
'గేమ్ ఛేంజర్' ఈ సంక్రాంతి బరిలో దిగి దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో రామ్ చరణ్ ( Ram Charan) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. శంకర్ దర్శకత్వం, దిల్ రాజు నిర్మాత కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, కథలో సరైన బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం, డాకూమహారాజ్ వంటి సినిమాల పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తే.. గేమ్ ఛేంజర్ అక్కడ(Game Changer) కూడా ఫెయిల్యూర్ అయిపోయింది.
ఇప్పటికే ఆడియో డిజాస్టర్‌కు కారణం సంగీత దర్శకుడు తమన్ (Thaman S) ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'గేమ్ ఛేంజర్‌లో సరైన హుక్ స్టెప్ లేదు. అందుకే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ రాలేదు. గతంలో నేను మ్యూజిక్ ఇచ్చిన 'అల వైకుంఠపురములో' పాటల్లో ప్రతిదానిలో హుక్ స్టెప్ ఉండటం వల్ల అక్కడ క్లిక్ అయిందని చెప్పాడు. ఇప్పుడు జరగండి జరగండి సాంగ్ స్టెప్స్ గురించి వైరల్ కామెంట్లు చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

గేమ్ ఛేంజర్ స్టెప్స్ కంటే వెయ్యి రెట్లు బెటర్
ఆహా తెలుగు వేదికగా జరుగుతున్న డ్యాన్స్ ఐకాన్ 2లో తాజాగా సంగీత దర్శకుడు తమన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ చేస్తున్న డ్యాన్స్‌కు ఆయన ఫిదా అయ్యారు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్‌లోని 'జరగండి జరగండి' సాంగ్‌కు ఒక చిన్నారి వేసిన స్టెప్పులపై తమన్ ఇలా కామెంట్ చేశారు. సినిమాలో ఉన్న స్టెప్స్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వేశావ్.. చాలా గ్రేట్, అవకాశం ఉంటే సినిమాలో ఈ స్టెప్స్ యాడ్ చేయమని కోరుతాను.' అని అన్నారు. అయితే, ఈ ప్రోగ్రామ్ పూర్తి ఎపిసోడ్ ఆహాలో మార్చి 21న సాయింత్రం 7గంటలకు స్ట్రీమింగ్‌కు వస్తుంది. ఆయన ఇంకా ఏమన్నారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

నువ్వు ఇప్పుడు నందమూరి తమన్ కదా అంటూ..
తమన్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇదే పాటను మెచ్చుకుంటూ పలు వేదకలపై ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. ప్రభుదేవా సరైనా కొరియోగ్రఫీ ఇవ్వలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు ఇప్పుడు నందమూరి తమన్ కదా..! అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్' అని సెటైర్స్ వేస్తున్నారు. మరికొందరైతే నీకు దెబ్బలు పడుతాయ్ అంటూ పుష్ప2 సాంగ్ లిరిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో కంటే నిజంగానే ఈ చిన్నారి బాగా డ్యాన్స్ చేసిందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన మరిచిపోయిన గేమ్‌ఛేంజర్ గాయాన్ని పలు వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్‌కు తమన్ గుర్తుచేస్తున్నారు.
#GameChanger @MusicThaman కామెంట్స్ pic.twitter.com/bYMB5LvhYY
— devipriya (@sairaaj44) March 19, 2025
Comments
Please login to add a commentAdd a comment