‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్‌గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.
తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి.
ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్‌ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు.
Comments
Please login to add a commentAdd a comment