
సౌత్ ఇండియాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్ తెలుగు ఐడల్ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలు ఎక్కడా చర్చించని తమన్. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్)
తాజాగా వర్దిని ఓ ఇంటర్వ్యూలో తమన్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. 'ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్ గురించి చర్చ రాదు. ఆయన కూడా ఆలోచించడు. తమన్ ఇంటర్వ్యూలు నేనూ చూస్తాను.. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవను.. ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల వాటిని చదివితే ఒక భార్యగా బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్ ఆఫ్ అవుతాను కూడా.. అందువల్ల వాటిపై మా ఇంట్లో నో కామెంట్ అని అనుకుంటాం. తమన్‌ను అభిమానించే వారందరికి థ్యాంక్స్' అంటూ ఎమోషనల్ అయింది. తెలుగులో 'స్వరాభిషేకం' షో వల్ల సింగర్‌గా వర్దిని చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది.
(ఇదీ చదవండి: అన్నా.. నేను అలాంటి దాన్ని కాదు: అనుపమ)
Comments
Please login to add a commentAdd a comment