
భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు.
(ఇది చదవండి: లైకా ఖాతాలో.. అరుణ్ విజయ్ చిత్రం)
చెన్నైలో లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఆస్తులపై ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రొడక్షన్ హౌస్‌లో అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై లైకా ప్రతినిధులు ఎలాంటి అధికారికి ప్రకటన చేయలేదు. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(ఇది చదవండి: ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్)
తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థగా పేరుంది. రజినీకాంత్ రోబో'2.0', మణిరత్నం'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2'తో సహా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. గతంలో రజనీకాంత్ 'దర్బార్' చిత్రాన్ని కూాడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయనతో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. హిందీలో జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' (2022), అక్షయ్ కుమార్ యొక్క 'రామ్ సేతు' (2022) చిత్రాలను నిర్మించింది. కాగా.. ఇటీవలే టాలీవుడ్‌లోనూ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ED conducts raids at LYCA Productions in Chennai. More details awaited: Sources pic.twitter.com/lZOX7pE9ks
— ANI (@ANI) May 16, 2023