Ponniyin Selvan 2 Movie Collects 100 Crore Rupees In Just Two Days, Deets Inside - Sakshi
Sakshi News home page

Ponniyin Selvan-2 Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న పీఎస్-2.. రెండు రోజుల్లో వందకోట్లు!

Published Sun, Apr 30 2023 5:58 PM | Last Updated on Sun, Apr 30 2023 6:30 PM

Ponniyin Selvan-2 Collects 100 Crore Rupees In Just Two days - Sakshi

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. 

(ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్‌ లాంఛ్‌)

పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది.   

(ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్‌ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!)

కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1  పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్‌ కుమార్, ప్రకాష్‌ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement