
'ఐ' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్
చెన్నై: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఐ' సినిమా విడుదలకు ముందే ఎదురుదెబ్బ తగిలించింది. ఈ సినిమా విడుదల చేయొద్దని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఈ సినిమా మూడు వారాలు ఆలస్యంగా విడుదలకానుంది. పైనాన్షియర్, నిర్మాతకు మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తడంతో పైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని అనుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్‌ను 14కు మార్చారు. పండగ నాడే సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే 'ఐ' సినిమా విడుదలకు ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేసింది. అయితే 'ఐ' చిత్రం 14న యధావిధిగా విడుదలవుతుందని ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాపై తలెత్తిన సమస్యలు రేపటిగా పరిష్కారమవుతాయని చెప్పారు.
ఇప్పటికే అన్ని పనులూ పూర్తి చేసుకున్న శంకర్ విజువల్ వండర్ 'ఐ' మీద దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హీరో విక్రమ్‌ను విభిన్న రూపాల్లో చూపించే ఈ చిత్రం ఏకంగా మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండడం విశేషం.