన్, ప్రభాస్ ఆదిపురుష్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జైలర్ తమిళ వెర్షన్ ఇప్పటికే రూ. 139 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రూ.400 కోట్లే లక్ష్యంగా జైలర్ దూసుకెళ్తోంది. కాగా.. జైలర్‌లో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణన్, వినాయకన్, శివరాజ్‌కుమార్, సునీల్, నాగేంద్ర బాబు కీలకపాత్రల్లో నటించారు. -
మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...
సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో లక్కీ హీరోయిన్ ఎవరంటే మొదటగా త్రిష పేరునే చెప్పాలి. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నా, నటిగా మాత్రం ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అపజయాలతో సతమతమవుతున్నప్పుడల్లా ఒక మంచి విజయం వచ్చి ఈమెను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్తోంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. అంతకుముందు వరుసగా ప్లాపులు వెంటాడుతున్న త్రిషకు.. ఈ చిత్రంతో ఒక్కసారిగా మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ దక్షిణాది చిత్రాలలో ఒక రౌండ్ కొడుతోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తున్న త్రిష త్వరలో ప్రారంభం కానున్న అజిత్ చిత్రంలోనూ ఈమెనే నాయకి అనే ప్రచారం జరుగుతుంది. కాగా తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మరోసారి చిరంజీవితో జతకట్టే అవకాశం త్రిషను వరించింది. అదేవిధంగా మలయాళంలోను మరో అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. త్రిష చాలా కాలం క్రితం హే జూడ్ అనే మలయాళ చిత్రంలో నటించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో తనయుడి వేధింపులు? స్పందించిన బేబమ్మ) ఆ తర్వాత మోహన్ లాల్‌కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభమై మూడేళ్లు గడిచిన ఇంకా పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషను తాజాగా మరో అవకాశం వరించిందని సమాచారం. ఈమెను నటుడు టోవినో థామస్ సరసన నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుందని సమాచారం. -
ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు.కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. కానీ రెంట్ విధానంలో ‘పొన్నియిన్ సెల్వన్ 2’ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్ షిప్‌తో సంబంధం లేకుండా రూ. 399 చెల్లించి సినిమాను చూడొచ్చు. అయితే డబ్బులు కట్టిన 48 గంటల్లోనే సినిమాను చూడటం పూర్తిచేయాలి. మిగిలిన కండీషన్స్ కూడా వర్తిస్తాయి. తమిళంతో పాటు తెలుగు సహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. జూన్ రెండో వారం నుంచి మాత్రం అమెజాన్ సబ్స్క్రైబర్లకు ఉచితంగా పొన్నియన్ సెల్వన్ -2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!
భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. (ఇది చదవండి: లైకా ఖాతాలో.. అరుణ్ విజయ్ చిత్రం) చెన్నైలో లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఆస్తులపై ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రొడక్షన్ హౌస్‌లో అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై లైకా ప్రతినిధులు ఎలాంటి అధికారికి ప్రకటన చేయలేదు. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్) తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థగా పేరుంది. రజినీకాంత్ రోబో'2.0', మణిరత్నం'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2'తో సహా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. గతంలో రజనీకాంత్ 'దర్బార్' చిత్రాన్ని కూాడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయనతో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. హిందీలో జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' (2022), అక్షయ్ కుమార్ యొక్క 'రామ్ సేతు' (2022) చిత్రాలను నిర్మించింది. కాగా.. ఇటీవలే టాలీవుడ్‌లోనూ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ED conducts raids at LYCA Productions in Chennai. More details awaited: Sources pic.twitter.com/lZOX7pE9ks — ANI (@ANI) May 16, 2023 -
'పొన్నియిన్ సెల్వన్' ఇదేందయ్యా...అదుర్స్ అన్నారుగా
-
రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్, 10 సెకన్లలో జీవితమంతా..
ప్రముఖ సింగర్ రక్షిత సురేశ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. మలేషియాలో ఆదివారం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టి పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆమె చిన్నపాటి గాయాలతో తప్పించుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈరోజు పెద్ద ప్రమాదమే జరిగింది. ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తుండగా నేను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టి, ఆ భాగమంతా నుజ్జునుజ్జయింది. ఆ 10 సెకన్లలో నా జీవితమంతా కళ్ల ముందు మెదిలింది. ఎయిర్ బ్యాగ్స్ నా ప్రాణాలు కాపాడాయి. అవి లేకపోయుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. డ్రైవర్, నేను, మరో ప్యాసింజర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. ఏదైతేనేం, చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డందుకు మేము చాలా అదృష్టవంతులం' అని రాసుకొచ్చింది. కాగా రక్షిత సురేశ్.. రిథమ్ తధిమ్, లిటిల స్టార్ సింగర్ 2009 విజేతగా అవతరించింది. సూపర్ సింగర్ 6లోనూ పాల్గొన్న ఆమె ఈ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. తమిళంలో పలు పాటలు ఆలపించిన ఆమె తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ గాయనిగా సత్తా చాటింది. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 కన్నడ వర్షన్లోనూ పలు పాటలు పాడింది. 🙏🏼🧿 pic.twitter.com/NU3gUBtqjL — Rakshita Suresh (@RakshitaaSuresh) May 7, 2023 చదవండి: వివాదాల మధ్య దూసుకుపోతున్న ది కేరళ స్టోరీ కీర్తి సురేశ్‌కు ఏమైంది? ఇలా మారిపోయింది! -
సోషల్ మీడియా ని షాక్ చేసిన అందాల తార త్రిష బర్త్ డే...
-
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
-
PS2 Movie HD Stills: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ స్టిల్స్
-
కార్తీ సినిమా చూసేందుకు చెన్నై వచ్చిన జపాన్ ఫ్యాన్స్!
దక్షిణాది సినిమాలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపాన్ దేశ ప్రజలు విశేషంగా ఆదరించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు పంటి ప్రముఖ తారాగణం నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సూపర్ హిట్ అయ్యింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ గత నెల 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది చారిత్రక కథ కావడంతో కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నా, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కాగా నటుడు కార్తీకి జపాన్‌లో కూడా అభిమానులు ఉండటం విశేషం. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో వాందియదేవన్గా నటించిన కార్తీ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన కార్తీ అభిమానులు పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రాన్ని తమిళనాడులో చూడాలన్న ఆసక్తితో చైన్నెకి రావడం విశేషం. వారు ఈ చిత్రాన్ని ఏకంగా నాలుగు సార్లు చూశారట. ఈ విషయం తెలుసుకున్న నటుడు కార్తీ సర్ ప్రైజ్ చేసే విధంగా వారిని తన ఇంటికి రప్పించుకుని ముచ్చటించారు. ఈ సందర్భంగా జపాన్ అభిమానులు కార్తీ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన బహుమతులను ఆయనకు అందించారు. కార్తీ వారితో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. #PonniyinSelvan | After #Rajini it's for #Karthi !! Karthi fans from Japan came to Chennai, to watch #PonniyinSelvan2 with Tamil audience. Apparently, they watched movie for about 4 times and also happened to meet actor Karthi at his residence pic.twitter.com/JUj9rhwmyh — Ramesh Bala (@rameshlaus) May 1, 2023 చదవండి: ఇళయరాజా కుటుంబంలో విషాదం -
PS2 Movie HD Stills: పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ స్టిల్స్
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ స్టిల్స్ -
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’రెండో భాగం పీఎస్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. (చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’! ) పార్ట్2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందులో టీనేజ్ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె ఎవరో కాదు.. సారా అర్జున్. ఈమె ఎవరంటారా? అదేనండి.. విక్రమ్, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని చెప్పాలి. 2011లో విడుదలైన ఈ చిత్ర మంచి విజయం సాధించింది. అప్పుడు సారా వయసు కేలవలం ఐదేళ్లు మాత్రమే. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది సారా. ఇక పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించింది. సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష,ఐశ్వర్య లక్ష్మీ, శోభిత లాంటి అందగత్తెలు ఉన్నా.. సారా అర్జున్ వారికి ఎక్కడా తగ్గకుండా తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjun.offical) -
పాండియన్ల నమ్మకమే!
తమిళనాడులోని మదురై జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అభిమానం చూపడంలో, ఆవేశ పడడంలోనూ అక్కడి ప్రజల తరువాతే ఎవరైనా. సినిమాలను ఆదరించడంలోనూ ముందుంటారు. ఇక అసలు విషయానికి వస్తే దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని, రవివర్మన్ చాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా రెండో భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. చిత్ర ప్రచారంలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. అదే విధంగా మదురైలోనూ వాల్‌పోస్టర్లను అంటించారు. అయితే అక్కడ ప్రత్యేక వాల్‌పోస్టర్లు వెలిశాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్రను పోషించిన ఐశ్వర్యరాయ్ ఫొటోలతో పోస్టర్లను ముద్రించి అందులో అక్కా, పాండియన్ల నమ్మకమే. పాండియన్ల చివరి ఆయుధమే అంటూ పొందుపరిచి పాండియన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు
మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా నటుడు జయం రవి పేర్కొన్నారు. శుక్రవారం ఈ చిత్ర రెండవ భాగం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో జయం రవి టైటిల్ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఐదేళ్ల శ్రమ పొన్నియిన్ సెల్వన్ (రెండు భాగాలు) అని ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం మరచిపోలేని మధురానుభూతిగా జయం రవి పేర్కొన్నారు. చదవండి:రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు షూటింగ్ సమయంలో అందరం పలు విషయాల గురించి ముచ్చటించుకునే వాళ్లమని చెప్పారు. మళ్లీ ఇంతమంది ప్రముఖ నటీనటులతో కలిసి నటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ముందుకు రావాలిగా అని పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని భారీ చిత్రాల్లో నటించిన తరువాత మీరు నటిస్తున్న తర్వాత చిత్రాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్న ప్రశ్నకు మనం రోజూ బిరియానీ తినలేము కదా, సాంబారు అన్నం తినక తప్పదు కదా. అదే విధంగా పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు అరుదుగా వస్తాయని కాబట్టి తన తర్వాత చిత్రాలకు ఆదరణ లభిస్తుందా అనే సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇరైవన్ చిత్రాన్ని పూర్తి చేశానని, నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నానని ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. కాగా సైరన్ చిత్రంలో తండ్రి పాత్ర కోసం సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు రాజేష్ ఎం.దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నట్లు ఇది కూడా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? మెగా ఫోన్ ఎప్పుడు పట్టనున్నారు అన్న ప్రశ్నకు ఆ ఆలోచన ఉందని అందుకు చిన్నచిన్న కథలను కూడా తయారు చేసుకున్నట్లు చెప్పారు. అందులో ఒక కథ గురించి చెప్పగా బాగుంది నువ్వు మంచి దర్శకుడు అవుతావు అని పేర్కొన్నారు. కాగా తాను దర్శకత్వం వహించే చిత్రంలో కార్తీ నటిస్తారని ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పానని జయంరవి చెప్పారు. -
100 కోట్లు గ్రాస్...!
-
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్28) రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ) వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్) మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
PS2 Movie Review: ‘పొన్నియన్ సెల్వన్-2’ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-2 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: ఏప్రిల్28, 2022 ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం. కథేంటంటే... చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం. (చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?) ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
‘పొన్నియన్ సెల్వన్ 2’ ట్విటర్ రివ్యూ
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. ఇక రెండో భాగం నేడు (ఏప్రిల్ 28)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 కథ ఏంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (చదవండి: ఆ ముసలావిడ ఎవరు? నందినిని చంపేశాడా?.. ఎన్నో ప్రశ్నలకు సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2) పొన్నియన్ సెల్వన్ 2 మొదటి భాగం కంటే చాలా బాగుందంటున్నారు.పార్ట్ 1లో కథనం స్లోగా సాగితే.. పార్ట్ 2లో మాత్రం వేగంగా ఉంటుందని చెబుతున్నారు. చిత్రంలోని ఆర్ట్ డిజైన్ మరియు పాటలతో పాటు డ్రామా చాలా వరకు డీసెంట్‌గా ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి అంతటా పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. స్క్రీన్‌ప్లే కూడా పార్ట్ 1 కంటే బాగుందట. మణిరత్నం దర్శకత్వం, రవివర్మ సినిమాటోగ్రఫీపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. #PS2 #PonniyanSelvan2 in USA… Better than first! Everything department top notch 🥵 House full on a weekday show! Mani Ratnam GOAT for a reason!!!@rekhshc @suhansidh — Reev Mani (@reev_mani) April 28, 2023 Movie is so entertaining !! First half is 🔥.. Second half got some lag but at the end looks great.. Some Goosebumps scenes are there.. Great effort from the technicians and ARR did a great job in #PonniyanSelvan2.. Ratting 4/5#PonniyanSelvan2Review #PS2 — VENKATESH ENGLISH PROFESSOR (MOTIVATIONAL SPEAKER) (@venkyjohn67) April 28, 2023 Blockbuster #PonniyanSelvan2 🙏 Part-2 >>>> Next level opening across!! AR Rehman Music ✨🔥 — THE VILLAIN (@NBKzealot) April 28, 2023 Completed watching #PonniyanSelvan2 a well executed movie than its prequel @Karthi_Offl rocked and @actor_jayamravi blasted as #ponniyanselvan @trishtrashers lovely♥️ #Chiyaanvikram totally a blockbuster sequel after some years in kollywood 👍 pic.twitter.com/25DMAUyD0Z — Navaneetha Krishnan (@navaneethanjuno) April 28, 2023 The best feel for chiyaan Anna fans after anniyan I think. Though mahaan is there it’s different case. Today the applause he is deserving is 🔥🔥🔥😭😭😭. @chiyaan finally ur hardwork and success matched bro. #PS2 — Greeshmanth Pulikanti (@PulikantiGreesh) April 28, 2023 #PS2 satisfiable continuation which justifies the part 1. Important events were sequenced appropriately and every character was given its due. Mani Ratnam’s ability to romance stands out again, but we get to see only few in this part. Technically sound, neatly performed. — Abiram Pushparaj (@abirampushparaj) April 28, 2023 #PonniyinSelvan2 Review POSITIVES: 1. Casting 2. Performances (#ChiyaanVikram & #AishwaryaRai) 3. Screenplay 4. Direction 5. Visuals 6. Music & BGM NEGATIVES: 1. Can be slow for some Overall, #PS2 is a terrific sequel that has soul in it👏#PonniyinSelvan2Review #PS2Review pic.twitter.com/mpopG6jx5h — Kumar Swayam (@KumarSwayam3) April 28, 2023 #PonniyinSelvan2 ~ #PS2 is as good as PS1 with an Impressive 2nd half. The big highlight scene of Vikram - Aishwarya is emotionally good. A proper conclusion. (3.5☆/5) pic.twitter.com/olOK1UTLAW — Prince Prithvi (@PrincePrithvi) April 28, 2023 முதல் பகுதி அப்படியே போர் அடிக்காம மெதுவா போகுது இன்டர்வெல் Goosebump மொமண்ட் இரண்டாம் பகுதி தெறிக்க விடுது செம்மையா இருக்கு படத்தின் மேல வச்ச நம்பிக்கைய காப்பற்றி விட்டது 🔥🔥🔥 தமிழ் சினிமாவில் பெருமை #PonniyinSelvan #PonniyinSelvanFDFS — S.NIRMAL KUMAR (@Nirmal_twitt) September 30, 2022 -
Ponniyin Selvan 2: ఆ ముసలావిడ ఎవరు? కుందవై ఏం చేసింది?
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ మూవీ మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఆదరించపోయినా.. తమిళంలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం రెండో భాగం రేపు (ఏప్రిల్ 28)న విడుదల కాబోతుంది. మొదటి భాగంలో మిగిలిపోయిన అనేక సందేహాలకు ఈ చిత్రంలో సమధానాలు దొరకనున్నాయి. అసలు పార్ట్ 1లో చెప్పిన స్టోరీ ఏంటి? పార్ట్ 2లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించబోతున్నాయి? నందిని ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఆదిత్య కరికాలుడు(విక్రమ్) ప్రేమించిన యువతి నందిని(ఐశ్వర్యరాయ్)ని పెద్ద పళవేట్టురాయల్ పెళ్లి చేసుకున్నట్లు పార్ట్ 1లో చూపించారు. ఆమె అనాథ అయిన కారణంగా ఆదిత్య చెల్లి కుందవై(త్రిష) నందినిని తన సోదరుడుకి దక్కకుండా చేస్తుంది. ఒకవైపు యుద్దం చేస్తునే.. మరోవైపు నందిని కోసం వెతుకుతాడు కరికాలుడు. అప్పటికే పాండ్యరాజు నందినిని కూతురిలా పెంచుకుంటాడు. వీరిని కరికాలుడు చూస్తాడు. పాండ్యరాజును హత్య చేయ్యొద్దని వేడుకున్నా.. కరికాలుడు అతడిని చంపేస్తాడు. ఆ కోపంతో నందిని చోళ రాజ్య కోశాధికారి పళవేట్టు రాయర్ని పెళ్లి చేసుకొని తంజావురుకు వచ్చినట్లు పార్ట్ 1లో చూపించారు. అసలు నందిని నేపథ్యం ఏంటి? పాండ్య రాజుని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది? పెద్ద పళవేట్టురాయర్‌తో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది? లంకలో ఉన్న అరుణ్మొళిని చంపాలని ఎందుకు కుట్ర చేస్తుంది? అనేది రెండో భాగంలో తెలియనుంది చోళరాజులపై పెద్ద పళవేట్టురాయర్‌కు ఎందుకు కోపం? కోశాధికారిగా ఉన్న పెద్ద పళవేట్టురాయర్(శరత్ కుమార్).. రాజ్య చక్రవర్తి సుందరచోళుడి(ప్రకాశ్ రాజ్) అన్న కొడుకు మధురాంతకుడి(రెహమాన్)కి ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఒకవైపు కోశాధికారిగా ఉంటూనే... లోలోపల సామంత రాజులను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? వయసులో తనకంటే చాలా చిన్నదైన నందినిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సుందర చోళుడిపై ఎందుకు కోపం? మధురాంతకుడి కోరిక నెరవేరేనా? చోళ సామ్రాజ్యానికి ఎలాగైనా తానే అధిపతి కావాలని ఆశపడుతున్నాడు మధురాంతకుడు. తల్లి వద్దని చెప్పిన వారించినా.. వినకుండా కోశాధికారి పెద్ద పళవేట్టురాయర్‌తో చేతులు కలిపాడు. సామంత రాజులతో సమావేశమై పన్నాగాలు పన్నుతుంటాడు. మరి ఆయన ప్రయత్నాలు ఫలించాయా? చోళ రాజ్యానికి రాజు అయ్యాడా? లేదా బాబాయ్ కొడుకుల చేతిలో బలైపోయాడా? అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. రాజ్యాన్ని కాపాడడానికి కుందవై ఏం చేసింది? చోళ రాజ్యానికి ఆపద ఉందని తెలుసుకున్న రాజకుమారి కుందవై(త్రిష).. తన రాజకీయ చతురతతో సామాంతుల రాజులను కలిసి .. వారి కుమార్తెలను తన సోదరులకి ఇచ్చి వివాహం చేస్తానని చెబుతుంది. దాంతో సామంత రాజుల మధ్య విభేదాలు వస్తాయి. మరి నిజంగానే వారి కుమార్తెలను తన సోదరులకు ఇచ్చి పెళ్లి చేసిందా? పెద్ద పళవేట్టురాయర్ కుట్రలను తన తెలివి తేటలతో ఎలా తిప్పికొట్టింది? ఆ ముసలావిడా ఎవరు? పొన్నియన్ సెల్వన్ క్లైమాక్స్.. అరుణ్మొళి సముద్రంలో పడిపోయినప్పుడు ఒక ముసలావిడ కాపాడానికి వస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సముద్రంలో దూకేస్తుంది. అసలు ఆ ముసలావిడా ఎవరు? అరుణ్మొళిని కాపాడాల్సిన అవసరం ఆమెకేంటి? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రేమించిన నందినిని కరికాలుడు చంపేస్తాడా? తన సోదరుడు అరుణ్మొళి చావుకు నందినినే కారణమని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడు.. కోపంతో ఆమెను చంపడానికి తంజావురు వస్తాడు. మరి నిజంగానే నందినిని కరికాలుడు చంపేశాడా? లేదా ఆమె చేతిలోనే బలైపోయాడా? అనేది రెండో భాగంలో తెలియనుంది. -
రొంబ సూపర్ ఇంటర్వ్యూ విత్ కార్తీ అండ్ విక్రమ్!
-
వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకునే వారు. బాహుబలి దెబ్బతో హిందీ ఇండస్ట్రీ వెనకపడి పోయింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ..చిన్న ఇండస్ట్రీ అయినా కన్నడ పరిశ్రమ నుండి కెజియఫ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. పఠాన్‌తో హిందీ పరిశ్రమ కూడా కోలుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. (చదవండి: మైసూర్ నవాబ్ మనవరాలిని సజీవసమాధి చేసిన భర్త.. 30 ఏళ్లుగా..) ఇలా అన్ని అన్ని వుడ్‌లలో భారీ హిట్లు నమోదు అవుతున్నాయి. మరి కోలీవుడ్ ఇండస్ట్రీ సంగతి ఎంటీ? వెయ్యి కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు? విక్రమ్ ,పొన్నియిన్ సెల్వన్ లాంటి మూవీస్ కోలీవుడ్‌లోనే భారీ వసూళ్లు రాబట్టాయి. తర్వాత ఇతర భాషల్లో విజయం సాధించిన కూడా అనుకున్నంత వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయాయి. మరి ఆ లోటు తీర్చే సినిమాలు కోలీవుడ్ నుండి ఎప్పుడు వస్తాయి? (చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్..కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు) పొన్నియిన్‌సెల్వన్ సినిమా ఐదు వందల కోట్లు కొల్లగొట్టింది. రెండో బాగం మీద అన్ని భాషల్లో బజ్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్టే మూవీ టీం కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అనే చర్చలు నడుస్తున్నాయి. ఏప్రిల్ 28 న మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక శివ దర్శకత్వంలో సూర్య హీరోగా కంగువ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్లో ఈ పిరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా తీసుకురావాలి అనుకుంటున్నారట మేకర్స్. కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ మూవీ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. మరి ఫ్యూచర్లో తమిళ్ పరిశ్రమనుంచి..రాబోతున్న భారీ హిట్ సినిమా ఏది? పాన్ ఇండియా విజయం సాధించి వెయ్యి కోట్లు కొల్లగొట్టే మూవీ ఏదో తెలుగుసుకోవాలి అంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. -
మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్.. కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు
దిగ్గజ దర్శకుడు మణితర్నం అంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎంత గౌరవమో అందరికి తెలిసిందే. అతన్ని తన గురువులా భావిస్తుంది. ఐశ్వర్యను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది మణిరత్నమే. 1997లో ఇరువన్(తెలుగులో ఇద్దరు) చిత్రంతో ఐశ్వర్య ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మణిరత్నం, ఐష్ కాంబోలో గురు, రావణ్, పొన్నియన్ సెల్వన్ 1 లాంటి చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2(పీఎస్ 2) విడుదలకు సిద్దం కాబోతుంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ముంబైలో కూడా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అరుదైన సంఘటన జరిగింది. తన గురువులా భావించే మణిరత్నం కాళ్లకు నమస్కరించింది ఐశ్వర్య రాయ్. ప్రమోషన్ ఈవెంట్లో మణిరత్నం మాట్లాడుతూ... పొన్నియన్ సెల్వన్‌లో ‘నందిని’పాత్రకు ఐశ్వర్య అయితేనే న్యాయం చేస్తుందనిపించింది. ఆమెను అడిగిన వెంటనే ఓకే చెప్పింది’అని చెబుతుండగా.. ఐశ్వర్య ఎమోషనల్ అయింది. వెంటనే స్టేజ్‌పై నుంచి లేచి అందరి ముందు మణిరత్నం కాళ్లుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.