Ponniyin Selvan 2 Singer Rakshita Suresh Met with Major Accident- Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సింగర్‌కు గాయాలు.. పరిస్థితి దారుణంగా ఉండేదంటూ పోస్ట్‌

Published Sun, May 7 2023 5:46 PM | Last Updated on Sun, May 7 2023 6:07 PM

Singer Rakshita Suresh Met with Major Accident - Sakshi

ప్రముఖ సింగర్‌ రక్షిత సురేశ్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. మలేషియాలో ఆదివారం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టి పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆమె చిన్నపాటి గాయాలతో తప్పించుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈరోజు పెద్ద ప్రమాదమే జరిగింది. ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తుండగా నేను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టి, ఆ భాగమంతా నుజ్జునుజ్జయింది. ఆ 10 సెకన్లలో నా జీవితమంతా కళ్ల ముందు మెదిలింది.

ఎయిర్‌ బ్యాగ్స్‌ నా ప్రాణాలు కాపాడాయి. అవి లేకపోయుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. డ్రైవర్‌, నేను, మరో ప్యాసింజర్‌ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. ఏదైతేనేం, చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డందుకు మేము చాలా అదృష్టవంతులం' అని రాసుకొచ్చింది.

కాగా రక్షిత సురేశ్‌.. రిథమ్‌ తధిమ్‌, లిటిల​ స్టార్‌ సింగర్‌ 2009 విజేతగా అవతరించింది. సూపర్‌ సింగర్‌ 6లోనూ పాల్గొన్న ఆమె ఈ షోలో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. తమిళంలో పలు పాటలు ఆలపించిన ఆమె తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ గాయనిగా సత్తా చాటింది. ఇటీవల వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ 2 కన్నడ వర్షన్‌లోనూ పలు పాటలు పాడింది.

చదవండి: వివాదాల మధ్య దూసుకుపోతున్న ది కేరళ స్టోరీ
కీర్తి సురేశ్‌కు ఏమైంది? ఇలా మారిపోయింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement