టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్ తన కెరీర్ గురించి మాట్లాడారు. కొందరిని నమ్మి తాను కూడా మోసపోయానని వెల్లడించారు. తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. మన జీవితంలో చాలామందిని నమ్ముతామని.. కానీ ఏదో ఒక సమయంలో మోసపోతామని తెలిపారు. నా జీవితంలో కూడా అలాంటి అనుభవం ఎదురైందని అన్నారు. చాలావరకు డబ్బులు పోగొట్టుకున్నానని తమన్ వెల్లడించారు.
తమన్ మాట్లాడుతూ.. ' నా కెరీర్ నాకు జీవిత పాఠాలు చాలా నేర్పింది. కొందరిని నమ్మి చాలా డబ్బులు కూజా పొగొట్టుకున్నా. నేను నమ్మడం వల్లే నన్ను మోసం చేశారు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పనిలో ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే గ్రౌండ్‌లోకి అడుగుపెడతా. మాకంటూ ఒక స్పెషల్ టీమ్ ఉండాలని భావించేవాడిని. స్టార్ క్రికెటర్లు ఆడిన మైదానంలో ఆడాలనేది నా కోరిక. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగం కావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌కు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment