Kashi
-
కుంభమేళా ఎఫెక్ట్.. గంగా హారతి నిలిపివేత
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని ఆపేస్తున్నట్లు చెప్పారు.కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేసినట్లు తెలిపారు.ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.కాగా,మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసకుంది. ఈ క్రమంలోనే కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దీంతోపాటు వీవీఐపీ, స్పెషల్ పాసులను రద్దు చేశారు.ఇప్పటివరకు 29.64 కోట్లమంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. -
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు
న్యూఢిల్లీ: పితృ పక్ష అమావాస్యనాడు పెద్దలకు పిండ ప్రదానం చేయడమనేది హిందువుల్లో ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న పితృపక్ష అమావాస్య. పెద్దలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అలాగే పిత్ర దోషం కూడా తొలగిపోతుందని అంటారు. పిండ ప్రదానం చేసేందుకు దేశంలోని గయతో పాటు కొన్ని ప్రాంతాలు శ్రేష్టమైనవని చెబుతారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.1. హరిద్వార్హరిద్వార్లోని నారాయణి శిల దగ్గర పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారిపై పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి జీవితంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయని చెబుతుంటారు.2.బుద్ధగయబీహార్లోని ఫల్గు నది ఒడ్డున ఉన్న బుద్ధగయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు విదేశాల నుండి కూడా తరలివస్తారు. విష్ణుపురాణం, వాయుపురాణాలలో దీనిని మోక్షభూమి అని పేర్కొన్నారు. దీనిని విష్ణు నగరి అని కూడా అంటారు. విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని, బ్రహ్మ స్వయంగా తమ పూర్వీకులకు ఇక్కడే పిండప్రదానాన్ని చేశారని చెబుతారు. Foreigners perform Pitru Paksha Tarpan rituals at GayaGaya is Mokshbhumi and it attracts sanatan dharma followers across the world Our rituals Our traditions 🔥🙏🏼 pic.twitter.com/Nru3esLfUo— Viक़as (@VlKAS_PR0NAM0) September 30, 20243. కురుక్షేత్రహర్యానాలోని కురుక్షేత్రలో పితృపక్ష అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాభారతంలోని వివరాల ప్రకారం ధర్మరాజు తన కుటుంబ సభ్యులకు ఇక్కడే పిండప్రదానం చేశాడు.4. కాశీకాశీలో పిండప్రదానం చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు. కాశీలోని పిశాచ మోచన్ కుండ్ సమీపంలో మూడు మట్టి పాత్రలను ఉంచి, పిండ ప్రదానం చేస్తారు. ఆరోజున నలుపు, ఎరుపు, తెలుపు జెండాలను ఎగురవేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
'మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాదు'.. విక్రమ్‌కు వార్నింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విక్రమ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ కోసం బరువు తగ్గినట్లు వెల్లడించారు. దాదాపు 86 కిలోల నుంచి ఏకంగా 52 కేజీలకు తగ్గానని తెలిపారు. అయితే తన శారీరక మార్పులతో తీవ్రమైన సమస్య నుంచి బయటపడ్డానని వివరించారు. 50 కంటే బరువు తగ్గితే మీ శరీరంలో అవయవాలు పనిచేయవని డాక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే.. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం కాదంటూ వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా కాశీ అనే మూవీలో విక్రమ్ అంధుడి పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించానని తెలిపారు. ఆ చిత్రంలో నటించాక దాదాపు మూడు నెలలపాటు సరిగా చూడలేకపోయానని విక్రమ్ వెల్లడించారు. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేదని.. ఆ ఎఫెక్ట్ నా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. దీంతో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో పాత్రల కోసం తన ప్రాణాలనే రిస్క్‌లో పెడుతున్న విక్రమ్‌ను చూస్తుంటే ఆయన డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఇటీవల విడుదలైన 'తంగలాన్' కోసం కొంత బరువు తగ్గడంతో పాటు సగం తల గుండు చేయించుకున్నాడు. -
కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.ఐఆర్సీసీటీ వెబ్సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. Embark on a divine journey to the land of spiritual awakening! Join IRCTC Tourism’s Ram Mandir Darshan and seek blessings at the revered destinations - Ayodhya & Varanasi!To experience the essence of Hinduism and rejuvenate your soul, book your journey at… pic.twitter.com/hMPlPIbTsN— IRCTC (@IRCTCofficial) August 18, 2024 -
'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం..!
ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ దాతృత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి చాలా సింపుల్‌గా ఉంటారు. చెప్పాలంటే సింపుల్ సిటీకి కేరాఫ్ ఆమె అన్నంతగా చాలా సాదాసీదాగా ఉంటారామె. అయితే ఆమె వద్ద ఎన్నో చీరలు ఉండవని, షాపింగ్ చేయరని కథలు కథలుగా విన్నాం. రెండు లేదా మూడో చీరలే ఉంటాయని సుధా కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేంటి ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత భార్య వద్ద అన్నే చీరలా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా. నేటి రోజుల్లో చిన్నగా స్టార్డమ్ వచ్చి, పేరు ప్రఖ్యాతలు వస్తేనే..వారి రేంజ్, లుక్కు మారిపోతుంది. ఏదో గోల్డ్స్పూన్ బేబీ మాదిరి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ అన్నట్లు ఉంటుది వ్యవహారం. కానీ ఆమె ఆహార్యం సాధారణ గృహిణిలా ఉంటుంది. ఇటీవలే అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఆమె రాజ్యసభ ఎంపీగా నామనేట్ అయ్యిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో రాజ్యసభ ఎంపీగా తొలి ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ సైతం ఆమె ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన వద్ద చీరలు ఎందుకు లేవు? తాను ఎందుకు కొనుగోలు చెయ్యరో తదితర ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను 30 ఏళ్లుగా చీర కొనలేదని అన్నారు. కాశీ పర్యటనకు వెళ్లినప్పుడూ మనకు బాగా ఇష్టమైనది వదిలేయాలి అని అంటారు. అందుకోసం తాను బాగా ఇష్టపడే షాపింగ్ ని వదిలేస్తానని గంగామాతకు వాగ్దానం చేశానని అన్నారు. తనకు పొదుపుగా, సింపుల్‌గా ఉండటం తన తల్లిదండ్రులు, తాతల నుంచి వచ్చిందని చెప్పారు. తన తల్లి చనిపోయినప్పుడూ ఆమె వస్తువులు పంచేందుకు కేవలం అరంగంట సమయమే పట్టిందన్నారు. ఎందుకంటే అప్పటికీ ఆమె వద్ద కేవలం నాలుగు చీరలు ఉన్నాయి. ఇలా సింపుల్‌గా బతకడం వాళ్ల పెంపకం నుంచి మొదలయ్యింది కాబట్టి చాలా సులభంగా సాదాసీదాగా జీవిస్తున్నానని అన్నారు. రెండు దశాబ్దాలుగా తన సోదరీమణులు, సన్నిహితులు, తాను పనిచేసే ఎన్జీవోలు తనకు బహుమతిగా చీరలు ఇస్తుంటారని, వాటినే తాను ధరిస్తానని చెప్పారు. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళల బృందం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని అవే తన వద్ద ఉన్నాయని సుధామూర్తి అన్నారు. అంతేగాదు తన సోదరీమణులు ప్రతి ఏడాది బహుమతిగా ఇస్తున్న చీరల సేకరణ పెరుగుతున్నందున నిర్వహించడం కష్టంగా ఉందని వారికే నేరుగా చెప్పేశానని అన్నారు. అంతేగాదు సుధామార్తి చీరలు ధరించిన పర్యావరణ హితార్థం కనీసం ఐరన్ కూడా చేయించరు. అలాగే నేలను తుడిచేలా చీరను ధరించను కాబట్టి చాలా జాగ్రత్తగా, మన్నికగా బట్టలను వాడతాను కాబట్టి పెద్దమొత్తంలో చీరలు కావాల్సిన అవసరం పడలేదన్నారు. అపార సంపద ఉన్నప్పటికీ..అత్యంత సాదాసీదాగా జీవిస్తారు సుధా. ఆమె నుంచి సాధారణ జీవితంలోని గొప్పతనం, పొదుపుగా ఉండటం రెండూ నేర్చుకోవచ్చు. మనిషి వద్ద ఉండే అపారమైన మేధస్సు, జ్ఞానానికి మించిన గొప్ప వస్తువులు ఏమీ అవసరం లేదని సుమధామూర్తి ఆచరించి చూపిస్తున్నారు. అపారమైన సంపద ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె ఆహార్యం ఎందరికో స్ఫూర్తి. ఇక ఆమె అనేక పుస్తకాలు రచించారు, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా రాశారు.(చదవండి: ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!) -
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్‌లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్‌గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్‌కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ -
వారణాసిలో వార్ వన్ సైడే
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశలో జూన్ 1న పోలింగ్ జరుగనున్న వారణాసిలో వార్ వన్ సైడే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పోల్ అయ్యే ఓట్లలో అత్యధిక శాతం ప్రధాని మోదీకే పడటం ఖాయమన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో ఆయన డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పాటు తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వారణాసిలో మోదీ విజయం ఖాయమని, అయితే దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. తెలుగు ఓటర్ల పోలింగ్ నూటికి నూరు శాతం జరిగేలా చూడాలని శ్రీరామ తారక ఆంధ్రాఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వి.వి.సుందర శాస్త్రిని కోరారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత పాల్గొన్నారు. -
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది. -
కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. యూపీలో ఆయన పర్యటనకు శనివారం రెండో రోజు. రాహుల్ ఈ ప్రయాణం ప్రారంభించి 35 రోజులైంది. యూపీ చేరుకున్న రాహుల్ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ఈ ప్రయాణంలో ఎన్నడూ ద్వేషాన్ని చూడలేదని, యాత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వారు కూడా వెంట వచ్చారన్నారు. వారు తనతో చక్కగా మాట్లాడారన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే దేశం పట్ల ప్రకటించే నిజమైన భక్తి అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ద్వేషం, భయాందోళనకర వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి వారణాసితో విడదీయరాని అనుబంధం ఉంది. పండిట్ నెహ్రూ 1910 నుండి 1950 వరకు అనేకసార్లు కాశీని సందర్శించారు. ప్రధాని అయ్యాక కూడా వారణాసికి వచ్చారు. ఇందిరా గాంధీ కూడా వారణాసిలో రాజకీయ, మతపరమైన పర్యటనలు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన తండ్రి పండిట్ మోతీలాల్ నెహ్రూతో కలిసి 1910లో మొదటిసారి కాశీకి వచ్చారు. ఆ తర్వాత 1921లో కాశీ విద్యాపీఠం స్థాపనకు హాజరయ్యారు. ఆ తర్వాత నెహ్రూ 1942, 1946లోనూ కాశీని సందర్శించారు. స్వాతంత్య్రానంతరం 1950, 1952లో పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి హోదాలో కాశీకి వచ్చారు. 1980 మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జరిపిన వారణాసి పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిందని చెబుతుంటారు. ఆరోజున ఇందిర సభ 1979, డిసెబర్ 31న రాత్రి 8 గంటలకు జరిగాల్సి ఉండగా, ఆమె జనవరి 1980, జనవరి ఒకటిన ఉదయం 10 గంటలకు 14 గంటలు ఆలస్యంగా వచ్చారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ జనం ఆమెను చూసేందుకు, ఆమె మాటల వినేందుకు ఎంతో ఆసక్తి చూపారు. #WATCH | Varanasi, UP: During the Bharat Jodo Nyay Yatra, Congress MP Rahul Gandhi says, "During the entire 'yatra' I never saw hatred. Even BJP and RSS people came in the yatra, and as soon as they came to us, they would speak to us nicely... This country strengthens only when… pic.twitter.com/GYCKQHQUZ7 — ANI (@ANI) February 17, 2024 -
కాశీలో హిందువుగా మారిన రష్యన్ మహిళ
విశ్వనాథుడు కొలువైన కాశీ నగరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి మహాశివుని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇదే కోవలో నిజమైన ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీకి వచ్చిన ఒక రష్యన్ మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఇంగా నుండి ఇంగానందమయిగా మారారు. వారణాసిలోని శివలా ఘాట్ సమీపంలోని వాగ్యోగ పీఠం వద్ద ఇంగానందమయి ఈ దీక్ష తీసుకున్నారు. ఇంగా రష్యాలోని మాస్కో నివాసి. ఈ దీక్షకు ముందు ఆమె భారతీయుల తరహాలో వస్త్రధారణ చేశారు. పూజలో కూర్చొని, సనాతన ధర్మ ప్రక్రియను అనుసరించి, హిందూ మతాన్ని స్వీకరించారు. పండితులు ఆశాపతి త్రిపాఠి నుండి ఇంగా దీక్షను స్వీకరించారు. అనంతరం ఆమె మహాశివునికి రుద్రాభిషేకం చేశారు. పండితులు ఆశాపతి త్రిపాఠి తనకు జీవితంలో ప్రశాంతతను అందించారని ఇంగా తెలిపారు. తాను ఇప్పటికే తాంత్రిక దీక్షను స్వీకరించానని, అయితే తనలోని అశాంతిని తొలగించుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ఇంగా తెలిపారు. శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శాంతించాలని ప్రార్థించానని ఇంగా పేర్కొన్నారు. -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
బాలరామునికి బొమ్మల బహుమానం
అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్ చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్‌లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందుకు ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్‌లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్ బ్యాంక్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!
ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కాశీలోని వ్యాపారులకు అయోధ్యలో వినియోగించబోయే ఐదు లక్షల కలశాలకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. జనవరి 15లోగా ఈ కలశాలను సిద్ధం చేసి అయోధ్యకు పంపనున్నారు. జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బనారసీ దుస్తులు, పూజా పాత్రలు ఇతర సరంజామాను ఇప్పటికే కాశీ నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. వీటిలో బనారసీ దుపట్టా, రామనామి, స్టోన్ క్రాఫ్ట్ జాలీ వర్క్, జర్దోసీ, వాల్ హ్యాంగింగ్ మొదలైనవి ఉన్నాయి. కాశీ-అయోధ్య మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ)నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ప్రముఖ జీఐ ఉత్పత్తులున్నాయని, హస్తకళలు, చేనేతలకు సంబంధించిన అత్యుత్తమ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఇత్తడి గంటలు, చేతి గంటలు, పూజా పాత్రలు, లోటాలు, సింహాసనాలు, కలశాలు, గొడుగు, స్టోన్ క్రాఫ్ట్ జాలి వర్క్ మొదలైనవి అయోధ్యకు పంపిస్తున్నారన్నారు. మెటల్ క్రాఫ్ట్‌లోనే రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని చౌక్ నివాసి మెటల్ క్రాఫ్ట్ స్టేట్ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ కసెరా తెలిపారు. కాశీ ఉత్పత్తులకు అయోధ్య నుంచి గరిష్టసంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. చెక్కతో చేసిన రామ్ దర్బార్ కోసం వచ్చిన 1.25 లక్షల ఆర్డర్లు పూర్తయ్యాయని జాతీయ అవార్డు గ్రహీత రామేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడు మరో లక్ష ఆర్డర్లు వచ్చాయని, వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇది కూడా చదవండి: అసోంలో ఇక శాంతి పవనాలు -
సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు?
ఉత్తర భారతదేశంలో ఈవీ రామసామి నాయకర్ ‘పెరియార్’.. నాస్తికునిగా, హిందీ వ్యతిరేకిగా పేరొందారు. పెరియార్‌కు సంబంధించి ఇటువంటి పరిచయం తప్పు కానప్పటికీ, ఇది ఏకపక్ష భావన అనే వాదన కూడా వినిపిస్తుంటుంది. పెరియార్ సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన సన్యాసం స్వీకరించిన తరువాత ఉత్తర భారతదేశానికి వచ్చి, ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన కాశీలో నివసించాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక ఘటన పెరియార్‌ను నాస్తికునిగా మార్చివేసింది. పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి పేరు వెంకట్ నాయకర్. తల్లి పేరు చిన్న తాయమ్మాళ్ అలియాస్ ముత్తమ్మాళ్. పెరియార్ తండ్రి ఆ ప్రాంతంలో సంపన్న వ్యాపారవేత్త. 1944 డిసెంబర్లో కాన్పూర్‌లో ఒక ప్రసంగంలో పెరియార్ స్వయంగా ఇలా అన్నారు.. ‘నా కుటుంబం సనాతన సంప్రదాయాన్ని పాటించే కుటుంబం. దేవాలయాలు, సత్రాలు నిర్మించి ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించడానికి పాటుపడిన కుటుంబం. మా కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు విరాళాలు అందించారు. అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ నన్ను చాలా మంది విప్లవవాది, అతివాది అంటారు. దీని వెనుక కారణం ఏమిటంటే.. మన సమాజంలో ఉండకూడని కొన్ని అంశాలపై నేను దాడి చేశాను’ అని పేర్కొన్నారు. పెరియార్ జీవితంపై రాజ్‌కమల్ ప్రకాశన్ మూడు సంపుటాలుగా పుస్తకాలను ప్రచురించింది. పెరియార్‌కు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉందని ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇదే పెరియార్‌ను సన్యాసం దిశాగా తీసుకువెళ్లింది. పెరియర్ తన ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి, గంగా నది ఒడ్డున ఉన్న కాశీ (వారణాసి)కి చేరుకున్నారు. సన్యాసి అయినందున అక్కడి ధర్మశాలలో లభించే ఉచిత ఆహారం కోసం ఆశించారు. అయితే అతనికి ఎక్కడా ఉచితంగా ఆహారం లభించలేదు. ఉచిత భోజన సౌకర్యం కేవలం బ్రాహ్మణులకు మాత్రమేనని అక్కడున్నవారు పెరియార్‌కు చెప్పారు. కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించిన యువ పెరియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. అంతే.. పెరియర్ బ్రాహ్మణ వేషం ధరించారు. జంధ్యాన్ని ధరించి, ఆహారం కోసం ధర్మశాలకు వెళ్లారు. అయితే ఇందుకు అతని మీసం అడ్డంకిగా మారింది. పెరియార్ పుస్తకంలోని వివరాల ప్రకారం.. గేట్ కీపర్ పెరియార్‌ను లోపలికి రాకుండా ఆపడమే కాకుండా, రోడ్డుపైకి నెట్టివేశాడు. అప్పటికే లోపల భోజన కార్యక్రమం పూర్తికావడంతో, ఎంగిలి ఆకులను రోడ్డుపై పడేశారు. చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తున్న పెరియార్ మరోమార్గం లేక ఆ ఎంగిలి ఆకుల్లో మిగిలిన ఆహారాన్ని తినవలసి వచ్చింది. ఈ సమయంలో వీధి కుక్కలు కూడా ఆ ఆకులలోని ఆహారాన్ని తినడానికి ఎగబడ్డాయి. ఎంగిలి ఆహారం తింటున్నప్పుడు పెరియార్ దృష్టి ఎదురుగా గోడపై రాసిన అక్షరాలపై పడింది. ‘ఈ ధర్మశాల ముఖ్యంగా అత్యున్నత కులానికి అంటే బ్రాహ్మణులకు చెందినది. ఈ ధర్మశాలను తమిళనాడుకు చెందిన ధనిక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించారు’ అని రాసివుంది. పెరియార్ మనసులో అకస్మాత్తుగా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి..‘ఈ ధర్మశాలను ఒక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించినప్పుడు, బ్రాహ్మణులు..ఇతర ద్రావిడులు ఇక్కడ ఆహారం తినకుండా ఎలా అడ్డుకుంటారు? బ్రాహ్మణులు క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ద్రావిడులతో సహా ఇతర వర్గాలను ఆకలితో చంపడానికే నిశ్చయించుకుని, కుల వ్యవస్థ పేరుతో ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వారు వెనుకాడరా?' పెరియార్ మదిలో మెదిలిన ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. కాశీలో బ్రాహ్మణులు చేసిన అవమానం పెరియార్ హృదయాన్ని గాయపరిచిందని ఆ పుస్తకం వెల్లడించింది. ఇదే అతని మనసులో కుల వ్యవస్థపై తీవ్ర ద్వేషాన్ని రగిలేలా చేసింది. దీంతో కాశీ ఒక పవిత్ర నగరం అని అనడాన్ని పెరియార్ ఒక భ్రమగా భావించారు. కొంతకాలానికి సన్యాసాన్ని వదిలివేసి, కుటుంబ సభ్యులు చెంతకు చేరారు. ఇది కూడా చదవండి: నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి.. -
కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. ‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు. విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది. నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. ‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి. ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు. -
వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది?
వినోబా భావే పాత్ర భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినోబా భావే స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే, దేశానికి సేవ చేయాలనే తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగించారు. గాంధీజీని కలిసిన తర్వాత తన జీవిత లక్ష్యాలను వినోబా భావే అంకితభావంతో ఎలా సాగించాడో అతని జీవిత ప్రయాణం చెబుతుంది. గాంధీజీ మరణానంతరం మహాత్ముని జీవన విధానాలను సజీవంగా నిలిపివుంచి, దేశ సేవను కొనసాగించిన వారిలో ఆయన ఒకరు. భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ వినోబా భావే 1895 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని గగోడా గ్రామంలో జన్మించారు. చిత్పావ్ బ్రాహ్మణ నరహరి భావే, రుక్మణి బాయిల ఐదుగురు పిల్లలలో వినోబా పెద్దవాడు. వినోబా చిన్నప్పటి నుంచి తెలివైన పిల్లాడిగా గుర్తింపు పొందారు. తల్లి సాంగత్యంలో ఆయనకు మొదటి నుంచీ భగవంతునిపై నమ్మకం, ఆధ్యాత్మికతపై ప్రేమ ఏర్పడింది. తార్కిక ఆలోచనలు కలిగిన వినోబా తన తండ్రి నుండి గణితం, సైన్స్ నేర్చుకున్నారు. తండ్రి చెప్పారని ఫ్రెంచ్, తల్లి కోరిక మేరకు సంస్కృతం.. వినోబా హైస్కూల్‌కు చేరుకున్న తర్వాత అతని తండ్రి వినాయక్ ఫ్రెంచ్ నేర్చుకోవాలని కోరగా, అతని తల్లి సంస్కృతం నేర్చుకోవాలని కోరింది. వినాయక్ హైస్కూల్లో ఫ్రెంచ్ను ఎంచుకున్నారు. తల్లి కోరిక మేరకు ఇంట్లో సంస్కృతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వినాయక్‌కు చదువుపై ఉన్న ఆసక్తి కారణంగా మతపరమైన పుస్తకాలు చదివేవారు. ఫ్రెంచ్ సాహిత్యంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు కూడా శ్రద్ధగా చదివారు. ఈ నేపధ్యంలో వినోబా ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతూ వచ్చింది. అతను తన జీవిత లక్ష్యాలపై మరింత లోతుగా ఆలోచించేవారు. కాశీలో రైలు దిగిపోయి.. ఆ రోజుల్లో వినోబా చదువుకోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. 1916 మార్చి 25న ముంబై వెళ్లేందుకు రైలు ఎక్కారు. అయితే అక్కడ చదువు పూర్తయ్యాక ఏం చేయాలి? తన జీవిత లక్ష్యం ఏమిటి? ఏం చేయాలి అనే ప్రశ్నలు మనసులో కలకలం రేపాయి. ఇంతలో వినోబా ప్రయాణిస్తున్న రైలు సూరత్ చేరుకుంది. ఆయన అక్కడ రైలు దిగి, హిమాలయాలవైపు పయనమయ్యేందుకు తూర్పు వైపునకు వెళ్లే రైలులో కూర్చున్నారు. అయితే కాశీలో రైలు దిగిపోయాడు. శివుని నివాసమైన కాశీలో తనకు సరైన మార్గాన్ని చూపించగల ఋషులు, సాధువులను కలుసుకోవచ్చని భావించారు. గంగా తీరంలో చాలా కాలం పాటు తిరిగారు. అక్కడ తాను ఆశించినది దొరకకపోవడంతో హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా... ఆ సమయంలో యాదృచ్ఛికంగా హిందూ విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరుగుతోంది. దీనిలో గాంధీజీ ధనవంతులకు ఒక విజ్ఞప్తి చేశారు. వారు తమ సంపదను పేదల సేవకు వినియోగించాలని కోరారు. అ అంశంపై జరిగిన చర్చ మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురితమైంది. వినోబాకు ఈ వార్తాపత్రిక కనిపించింది. అందులో గాంధీజీ గురించి చదివిన తర్వాత, గాంధీజీ మాత్రమే తనకు సరైన మార్గాన్ని చూపగలరని వినోబా భావించారు. దీంతో వినోబా స్వయంగా గాంధీజీకి లేఖ రాయగా, గాంధీజీ దానికి సమాధానమిస్తూ ఆహ్వానం పంపారు. ఈ మేరకు వినోబా.. గాంధీజీ ఆశ్రమం ఉన్న అహ్మదాబాద్‌కు బయలుదేరారు. వారిద్దరూ 1916 జూన్ 7న తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు. గాంధీజీ అతనికి వినోబా అని పేరు పెట్టారు. అంతకు ముందు అతని పేరు(వినాయక్ నరహరి భావే). గాంధీజీని కలిసినది మొదలు వినోబా గాంధేయవాదిగా మారారు. అదే బాటలో జీవితాన్ని కొనసాగించారు. ఇది కూడా చదవండి: ‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా? -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
ఆలయానికి ఇటలీ యువతి, కాశీ యువకుడు.. వదంతులకు పూజారి చెక్!
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరని అంటారు. దీనికి ఇప్పుడు మరో తాజా ఉదాహరణ మనముందు నిలిచింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ ఆలయంలో సందడి నెలకొంది. ఈ ఆలయానికి ఒక జంట వచ్చారు. ఆలయంలో మహాశివుడిని దర్శించుకున్న ఆ జంటను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ జంట వేర్వేరు దేశాలకు చెందినవారు కావడమే అందుకు కారణం. వారణాసికి చెందిన యువకుడు, ఇటలీకి చెందిన యువతి జంటగా వచ్చారు. వారు ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే వారు త్రిలోచన్ ఆలయంలో వివాహం చేసుకున్నారనే వదంతులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ దంపతులు త్రిలోచన్ మహాదేవ్ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేపధ్యంలో వారికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటకు సంబంధించిన వివరాలను త్రిలోచన్ మందిరం ప్రధాన పూజారి సోనూ గిరి మాట్లాడుతూ ఆ జంటకు ఈ ఆలయంలో పెళ్లి జరిగిందనేది అవాస్తవమని, రిజిస్ట్రేషన్ లేకుండా ఇక్కడ పెళ్లిళ్లి చేయమని అన్నారు. వారణాసికి చెందిన అఖిలేష్ విశ్వకర్మ, ఇటలీకి చెందిన తానియా ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడ పూజలు చేసేందుకు మాత్రమే వచ్చారన్నారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం వారణాసి జిల్లాలోని కార్ఖియాం గ్రామ నివాసి అఖిలేష్ విశ్వకర్మ 2016లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చేసిన తరువాత కతర్ దేశం వెళ్లాడు. అక్కడ కతర్ ఎయిర్వేస్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉద్యోగం పొందాడు. కొద్దిరోజుల తరువాత అతనికి ఇటలీకి చెందిన తానియాతో ప్రేమ ఏర్పడింది. తరువాత వారిద్దరూ జార్జియాలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే అఖిలేష్ తన భార్యతో పాటు ఇంటికి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే వారు త్రిలోచన్ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ తానియా ఇటలీలో పుట్టిందని, ఆమె ఫిలిప్పీన్స్‌లో చదువుకున్నదని తెలిపారు. తానియా తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారన్నారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! -
బెయిల్ ఇప్పించి చంపేశాడు
బరేలీ: ప్రతీకారంతో రగిలే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామంలో కాశీ కాశ్యప్(50) అనే వ్యక్తి అదే చేశాడు. తన కొడుకును చంపి జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చి మరీ హత్య చేశాడు. కాశీ దంపతులకు జితేంద్ర(14) అనే కొడుకున్నాడు. 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు. తర్వాత అతని భార్యకు సమీప బంధువైన శత్రుధన్ లాలా (47)తో అక్రమ సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తమకు అడ్డుగా ఉన్న జితేంద్రను చంపేశారు. ఈ కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. గతేడాది కాశీ జైలు నుంచి బయటికొచ్చాడు. కొడుకును పొట్టనపెట్టుకున్న లాలాపై ప్రతీకారంతో రగిలిపోయాడు. సొంత ఖర్చుతో లాయర్‌ను ఏర్పాటు చేసి మరీ లాలాను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి అతన్ని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు. -
కాశీలో తెలుగు సంగమం గంగా పుష్కర్ ఆరాధన...ముఖ్య అతిధిగా మోదీ
-
కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ
లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో నిర్వహించినవి.. ► ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం. ► వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం. ► మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన, గంగా హారతి. చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
Rk Roja: రిక్షాలో మంత్రి ఆర్కే రోజా ప్రయాణం
నగరి(చిత్తూరు జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆర్కే రోజా వెళ్లారు. అయితే వారణాశిలోని వీధుల్లో మంత్రి రోజా రిక్షాలో తిరుగుతూ సందడి చేశారు. 144 ఏళ్ల తరువాత శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి రావడంతో ఈ పర్వదినాన కాశీవిశ్వేశ్వరుని శనివారం ఆమె దర్శించుకున్నారు. గంగా హారతి అనంతరం తానో మంత్రి, సెలబ్రిటీ అని మరచి కాసేపు ఓ సాధారణ భక్తురాలిలా రిక్షాలో ప్రయాణించారు. -
మహా శివరాత్రికి కాశీలో ఏపీ మంత్రి రోజా
-
RK Roja: కాశీలో ఏపీ మంత్రి రోజా
సాక్షి, వారణాసి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక నగరం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని.. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపై.. కాశీ వీధుల్లో రిక్షాలో మంత్రి రోజా చక్కర్లు కొట్టారు. రిక్షా ఎక్కి ఆమె నగరంలో పర్యటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చదవండి: సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు -
పంచెకట్టులో మోదీ.. కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించిన ప్రధాని
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ-తమిళ సంగమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై, సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాశీలో నేటి నుంచి నెల రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న పురాతన సంస్కృతి, శతాబ్ధాల జ్ఞానాన్ని పంచుకునే లక్ష్యంతో కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి యూపీ సర్కార్ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన వారిని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. ‘సంగమం’ భారతదేశ విభిన్న సంస్కృతుల వేడుక అని అన్నారు. మన దేశంలోని నదుల సంగమం, జ్ఞానం, ఆలోచనల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాశీ-తమిళనాడు సంగమం, గంగా యమునా సంగమం లాగే పవిత్రమైనదని తెలిపారు. కాశీ.. భారత దేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధాని అయితే తమిళనాడు.. దేశ పురాతన చరిత్రను కలిగి ఉందని వ్యాఖ్యినించారు. చదవండి: బుల్డోజర్లతో కూల్చివేతలు.. కథలేమైనా ఉంటే ఆ డైరెక్టర్‌కి చెప్పండి.. సినిమా తీస్తారు! ఇక కాశీలో 30 రోజుల పాటు తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమిళ వంటకాలు యూపీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. తమిళ సంగీతం కాశీలో మారుమోగనుంది. కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది ఇవాళ వారణాసి చేరుకున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు. In Varanasi, addressing the 'Kashi-Tamil Sangamam.' It is a wonderful confluence of India's culture and heritage. https://t.co/ZX3WRhrxm9 — Narendra Modi (@narendramodi) November 19, 2022 -
కాశీకి పోలేము రామాహరి!
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లిరావాలని చాలా మంది పెద్దల కోరిక. అంతదూరం ప్రయాణించాల్సి రావడంతో.. కాశీకి వెళితే కాటికి వెళ్లినట్టే అన్న సామెత కూడా పుట్టింది. ఇప్పుడు ఇంతగా ప్రయాణ సౌకర్యాలు పెరిగినా మన రాష్ట్రవాసులకు మాత్రం కాశీ యాత్ర కష్టాలు మాత్రం తప్పడం లేదు. అంత దూరం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించలేక, విమాన ప్రయాణ ఖర్చులు భరించలేక.. రైళ్లను ఆశ్రయించే భక్తులు తిప్పలు పడుతున్నారు. రెండు నెలల ముందు రిజర్వేషన్ కోసం బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టే ఉంటూ.. సగం మందికి కూడా సీట్లు మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు. హైదరాబాద్ నుంచి రోజూ ఒక్క రైలు మాత్రమే ఉండటం దీనికి కారణం. అంతేకాదు కాశీ వెళ్లే భక్తులతోపాటు ఉత్తరాదికి వెళ్లే ఇతర ప్రయాణికులూ ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దీనితో భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకుని మళ్లీ టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా రైలు లేదు: కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగు వారే ఎక్కువ. నిత్యం రెండు వేల మంది వరకు కాశీకి వెళతారని ఒక అంచనా అందులో రైలు ద్వారా వెళ్లేవారు వెయ్యి మందికిపైగా ఉండగా.. మిగతా వారు రోడ్డు మార్గంలో, అతికొద్ది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. బిహార్ నుంచి వచ్చి, తిరిగి వెళ్లే కూలీలకూ ఈ రైలే దిక్కు. అయితే ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ఆయా మార్గాల్లో క్లోన్ రైళ్లను నడిపేది. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో మరో రైలును అదనంగా నడిపేది. దానితో కొంత వరకు వెయిటింగ్ లిస్టు ప్రయా ణికులకు అవకాశం దక్కేది. ఇలా సికింద్రాబాద్–దానాపూర్ మధ్య ఓ క్లోన్ రైలును నడిపేవారు. కానీ కరోనా ఆంక్షల సమయంలో నిలిపివేసిన ఆ రైలును మళ్లీ పునరుద్ధరించలేదు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం స్వయంగా రైల్వే బోర్డును కోరినా స్పందన రాలేదు. రైల్వే స్పందించి అదనపు రైలు వేయాలని, లేదా క్లోన్ రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
Sakshi Cartoon: ఆధ్యాత్మిక క్షేత్రాలను మేల్కొల్పాలి-యోగి ఆదిత్యనాథ్
ఆధ్యాత్మిక క్షేత్రాలను మేల్కొల్పాలి-యోగి ఆదిత్యనాథ్ -
ఆధ్యాత్మిక క్షేత్రాలను మేల్కొల్పాలి: యోగి
లక్నో: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆలయ నగరం కాశీని మేల్కొల్పాల్సిన అవసరం మన ముందు ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మథుర, బృందావన్, వింధ్యావాసిని ధామ్, నైమిష్ థామ్ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సైతం మరోసారి మేల్కొల్పాలని అన్నారు. అయోధ్య తర్వాత కాశీ వంతేనని పరోక్షంగా వెల్లడించారు. మథుర, కాశీలో మందిరం–మసీదుపై చట్టపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మత కలహాలు లేవని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఆయన ఆదివారం లక్నోలో బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈసారి ఈద్ చివరి శుక్రవారం నమాజ్‌ను రోడ్లపై జరపలేదని గుర్తుచేశారు. ఇలా జరగడం ఉత్తరప్రదేశ్‌లో ఇదే తొలిసారి అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని ప్రజలు శాంతియుతంగా జరుపుకున్నారని వెల్లడించారు. ప్రార్థన స్థలాల్లో లౌడస్పీకర్ల వినియోగంపై స్పందిస్తూ.. అనవసరమైన శబ్దాలు లేని పరిస్థితి రావాలని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. -
కాశీ, మథురలను హిందువులకు అప్పగించాలి
కాశీ విశ్వనాథ్ మందిరం – జ్ఞానవాపి మసీదు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇస్లాం నిజంగానే శాంతి కాముక మతమని నిరూపించుకునేందుకు కాశీ, మథురలను హిందువులకు అప్పగించాలి. అయితే కొత్తగా మరి ఏ ఇతర ప్రార్థనా స్థలాలపై హక్కులు కోరబోమన్న భరోసాను ముస్లింలకు హిందువులు కూడా కల్పించాలి. బాబ్రీ మసీదు విధ్వంసా నికి దాదాపు ఏడాదిన్నర ముందే వివాద పరిష్కారం కోసం ఓ ప్రత్యామ్నా యాన్ని ప్రతిపాదించారు ఇద్దరు ముస్లిం ఆలోచనాపరులు. ఈ ఇద్దరిలో ఒకరైన ప్రముఖ పరిశో ధకులు సంఘ సంస్కర్త యాసిన్ దలాల్ 1991లో ‘బిజినెస్ అండ్ పొలిటికల్ అబ్జర్వర్’లో ‘ముస్లిమ్స్ షుడ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్’ పేరుతో రాసిన ఓ కథనంలో ‘‘తగిన సమయంలో బాబ్రీ మసీదును ఇంకో చోటికి తరలించడం ద్వారా బాబ్రీ కమిటీ వీహెచ్‌పీ–బీజేపీ ప్రాబల్యాన్ని ఆశ్చర్యకరంగా తగ్గించి ఉండ వచ్చు. ఈ చర్య రామ జన్మభూమి మద్దతుదారులకు అశనిపాతంలా మారి ఉండేది. కానీ దీనికి బదులుగా అటు ప్రభుత్వమూ, ఇటు ముస్లిం నేతలిద్దరూ మొండి పట్టుదలకు పోయారు. తద్వారా తమకు తెలియకుండానే బీజేపీ గెలుపునకు దోహదపడ్డార’’ని రాశారు. యాసిన్ దలాల్ మాత్రమే కాదు... సీనియర్ జర్నలిస్ట్ ఎల్.హెచ్. నఖ్వీ కూడా బీజేపీకి మద్దతివ్వడం ద్వారా ముస్లింలు దిక్కుమాలిన రాజకీయం తీరుతెన్నులను మార్చేయాలని అప్పట్లో పిలుపునిచ్చారు. ‘మంథన్’ 1991 జూన్ సంచికలో ఆయన ఒక కథనం రాస్తూ... ‘‘కాంగ్రెస్ మైనార్టీ వర్గాల్లో ఒక అభద్రతా భావాన్ని పెంచి పోషించిందని ఆరో పించారు. అందుకే ఇప్పుడు ముస్లింలు బీజేపీకి మద్దతిస్తే తప్పేంటి?’’ అని వ్యాఖ్యా నించారు. ముందుగా చెప్పినట్లు ఈ రెండు వ్యాసాలూ రాసింది బీజేపీకి బద్ధ వ్యతిరేకులైన ఇద్దరు ముస్లిం ఆలోచనాపరులు. ఇద్దరి ఉద్దేశాలూ శాంతిస్థాపనే. తర్కయుతమైన ఆలోచనలే. ముస్లిం నేతలు ఇలాంటి వారి మాటలు విని ఉంటే అపార ప్రాణ నష్టం నివారించేందుకు అవకాశం ఉండేది. ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ కె.కె. ముహమ్మద్ వాంగ్మూలం ద్వారా ఇప్పుడు మనకు ఇంకో విషయం కూడా తెలుసు. మార్క్సిస్ట్ చరిత్ర కారులు అస్తవ్యస్తతకు పాల్పడి ఉండకపోతే ముస్లింలు రామజన్మభూమి స్థలాన్ని ఎప్పుడో అప్పగించి ఉండేవారని ఆయన అన్నారు. కాశీ విశ్వనాథ్ మందిరం, జ్ఞానవాపి మసీదు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో సహజంగానే కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. –ఇస్లాం నిజంగానే శాంతి కాముక మతమని నిరూపించుకునేందుకు కాశీ, జ్ఞానవాపీ దేవాలయాల సముదాయాన్ని తిరిగి తమకి ఇచ్చేయాలన్న హిందువుల డిమాండ్‌ను నేరవేర్చడం అనేది ప్రస్తుత ముస్లిం నేతలకు మంచి అవకాశం. మరి వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా? – జ్ఞానవాపి మాదిరిగానే దేశంలో అనేక ఇతర డిమాండ్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పడేది ఎలా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ముస్లిమేతరుల దేవాలయాలను ధ్వంసం చేయడం... ఇస్లామిక్ ప్రార్థన స్థలాలను నిర్మించడం ఇతర మతస్థులందరిపై జరిపిన దాడి, దుందుడుకు చర్య. వారిని దాస్యులుగా చేసుకునేందుకు చేసిన ప్రయత్నం. అప్పటివరకూ ఉన్న ‘‘తప్పులతో కూడిన విశ్వాసాలు, అజ్ఞాన యుగాన్ని అంతరింపజేసి’’ ప్రత్యామ్నాయంగా ఇస్లాంను స్థాపించడం ప్రాథమికమైన లక్ష్యం. ఇప్పటికీ ఇదే రకమైన భావజాలాన్ని అనుసరించే శక్తిమంతమైన ఇస్లామిక్ రాజకీయం నడుస్తూనే ఉంది. వేదాంతంలో వైవిధ్యాన్ని వీరు సహించ లేరు. అదే సమయంలో వీటిని తమ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నమూ చేస్తారు. హిందువులు నివసించే భూభాగంలో కాశీ, మథుర, అయోధ్యలు మూడు పుణ్యక్షేత్రాలు. ప్రపంచంలో ఉండే హిందువులందరూ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని కోరుకుంటారు. మరి.. అటువంటి వాళ్లు ఇక్కడికొస్తే కనిపించేదేమిటి? అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో మసీదులు కనిపిస్తాయి. ఇది వారిని బాధిస్తుంది. హేళన చేసినట్టుగానూ ఉంటుంది. వారి మనసులకయ్యే గాయాలు ఎంతో కాలంగా అలా పచ్చిగానే ఉన్నాయి. ఈ దేశ సామరస్యాన్ని దెబ్బతీయగల టైమ్ బాంబులు ఈ మానని గాయాలు! భారీయుద్ధం, జన నష్టం తరువాత అయోధ్య సమస్య కొంత సమసిపోయింది. మరి కాశీ, మథురల పరిస్థితి ఏమిటి? కార్యాచరణ ఏమైనప్పటికీ శివుడి దర్శనం కోసం ఓ నంది, తన జన్మస్థానాన్ని పొందేందుకు కృష్ణుడు మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే. ఒకవేళ న్యాయ, రాజకీయ యుద్ధాల్లో హిందువులు బలవంతంగా పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే... హిందువులను కించపరిచే బుద్ధి ఇంకా కొనసాగుతూనే ఉందని అనుకోవాలి. అదే జరిగితే ఇస్లాం చొరబాటుదారులు ధ్వంసం చేసిన, బలవంతంగా ఆక్రమించిన ప్రతి దేవాలయంపై హక్కులు కోరడంలో తప్పేమీ ఉండదు. దీనికి బదులుగా ముస్లిం నేతలు కాశీ, మథురలను తమంతట తాముగా అప్పగిస్తే హిందువులు దాన్ని అంగీకరించాలి. ఆ తరువాత హిందూ ధర్మాచార్యులు కొత్తగా ఎలాంటి ప్రార్థనా స్థలాలపై హక్కులు కోరబోమన్న భరోసాను ముస్లింలకు కల్పించాలి. (👉🏾చదవండి: ఈ సర్వేల ‘న్యాయం’ ఎన్నాళ్లు?) - అరవిందన్ నీలకంఠన్ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్, ‘స్వరాజ్య’ -
తుదిశ్వాస దాకా వారణాసి ప్రజలకు సేవలు
వారణాసి: జీవితంలో ఆఖరి రోజుల్లోనే చాలామంది వారణాసి(కాశి)కి వస్తుంటారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తాను తుదిశ్వాస విడిచేదాకా వారణాసి ప్రజలకు సేవలందిస్తూనే ఉంటానని చెప్పారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు వారి పార్టీలను సొంత ఆస్తులుగా భావిస్తున్నారని, అలాంటివారు కార్యకర్తల పార్టీ అయిన బీజేపీని ఎప్పటికీ చాలెంజ్ చేయలేరని పేర్కొన్నారు. తాను కాశీలోనే చనిపోవాలని ఎవరైనా ప్రార్థిస్తే సంతోషిస్తానని తెలిపారు. వారణాసి గానీ, వారణాసి ప్రజలు గానీ తనను ఎప్పటికీ వదులుకోరనే విషయం తనకు అర్థమైందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలే తనకు ఒక విశ్వవిద్యాలయమని, వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని ప్రధాని మోదీ వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ చరిత్రాత్మక, ఆధ్యాత్మిక నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం పవిత్ర గంగానది తీరాన్ని తాకిందని హర్షం వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును అందరూ గర్వకారణంగా భావిస్తుంటే, కొందరు మాత్రం మతం కోణంలో చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. -
హిందూయేతరులు ఘాట్‌కు రావద్దు
వారణాసి: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తొలగించిన పోలీసులు ఇవి ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయవాద సంస్థలు వీటి వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నాలు, వీటిపై నమ్మకమున్నవారికి స్వాగతం, లేదన్న వారు ఇది పిక్నిక్ స్పాట్ కాదని గుర్తుపెట్టుకోండి’ అని ఈ పోస్టర్లలో రాశారు. వీటిపై హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అనే శీర్షికనుంచారు. ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అనే బెదిరింపులు కూడా వీటిపై ఉన్నాయి. ఈ పోస్టర్ల ఫొటోలు, వీడియోలను వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దర్శనమిచ్చాయి. భేల్‌పూర్ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో, ఫొటోల్లోని కొందరిని గుర్తించామన్నారు. హిందూయేతరులు ఘాట్ల పవిత్రతను దెబ్బతీస్తారని, అందుకే వీరికి ఈ వార్నింగ్ ఇచ్చారని బజరంగ్దళ్ నేత నిఖిల్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. వీరంతా ఘాట్లలో మద్యం తాగడం, మాంసం తినటం చేస్తారని ఆరోపించారు. ఇటీవలే కొందరు బాలికలు ఘాట్లలో బీర్లు తాగుతున్న ఫొటోలు బయటపడ్డాయని, ఇలాంటి వారు తమకు పట్టుబడితే పోలీసులకు అప్పజెబుతామని హెచ్చరించారు. -
కాశీ సాక్షిగా నవశకం
భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుంది. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలి. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలి. కాశీ కారిడార్ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుంది. భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోం ది. ఈ చరిత్రకు సాక్షులం కావడం మన అదృష్టం. ► కాశీ ఆలయం గతంలో 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేది. ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చు. శివుడి రక్షణలోని కాశీ ఎన్నటికీ నాశనం కాబోదు. ► కాశీ విశ్వనాథ్ ధామం ఒక భారీ భవంతి మాత్రమే కాదు. దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ ధామంతోపాటు బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడు. సాలార్ మసూద్ మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్దేవ్ అతడిని ఎదుర్కొంటాడు. మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడు. ఎన్నో కుతంత్రాలను తట్టుకుని కాశీ సగర్వంగా నిలిచింది. నవ చరిత్రకు సాక్షులం ► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ ఉద్భవిస్తాడు ► సాలార్ మసూద్ వస్తే రాజా సుహల్దేవ్ ఎదుర్కొంటాడు ► భారత్ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు ► దేశ నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీక కాశీ ► మహోన్నత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది ► కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం వారణాసి: భారతదేశ నాగరిక వారసత్వానికి, ఔన్నత్యానికి కాశీ నగరం గొప్ప ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకులు కాశీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని, అప్పటి దాడులు, దౌర్జన్యకాండ చరిత్ర పుటల్లో చీటిక అధ్యాయాలుగా మిగిలిపోయాయనని అన్నారు. మన ప్రాచీన పవిత్ర నగరం కాశీ తన మహోన్నతమైన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కాశీ కర్మభూమి, జన్మభూమి అన్నారు. ప్రధాని మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శతాబ్దాల బానిసత్వం భారత్‌ను ఆత్మన్యూనతకు గురిచేసిందని, ఆ ప్రభావం నుంచి దేశం క్రమంగా బయటపడుతోందని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుందని, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోందన్నారు. ఈ నవ చరిత్రకు సాక్షులం కావడం మనం అదృష్టమని చెప్పారు. ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడని, సాలార్ మసూద్(భారత్‌పై దండెత్తిన ముస్లిం) మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్దేవ్ అతడిని ఎదుర్కొంటాడని, మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడని అన్నారు. ఔరంగజేబు, సాలార్ మసూద్, వారెన్ హేస్టింగ్స్ లాంటి వాళ్లు కాశీని ధ్వంసం చేయడానికి ఎన్నో కుతంత్రాలు సాగించారని, అన్నింటినీ తట్టుకొని నగరం సగర్వంగా నిలిచిందని చెప్పారు. సుల్తాన్లు వచ్చారు, పోయారు గానీ కాశీ మాత్రం స్థిరంగా నిలిచి ఉందని పేర్కొన్నారు. ఈ దేశం మట్టి మిగతా ప్రపంచం కంటే భిన్నమైనదని వివరించారు. తన ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హర హర మహదేవ్’ మంత్రాన్ని పఠించారు. అప్పుడప్పుడు స్థానిక యాసలో మాట్లాడుతూ ఆహూతులను ఆకట్టుకున్నారు. సనాతన సంస్కృతికి చిహ్నం రాణి అహల్యాబాయి కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పునర్నిర్మించారని, సిక్కు రాజు రంజిత్ సింగ్ ఈ గుడి గోపురాలకు బంగారు పూత వేయించారని మోదీ గుర్తుచేశారు. కాశీ విశ్వనాథ్ ధామం కేవలం ఒక భారీ భవంతి మాత్రమే కాదని, దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం అని వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ ధామంతోపాటు సముద్రంలో వేలాది కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్, పేదల కోసం లక్షలాది ఇళ్లను భారత్ నిర్మించుకుంటోందని, పరిశోధకులను అంతరిక్షంలోకి పంపిస్తోందని తెలిపారు. బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విశ్వనాథ్ ధామం పాత, కొత్తల మేలు కలయిక అని అన్నారు. మన శక్తిసామర్థ్యాలకు ఈ ధామం ఒక సాక్షిభూతమని, గట్టి పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని వివరించారు. సృజనాత్మకతకు పదును పెట్టండి భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదని మోదీ తేల్చిచెప్పారు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుందని చెప్పారు. స్వయం సమృద్ధ (ఆత్మనిర్భర్) భారత్ కోసం ప్రయత్నాలు కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలన్నారు. నమామి గంగా మిషన్‌ను విజయవంతం చేయాలన్నారు. భారత్ ఎన్నో శతాబ్దాలపాటు బానిసత్వం కింద మగ్గిపోయిందని, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఫలితంగా మన సృజనపై మనం నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో సృజనాత్మకతకు పదును పెట్టాలని ప్రజలకు సూచించారు. త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నామని, మరో 25 ఏళ్ల తర్వాత (100వ స్వాతంత్య్ర దినోత్సవాల నాటికి) ఇండియా ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అందుకోసం ఇప్పటినుంచి కృషి చేయాలని పేర్కొన్నారు. కాశీకి శివుడే రక్షణ కాశీ విశ్వనాథ ఆలయాన్ని భారీగా విస్తరించామని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో ఈ ఆలయం 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేదని, ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని చెప్పారు. