
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్‌యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.
2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment