కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ' | 'I' hits the bull's eye, collects over Rs.100 crore | Sakshi
Sakshi News home page

కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ'

Published Tue, Jan 20 2015 1:25 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ'

కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ'

చెన్నై: సృజనాత్మక దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఐ' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తొలుత మిశ్రమ రివ్యూలకే పరిమితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా  గత వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఐ మూవీ తమిళనాట కాకుండా బయటకూడా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ చిత్రం కేరళలో కలెక్షన్లలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకూ కేరళ రాష్ట్రంలో ఏ తమిళ చిత్రం కూడా నెలకొల్పని కలెక్షన్ల రికార్డులను ఐ మూవీ సొంతం చేసుకుంది.
 

తెలుగులోకి అనువాదమైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రోజే రూ. 9 కోట్లను వసూలు చేయగా,  హిందీలో రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ అన్ లిస్ట్ త్రినాథ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement