కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్రమ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ కోసం బరువు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 86 కిలోల నుంచి ఏకంగా 52 కేజీలకు తగ్గానని తెలిపారు. అయితే తన శారీరక మార్పులతో తీవ్రమైన సమస్య నుంచి బయటపడ్డానని వివరించారు. 50 కంటే బరువు తగ్గితే మీ శరీరంలో అవయవాలు పనిచేయవని డాక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే.. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం కాదంటూ వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు.
అంతేకాకుండా కాశీ అనే మూవీలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించానని తెలిపారు. ఆ చిత్రంలో నటించాక దాదాపు మూడు నెలలపాటు సరిగా చూడలేకపోయానని విక్రమ్ వెల్లడించారు. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేదని.. ఆ ఎఫెక్ట్ నా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. దీంతో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో పాత్రల కోసం తన ప్రాణాలనే రిస్క్‌లో పెడుతున్న విక్రమ్‌ను చూస్తుంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఇటీవల విడుదలైన 'తంగలాన్' కోసం కొంత బరువు తగ్గడంతో పాటు సగం తల గుండు చేయించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment