
తమిళనాడులోని మదురై జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అభిమానం చూపడంలో, ఆవేశ పడడంలోనూ అక్కడి ప్రజల తరువాతే ఎవరైనా. సినిమాలను ఆదరించడంలోనూ ముందుంటారు. ఇక అసలు విషయానికి వస్తే దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, ప్రభు వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని, రవివర్మన్ చాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
కాగా రెండో భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. చిత్ర ప్రచారంలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. అదే విధంగా మదురైలోనూ వాల్‌పోస్టర్లను అంటించారు. అయితే అక్కడ ప్రత్యేక వాల్‌పోస్టర్లు వెలిశాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్రను పోషించిన ఐశ్వర్యరాయ్ ఫొటోలతో పోస్టర్లను ముద్రించి అందులో అక్కా, పాండియన్ల నమ్మకమే. పాండియన్ల చివరి ఆయుధమే అంటూ పొందుపరిచి పాండియన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment