Rajinikanth Film Is 2023 Highest Tamil Grosser in Kollywood - Sakshi
Sakshi News home page

Rajinikanth Jailor: తగ్గేదేలే అంటున్న రజినీకాంత్.. ఆ లిస్ట్‌లో మూడోస్థానం!

Aug 15 2023 3:08 PM | Updated on Aug 15 2023 5:21 PM

Rajinikanth film is 2023 highest Tamil grosser In Kollywood - Sakshi

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు వసూళ్లు సాధించి ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని సినీ ట్రేడ్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. 

 ఈ రికార్డ్ స్థాయిలో వసూళ్లతో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రాన్ని అధిగమించింది. పొన్నియన్ సెల్వన్-2 బాక్సాఫీస్ వద్ద రూ.345 కోట్లు వసూళ్లు చేయగా.. తాజాగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. పొన్నియిన్ సెల్వన్ -2లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్,  త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. 

 అత్యధిక వసూళ్లలో మూడోస్థానం

 ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా జైలర్ నిలిచింది. ఆ లిస్ట్‌లో షారుఖ్ ఖాన్ పఠాన్, ప్రభాస్ ఆదిపురుష్ మొదటి రెండు స్థానాల్లో  ఉన్నాయి.  జైలర్ తమిళ వెర్షన్ ఇప్పటికే రూ. 139 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రూ.400 కోట్లే లక్ష్యంగా జైలర్ దూసుకెళ్తోంది.  కాగా.. జైలర్‌లో మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్,  రమ్య కృష్ణన్, వినాయకన్, శివరాజ్‌కుమార్, సునీల్, నాగేంద్ర బాబు కీలకపాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement