ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
చదవండి: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత
గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిపోయిందని, ఇప్పుడు తన ఫోకస్ ఇండియన్-2 సినిమాకు షిఫ్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా ఆయన రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్, కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్-2 విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఇండియన్-2పై ఫోకస్ పెట్టనున్నారు శంకర్. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్
Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet
— Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023
Comments
Please login to add a commentAdd a comment