Is Ponniyin Selvan 2 And Kanguva Movies Going To Hit 1000 Crores Milestone In Collections - Sakshi
Sakshi News home page

Kollywood: వెయ్యి కోట్లు నమోదు చేసే సినిమా ఏదీ?

Apr 26 2023 2:18 PM | Updated on Apr 26 2023 3:25 PM

Kollywood Hopes On PS2, Kanguva Movies To Hit The 1000 Crore Milestone - Sakshi

ఒకప్పుడు బాలీవుడ్‌ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకునే వారు. బాహుబలి దెబ్బతో హిందీ ఇండస్ట్రీ వెనకపడి పోయింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ..చిన్న ఇండస్ట్రీ అయినా కన్నడ పరిశ్రమ నుండి కెజియఫ్‌ వచ్చింది. బాలీవుడ్‌లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. పఠాన్‌తో హిందీ పరిశ్రమ కూడా కోలుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 

(చదవండి: మైసూర్‌ నవాబ్‌ మనవరాలిని సజీవసమాధి చేసిన భర్త.. 30 ఏళ్లుగా..)

ఇలా అన్ని అన్ని వుడ్‌లలో భారీ హిట్లు నమోదు అవుతున్నాయి. మరి కోలీవుడ్‌ ఇండస్ట్రీ సంగతి ఎంటీ? వెయ్యి కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?  విక్రమ్‌ ,పొన్నియిన్‌ సెల్వన్‌ లాంటి మూవీస్‌ కోలీవుడ్‌లోనే భారీ వసూళ్లు రాబట్టాయి. తర్వాత ఇతర భాషల్లో విజయం సాధించిన కూడా అనుకున్నంత వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయాయి. మరి ఆ లోటు తీర్చే సినిమాలు కోలీవుడ్‌ నుండి ఎప్పుడు వస్తాయి?

(చదవండి: మణిరత్నం మాటలకు ఐశ్వర్య ఎమోషనల్‌..కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు)

పొన్నియిన్‌సెల్వన్ సినిమా ఐదు వందల కోట్లు కొల్లగొట్టింది. రెండో బాగం మీద అన్ని భాషల్లో బజ్‌ క్రియేట్‌ అయింది. అందుకు తగ్గట్టే  మూవీ టీం కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్‌ రాబడుతుందా లేదా అనే చర్చలు నడుస్తున్నాయి. ఏప్రిల్‌ 28 న మూవీ రిలీజ్ కాబోతుంది.

ఇక శివ దర్శకత్వంలో సూర్య హీరోగా కంగువ మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్‌లో ఈ పిరియాడిక్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా తీసుకురావాలి అనుకుంటున్నారట మేకర్స్. కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ మూవీ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. మరి ఫ్యూచర్‌లో తమిళ్‌ పరిశ్రమనుంచి..రాబోతున్న భారీ హిట్‌ సినిమా ఏది? పాన్‌ ఇండియా విజయం సాధించి వెయ్యి కోట్లు కొల్లగొట్టే మూవీ ఏదో  తెలుగుసుకోవాలి అంటే కొద్ది రోజులు  ఎదురు చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement