'ఐ' చిత్రం కోసం 5 కోట్లతో శంకర్ పాట చిత్రీకరణ! | Shankar picturised a song with 5 crores for I Movie | Sakshi
Sakshi News home page

'ఐ' చిత్రం కోసం 5 కోట్లతో శంకర్ పాట చిత్రీకరణ!

Published Tue, Apr 22 2014 5:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

'ఐ' చిత్రం కోసం 5 కోట్లతో శంకర్ పాట చిత్రీకరణ!

'ఐ' చిత్రం కోసం 5 కోట్లతో శంకర్ పాట చిత్రీకరణ!

చిత్ర పరిశ్రమలో 5 కోట్ల బడ్జెట్ అంటే  రెండు, మూడు చిన్న చిత్రాలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్మించవచ్చు. కాని ఏకంగా ఓ పాట కోసం సెన్సేషనల్ దర్శకుడు శంకర్ 5 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. జీన్స్ చిత్రంలో ప్రపంచ ఏడు వింతల వద్ద ఓ పాటను భారీగా ఖర్చు పెట్టి చిత్రీకరించిన శంకర్ మరో సంచలనానికి తెర తీశాడు. 
 
విలక్షణ నటుడు విక్రమ్, అమీ జాక్సన్ తో శంకర్ నిర్మిస్తున్న 'ఐ' చిత్రంలో ఓ పాటను ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో, టూరిస్ట్ కేంద్రాల్లో చిత్రీకరించినట్టు సమాచారం. ఓ పాట కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇదే ప్రథమం అని సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఇంతకు ముందు ధూమ్-3 చిత్రంలో మలంగ్.. మలంగ్ పాట కోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 5 కోట్ల రూపాయలతో శంకర్ చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులకు కొంత అనుభూతిని పంచడం ఖాయమని సినీ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement