పది రోజులతో ఆట పూర్తి | Director Shankar shares update about Ram Charan Game Changer | Sakshi
Sakshi News home page

పది రోజులతో ఆట పూర్తి

Published Fri, Jun 28 2024 12:16 AM | Last Updated on Fri, Jun 28 2024 12:16 AM

Director Shankar shares update about Ram Charan Game Changer

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్‌ చేంజర్‌’లో జోడీగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు శంకర్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ మాట్లాడుతూ– ‘‘గేమ్‌ చేంజర్‌’ చిత్రీకరణ క్లైమాక్స్‌కు చేరుకుంది.

కేవలం పది రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ (కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 12న రిలీజ్‌ కానుంది) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదలయిన తర్వాత ‘గేమ్‌ చేంజర్‌’ షూటింగ్‌ పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్‌ ఫుటేజ్‌ చూసి పో స్ట్‌ప్రోడక్షన్‌ పనులు మొదలుపెడతాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. శ్రీకాంత్, సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి, ఎస్‌జె సూర్య, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గేమ్‌ చేంజర్‌’ రాజకీయ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement