మళ్లీ ఒక రౌండ్‌ కొడుతున్న త్రిష... | Trisha Krishnan Get Again Big Movie Chances | Sakshi
Sakshi News home page

Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్‌ కొడుతున్న త్రిష...

Published Fri, Jul 7 2023 6:46 AM | Last Updated on Fri, Jul 7 2023 6:47 AM

Trisha Krishnan Get Again Big Movie Chances - Sakshi

సౌత్‌ ఇండియా సినీ పరిశ్రమలో లక్కీ హీరోయిన్‌ ఎవరంటే మొదటగా త్రిష పేరునే చెప్పాలి. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నా, నటిగా మాత్రం ఈమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. అపజయాలతో సతమతమవుతున్నప్పుడల్లా ఒక మంచి విజయం వచ్చి ఈమెను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్తోంది. ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. అంతకుముందు వరుసగా ప్లాపులు వెంటాడుతున్న త్రిషకు.. ఈ చిత్రంతో ఒక్కసారిగా మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ దక్షిణాది చిత్రాలలో ఒక రౌండ్‌ కొడుతోంది.

(ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?)

ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సరసన లియో చిత్రంలో నటిస్తున్న త్రిష త్వరలో ప్రారంభం కానున్న అజిత్‌ చిత్రంలోనూ ఈమెనే నాయకి అనే ప్రచారం జరుగుతుంది. కాగా తెలుగులో చాలా గ్యాప్‌ తర్వాత మరోసారి చిరంజీవితో జతకట్టే అవకాశం త్రిషను వరించింది. అదేవిధంగా మలయాళంలోను మరో అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. త్రిష చాలా కాలం క్రితం హే జూడ్‌ అనే మలయాళ చిత్రంలో నటించింది.

(ఇదీ చదవండి: స్టార్‌ హీరో తనయుడి వేధింపులు? స్పందించిన బేబమ్మ)

ఆ తర్వాత మోహన్‌ లాల్‌కు జంటగా రామ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభమై మూడేళ్లు గడిచిన ఇంకా పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషను తాజాగా మరో అవకాశం వరించిందని సమాచారం. ఈమెను నటుడు టోవినో థామస్‌ సరసన నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement