I Movie
-
'మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాదు'.. విక్రమ్‌కు వార్నింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్రమ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ కోసం బరువు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 86 కిలోల నుంచి ఏకంగా 52 కేజీలకు తగ్గానని తెలిపారు. అయితే తన శారీరక మార్పులతో తీవ్రమైన సమస్య నుంచి బయటపడ్డానని వివరించారు. 50 కంటే బరువు తగ్గితే మీ శరీరంలో అవయవాలు పనిచేయవని డాక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే.. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం కాదంటూ వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కాశీ అనే మూవీలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించానని తెలిపారు. ఆ చిత్రంలో నటించాక దాదాపు మూడు నెలలపాటు సరిగా చూడలేకపోయానని విక్రమ్ వెల్లడించారు. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేదని.. ఆ ఎఫెక్ట్ నా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. దీంతో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో పాత్రల కోసం తన ప్రాణాలనే రిస్క్‌లో పెడుతున్న విక్రమ్‌ను చూస్తుంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఇటీవల విడుదలైన 'తంగలాన్' కోసం కొంత బరువు తగ్గడంతో పాటు సగం తల గుండు చేయించుకున్నాడు. -
'ఐ' సినిమా హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?
అమీ జాక్సన్.. విక్రమ్ 'ఐ', రామ్ చరణ్ 'ఎవడు', 'రోబో 2.0' సినిమాలతో తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్‌మేన్ జార్జ్‌ను ప్రేమించిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే ముగిసిపోయింది. గతేడాది నుంచి ఎడ్ వెస్ట్విక్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ మిషన్ చాప్టర్ 1: అచ్చమ్ ఎంబతు ఇల్లయే అనే తమిళ సినిమా చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అమీ జాక్సన్ ఈ మధ్య గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. తను అమీ జాక్సన్‌లానే లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన హాలీవుడ్ మూవీ ఓపెన్హైమర్లోని నటుడు సిలియన్ మర్ఫీలా ఉందంటున్నారు. అమీ.. ఏదైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే ఏదైనా సర్జరీ చేయించుకుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఐ సినిమాలో విక్రమ్ తనను మోసం చేసిన అందరి మీదా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఇన్నాళ్లకు హీరోయిన్‌పై రివేంజ్ తీర్చుకున్నాడంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అమీ జాక్సన్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలోనే తన లుక్ బాగుందని, ఇప్పుడస్సలు బాగోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) చదవండి: డీజే టిల్లు హీరోయిన్‌తో డైరెక్టర్ గొడవ.. మూడు నెలలు మాట్లాడుకోలేదు! -
వీళ్లకు క్యారెక్టర్ ఉంది
ఒక్కర్నీ గుర్తుపట్టలేం!అందుకేనేమో అంత గుర్తింపు వచ్చింది.మేకప్ మేకోవర్..!ఇదో పెద్ద గేమ్. మనకు మన హీరో కనపడడు. రాసినవాళ్ల క్యారెక్టర్ కనబడుతుంది. మనల్ని మైమరిపించడానికిఈ గోల్డెన్ పాత్రలు సిల్వర్పూతలు పూయించుకుంటాయి. అదేనండీ.. సిల్వర్‌స్క్రీన్ పూతలు.మేకప్మేన్లు, టెక్నీషియన్లు..సైంటిస్టులు.. వీళ్లందరి ‘కళ’పూతమనకు అతుక్కుంటుంది.. మరచిపోలేని క్యారెక్టర్‌తో!! సాఫ్ట్‌గా కనిపించే కుర్రాడు... వైల్డ్‌గా మారిపోయాడు! తెల్లని మేని ఛాయతో తళుకులీనే భామ నీలంలో నిగనిగలాడింది! నెత్తిన కొమ్ములొచ్చిన వ్యక్తి ఒకరైతే... ఒళ్లంతా దద్దుర్లతో ఇంకొకరు.. అంతా మాయ... మేకప్ మాయ... బఫూన్ విలన్ చాక్లెట్ బాయ్ అని కొంతమంది కుర్రాళ్లను అంటుంటారు. అంటే ఏంటి? ఎప్పుడూ చేతిలో చాక్లెట్ ఉంటుందనా? ఊహూ.. ‘చాలా హ్యాండ్సమ్’గా ఉండేవాళ్లను అలా అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ యంగ్ స్టార్స్‌లో ‘బిల్ స్కార్స్‌గార్డ్’ అలాంటివాడే. ఎవరైనా ఇతన్ని హీరోగానే ఊహించుకోవాలే తప్ప ‘బఫూన్’లా ఊహించుకోవడం కష్టం. కానీ ఈ చాక్లెట్ బాయ్ గతేడాది రిలీజైన ‘ఇట్’ సినిమాలో ‘పెన్నీవైస్ ది డ్యాన్సింగ్ క్లౌన్’ క్యారెక్టర్ చేశాడు. బఫూన్లా కనిపించే విలన్ అన్నమాట. ఈ క్యారెక్టర్లోకి మారడం కోసం కేజీల కేజీల ఫౌండేషన్ పూసుకోవాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలు మేకప్‌కి పట్టేది. బుగ్గలకు ఎర్ర చార గీతలు, సాగిపోయిన పెదాలు, రంగు మారిన పళ్లు, నీరు లేక ఎండిపోయిన భూమిలా నుదురు మీద పగుళ్లు... స్కార్స్ భయంకరంగా మారిపోయాడు. సినిమాలో బాగా భయపెట్టాడు. తనకు ఈ మేకప్ ఎక్స్పీరియన్స్ ఓ భయంకరమైన అనుభవం అంటాడు స్కార్స్. కానీ ఈ అనుభవం బాగుందని కూడా అంటాడు. ఒళ్లంతా పెయింట్‌తో... హాలీవుడ్ హాట్ బ్యూటీ జెన్నీఫర్ లారెన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసిన సినిమా ‘ఎక్స్–మెన్: ఫస్ట్ క్లాస్’. రాబోయే కాలంలో ఎలాంటి శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లుతుందో ముందే గ్రహించి, తొమ్మిది శక్తుల గల వ్యక్తులతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తుని ఎలా రూపకల్పన చేస్తారు? అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. ఆ తొమ్మిది శక్తుల్లో మిస్టిక్ ఒకటి. అది జెన్నీఫర్ చేశారు. పసుపు రంగు కళ్లు, కొబ్బరి పీచుని తలపించే జుత్తు, నీలం రంగు ఒళ్లు.. మిస్టిక్‌గా మారడానికి జెన్నీఫర్కి 8 గంటలు పట్టింది. ఒళ్లంతా బ్లూ కలర్ పెయింట్ చేయించుకున్నారు. మేకప్ తీసేశాక ఒంటి మీద వచ్చిన ‘ర్యాషెస్’ ఈ సినిమా మిగిల్చిన తీయని గుర్తు అంటారు జెన్నీఫర్. అయితే ఇదే సినిమా సిరీస్‌లో వచ్చిన తదుపరి చిత్రాలు ‘ఎక్స్–మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’, ‘ఎక్స్–మెన్: అపోకలిప్స్’లకు మాత్రం ఆమె అంతలా కష్టపడలేదు. అప్పటికి బ్లూ కలర్ బాడీ సూట్ రావడంతో పెయింటింగ్ చేయించుకునే బాధ తప్పింది. ‘బతికిపోయాను రా బాబూ’ అని జెన్నీఫర్ అనుకునే ఉంటారు. బ్లూ టు గ్రీన్ గమోరా.. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’లో జోయీ సాల్డానా చేసిన పాత్ర ఇది. ఈ పాత్ర కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్, పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ వాడదాం అనుకున్న దర్శక–నిర్మాతలతో ‘నో ప్రాబ్లమ్.. మేకప్‌కే వెళ్దాం’ అని అభయమిచ్చారట. ఒంటి నిండా గ్రీన్ కలర్ పూసుకున్నారామె. విశేషం ఏంటంటే గ్రీన్ కలర్ కంటే లోపల మరో రెండు మూడు లేయర్స్ మేకప్ ఉండేదట. శరీరం మొత్తం పచ్చగా మారటానికి సుమారు మూడు గంటలకు పైనే పట్టేదట. బుగ్గలు ఉబ్బెత్తుగా, నుదురు కొంచెం పెద్దదిగా కనిపించడం కోసం సిలికాన్ ప్రోస్థెటిక్స్ వాడారు. అయినా ఇలా రంగుల్లో మునిగిపోవడం జోయీకి కొత్తేం కాదు. ఆల్రెడీ ‘అవతార్’లో నీలంగా నెయిత్రీలా మారిపోయిన విషయం తెలిసిందే. అరగుండు అయినా ఓకే.. నెబూలా పైశాచికత్వానికి కేరాఫ్ అడ్రస్. అసూయ, ద్వేషం, పగ... వీటిని, నెబూలాని వేరు చేసి చూడలేం. అందుకే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సినిమాలో నెబూలా క్యారెక్టర్ని చాలెంజ్‌గా తీసుకున్నారు కరేన్ గిల్లన్. ఈ పాత్ర కోసం పొడవాటి తన జుట్టుని త్యాగం చేశారు. పోతే పోయింది.. పాత్రకన్నా ఎక్కువా? అనుకున్నారు. ఈ క్యారెక్టర్ కోసం కళ్లకు 22 మిల్లీమీటర్ కాంటాక్ట్ లెన్సులు వాడారు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ పార్ట్ 2 మాత్రం కరేన్కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. టెక్నాలజీ త్వరగా డెవలప్ అవుతోంది కాబట్టి.. మేకప్‌కి 2 గంటలు కేటాయిస్తే సరిపోయింది. ఫస్ట్ పార్ట్‌కి గుండు చేయించుకున్న కరేన్ సెకండ్ పార్ట్‌కి అర గుండు చేయించుకున్నారు. సూట్ అంత సులువుగా రాదు బ్లాక్ పాంథర్ కామిక్స్ పరిచయం లేని వాళ్లు ఎవరైనా సడెన్‌గా ఎరిక్ కిల్మాంగర్ పాత్రను చూస్తే గగుర్పాటుకు గురి కావొచ్చు. ఒళ్లంతా దద్దుర్లతో కొంచెం జుగుప్సగా కనిపిస్తాడు. తాను చంపిన ఒక్కొక్కరి గుర్తుగా ఆ మార్క్‌ని పెట్టుకున్నారంటే అతనెంత క్రూయలో ఈపాటికి అర్థం అయిపోయుంటుంది. ‘బ్లాక్ పాంథర్’లో మైఖేల్ బి.జోర్డాన్ ఈ పాత్ర చేశారు. దీని కోసం స్పెషల్ సూట్ తయారు చేయించారు. ఆ సూట్ వేసుకోవడం, తీయడం అంత సులువు కాదు. సూట్ ఒంటికి అతుక్కుపోవడానికి వాడిన గమ్ ఓ పట్టాన ఒంటి నుంచి సూట్‌ని వేరు చేయనిచ్చేది కాదట. రిమూవ్ చేసిన తర్వాత ఒంటికి అంటుకుపోయిన జిగురు పోవడానికి కాసేపు ఆవిరి తొట్టెలో కూర్చునేవారట. ఏదైనా జిమ్ క్యారీ చేసేస్తా కారెక్టర్ ఏదైనా, ఆ క్యారెక్టర్‌ది ఎలాంటి బాడీ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా క్యారీ చేస్తా అంటారు జిమ్ క్యారీ. అలాంటి ప్రయోగమే చేశారు ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’ సినిమా కోసం. అందులో ఆయన పచ్చని రంగులో ఉన్న ఓ వింత జంతువు రూపంలో కనిపిస్తారు. ఈ పాత్రలా మారడానికి సుమారు మూడు గంటలు పట్టేదట. కదలకుండా మూడు గంటలు పాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేదట. విశేషం ఏంటంటే సినిమాలో మేకప్ కోసమే జిమ్ కదలకుండా ఖాళీగా కూర్చున్న సమయాన్ని లెక్కేస్తే సుమారు 92 రోజులట. చిత్రాతిచిత్రంగా... ఆ ముఖం ఎరుపు, నలుపు రంగుల డిజైన్‌తో విచిత్రంగా ఉంటుంది. కొమ్ములు తిరిగిన మొనగాడు డార్త్ మౌల్. విచిత్రమైన కాంటాక్స్ లెన్స్‌తో చిత్రాతిచిత్రంగా కనిపిస్తాడు. ‘స్టార్ వార్స్: ఎపిసోడ్ 1 – థి ఫ్యాంథమ్ మెనేస్’ సినిమాలోని ఈ క్యారెక్టర్ రే పార్క్‌కి పెద్ద సవాల్. నటించడానికి కాదు.. మేకప్ ఓ పెద్ద చాలెంజ్. నిజానికి ఈ పాత్ర రూపం ఎలా ఉండాలనే విషయంపై యూనిట్తర్జన భర్జనలు పడిందట. ఫైనల్లీ ఒక పేపర్ మీద ఇంక్ జల్లి ఫోల్డ్ చేసి, తీసి చూసినప్పుడు డిజైన్ అటూ ఇటూ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి.. డార్త్ ముఖం అలానే ఉండాలనుకున్నారట. లెఫ్ట్, రైట్.. ఎరుపు, నలుపు డిజైన్‌తో ముఖాన్ని డిజైన్ చేశారు. వైల్డ్ ఏలియన్.. బోలెడన్ని లేయర్లు ఏలియన్స్ ఎలా ఉంటారు? విచిత్రంగా కనిపిస్తారు. ఒక మనిషి ఏలియన్లా మారాలంటే మామూలు విషయం కాదు. మూడు నాలుగు గంటలు ఈజీగా పట్టేస్తుంది. ‘స్టార్ ట్రెక్ బియాండ్’లో చేసిన పవర్ఫుల్ ఏలియన్ వార్ లార్డ్ క్యారెక్టర్ కోసం ఇడ్రిస్ ఎల్బా ఏలియన్‌గా మారారు. ఒక లేయర్.. ఆ పైన ఇంకో లేయర్.. ఇంకోటి... మరోటి.. ఇలా బాడీ మొత్తం మేకప్ లేయర్లే. నిజానికి ఇతగాడికి ‘క్లాస్ట్రోఫోబియా’ ఉంది. అంటే.. నిర్భంధిత పరిస్థితుల్లో ఉండలేకపోవడం. ఇక్కడ లేయర్ల చాటున నిర్భంధ స్థితిలో శరీరం ఉంటే.. అది ఏమాత్రం గుర్తుకు రానివ్వకుండా కెమెరా ముందు నటించడంలో ఇడ్రిస్ సక్సెస్ అయ్యారు. తన ఫోబియాని మరచిపోయేలా చేసిన ఘనత మేకప్‌దే అంటారు ఇడ్రిస్. మేమేం తక్కువ కాదు గుర్తు పట్టలేనంతగా మారిపోవడం హాలీవుడ్ నటులకే కాదు.. ఇండియన్ స్టార్స్‌కి కూడా సాధ్యమే. ‘భీష్మ’లో ఎన్టీఆర్ గురించి చెప్పుకున్నాం. భారతీయ నటుల్లో ముఖ్యంగా చెప్పాల్సింది కమలహాసన్ గురించి. ప్రయోగాలకు చిరునామా ఆయన. ‘ఇంద్రుడు–చంద్రుడు’ లో ఎత్తు పళ్లు, బాన పొట్టతో, ‘కల్యాణ రామన్’లో ఎత్తు పళ్లతో, ‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా, ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, ‘భారతీయుడు’లో వృద్ధ గెటప్‌లో... ఇలా మేకప్‌తో పూర్తిగా మారిపోయిన పాత్రలెన్నో కమల్ చేశారు. ఆయన చేసినన్ని ప్రయోగాలు రజనీకాంత్ చేయకపోయినా ‘రోబో’ సినిమా కోసం ఆయన మేకప్‌కి చాలా గంటలు వెచ్చించాల్సి వచ్చింది. చిట్టి క్యారెక్టర్ కోసం ప్రోస్థెటిక్ మేకప్ చేయించారు. ఈ సినిమా సీక్వెల్ ‘2.0’కి కూడా ఎక్కువగా మేకప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి జనరేషన్లో విక్రమ్‌ని చెప్పుకోవచ్చు. ‘కాశీ’లో అంధుడిగా, ‘శివపుత్రుడు’లో లోకం తెలియని అమాయకుడిగా... ఇవన్నీ ఒక ఎల్తైతే ‘ఐ’లో చేసిన పాత్ర మరో ఎత్తు అవుతుంది. ఆ సినిమాలో హెవీ ప్రోస్థెటిక్ మేకప్‌తో విచిత్రమైన ఆకారంలో కనిపించి, భేష్ అనిపించుకున్నారు విక్రమ్. ‘గజిని’ ఫేమ్ సూర్య అయితే ‘పేరళగన్’ అనే తమిళ సినిమాలో గూని ఉన్న వ్యక్తిగా మౌల్డ్ అయ్యారు. ‘24’లో విలనీ షేడ్ ఉన్న పాత్ర గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక, స్లిమ్‌గా ఉండే ‘అల్లరి’ నరేశ్ బండ బాబులా కనిపించిన చిత్రం ‘లడ్డూ బాబు’. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ‘మగధీర’లో రావు రమేశ్ చేసిన మాంత్రికుడి పాత్ర కూడా చెప్పుకోదగ్గదే.. ‘బాహుబలి’లో ప్రభాకర్ చేసిన కాలకేయుడు క్యారెక్టర్ మేకప్నీ విస్మరించలేం. రీసెంట్గా రిలీజైన ‘మహానటి’లో కీర్తీ సురేష్ ప్రోస్థెటిక్ మేకప్ చేసుకోవాల్సి వచ్చింది. సావిత్రి బాగా లావైన తర్వాత వచ్చే సీన్స్‌కి కీర్తీ ఈ మేకప్ చేసుకున్నారు. బాలీవుడ్ గురించి చెప్పాలంటే... ‘పా’ మూవీలో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిగా అమితాబ్ నటించారు. ఆ సినిమాలో అమితాబ్ 12 ఏళ్ల పిల్లవాడైనా.. చూడ్డానికి ఐదింతలు ఎక్కువ వయసున్న వ్యక్తిలా కనిపిస్తాడు. తక్కువ శారీరక ఎదుగుదల, వృద్ధ లక్షణాలు కనిపించడం కోసం అమితాబ్‌కి ప్రోస్థెటిక్ మేకప్ చేశారు. మరో హిందీ నటుడు అక్షయ్ కుమార్ ‘2.0’లో క్రౌమేన్గా కనిపించడం కోసం తీసుకున్న రిస్క్ తక్కువేం కాదు. ఈ సినిమాలో అతను పక్షి ప్రేమికుడు. అందుకని గెటప్ కూడా పక్షిని పోలినట్లే ఉంటుంది. ఈ గెటప్ కోసం మూడు నాలుగు గంటలు మేకప్‌కి కేటాయించారు. ఇలా ఇండియన్ మూవీస్‌లో ప్రయోగాలు చేస్తున్న తారలు చాలామందే ఉన్నారు. మంచి క్యారెక్టర్ కుదిరితే ‘మేమేం తక్కువ కాదు..’ అంటున్నారు. ఎన్టీఆర్ భీష్మ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు... ఇలా పౌరాణిక పాత్రలతో పాటు సాంఘిక పాత్రలను అలవోకగా చేసిన నటుడు నందమూరి తారక రామారావు. సాంఘిక చిత్రాల్లో వేసిన మారువేషాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. అయితే మారువేషంలో ఉన్నది ఎన్టీఆర్ అనీ, పౌరాణిక గెటప్స్‌లో ఉన్నప్పుడు అది ఎన్టీఆరే అని స్పష్టంగా తెలిసిపోయేది. ‘భీష్మ’ సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ సినిమాలో భీష్మ గెటప్‌లో ఉన్నది ఎన్టీఆర్ అని అప్పట్లో ఎవరూ గుర్తు పట్టలేకపోయారన్నది అక్షర సత్యం.. అది మేకప్ మహత్యం. నిజానికి తెరపై కనిపించే నటుల గురించి చెప్పుకుంటాం కానీ, వారలా కనిపించడానికి తెరవెనక కృషి చేసే మేకప్ నిపుణులను కూడా అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ'
చెన్నై: సృజనాత్మక దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఐ' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తొలుత మిశ్రమ రివ్యూలకే పరిమితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గత వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఐ మూవీ తమిళనాట కాకుండా బయటకూడా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ చిత్రం కేరళలో కలెక్షన్లలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకూ కేరళ రాష్ట్రంలో ఏ తమిళ చిత్రం కూడా నెలకొల్పని కలెక్షన్ల రికార్డులను ఐ మూవీ సొంతం చేసుకుంది. తెలుగులోకి అనువాదమైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రోజే రూ. 9 కోట్లను వసూలు చేయగా, హిందీలో రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ అన్ లిస్ట్ త్రినాథ్ తెలిపారు. -
హిజ్రాల ఆందోళన
తమిళ సినిమా : ఐ చిత్రంలో తమ మనోభావాలకు భంగం కలిగేవిధంగా చిత్రీకరించినట్టు హిజ్రాలు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా సోమవారం నుంగం బాక్కం శాస్త్రి భవన్ వద్ద ఉన్న సెన్సార్ కార్యాలయంలో పలువురు హిజ్రా లు ధర్నాకు దిగారు. వారిలో ప్రముఖ నటి రోశ్, బామా, డాక్టర్ సెల్వి తదితరులు ఉన్నారు. వీరంతా ఐ చిత్రంలో హిజ్రాలను కించ పరిచే సన్నివేశాలకు అనుమతించినందుకు గాను, సెన్సార్ బృందానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా హిజ్రా బామా మాట్లాడుతూ, ఐ చిత్రంలో హిజ్రాల మనో భావాలను దెబ్బ తిసే సన్నివేశాలను వెంటనే తొలగించి, ఆ చిత్ర దర్శకుడు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లే కుంటే, ఐ చిత్రంపై తాత్కాళిక స్టే విధించాలన్నారు. కమిషనర్‌కు వినతి పత్రం కొందరు హిజ్రాలు నగరంలోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. హిజ్రాల సంఘం ఉప శాఖ అధ్యక్షురాలు సుధాతో పాటుగా ఇరవై మందికి పైగా హిజ్రాలు అక్కడ గుమిగూడారు. కాంచన చిత్రంలో నటించిన ప్రియ మాట్లాడుతూ, ఐ చిత్రంలో హిజ్రాలను అవమాన పరిచే సన్నివేశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విక్రమ్‌ను హిజ్రా ప్రేమించినట్టుగా, అందుకు ఆయన అవహేళన చేసినట్టుగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని కోరినా స్పందించలేదన్నారు. అందుకే ఈనెల 22న వళ్లువర్ కోట్టం వద్ద హిజ్రా సంఘాల నేతృత్వంలో భారీ నిరసన చేపట్టనున్నామని తెలిపారు. ఇందుకు కమిషనర్ అనుమతి కోరుతూ వినతి పత్రం అందజేశామన్నారు. -
నేను కోమాలోకి వెళ్లిపోతానేమోనని భయం వేసింది : విక్రమ్
మూడేళ్లు ఒకే సినిమాకు పని చేయడం, ఆ సినిమాలో పాత్రల కోసం తన శరీరాన్ని హింసించుకోవడం ఒక్క విక్రమ్‌కే చెల్లిందేమో. శంకర్ తీసిన ‘ఐ’ కోసం విక్రమ్ 24/7 ఇష్టపడుతూ కష్టపడ్డారు. ఆ కష్టాల గురించి విక్రమ్ చెబుతుంటే నిజంగా ఎవ్వరికైనా ఇతనికి పిచ్చెక్కిందా అనిపిస్తుంది. విక్రమ్ మాటల్లో ఆయన కష్టాల అధ్యాయం... శంకర్ ‘ఐ’ కథ చెప్పగానే అదిరిపోయాను. అందులో నేను మూడు పాత్రలు చేయాలి. రెండు పాత్రల్ని గ్రాఫిక్స్‌లో చేసేద్దామన్నారు. నేనస్సలు ఒప్పుకోలేదు. నేనే చేస్తా అని మొండిగా చెప్పా. పాతిక కేజీలు బరువు తగ్గి, మళ్లీ బరువు పెరగడమంటే చాలా కష్టమని శంకర్ ఎంత చెప్పినా వినలేదు. నేను ఎంత కష్టమైనా భరించడానికి రెడీ అయ్యా. రోజూ మూడు పూటల్లా వ్యాయామం. అది కూడా ఉదయం మూడు గంటలు, మధ్యాహ్నం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు. దాదాపుగా నోరు కుట్టేసుకున్నాను. అప్పుడు నా ఆహారం... కేవలం చిన్న యాపిల్. ఇలా ఏడాది పాటు చేశా. దాంతో రోగిష్టిలా తయారయ్యా. నన్ను చూసి మా ఇంట్లో వాళ్లే కాదు, డాక్టర్లూ భయపడిపోయారు. మొదట్లో రెండు వారాలకోసారి వైద్య పరీక్షలు జరిపితే, తర్వాత వారినికోసారి చేయాల్సి వచ్చేది. శరీరంలో బి.పి., షుగర్త్ సహా అన్ని లెవెల్స్ పడిపోయాయి. ఇక మేకప్కైతే సుమారు నాలుగు గంటలు పట్టేది. మేకప్ వేసేటప్పుడు మొహం కందిపోయి బొబ్బలు వచ్చేసేవి. స్ప్రే, సిగరెట్, పెయింట్, ధూళి... ఇలా ఏ వాసన వచ్చినా భళ్లున వాంతి వచ్చేసేది. ఊపిరి ఆగినంత పనయ్యేది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారేది. నేను కోమాలోకి వెళ్లి పోతానేమోనన్న భయం వేసేది. ఏదేమైనా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. -
హీరోకు చుక్కలు చూపించిన సినిమా
దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఐ' సినిమా ఏ రేంజిలో హిట్టవుతుందో గానీ.. అందులో హీరో విక్రమ్‌కు మాత్రం చుక్కలు చూపించింది. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా తన శరీరబరువును సగానికి తగ్గించుకోవాల్సి వచ్చింది. తనకు విపరీతంగా ఆకలి వేసేదని, తినాలని కూడా అనిపించేదని, ఆకలి ఆపుకోవడం చాలా కష్టంగా ఉండేదని విక్రమ్ అన్నాడు. దాంతో చివరకు పిచ్చెక్కినట్లు అనిపించేదని చెప్పాడు. ఐ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. వాటిలో ఒకటి బాడీ బిల్డర్ పాత్ర. మరొకటి అందవికారంగా కనపడే వ్యక్తి పాత్ర. ఈ పాత్ర కోసమే తాను తిండి మానుకుని, విపరీతంగా జిమ్‌లో వ్యాయామాలు చేయాల్సి వచ్చిందని విక్రమ్ చెప్పాడు. కావాలనుకుంటే స్టెరాయిడ్లు వాడి సులభంగా పెంచుకోవచ్చని, కానీ తానలా చేయదలచుకోలేదని అన్నాడు. దర్శకుడు శంకర్ తనను బరువు తగ్గాలని చెప్పలేదు గానీ, తనంతట తానే అలా చేశానన్నాడు. కావల్సిన లుక్ కోసం తాను ఆకలి చంపుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. కేవలం జ్యూసులు తాగి పొట్ట నింపుకున్నట్లు వివరించాడు. బయటకు వెళ్తే రహస్యం తెలిసిపోతుందని తాను ఎక్కడికీ వెళ్లలేదని తెలిపాడు. ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండేవాడినని, ఇంట్లో కూడా బిర్యానీలు నోరు ఊరించినా.. నోరు కట్టుకున్నానని అన్నాడు. -
ఆల్ క్లియర్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ చిత్రానికి అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. వాటన్నిటినీ అధిగమించి జనవరి 14న ‘ఐ’ విడుదల కానున్నట్లు మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ ప్రకటించింది. నిర్మాత ‘ఆస్కార్’ రవిచంద్రన్ తమకు 19 కోట్ల రూపాయలు చెల్లించేంత వరకు స్టే విధించాలని పిక్చర్ మీడియా హౌస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో చిత్రం యథావిధిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఐ' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్
చెన్నై: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఐ' సినిమా విడుదలకు ముందే ఎదురుదెబ్బ తగిలించింది. ఈ సినిమా విడుదల చేయొద్దని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఈ సినిమా మూడు వారాలు ఆలస్యంగా విడుదలకానుంది. పైనాన్షియర్, నిర్మాతకు మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తడంతో పైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని అనుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్‌ను 14కు మార్చారు. పండగ నాడే సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే 'ఐ' సినిమా విడుదలకు ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేసింది. అయితే 'ఐ' చిత్రం 14న యధావిధిగా విడుదలవుతుందని ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాపై తలెత్తిన సమస్యలు రేపటిగా పరిష్కారమవుతాయని చెప్పారు. ఇప్పటికే అన్ని పనులూ పూర్తి చేసుకున్న శంకర్ విజువల్ వండర్ 'ఐ' మీద దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హీరో విక్రమ్‌ను విభిన్న రూపాల్లో చూపించే ఈ చిత్రం ఏకంగా మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండడం విశేషం. -
'ఐ' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్
-
ఐ ఫీస్ట్‌గా...
ఎట్టకేలకు ఈ సంక్రాంతి పండగకు బాక్సాఫీస్ వద్ద పోటీపడే సినిమా పుంజులు ఏమిటన్నది ఒక స్పష్టత వచ్చింది. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’కు తెలుగు రీమేక్ అయిన మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల... గోపాల’, భారతీయ దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ఐ’ - ఈ రెండూ ఈ పెద్ద పండగకు ప్రేక్షకులను అలరించనున్నాయి. సరిగ్గా పండగ రోజు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శంకర్ దర్శకత్వంలోని ‘ఐ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను 14కు మార్చారు. పండగ నాడే సినిమా విడుదల చేస్తున్నామంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మరో పక్క మొన్న ఆదివారమే పాటల విడుదల కార్యక్రమం జరుపుకొన్న ‘గోపాల... గోపాల’ చిత్రం తుది మెరుగులు దిద్దుకొంటూ, సెన్సార్ జరుపుకొనే పనిలో ఉంది. ఆ పనులన్నీ పూర్తి కాగానే, ఈ చిత్రాన్ని పండగ కన్నా ముందే విడుదల చేయాలని శరవేగంతో పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ బాక్సాఫీస్ సమరం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం కాగా, అభిమానులు ఎవరి అంచనాల్లో వారున్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే అన్ని పనులూ పూర్తి చేసుకున్న శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ మీద దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హీరో విక్రమ్‌ను విభిన్న రూపాల్లో చూపించే ఈ చిత్రం ఏకంగా మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండడం విశేషం. భారీ సెట్లు, గ్రాఫిక్ వర్క్స్ ఉన్న ఈ చిత్రం కోసం ఇంత కష్టపడడం వెనుక కారణాన్ని కూడా దర్శకుడు శంకరే ఇటీవల వివరించారు. ‘‘నేను నా సినిమాలను ఒక దర్శకుడిగానే కాక, ఒక సాధారణ ప్రేక్షకుడిగా కూడా చూస్తుంటా. అందుకే, ఎప్పటికప్పుడు నా కొత్త చిత్రం, నా మునుపటి చిత్రాన్ని అధిగమించాలని భావిస్తుంటా’’ అన్నారాయన. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగా ‘రొమాంటిక్ థ్రిల్లర్’ కోవలో ‘ఐ’ సినిమాను ఆయన తీశారు. గతంలో ఆయన ప్రభుదేవాతో ‘ప్రేమికుడు’ (తమిళంలో ‘కాదలన్’) చిత్రం చేసినప్పటికీ అది యువతరం ప్రేమకథా చిత్రం. ఈసారి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే ప్రేమ కథ ఇది. ‘‘వినోదాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలే రూపొందిస్తానంటూ నా పైన ముద్ర పడింది. కానీ, ఆ ముద్రకు భిన్నమైన చిత్రాలు చేయాలని నేను తపిస్తున్నా. అందులో భాగంగా వస్తున్నదే - ‘ఐ’ చిత్రం’’ అని శంకర్ వివరించారు. అసాధారణమైన వ్యక్తిని కానీ, వార్తను కానీ చూసినప్పుడల్లా అతని వెనుక, లేదంటే ఆ వార్త వెనుక ఉన్న కథేమిటని ఆలోచించే శంకర్ అక్కడ నుంచే తన కథలు పుడతాయని చెబుతుంటారు. మరి, ఈ ‘ఐ’ కథకు స్ఫూర్తి ఏమిటన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఈ కథ ఒక హాలీవుడ్ సినిమాలోని అంశాన్ని తీసుకొని అల్లుకొన్నదనీ, విక్రమ్ చేత వేయించిన భీకరమైన రూపం తాలూకు గెటప్‌కు కూడా అదే స్ఫూర్తి అనీ ఇప్పటికే కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ చిత్రం కోసం హీరో విక్రమ్ మిగిలినవన్నీ పక్కనబెట్టి, పూర్తిగా లీనమైపోయి నటించారట! అందుకే, ఈ దిగ్దర్శకుడు సైతం ‘‘పోషిస్తున్న పాత్ర కోసం విపరీతంగా బరువు పెరగడం, విపరీతంగా బరువు తగ్గడం, కొన్నేళ్ళ తరబడి ఆ పాత్రకే కట్టుబడి ఉండడం లాంటివన్నీ చేసే నటులు చాలా కొద్దిమందే ఉంటారు. అలాంటి అతి కొద్దిమందిలో తానూ ఒకణ్ణని విక్రమ్ మరోసారి నిరూపించారు’’ అని అభినందనలు కురిపించారు. కెరీర్ మొదట్లో ‘రేవతి’ అనే పేరుతో నాయికా ప్రధానమైన చిత్రం తీయాలనుకొని, నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బంది పడ్డ శంకర్ ఈసారి ‘ఐ’ చిత్రంలో కథానాయిక పాత్రకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అమీ జాక్సన్ ఆ కీలక పాత్రను పోషిస్తున్నారు. మరి, ట్రైలర్లు చూస్తుంటే, విక్రమ్‌ను ఒకపక్క హీరోగా, అదే సమయంలో మరోపక్క యాంటీ హీరోగా కూడా చూపిస్తూ, కొత్త ప్రయోగం చేస్తున్నారని భావిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో ఇప్పటికే ఒకటి రెండు పాటలూ పదే పదే వినిపిస్తున్నాయి. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వ విలువలు కూడా కలసి, భారీగా రూపొందిన ‘ఐ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సంచలనం సృష్టిస్తుందో తెలుసుకొనేందుకు మరొక్క వారం రోజులు ఆగాలి. ఈలోగా మరిన్ని ‘ఐ’ కబుర్లు మీడియాలో రావడం ఎలాగూ ఖాయం! -
అందుకే మాస్ చిత్రంలో లేను
కోలీవుడ్‌లో ఉజ్వల భవిష్యత్‌కు పునాదులు వేసుకుంటున్న ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్. మదరాసు పట్టణం సినిమాతో నాయికగా తన కేరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తరువాత తాండవం చిత్రంలో విక్రమ్‌తో జతకట్టింది. అటుపై బాలీవుడ్‌పై కన్నేసినా అక్కడ తొలిచిత్రమే నిరాశపరచడంతో మళ్లీ అటు వైపు చూడలేదు. అలాంటి సమయంలో స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించే లక్కీ చాన్స్ వచ్చింది. విక్రమ్ త్రిపాత్రాభినయంతో శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆస్కార్ ఫిలింస్ భారీ నిర్మాణ విలువలతో తెరపై ఆవిష్కృతమైన ‘ఐ’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నారుు. ఈ చిత్రం పూర్తి కాగానే ఎమీకి సూర్యతో మాస్ చిత్రంలో నటించే మరో మంచి అవకాశం వచ్చింది. అయితే ముందు ఆ చిత్రాన్ని చెయ్యడానికి అంగీకరించినా ఆ తరువాత ఎమీజాక్సన్ చిత్రం నుంచి వైదొలగింది. కారణం ఆ చిత్రంలో నటిస్తున్న మరో నాయకి నయనతారనే ప్రచారం మొదలైంది. అయితే ఎమీ వివరణ మాత్రం వేరేగా ఉంది. ఆమె ఆ చిత్ర ద ర్శకుడు వెంకట్‌ప్రభు క థలో మార్పులు చేశారని అందులో తన పాత్ర కు ప్రాధాన్యం తగ్గిపోవడంతో, మాస్ చిత్రం నుంచి వైదొలగానని పేర్కొంది. ఐ చిత్రంలో నటించిన తరువాత ఇకపై మంచి కథా చిత్రాలను ఎంచుకుని నటించాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది కూడా మాస్ చిత్రం నుంచి తప్పుకోవడానికి కారణం అని పేర్కొంది. అయితే భవిష్యత్తులో సూర్యతో నటించే అవకాశం వస్తే వదలుకోనన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉదయనిధి స్టాలిన్‌తో జతగా ఒక చిత్రం చేయనున్నానని, ఇందులో తనది గ్రామీణ పాత్ర అని పేర్కొంది. దీంతో అప్పటి నుంచే చీర కట్టుకోవడం నేర్చుకుంటున్నానని పేర్కొంది. అదే విధంగా త్వరలో వేల్రాజ్ దర్శకత్వంలో ధనుష్ సరసన ఓ చిత్రం చేయనున్నట్లు ఎమీ పేర్కొంది. -
పండగకి ‘ఐ’ రిలీజ్ సరికాదు
‘‘కొంతమంది అగ్రనిర్మాతలు థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న నిర్మాతలను ఇబ్బందులపాలు చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ సమయాలలో అనువాద చిత్రాలను విడుదల చేయకూడదని రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి తీర్మానించిన నేపథ్యంలో ‘ఐ’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంవల్ల, థియేటర్లు దొరక్క కొన్ని చిత్రాల విడుదల ఆగిందని ఆయన ఆరోపించారు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ చిత్రాన్ని కూడా పండగకి విడుదల చేయాలనుకున్నారనీ, కానీ థియేటర్లు దొరక్క వాయిదా వేసుకున్నారనీ ఆయన అన్నారు. -
ఇది అంచనాలు అందుకొనే సినిమా : దర్శకుడు శంకర్
భారతీయ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలోని విజువల్ అద్భుతం ‘ఐ’ తెలుగు పాటల విడుదల కార్యక్రమం సినీ పరిశ్రమలోని ఇతర దర్శక దిగ్గజాలకు కూడా వేదిక అయింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను తదితర తెలుగు దర్శక ప్రముఖులు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ అయింది. పాటల సీడీని రాజమౌళి ఆవిష్కరించగా, తొలి ప్రతిని త్రివిక్రమ్ అందుకున్నారు. ఈ వేడుకలో శంకర్ మాట్లాడుతూ, అందరం ఏళ్ళ తరబడి చేసిన శ్రమ ఫలితంగా రూపొందిన ‘ఐ’లోని దృశ్యాలు అంచనాలను పెంచేశాయన్నారు. అయినప్పటికీ, వాటన్నిటినీ ఈ సినిమా అందుకుంటుందని నమ్మకంగా చెప్పారు. ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాలతో రాజమౌళికి అభిమానిగా మారిన తాను ‘బాహుబలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. అలాగే, ఇన్నేళ్ళుగా అనువాద చిత్రాలతోనే తెలుగు వారిని ఆకట్టుకుంటున్న తాను త్వరలోనే నేరుగా తెలుగులోనే సినిమా చేస్తానని సభాముఖంగా మాట ఇచ్చారు. ఆస్కార్ వి. రవిచంద్రన్ నిర్మించిన ‘ఐ’ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్లు తెలుగులో అందిస్తున్నారు. పాటల రచయిత చంద్రబోస్ ప్రసంగిస్తూ, శంకర్, విక్రమ్‌ల గురించి తనదైన శైలిలో తెలుగులో లోతైన విశ్లేషణ చేశారు. ఆ ప్రసంగం తాలూకు వివరాలను శంకర్, విక్రమ్‌లు త్రివిక్రమ్ ద్వారా అనువదింపజేసుకొని చెప్పించుకోవడం కనిపించింది. చిత్ర కథానాయకుడు విక్రమ్ మాట్లాడుతూ, మేకప్ వేసుకోవడానికి అయిదు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టిన పాత్ర కోసం, ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. కళాదర్శకుడు ముత్తురాజ్, ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ తదితర చిత్ర యూనిట్ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'భవిష్యత్ లో తెలుగు సినిమా చేస్తా'
హైదరాబాద్: భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని తమిళ దర్శకుడు శంకర్ అన్నారు. విక్రమ్ హీరోగా తాను తెరకెక్కించిన 'ఐ' సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉన్నానని అన్నారు. భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఇది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మగధీర సినిమా చూసి రాజమౌళి అభిమాని అయ్యాయని శంకర్ అన్నారు. 'ఐ' సినిమా అందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హీరో విక్రమ్, కెమెరామన్ పీసీ శ్రీరాం, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'ఐ' సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. -
మాలాంటి వాళ్ళందరికీ శంకర్.. మార్గదర్శకులు
-
అది శంకర్ గారి గొప్పదనమే..!
-
రివైజింగ్ కమిటీకి ఐ!
ఐ చిత్రం రివైజింగ్ కమిటీకి వెళ్లనుందని తెలిసింది. సియాన్ విక్రమ్, లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ జంటగా నటించిన భారీ చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ అద్భుత సెల్యులాయిడ్ ఇది. ఆస్కార్ రవిచంద్రన్ భారీ నిర్మాణ విలువకు నిదర్శనం. ఐ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీపావళికే తెరపైకి వస్తుందనుకున్న ఐ సంక్రాంతికి ముస్తాబవుతోంది. జనవరి తొమ్మిదిన తెరపైకి రానున్న నేపథ్యంలో సెన్సార్ బృందం చిన్న షాక్ ఇచ్చింది. ఐ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఈ ఘటన చిత్ర యూనిట్‌ను విస్మయానికి గురి చేసింది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వస్తే ప్రభుత్వ రాయితీలు వర్తించవు. దీంతో ఐ చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
180 కోట్లతో తెరకెక్కుతున్న ఐ
-
'ఐ' తెలుగు రైట్స్.. అన్ని కోట్లకా..?!
-
నవంబర్‌లో అద్భుతాల ‘ఐ’
ఐ చిత్రం విడుదల నవంబర్ నెలకు వాయిదా పడింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్లే చిత్రం విడుదల వాయిదా పడిందని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. స్టార్ దర్శకుడు శంకర్ తాజా అద్భుత సెల్యులాయిడ్ చిత్రం ఐ. ఇందులో సియాన్ విక్రమ్ నటుడిగా విశ్వరూపం చూపారు. అందాల భామ ఎమిజాక్సన్ హీరోయిన్. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస్కార్ ఫిలిం సంస్థ నుంచి వస్తున్న మరో వండర్ఫుల్ చిత్రం ఐ. పలు విశేషాలకు నెలవైన ఈ చిత్రం కోసం దర్శకుడు శంకర్‌తో పాటు నటుడు విక్రమ్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ మేరకు ఆయన తొలిసారిగా హిందీలోనూ తన పాత్రకు డబ్బిం గ్ చెప్పుకోవడం విశేషం. పస్తుతం ఐ చిత్రం హిందీ డబ్బింగ్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ డబ్బింగ్ థియేటర్లో ఇటీవలే పూర్తి చేశారని నిర్మాత తెలిపారు. తదుపరి తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పనున్నారని తెలిపారు. తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను అతిథిగా రప్పించిన ఆస్కార్వ్రిచంద్రన్ త్వరలో తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్‌ను ఆహ్వానిస్తున్నారు. కాగా ఐ చిత్రం ప్రీమియర్ షోను సింగపూర్, యూఎస్‌లో ఏర్పాటు చేయనున్నామని, దీనికి రావడానికి సిల్వర్‌స్టార్ స్టాలోన్ అంగీకరించారని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
గోపాలడుకి ఐ పోటి ఇస్తుందా...
-
శంకర్ ”ఐ” సినిమా టీజర్
-
రెహ్మాన్ వల్లే ‘ఐ’ ఆలస్యం
సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ కారణంగా ఐ చిత్రం విడుదల ఆలస్యం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఐ. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇది. విక్రమ్, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలందిస్తున్నారు. చిత్ర నిర్మాణం పూర్తయి, ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు. అయితే సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ పాటలకు ఇంకా ట్యూన్స్ అందించకపోవడంతో ఆడియో విడుదల కార్యక్రమం ఆలస్యం అవుతోందని, దీంతో చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతోందని సమాచారం. రెహ్మాన్ బాణీలు కట్టిన తరువాత దర్శకుడు గీతాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఎ.ఆర్.రెహ్మాన్ వెంటబడి సాంగ్స్ రికార్డింగ్ చేయించుకుంటున్నారట. చిత్ర ఆడియో ఆవిష్కరణను కెనడాలో భారీ ఎత్తున నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన కంటే ప్రముఖ వ్యక్తి అతిథిగా విచ్చేస్తారని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. అయితే ఆయన పేరును వెల్లడించడానికి నిరాకరించారు. -
'ఐ' చిత్రం కోసం 5 కోట్లతో శంకర్ పాట చిత్రీకరణ!
చిత్ర పరిశ్రమలో 5 కోట్ల బడ్జెట్ అంటే రెండు, మూడు చిన్న చిత్రాలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్మించవచ్చు. కాని ఏకంగా ఓ పాట కోసం సెన్సేషనల్ దర్శకుడు శంకర్ 5 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. జీన్స్ చిత్రంలో ప్రపంచ ఏడు వింతల వద్ద ఓ పాటను భారీగా ఖర్చు పెట్టి చిత్రీకరించిన శంకర్ మరో సంచలనానికి తెర తీశాడు. విలక్షణ నటుడు విక్రమ్, అమీ జాక్సన్ తో శంకర్ నిర్మిస్తున్న 'ఐ' చిత్రంలో ఓ పాటను ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో, టూరిస్ట్ కేంద్రాల్లో చిత్రీకరించినట్టు సమాచారం. ఓ పాట కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇదే ప్రథమం అని సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకు ముందు ధూమ్-3 చిత్రంలో మలంగ్.. మలంగ్ పాట కోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 5 కోట్ల రూపాయలతో శంకర్ చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులకు కొంత అనుభూతిని పంచడం ఖాయమని సినీ వర్గాలు వెల్లడించాయి.