దక్షిణాది సినిమాలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని జపాన్ దేశ ప్రజలు విశేషంగా ఆదరించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు పంటి ప్రముఖ తారాగణం నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సూపర్ హిట్ అయ్యింది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ గత నెల 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
ఇది చారిత్రక కథ కావడంతో కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నా, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కాగా నటుడు కార్తీకి జపాన్‌లో కూడా అభిమానులు ఉండటం విశేషం. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో వాందియదేవన్‌గా నటించిన కార్తీ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన కార్తీ అభిమానులు పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రాన్ని తమిళనాడులో చూడాలన్న ఆసక్తితో చైన్నెకి రావడం విశేషం.
వారు ఈ చిత్రాన్ని ఏకంగా నాలుగు సార్లు చూశారట. ఈ విషయం తెలుసుకున్న నటుడు కార్తీ సర్ ప్రైజ్ చేసే విధంగా వారిని తన ఇంటికి రప్పించుకుని ముచ్చటించారు. ఈ సందర్భంగా జపాన్ అభిమానులు కార్తీ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన బహుమతులను ఆయనకు అందించారు. కార్తీ వారితో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
#PonniyinSelvan | After #Rajini it's for #Karthi !!
— Ramesh Bala (@rameshlaus) May 1, 2023
Karthi fans from Japan came to Chennai, to watch #PonniyinSelvan2 with Tamil audience.
Apparently, they watched movie for about 4 times and also happened to meet actor Karthi at his residence pic.twitter.com/JUj9rhwmyh
చదవండి: ఇళయరాజా కుటుంబంలో విషాదం
Comments
Please login to add a commentAdd a comment