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చని అన్నారు. శివుడి రక్షణలో ఉన్న కాశీ నగరం ఎన్నటికీ నాశనం కాబోదని వ్యాఖ్యానించారు. మోదీకి తలపాగా బహూకరణ మోదీ రాకతో వారణాసి సందడిగా మారింది. హర హర మహాదేవ్, మోదీ మోదీ అని నినదిస్తూ జనం ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లారు. కాలభైరవ మందిరం వద్ద కారులో ఉన్న మోదీ దగ్గరకు వచ్చేందుకు ఓ బ్రాహ్మణుడు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన మోదీ చేతులు ఊపారు. దీంతో భద్రతా సిబ్బంది సదరు బ్రాహ్మణుడిని అనుమతించారు. ఆయన మోదీకి గులాబీ రంగు తలపాగా, కాషాయం రంగు అంగవస్త్రాన్ని బహూకరించారు. మోదీ కటౌట్లు, పోస్టర్లతో కాశీ వీధులు నిండిపోయాయి. గంగా హారతి తిలకించిన ప్రధాని మోదీ 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి సోమవారం సాయంత్రం గంగా నదిలో ఓడపై విహరించారు. ప్రఖ్యాత దశాశ్వమేధ ఘాట్ వద్ద ఆగి, గంగా హారతిని తిలకించారు. కూలీలపై పూలవర్షం కాశీ విశ్వనాథ్ ధామం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వినమ్రంగా చేతులు జోడించి అభివాదం చేశారు. వారిపై పూల రేకులు చల్లారు. కూలీతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం వారితోపాటు కూర్చొని ఫొటో దిగారు. విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు సోమవారం ఉదయం కాశీకి చేరుకున్న మోదీ కాలభైరవ ఆలయంలో(కాశీ కా కొత్వాల్) ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసేందుకు స్వయంగా కలశంలో గంగా జలాన్ని సేకరించారు. ఆలయానికి చేరుకొని విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ్ ధామ్ ప్రాంగణంలో భారతమాత, మహారాణి అహల్యాబాయి హోల్కర్, ఆది శంకరాచార్య విగ్రహాలను అధికారులు ఏర్పాటు చేశారు. ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ ప్రారంభోత్సవంలో యూపీ సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వేలాది మంది మత గురువులు, సాధువులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారణాసిలో కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ప్రధాని మోదీ భరతమాత విగ్రహానికి నమస్కరిస్తూ.. -
దివ్య కాశీ – భవ్య కాశీ
గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమైన పవిత్ర కాశీ నగరాన్ని పునరుజ్జీవింపచేయడానికి ప్రధాని నరేంద్రమోదీ విశేష కృషి చేస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, చేపట్టారు. కాశీని సందర్శించే భక్తులకు సుసంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా కాశీని తీర్చిదిద్దడానికి ప్రధాని గొప్ప యజ్ఞానికి పూనుకున్నారు. ధార్మిక విశ్వాసాలకు కాశీ నెలవు. బౌద్ధ, జైనుల పవిత్ర గ్రంథాలలో కూడా కాశీ విశిష్టతను వివరించారు. హిందువుల ఆరాధ్య దైవం పరమ శివుడు కొలువుదీరిన క్షేత్రంగానే కాదు, బుద్ధ భగవానుడు తొలి ఉపన్యాసాన్ని ఇచ్చిన వైశిష్ట్యమూ ఈ కాశీ సొంతం. పురాతన కాశీ నగరాన్ని ఆధునికంగా, చైతన్యవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రధాని చేసిన కృషి నేడు ఫలిస్తోంది. ‘‘దివ్య కాశీ, భవ్య కాశీ’’ నినాదం మాత్రమే కాదు, దాని వెనుక స్పష్టమైన లక్ష్యం, దీర్ఘకాలిక వ్యూహం, మంచి ఆలోచనతో కూడిన కార్యాచరణ ఉన్నాయి. 2014 ఎన్నికలలో కాశీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా నరేంద్రమోదీ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ‘‘ఇక్కడ పోటీ చేయమని నన్ను ఎవరూ పంపలేదు, నాకు నేనుగానూ ఇక్కడ పోటీ చేయాలని అనుకోలేదు, నన్ను రమ్మని గంగమ్మ తల్లి పిలిచింది, ఆ పిలుపునకే నేను స్పందిస్తున్నాను’’ అని అన్నారు. తల్లి ఒడికి చేరుకునే బిడ్డ పొందే అనుభూతిని అనుభవిస్తున్నానంటూ కాశీతో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని ప్రధాని అనేక వేదికలపై వెల్లడించారు. గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమైన పవిత్ర కాశీ నగరాన్ని పునరుజ్జీవింపచేయడానికి ప్రధాని విశేష కృషి చేస్తున్నారు. ఇందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, చేపట్టారు. కాశీని సందర్శించే భక్తులకు సుసంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా కాశీని తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ గొప్ప యజ్ఞానికి పూనుకున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన కాశీ హిందువులకు పవిత్రమైన ధార్మిక క్షేత్రం. ప్రతి హిందువూ తన జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుడిని దర్శించాలని కోరుకుంటాడు. జీవిత చరమాంకంలో చివరి గడియలను కాశీ విశ్వనాథుడి చెంత, గంగమ్మ ఒడిలో గడపాలని ఆకాంక్షిస్తాడు. ధార్మిక విశ్వాసాలకు కాశీ నెలవు. వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారత తదితర ఇతిహాసాల్లో కాశీ ప్రస్తావన ఉంది. బౌద్ధ, జైనుల పవిత్ర గ్రంథాలలో కూడా కాశీ విశిష్టతను వివరించారు. హిందువుల ఆరాధ్య దైవం పరమ శివుడు కొలువుదీరిన క్షేత్రంగానే కాదు, బుద్ధ భగవానుడు తొలి ఉపన్యాసాన్ని ఇచ్చిన వైశిష్ట్యమూ ఈ కాశీ సొంతం. కాశీ దగ్గరలోని సారనాథ్‌లో బుద్ధ భగవానుడు తన తొలి ఉపన్యాసం ఇచ్చారు. జైన మతానికి చెందిన తీర్థంకరులలో సుపర్శ్వనాథ్ (7 వ), చంద్రప్రభు (8వ), శ్రేయాన్సనాథ్ (11 వ), పార్శ్వనాథ్ (23 వ) వంటి వారికి జన్మనిచ్చిన నగరం కాశీ. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మాధవాచార్యులు, గోరక్షనాథ్ వంటి ఆధ్యాత్మికవేత్తలకు సైతం కాశీతో విశిష్ట అనుబంధం ఉంది. భారతీయ సాహిత్యంలోనూ కాశీకి విశిష్ట స్థానం. కబీర్ దాస్, తులసీదాస్, రవిదాస్, మున్షి ప్రేమ్‌చంద్, భర్తెందు హరిశ్చంద్ర, జై శంకర్ వంటి వారు తమ రచనలు, పద్యాలు, కవితలు, కథల ద్వారా కాశీ ఔన్నత్యాన్ని గొప్పగా వివరించారు. భారతదేశంలోని ప్రతి పెద్ద సామ్రాజ్యానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు పవిత్రమైన కాశీ నగరంలో ఉన్నాయనడానికి ఇది నిదర్శనం. 14–18వ శతాబ్దం కాలంలో ధ్వంసమైన కాశీ నగరాన్ని 1777 – 80 కాలంలో రాణి అహల్యాబాయి హోల్కర్ పునః నిర్మించారు. మన జాతిపిత మహాత్మాగాంధీ కాశీలోని దుర్బర స్థితిని చూసి తీవ్ర ఆవేదన చెందారు. గాంధీజీ ఆత్మకథ ‘మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్‘ పుస్తకంలో 1916 కాశీ సందర్శనను ఉటంకిస్తూ ఇలా రాశారు, ‘‘నేను కాశీ విశ్వనాథుడి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే చాలా బాధ కలిగింది. ఈ బాధ మాటల్లో చెప్పినదాని కన్నా చాలా ఎక్కువ. అక్కడ ప్రశాంతత లేదు. గుంపులు గుంపులుగా ముసురుకున్న ఈగల శబ్దాలు, వ్యాపారుల అరుపుల ద్వారా భక్తులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు. ధ్యానం చేద్దామని ప్రశాంత వాతావరణం ఆశించి వచ్చే వారికి అక్కడ విరుద్ధమైన వాతావరణమే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ, ప్రశాంతతను ఎవరికి వారు సొంతంగా వెతుక్కోవాల్సి ఉంటుంది.’’ అని గాంధీ తన అనుభవాలను పంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చినా కాశీలోని పరి స్థితులు పెద్దగా మారలేదు. అందుకే పవిత్ర కాశీ నగరాన్ని అభివృద్ధి చేయాలని నరేంద్రమోదీ సంకల్పించారు. ఈ ఆలోచన ఆయన క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టక ముందునుంచీ ఉంది. రాణి అహల్యాబాయి అభివృద్ధి చేసిన 240 సంవత్సరాల తరువాత కాశీ నగరం ఇవాళ ఒక గొప్ప మార్పును చూస్తున్నది. ఈ మార్పు గొప్ప సంకల్పం, సృజనాత్మకత, ఏకాభిప్రాయంతో కూడుకున్నది. ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణాలకు సంబంధించిన అసలు యాజమానులను గుర్తించి, వారితో అనేకసార్లు చర్చలు జరిపి, వారిని ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయటానికి సిద్ధం చేశారు. ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం ద్వారా అక్కడున్న వ్యాపారులు, ధర్మశాలలు, మఠాలు, పాఠశాలలకు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసి, వారి జీవనానికి అవసరమైన ప్రత్యామ్నాయాలను చూపించారు. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో నివసిస్తున్న వారిలో చాలా మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నవారే. మార్కెట్ ధర కన్నా నాలుగు రెట్లు వారి ఆస్తులకు చెల్లించారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని పెద్ద కుటుంబాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారం చూపించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 40 వరకు అతి పురాతనమైన ఆలయాలు బయటపడ్డాయి. వివిధ నిర్మాణాలతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ పురాతన ఆలయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వాటిని సంరక్షించి, భక్తులు సందర్శించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాణి అహల్యాబాయి ఊహించిన విధంగానే కాశీ విశ్వనాథుని ఆలయం నేడు మణికర్ణిక, లలిత ఘాట్ల ద్వారా గంగానదికి చేరువగా ఉంది. 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో కూడిన చదును చేసిన మార్గం ఆలయాన్ని, గంగానది ఘాట్లను కలుపుతుంది. ఎటువంటి ఆంక్షలు లేని ఈ మార్గం ద్వారా సాయం సంధ్యా సమయంలో ఇచ్చే మహా హారతిని భక్తులు దర్శించుకోవచ్చు. వసతి సముదాయం, మరుగుదొడ్లు, లైబ్రరీ, మ్యూజియం, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రం వంటి అనేక సదుపాయాలను యాత్రికుల కోసం ఏర్పాటు చేశారు.3500 చదరపు మీటర్లలో కొలువుదీరిన ఆలయ పరిసరాలు, నీలకంఠుడి మంటపం, గంగానది కనిపించేలా ఉన్న కేఫ్‌లు, గొప్పగా అలంకరించిన 7 ద్వారాలు కాశీ విశ్వనాథ్ ధామ్ మరిన్ని ప్రత్యేకలు. భారతదేశంలోని రెండు రాజధానులు నేడు పునరుజ్జీవనాన్ని సంతరించుకుంటున్నాయి. పరిపాలన రాజధాని న్యూఢిల్లీ వలసవాద సంకెళ్లను తెంచుకొని, నాణ్యతారాహిత్య నిర్మాణాల నుంచి బయటపడుతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న స్థలాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని 21వ శతాబ్దానికి తగిన విధంగా మన పార్లమెంటు సభ్యులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. అదే విధంగా, కాశీ నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ సందర్శించే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మెరుగుపరచటంతో పాటు, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సహకరిస్తాయి. కేవలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనంతోనే సరిపెట్టకుండా, కాశీకి అనుబంధంగా ఉన్న రోడ్డు, రైలు, విమాన మార్గాలనూ అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి సంకల్పించారు. 7 సంవత్సరాల తరువాత ఈ నిర్మాణాత్మక మార్పు నేడు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పురాతన కాశీ నగరాన్ని ఆధునికంగా, చైతన్యవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దటానికి చేసిన కృషి నేడు ఫలిస్తోంది. ‘‘దివ్య కాశీ, భవ్య కాశీ’’ నినాదం మాత్రమే కాదు, దాని వెనుక స్పష్టమైన లక్ష్యం, దీర్ఘకాలిక వ్యూహం, మంచి ఆలోచనతో కూడిన కార్యాచరణ ఉన్నాయి. జి.కిషన్ రెడ్డి – వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలమంత్రి (గౌరవ ప్రధాని నరేంద్రమోదీ నేడు నవీకరించిన కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా) -
రాబోయే రోజుల్లో కాశీని మెడికల్ హబ్‌గా మారుస్తాం: మోదీ
-
కాశీ నుంచి వెండి తమలపాకులు
లక్నో: హిందూ మతంలో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇళ్లు, ఆలయాలు ఇలా ఎక్కడ ఏ పూజ చేసినా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున అయోధ్యలో జరిగే రామ మందిర భూమి పూజకు కాశీ నుంచి వెండి తమలపాకులు తరలి వెళ్లాయి. నాడు నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ఈ వెండి తమలపాకులను వినియోగించనున్నారు. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరాసియా వీటిని వేద పండితులకు అందజేయగా.. వారు వీటిని తీసుకుని నేడు అయోధ్యకు బయలుదేరారు. (‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’) అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా రాతితోనే జరగునున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించడం లేదని.. మందిర నిర్మాణ పర్యవేక్షకుడు అను భాయ్ సోంపురా తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాను అన్నారు. మందిర నిర్మాణానికి ఇక్కడ లభించే రాళ్లతో పాటు.. రాజస్తాన్ నుంచి కూడా తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేవలం 180 మంది మాత్రమే హాజరవుతున్నారు. -
వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..
సాక్షి, చెన్నై: యువతుల్ని మాయమాటలతో లొంగదీసుకుని, వీడియో చిత్రీకరణ ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ, అందింది దోచుకుంటూ వచ్చిన కన్యాకుమారి మన్మ థుడు కాశీ లీలలు సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. ఇతగాడిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతుండడంతో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. (సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అడ్జెస్ట్మెంట్ ) చెన్నైకు చెందిన మహిళా డాక్టరు ఒకరు గత నెల ఇచ్చిన ఫిర్యాదుతో కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా మన్మథుడు కాశి(26) సాగిస్తూ వచ్చిన లీల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, సంపన్న మహిళల్ని గురి పెట్టి, వారితో సన్నిహితం పెంచుకుని, లొంగ దీసుకోవడమే కాదు, వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ తో సొమ్ము చేసుకుంటూ వచ్చిన ఈ మన్మథుడు కుమరి ఎస్పీ శ్రీనాథ్‌కు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతగాడ్ని గూండా చట్టంలో అరెస్టు చేసి విచారించగా, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లో పదుల సంఖ్యలో యువతులతో గడిపిన వీడియోలు బయట పడ్డాయి. రెండు సార్లు ఇతడ్ని కస్టడికి తీసుకుని విచారించారు.(రఫికా కూతురుపైనా ఆత్యాచారం..? ) ఈ సమయంలో ఐదుగురు యువతులు, ఇద్దరు మహిళలు, ఓ బాలిక, ఓ యువకుడు సైతం కాశిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం కుమరికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరిస్తున్నది. దీంతో కేసును సీబీసీఐడీకి అప్పగించాలని కుమరి ఎస్పీ శ్రీనాథ్ డీజీపీ త్రిపాఠిని కోరారు. ఇందుకు తగ్గ నివేదికను డీజీపీకి పంపించారు. తాము కాశి మీద నమోదు చేసిన గూండా చట్టం, ఇప్పటి వరకు కుమరిలో వచ్చిన ఫిర్యాదులు, ఇతర జిల్లాల్లో వస్తున్న ఫిర్యాదుల గురించి వివరించారు. ఈ కేసులో కాశి అనుచరుడు ఒకడ్ని అరెస్టు చేశామని, మరొకడు విదేశాల్లో ఉన్నాడని, అతడు తప్పించుకోకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్టు వివరించారు. దీంతో ఈకేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీసీఐడీ ఎస్పీ లేదా, ఏఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈకేసును ముందుకు తీసుకెళ్లనుంది. కాశీని మళ్లీ కస్టడికి తీసుకుని విచారించేందుకు సీబీసీఐడీ కసరత్తులు చేపట్టనుంది. -
కాశీలో చిక్కుకున్న ఏలూరు నగర వాసులు
పశ్చిమగోదావరి,ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కాశీకి వెళ్లిన ఏలూరు నగర వాసులు కొంతమంది కాశీ పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయారని, వారిని నగరానికి రప్పించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని వారి బంధువులు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన మీనంబాకం ఆనంద్ ఆయన కుటుంబ సభ్యులు 12 మందితో పాటు నగర పరిసర ప్రాంతాలకు చెందిన మరో 18 మంది కలిపి మొత్తం 30 మంది కాశీ యాత్రకు బయలుదేరి ఈ నెల 16వ తేదీన అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి వారు తిరుగు ప్రయాణమవుదామనుకున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఎటువంటి రవాణా సౌకర్యం లేక అక్కడే చిక్కుకుపోయారు. అయితే వారు ప్రస్తుతం ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదని, కనీసం ఆహారం కూడా అందక దుర్భర పరిస్థితిలో ఉన్నామని వేదన వ్యక్తం చేస్తూ తమ బంధువులకు సమాచారం చేరవేశారు. ఈ మేరకు ఆనంద్ కుమారుడు దుర్గా ప్రసాద్ తమ తండ్రి, బంధువులను అక్కడి నుంచి ఎలాగైనా స్వస్థలాలకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు. -
కాశీలో చిక్కుకున్న రాష్ట్రవాసులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్తరభారత దేశం యాత్రకు వెళ్లిన పలువురు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా కాశీలో వందల సంఖ్యలో యాత్రికులు మూడు నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. తాము రిజర్వేషన్ చేసుకున్న రైళ్లు రద్దు కావడంతో కాశీలోని సత్రాల్లో తలదాచుకున్నారు. సరైన వసతులు లేకపోవడం, తీసుకెళ్లిన డబ్బులు అయిపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. దీనికి తోడు ఊరుకాని ఊరులో ఉంటున్న తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని తమతమ వారికి వారి ద్వారా మీడియా వారికి, అధికారులకు ఫోన్లు చేసి తమను కాపాడాలంటూ విన్నపాలు చేశారు. - తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన 27 మంది ఈనెల 16న కాశీ ప్రయాణానికి వెళ్లారు. - పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులు ఈనెల 9న ఉత్తరభారతదేశం యాత్రకు వెళ్లారు. వీరంతా ఈనెల 22న తిరుగుప్రయాణం కావాల్సి ఉండగా రైళ్ల రద్దుతో చిక్కుకుపోయారు. - గుంటూరు నగరంలోని నల్లచెరువు, కొరిటెపాడు, మేనకాగాంధీనగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 55 మంది కూడా మూడు రోజులుగా కాశీలోనే తిరుగుప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఐదు రోజులు మాత్రమే బస చేసేందుకు ఆశ్రమం నిర్వాహకులు అనుమతి ఇచ్చారని తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. తమలో కొందరు కొన్ని జబ్బులకు మందులు వాడుతున్నవారు ఉన్నారని, ఇక్కడ మందులు దొరకక ఇబ్బందులు పడుతున్నామని గుంటూరుకు చెందిన రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. - శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 29 మంది కూడా కాశీలో బిక్కుబిక్కుమంటున్నారు. వీరు ఈ నెల 16న కాశీయాత్రకు రైలులో వెళ్లా రు. 22న తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా రైళ్లు రద్దు కావడంతో ఓ సత్రంలో తలదాచుకున్నారు. -
కాశీలో చిక్కుకున్న నెల్లూరు వాసులు
-
కరోనా ఎఫెక్ట్: కాశీలో చిక్కుకున్న భక్తులు
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో చిక్కుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కాశీకి వెళ్లినవారు ఇక్కడికి రాలేక.. అక్కడ ఉండలేన నానా యాతన పడుతున్నారు. ఈ యాత్రలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 71 మంది మార్చి 13న కాశీ విహారయాత్రకు బయలుదేరారు. వీరు మార్చి 23న ఆయా జిల్లాలకు చేరుకోవాల్సి ఉంది. (అనుమానితులకు కరోనా స్టాంప్) కానీ ఆదివారం 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు, విమాన, బస్సుల రాకపోకలు నిషేధించడంతో పలువురు ఉమ్మడిజిల్లావాసులు కాశీలో చిక్కుకున్నారు. దీంతో వారి కుటుంబీకులు స్వగ్రామాల్లో ఆందోనన చెందుతుండగా, యాత్రకు వెళ్లిన వారు అక్కడ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. యాత్రకు వెళ్లిన వారిలో జగిత్యాల మండలం పోరండ్ల గ్రామానికి చెందిన 14 మంది ఉండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. -
కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రాజకీయ నేతలు, ప్రముఖుల కోటాలో రైలు టికెట్లను కేటాయిస్తారు. కానీ కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మాత్రం ఏకంగా దేవుడికే ఓ సీటును రిజర్వు చేశారు. అంతేకాదు శివుడి పేరుతో ప్రత్యేక బెర్త్ కూడా ఏర్పాటు చేశారు. బి5 కోచ్‌లోని సీట్ నెంబర్ 64 పూర్తిగా దేవుడికే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి చిత్రపటాన్ని పెట్టి సీటును పూలతో డెకరేట్ చేశారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదు అంటూ బోర్డు పెట్టారు. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా యూపీలో కాశీ మహాల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు ఇండోర్ నుంచి కాశీకి ప్రతి రోజూ రాకపోకలను జరుపుతుంది. మార్గంలో మధ్యలోని మూడు జోతిర్లాంగాల క్షేత్రాలైన.. ఓంకారేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ని చుట్టుకుంటూ కాశీని చేరుకుంటుంది. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మూడు జోతిర్లాంగాల క్షేత్రాలను చుట్టేస్తుంది. ప్రతి కోచ్ లో భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాకాహార భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశారు. కాగా భారతీయ రైల్వే కాకుండా పూర్తిగా ప్రైవేటు సంస్థ తయారు చేసిన మూడో రైలు కాశీ మహాల్ ఎక్స్ ప్రెస్ కావడం విశేషం. -
పవిత్ర జలం
మహారాష్ట్రలో ఏక్నాథ్ అనే భక్తుడుండేవాడు. ఓసారి గొప్ప పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్లాడు. గంగానదిలో స్నానం చేసి అన్నపూర్ణ, విశ్వేశ్వరులను సందర్శించాడు. పవిత్ర గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరం వెళ్లి అక్కడి సముద్రలో కలపడం నాటి ఆచారం. అంచేత రెండు బిందెలను గంగాజలంతో నింపి కావడిలో పెట్టుకుని తన శిష్యగణంతో రామేశ్వరం బయలుదేరాడు. అప్పటిలో ప్రయాణ సాధనాలు లేనందున కాలినడకనే వెళ్లేవారు. అలా వెళ్తుండగా ఓ గాడిద కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యం కంటపడి అక్కడ ఆగిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాడిదకు తీరని దాహం వేసి ఉంటుందని గ్రహించిన ఏక్నాథ్ మనస్సు చలించిపోయింది. వెంటనే కావడిలో ఉన్న బిందెడు నీటిని దాని నోటిలో పోసి, దాని మీద కాసిని నీళ్లు చిలకరించాడు. కాసేపటికి లె ప్పరిల్లిన ఆ గాడిద కళ్లు తెరిచి కృతజ్ఞతాపూర్వకమైన చూపు చూస్తూ లేచి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఉదంతాన్ని తేరిపార చూసిన అతని శిష్యులు ‘‘స్వామీ! రామేశ్వరం తీసుకుని వెళ్తున్న పవిత్రమైన గంగాజలాన్ని గాడిద నోటిలో పోసి వృథా చేశారే! కాశీ వెళ్లిన ఫలితం కాస్తా బూడిదలో పోసిన పన్నీరైనట్లే కదా. ఇప్పుడు రామేశ్వరం వెళ్లి ఏంటి ప్రయోజనం?’’ అని అడిగారు. అందుకు ఏకనాథుడు స్పందిస్తూ ‘‘దేవుడు సమస్త జీవులలో ఉన్నాడు. ఏ జీవిని నిర్లక్ష్యం చేసినా దేవుణ్ణి బాధించినట్లే. అంచేత మనం ఏ జీవి ప్రాణ సంకట స్థితిలో ఉన్నా నిర్లిప్తత కూడదు. గంగాజలంతో ఓ జీవిని రక్షించగలిగానన్న సంతోషం నాకు రామేశ్వరం వెళ్లినంత సంతృప్తినిచ్చింది. ఆత్మసంతృప్తి కన్నా ఆనందం ఇంకేముంటుంది?’’ అన్నాడు. శిష్యులు ఏక్‌నాథుడికి తడికళ్లతో నమస్కరించారు.– వాండ్రంగి కొండలరావు -
నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో వారణాసి లోక్‌సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. చివరి దశ (ఏడో దశ)లో భాగంగా మే 19న ఇక్కడ ఎన్నిక జరగనుంది. మోదీ శుక్రవారం (రేపు) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం సాయంత్రం భారీ రోడ్‌షో నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కాషాయ కోలాహలంతో నిండిపోయింది. ‘దర్భంగా, బందాలో భారీ బహిరంగ సభల అనతరం తనకెంతో ఇష్టమైన కాశీకి చేరుకున్నా. లక్షలాది మంది నా సోదర, సోదరీమణులను కలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. హరహర మహదేవ్’ అంటూ ట్వీట్ చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన మదన్‌పురా, సోనార్‌పురాతో పాటు 150కి పైగా ప్రదేశాలగుండా ఈ ర్యాలీ సాగనుంది. కాశీలో గంగా హారతి అనంతరం మూడు వేల మంది ఇంటలెక్చువల్స్‌తో భేటీ అయి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కాశీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్‌షో జరిగే ప్రాంతమంతా డ్రోన్లతో నిఘావేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్‌షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, పీయూష్ గోయల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బిహార్ సీఎం నితీష్‌కుమార్, శిరోమణి అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్ బాదల్, లోక్ జనశక్తి చీఫ్ రామ్‌విలాస్ పాశ్వాన్ తదితరులు పాల్గొననున్నారు. After bumper rallies in Darbhanga and Banda, I am heading to beloved Kashi. There are a series of programmes lined up, which would give me another excellent opportunity to interact with my sisters and brothers of Kashi. Har Har Mahadev! — Chowkidar Narendra Modi (@narendramodi) April 25, 2019 -
సాయి సన్నిధిలో శరీరత్యాగం చేసిన ముభక్తులు
ఎందరో మన హిందూధర్మం ప్రకారం కాశీ నగరానికి కేవలం శరీరాన్ని చాలించెయ్యాలనే అభిప్రాయంతో వెళ్లడాన్ని గమనిస్తూ ఉంటాం. దానికి కారణం ‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’ అని కనిపించే ప్రసిద్ధ ఋషివాక్యం మాత్రమే. అయితే ఈ సందర్భంలో ఆ వాక్యానికి కొంత వివరణ ఇచ్చుకోవలసి ఉంది.‘కాశ్యామ్+తు– కాశీనగరంలో మాత్రమే ముక్తిః – ముక్తి లభించడమనేదిమరణాత్ తు– మరణించడం వల్ల మాత్రమే లభిస్తుంది’ అని ఈ ఋషి వాక్యానికి అర్థం. మరి ఇదే నిజమైన ప్రమాణవాక్యమైతే కాశీనగరంలో ఎప్పటి నుండో ఉంటూ మరణించే ఎందరికో మోక్షమనేది అయాచితంగానూ, అదృష్టకారణంగానూ లభించేసినట్లే కదా! అనిపిస్తుంది మనకు. దానర్థం అది కాదు. అందుకే వ్యాఖ్యానాన్ని చదివీ లేదా వినీ అర్థం చేసుకోవాలని పెద్దలంటుంటారు. కాశీలో ముక్తి లభించాలంటే దానికి ఓ పద్ధతిని చెప్పారు ఋషులు.యదృచ్ఛాలాభ సంతుష్టః – అని. మనకిక్కడ ఇంట్లో ఏ తీరు సౌకర్యాలున్నాయో అలాంటి అన్ని సౌకర్యాలూ అక్కడ కూడా లభించేలా చేసుకుని కాశీలో ఉంటూ మరణానికి ఎదురు చూసినా, ఒకవేళ మరణించినా కూడా ముక్తిరాదట. యదృచ్ఛాలాభ సంతుష్టః – ఏది దొరికితే ఎప్పుడు దొరికితే– ఎలా దొరికితే– ఎంత దొరికితే– దాంతో సంతోషపడుతూ ఈ శరీరమనేదాన్ని – అవయవాలన్నింటినీ దాచుకునేందుకు పుట్టుకతో వచ్చిన ఓ సంచిగా భావిస్తూ – లెక్క చెయ్యకుండా దాని కోరికలకి ప్రాధాన్యాన్నీయకుండా జీవించే/జీవించగలిగే తనంతో ఉంటే, దాన్ని (మరణ)కాశీనివాసం అంటారు. అలా తనంత తానుగా ఎవరి శరీరం ఆ వ్యక్తిని విడిచి వెళ్లిపోతుందో.. అదుగో అలాంటి మరణం కాశీలో జరిగిన పక్షంలో ముక్తి లభిస్తుందని దానర్థం. అలా కాక ఇంటిలో ఉన్న సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ.. రుచికరమైన భోజనాలని చేస్తూ.. ప్రతి పనికీ దాసీజనాన్ని ఏర్పాటు చేసుకుని కాశీలో ఉన్నా, ఏదో కారణంగా మరణించినా అది కేవలం స్థలం మార్పు కిందికొస్తుంది తప్ప ‘కాశీవాసం’ అనే మాటకి సంబంధించిన ఏర్పాటు కిందికి రాదు. అలా మరణిస్తే కూడా ముక్తి రానేరాదు. అయితే కాశీలో ఉన్న పుణ్యఫలం మాత్రమే లభిస్తుందనేది యదార్థం. అది కూడా విశ్వనాథునిసేవ చేసుకున్న పక్షంలో మాత్రమే. చావు ఎన్ని తీరులు? ‘శరీరత్యాగం చేసి ముక్తిని పొందిన భక్తులు’ అనే ఈ శీర్షిక మరింత అర్థం కావాలంటేనూ, సాయి దగ్గరికొచ్చిన వాళ్లు కొన ఊపిరితో ఉన్నా సాయి మహత్యం కారణంగా బతికి బట్ట కట్టాలి కానీ అలా దిక్కు లేని వాళ్లలా చనిపోవడమా? అనే తీరు దుర్విమర్శకి సమాధానం తెలియాలంటేనూ ‘చావు’ అనేది ఎన్ని విధాలుగా ఉంటుందని లెక్కించారో వాటిలో ఏ తీరు ఈ ‘శరీర త్యాగం’ అనేది దేని కిందికి వస్తుందో తెలియాల్సిందే వివరంగా. 1. చచ్చిపోయాడు – ఇది మొదటి మాట. శరీరంలో ఉండే ఏ అవయవమో లేక అవయవాల సమూహమో తన పనుల్ని తాము చెయ్యలేని కారణంగా చచ్చుపడిపోతే (నిష్క్రియాపరత్వం అంటారు సంస్కృతంలో) ఆ తీరుగా చచ్చుబడిపోవడం వల్ల ఈ లోకం నుండి పోతే అతడ్ని చచ్చు బడిపోయాడు కాబట్టి చచ్చిపోయారంటారు. ఇది ముక్తికి ఏ మాత్రమూ అవకాశమీయని మరణం. 2. చనిపోయాడు – ‘చని’ అనే మాటకి ‘వెళ్లిపోవడం కారణంగా’ అని అర్థం. శరీరాన్ని చైతన్యవంతంగా ఉండేలా చేయగల వాయువు పేరు ‘ప్రాణం’ దాన్నే ప్రాణవాయువని పిలుస్తాం. అలాంటి ప్రాణవాయువు’ చని – శరీరం నుండి వెళ్లిపోవడం కారణంగా పోవడం – ఈ వ్యక్తి చైతన్యం ఈ లోకం నుండి బయటికి పోవడమేదుందో’ అది చనిపోవడం అవుతుంది. కాబట్టి ఈ లోఅర్థం తెలిసిన పెద్దలు ‘చని పోయాడు’ అనే అనేవారు గాని ‘చనిపోయాడు’ అని ఒక్కమాటలో అంటూ ఉండేవారు కాదు. కాలక్రమంలో ఉచ్చారణ విధానం మారినా ఉచ్చరించవలసిన తీరు మాత్రం ‘చచ్చి పోయాడు’ ‘చని పోయాడు’ అనేదే. అయితే ఈ తీరు చావు కూడా ముక్తికి ఏ మాత్రపు అవకాశాన్నీ ఇవ్వనే ఇవ్వలేదు. 3. పంచత్వం పొందాడు – పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశమనే పేరిట పంచభూతాలున్నాయి బ్రహ్మాండంలో.. ఈ పిండాండం (శరీరం)లో కూడా మజ్జమాంసమనే పేరిట పృథ్విభూతం, జలశాతం పేరిట అప్ భూతం, ఎంత వేడి పదార్థాన్ని తిన్నా ఎంత చల్లటి పదార్థాన్ని గాని నీటిని గాని తాగినా అటూ ఇటూ పెరుగు తరుగులు లేకుండా ఒకే తీరుగా ఉండే తేజోభూతం, పంచప్రధాన వాయువులూ అలాగే పంచ అప్రధానవాయువులతో అంటే మొత్తం దశవిధ వాయువులతో ఉండే వాయుభూతం, కనిపించకుండా ఉంటూ అనుక్షణం తన ప్రకారమే నడిచేలా మనని చేస్తూ ఉండే మనసు అనే ఆకాశభూతం ఉన్నాయి. ఈ పిండాండంలోని పంచభూతాలు ఆ బ్రహ్మాండంలోని పంచభూతాల్లోనూ కలిసి పోవడమేదుందో దాన్ని పంచత్వం పొందడం’ అంటారు. ఇది ఒక విధంగా ఆరోగ్యవంతుని మరణంగా గుర్తింపబడుతుంది. అయితే ఈ తీరు మరణం కూడా ముక్తికి ఏ మాత్రపు అవకాశాన్ని ఇవ్వలేదు. 4. నిర్యాణం– నిర్+యానమ్ అని పదవిభాగం. నిర్గతం యానం యేన తత్ నిర్యాణమ్. ఈ ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం కోసం ప్రస్తుతప్రదేశాన్ని ఖాళీ చెయ్యడాన్ని నిర్+యానమ్ (వ్యాకరణసూత్రం ప్రకారం నిర్యాణమ్) అవుతుంది. భాగవతంలో ప్రారంభంలో ‘శ్రీకృష్ణ నిర్యాణఘట్టః’ అని కనిపిస్తుంది. అంటే ‘వైకుంఠానికి వెళ్లేందుకోసం ఈ భూలోకం నుండి బయలుదేరడం’ అని అర్థమన్నమాట. ఈ పదాన్ని భగవంతుని స్థాయి వారికి మాత్రమే వాడాలి. భగవంతునికి ముక్తిని గురించి చెప్పే పదాల్లో చాలా బరువు అర్థం కలదన్నమాట. దీన్ని సాయికి వాడటం దోషం కాబోదు. 5. కీర్తిశేషుడు– సాధారణంగా ఏ వ్యక్తి అయినా మరణించాక అతని గురించిన మాటలు కొంతకాలం అయ్యేసరికి కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కాక ఆయనని గురించి నిరంతరం చెప్పుకునే రీతిలో ఎవరైనా తమ జీవితాన్ని గడిపి, ఈ లోకం నుండి వెళ్లిపోయినట్లయితే అలాంటి వారిని కీర్తి– తమ కీర్తినీ ప్రతిష్ఠనీ, శేషులు– ఈ లోకంలో మనందరికీ మార్గదర్శకత్వం కోసం మిగిల్చి వెళ్లినవారు’ అని అనాలన్నారు. సాయి స్థాయి ఇలాంటిది కాదు. ఎంతెంతో ఉన్నతమైనది. ఇక కీర్తిశేషులయిన వారు తమదైన పాండిత్య–సంగీత– నృత్య–అభినయ.. ఇలా అభికళల్లో దేనిలోనైనా విశేషకీర్తిని సంపాదించి దాన్ని లోకానికి విడిచి వెళ్లినవారు అవుతారు కాబట్టి ఈ అనుకున్న కళల ద్వారా వారికి ముక్తి లభించితీరాలనే నియమమేమీ లేదు. కాబట్టి ఈ కీర్తి శేష విధానానికీ ముక్తిని పొందడానికీ సంబంధం లేదు. 6. పరమపద ప్రాప్తి– ఈ లోకంలో ఓ స్థానాన్ని సంపాదించడమనేది ‘భూపదప్రాప్తి’ కిందికొస్తుంది. ఈ స్థానం కంటే గొప్పదనే అర్థంలో ఆ లోకాన్ని ‘పరమ–పదం’ అన్నారు. అలాంటి పరమపదాన్ని – ‘ప్రాప్తి–పొందడం’ అనేది ఏదుందో దాన్ని పరమపదప్రాప్తి అన్నారు. ఓ త్యాగరాజు ఓ అన్నమయ్య.. ఇలాంటి వారంతా మరో ధ్యాస ధ్యానం లేకుండా ఈ లోకానికి వచ్చికూడా ఆ లోకం గూర్చిన ధ్యాసతోనే ఉంటూ ఆ పరమపదాన్నే పొందాలనే ధ్యేయంతో జీవితాన్ని గడిపారు కాబట్టి ‘పరమపద ప్రాప్తి’ అనే పదం వారికి చెందినది తప్పక అవుతుంది. అంతటి పరమపదాన్ని పొందడమనేది ముక్తికి సాక్ష్యం కాబట్టి ఆ స్థాయి మహానుభావులకి వాడాల్సిన పదం ‘పరమపదప్రాప్తి’ అని. 7, శరీరత్యాగం – ఈ వివరణల క్రమంలో వచ్చే పదమే ‘శరీరత్యాగ’మనేది. ఈ శరీరాన్ని ఓ బరువైన పదార్థంగానూ, ముక్తిని పొందడానికి అభ్యంతరాన్ని కలిగించే పదార్థంగానూ (నిరంతరం కష్టాలనీ సుఖాలనీ కామ క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనీ కలిగిస్తూ దృష్టిని భగవంతుని మీద కేంద్రీకరించకుండా ఉండేలా చేస్తూ మధ్యమధ్యలో అనారోగ్యం మొదలైన వాటితో) మనసుని బాధపెడుతూ ఉండే ఓ వస్తువుగానూ భావించే లక్షణమున్నవాళ్లు యోగులు. వాళ్లు ఈ శరీరాన్ని ఎప్పుడు త్యజించి (విడిచేసి) ఎప్పుడెప్పుడు ఆ పైలోకానికి వెళ్లిపోదామా అనే ఒకే ఒక్క ఆలోచనతో కనిపించేవాళ్లు చేయగలిగిన పని ‘శరీరత్యాగం’ శరీరాన్ని త్యజించడమే కదా: అనే దృష్టితో ఆత్మహత్యని చేసుకోవడం, శరీరాన్ని దాడికి గురి చేసుకోవడం.. వంటివన్నీ ‘శరీరత్యాగం’ కిందికి రావు. ఈ శరీరమే, తనని ధరించిన వ్యక్తి తనకి చేస్తున్న తక్కువదనానికీ, అవమానాలకీ తట్టుకోలేక, ఎప్పుడెప్పుడు విడిచేద్దామా? అనుకుంటూ ఈ శరీరం వెళ్లిపోడానికి సిద్ధమై కనిస్తూ ఉంటుందో, అలా వ్యక్తిని విడిచేసి వెళ్లిపోతుందో దాన్ని ‘శరీరత్యాగం’ అంటారు. ఎవరైనా ఒక వ్యక్తికి సహాయకునిగా మరో వ్యక్తి అనుసరిస్తూ వెళ్తూ ఉంటే ప్రతిక్షణ మూ ఆ వ్యక్తి ఈ సహాయకుడ్ని నిందిస్తూ చీత్కారం చేస్తూ అవమానిస్తూ ఉంటే ఎలా ఆ సహాయకుడు ఈ శరీరాన్ని ధరించిన వ్యక్తి నిరంతరం ఆ శరీరపు పాలననీ, పోషణనీ చూడకుండా ఉంటే ఆ శరీరం ఎలా ఈ వ్యక్తిని త్యజిస్తుందో, అప్పుడే శరీరధారి ఎలా ఆనందపడతాడో దాన్ని ‘శరీరత్యాగం’ అని పిలుస్తారు.భాగవతంలో ‘రంతిదేవుడు’ ఇలా చేశాడు. 48 రోజుల నిరాహార దీక్షతో భగవద్ధ్యానాన్నే చేస్తూ గడుపుతూ చివరి రోజున ఆహారాన్ని తీసుకోబోతుంటే.. యాచకుడు కావాలనికోరితే, సగం అన్నాన్ని ఇచ్చి మళ్లీ తినబోతూ ఉంటే, మళ్లీ ఇంద్రుడే మారు రూపంలో యాచనకి రాగా ఆ మిగిలింది కూడా ఇచ్చేస్తే, ఆ మిగిలిన మంచి నీటినే తాగబోతూ ఉంటే మళ్లీ ఒకరొచ్చి అడగ్గానే నేను స్వీకరించబోయే పదార్థం మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందన్నప్పుడు ఈ శరీరమెందుకు? అంటూ శరీరత్యాగాన్ని చేసి ముక్తిని పొంది ముక్తుడయ్యాడు.అలాగే శ్రీమద్రామాయణంలో శరభంగుడనే మహర్షి కూడా రామదర్శనం కోసమే శరీరాన్ని నిలిపి ఉంచుకుని రాముడ్ని దర్శించి తానప్పటివరకూ చేసిన తపశ్శక్తిని స్వయంగా రామునికి ధారపోసి ఆయన సమక్షంలోనే శరీరత్యాగాన్ని చేసి ముక్తుడయ్యాడు.సాయిని గూర్చిన కథ అని ప్రారంభించి ఎటెటో వెళ్లిపోతున్నామనుకోకూడదు. సాయి సమక్షంలో ముక్తులైన ఆ మహనీయులు కూడా ఇలా శరీరత్యాగాన్ని చేసిన స్థాయి కలవాళ్లే అని తెలుసుకోవడం కోసం నిరూపించడం కోసం ఇంతా చెప్పాల్సి వచ్చింది. సరే! ఇంతకీ అలా ముక్తులైన ఇద్దర్ని గురించి తెలుసుకుందాం! బాలారామ్ (మాన్కర్) భార్య పోయిన బాలారామ్(మాన్కర్) సాయికి పరోక్షంగా భక్తునిగా ఉండేవాడు. ఎలాగైనా షిర్డీలోనే సాయి సన్నిధిలో ఉంటూ శరీరత్యాగాన్ని చేయాలనే గట్టి పట్టుదలతో సాయి దర్శనానికి వెళ్లాడు. సాయి బాలారామ్ని బాగా పరిశీలించి 12 రూపాయలనిస్తూ – ఇక్కడ ఉండద్దు. ‘మచ్ఛింద్రగడ్’ అనే ప్రదేశానికి పోయి రోజూ మూడు మార్లు ధ్యానాన్ని చేసుకో! ఫో!’ అన్నాడు. బాలారాంకి అక్కడికి వెళ్లడమనేది సుతరామూ ఇష్టం లేకున్నా ఆ గురువాక్యాన్ని ధిక్కరించడం ఇష్టంలేకా, తను షిర్డీలోనే సాయి సన్నిధిలోనే శరీరాన్ని విడవాలి ఉన్నప్పుడు విరోధించడం సరికాదనీ ‘మచ్ఛింద్రగఢ్’కి వెళ్లాడు అక్కడి విశాలప్రకృతీ పరిశుభ్రమైన నీరూ గాలీ.. అంతా భౌతికంగా నచ్చింది బాలారాంకి. దాంతో కావాలసినంత సేపు ధ్యానాన్ని చేసుకోగలుగుతూ పరమానందపడసాగాడు. ఓ రోజు ధ్యానంలో సాయి స్వయంగా దర్శనమిచ్చి ‘బాలారామ్! నిన్నెందుకు ఇక్కడికి పంపానో తెలిసిందా? ధ్యానమనే మొదటి మెట్టుని ఎక్కలేనిదే నీ శరీరత్యాగమనే స్థితికి ఎగబాకలేవు. షిర్డీలో నన్ను నువ్వు చూసిన దృష్టికీ, నేడు నీలో కనిపిస్తున్న అంతర్ దృష్టికీ చక్కని భేదం ఉంది. ఆ భేదం కూడా పరిణత స్థితిలో ఉంది. దైవం సర్వత్రా ఉంటాడనే స్థిరనిశ్చయం నీకు ఒకప్పుడు లేదు కాబట్టే అయిష్టంగా మచ్ఛింద్రగఢ్కి వెళ్లావు. ఇప్పుడు నీకు అర్థమవుతోంది. ‘దైవం సర్వత్ర అన్నింటా అన్ని కాలాల్లో ఉంటాడు– ఉన్నాడు’ అని. సాయి చెప్పి అంతర్ధానమయినట్లు అనిపించింది. ఇది పరోక్షానుభవం. కొంతకాలానికి బాలారాం తన ప్రదేశానికంటూ బయల్దేరగానే ఎవరో ఒక పల్లెటూరి వ్యక్తి లంగోటీతోనూ కంబళి కప్పుకునీ ఇతని వద్దకొచ్చి – ఇదిగో నీ ఊరికి టికెట్టు. నేను ప్రయాణం విరమించుకున్నాను. నువ్వు టికెట్టుని ఈ జన సమ్మర్దంలో తీసుకోలేకపోతున్నావుగా! అంటూ గబగబా దాన్ని అందిచ్చి వెళ్లిపోయాడు. ఎంతవెతికినా అతను కనిపించలేదు. ఇది అపరోక్షానుభవం.దాంతో షిర్డీకి పోయి తీరాలనే బలమైన ఆశ కలిగిన బాలారాం షిర్డీలోనే ఉంటూ సాయికి సేవ చేస్తూ... ఆయన మాటలని తు.చ. తప్పకుండా చేశాడు. సాయి అతని నిర్వా్యజసేవని మెచ్చుకునేవాడు.అపరిమిత భక్తికి ఆనందపడుతూ ఉండేవాడు. అనన్యభక్తి (సాయి తప్ప మరో లోకం దైవం లేదు)తో సేవ చేస్తూ ముక్తిని పొందిన భక్తునిగా లెక్కింపబడ్డాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ ఏ మాత్రమూ యోగులూ, ధ్యానపరులూ, సన్యాసులూ, ఫకీరులూ... అంటే విశ్వాసం లేని తాత్యా సాహెబ్ నూల్కర్ అనే న్యాయాధిపతి పండరిపురంలో ఉద్యోగరీత్యా ఉంటూ ఉండేవాడు. అక్కడే కింద ఉద్యోగిగా పని చేసే నానా(సాహెబ్) ఈయనకి సాయిలీలలని నిరంతరం చెప్తూ షిర్డీకి వెళ్లాలనే సంకల్పం కలిగేలా చేసాడు తాత్యాకి. ఇంకా పట్టుదల పోని తాత్యా – షిర్డీలో తనకొక బ్రాహ్మణ వంటవాడు కావాలనీ, నాగపూరు కమలా ఫలాలు సాయికి బహూకరించదలిచిన కారణంగా అవి కూడా దొరికితేనే షిర్డీ వస్తానన్నాడు.ఆశ్చర్యం! వంటవాడూ నూరు కమలా ఫలాలు రెండ్రోజుల్లోనే దొరికాయి. వెంటనే షిర్డీకి వెళ్లి సాయిని దర్శించబోతే.. సాయి తాత్యాని చూస్తూనే కోపాన్ని ప్రదర్శించాడు న్యాయాధిపతి అని తెలిసినా కూడా. తాత్యా మాత్రం ఏ మాత్రమూ తొందరపడకుండా ప్రతినిత్యమూ దర్శానానికే వెళ్తూ క్రమక్రమంగా సాయిపట్ల చెప్పలేని భక్తి కలవాడయిపోయాడు. ఎందరో భక్తులు వచ్చి వెళ్తున్నా అయస్కాంతాన్ని గట్టిగా పట్టుకుని విడదీయరాని విధంగా అతుక్కుపోయిన భక్తితో తాత్యా నిరంతరం సాయి సేవలోనే ఉండిపోసాగాడు.యోగులూ, ఫకీరులూ.. ఇలా ఎవరినీ నమ్మని తాత్యా అలా సాయి సేవలోనే జీవితం మొత్తాన్ని గడుపుతూ తనదైన ఉద్యోగస్థలాన్ని గానీ పవిత్ర పండరీపుర క్షేత్రాన్ని గానీ దర్శించకుండా ఆ ఆలోచన కూడా లేకుండా సాయి సన్నిధిలోనే శరీరత్యాగం చేసి ముక్తుడయ్యాడు. సాయి తాత్యా శవాన్ని చూస్తూ భోరున ఏడుస్తూ... ‘తాత్యా! నా కంటే ముందే వెళ్లిపోయావా?’ అని అందరితోనూ చెప్పుకుని విలపించాడు. వీళ్లు శరీరత్యాగం చేసి ముక్తులైనవాళ్లు అంటే. పైవారం – బాబాకి నిస్వార్థ సేవ చేసి ఆ ధాన్యంతో తరించిన భక్తులు. – సశేషం -
మీరు బాగుండాలి
పూర్వం కాశీలో ఓ బిచ్చగాడు ఉండేవాడు. అతను చేతులు చాచి అయ్యా అమ్మా అంటూ అడుక్కునేవాడు. అది అతని అలవాటైపోయింది. ఓమారు కాశీకి ఓ జ్ఞాని వచ్చారు. ఆయనను కలిసిన బిచ్చగాడు ‘అయ్యా, నా జీవితం మార్చుకోవడానికి ఏదైనా మార్గముంటే చెప్పండి’ అని ఎంతో వినయంగా అడిగాడు.అతని మాటలు విన్న జ్ఞాని ‘‘సరే, ఇక రేపటి నుంచి ఎవరిని కలిసినా డబ్బులు ఇవ్వమని అడుక్కోకు. దానికి బదులు మీరు బాగుండాలి అని దీవించడం మొదలుపెట్టు..’’ అన్నారు.బిచ్చగాడికి ఆయన మాటలపై నమ్మకం లేదు. అయినా తానడిగితే కదా జ్ఞాని తనకా సలహా ఇచ్చారు.. కనుక ఓ రాయి విసురుదాం అన్నట్టుగా ఆయన చెప్పినట్లే ఎవరిని కలిసినా ‘మీరు బాగుండాలి’ అని మనసారా దీవించడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో ఆ దీవెనలనుంచి పెద్దగా ఫలితమేమీ కనిపించలేదు. అయితే రోజులు గడిచే కొద్దీ అతని మాటలు బాగా ఫలించాయి. కొద్ది కాలానికే అతనికి అడక్కుండానే డబ్బులూ వచ్చాయి. కొందరైతే తమ ఇంట శుభకార్యం ఏదైనా చెయ్యదలచుకున్నప్పుడు అతని వద్దకు వచ్చి దీవెనలు అడిగి మరీ పుచ్చుకునేవారు. ఇంకేముంది ఇతని దీవెన గురించి ఊరు ఊరంతా వ్యాపించింది. అంతేకాదు, ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి అతని ఆశీస్సులు పొందేవారు. అందుకు బదులుగా అతని ఆకలి తీర్చేవారు. అవసరమైన వస్త్రాలు కూడా కొనిచ్చారు. ఉండటానికి ఓ ఇల్లు ఏర్పాటు చేసారు.ఒట్టి రెండు మంచి మాటలు అదే పనిగా చెప్పడంతో అతని జీవితమే మారిపోయింది. ఓ మంచి అలవాటు జీవితాన్ని మార్చేస్తుందన్న నిజాన్ని కూడా గ్రహించాడు. ఇందుకు ఈ బిచ్చగాడే నిలువెత్తు ఉదాహరణ. – యామిజాల జగదీశ్ -
భక్తి
కాశీ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు రామయ్య. దారిలో అతనికి సోమయ్య అనే బాటసారి కలిశాడు. ఇద్దరూ కొద్ది సమయంలోనే స్నేహితులై కలసి ప్రయాణం చేయసాగారు. అలా కొంతదూరం వెళ్ళేసరికి దారిలో రామయ్యకు బంగారునాణెం దొరికింది.‘‘పాపం. ఎవరో దురదృష్టవంతులు. జాగ్రత్తచేయి. తిరుగుప్రయాణంలో ఇచ్చేద్దాం’’ అన్నాడు సోమయ్య.‘‘వాడు ఎవడో పోగొట్టుకున్నాడు. వాడు దురదృష్టవంతుడు. నాకు దొరికింది. నేను అదృష్టవంతుడను. ఇద్దరం ఒకే రహదారిపై నడుస్తున్నాం. ఇది నాకే ఎందుకు దొరకాలి.? నీకు ఎందుకు దొరకకూడదు? ఎందుకంటే నేను అదృష్టవంతుడను కాబట్టి.నాకు దక్కిన అదృష్టాన్ని నేనెందుకు వదులుకుంటాను? వదులుకోను. లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడే తియ్యాలట. అలా ఈ బంగారునాణెం నన్ను వరించింది.’’ అన్నాడు గర్వంగా. ఏమీ మాట్లాడలేదు సోమయ్య. కొద్దిరోజులకు కాశీనగరం ప్రవేశించారు. అలా ప్రవేశించిన కాసేపటికే బంగారునాణెం ఉన్న రామయ్య మూటను ఎవరో దొంగిలించారు. కట్టుగుడ్డలతో మిగిలాడు రామయ్య.‘‘ఎవరో ఆ మూట దొరికిన అదృష్టవంతులు’’ అన్నాడు సోమయ్య.ఆ మాటలకి కోపం వచ్చిన రామయ్య ‘‘వేళాకోళం చేస్తున్నావా?’’ అన్నాడు సోమయ్యను చూస్తూ. ‘‘కాదు. నువ్వన్నదే నీకు చెబుతున్నాను. దొరికినవాళ్ళు అదృష్టవంతులు అన్నావు. బంగారునాణెం దొరికి నువ్వు అదృష్టవంతుడవు అయితే.. ఆ నాణెంతో సహా నీ మూట దొరికినవాడూ అదృష్టవంతుడే కదా!’’ అన్నాడు అతి మామూలుగా. ‘‘ఒక స్నేహితునిగా నాబాధ నీబాధ కాదా? పైగా వేళాకోళం చేస్తున్నావు..’’ అన్నాడు రామయ్య.‘‘స్నేహితుణ్ణి కాబట్టే నీ మేలుకోరి.. బంగారునాణెం దొరికినప్పుడు జాగ్రత్తచేయి తిరుగుప్రయాణంలో ఇచ్చేద్దాం అన్నాను. అది నీ అదృష్టంగా భావించి ఇవ్వనన్నావు. మనదికాని వస్తువు మన దగ్గర నిలవదు. అది వెళుతూ వెళుతూ మనది కూడా పట్టుకుపోతుంది. నువ్వే నిజమైన భక్తుడివైతే తిరుగుప్రయాణంలో ఆ వ్యక్తి ఎవరో.. ఆతను పోగొట్టుకున్న బంగారునాణెం అతనికి తిరిగి ఇచ్చి అతణ్ణి మరింత అదృష్టవంతుణ్ణి చేసేవాడివి. ఎందుకంటే వస్తువు దొరికినవాడు అదృష్టవంతుడైతే, పోగొట్టుకున్న వస్తువును తిరిగిపొందిన వాడిది మరింత అదృష్టం. కానీ నువ్వు అసలైన భక్తుడివి కావు. అందుకే ఆ నాణెం ఉంచేసుకున్నావు. అది మొత్తాన్నే పట్టుకుపోయింది.‘‘నిజమేసుమా..! పరాయి సొమ్ము ఆశించటం నిజమైనభక్తుల లక్షణం కాదు. ఒకవేళ పోయిన నా మూట నాకు దొరికితే గనుక ఆ బంగారు నాణేన్ని అతనికి తిరిగి ఇచ్చేస్తాను..’’ అన్నాడు పశ్చాత్తాపంతో.. ఇంతలో వెనకనుండి..‘ ఎవరో వృద్ధుడు...‘‘అయ్యా..! ఈ మూట తమరిదే కదా? ఇందాక మీరు దీనిని గట్టుమీద పెట్టి గంగలో స్నానానికి దిగినప్పుడు దొంగ దీనిని తస్కరించటం చూసి వెంటాడి తరిమిపట్టుకున్నాను. ఇందాకట్నించీ మీకోసం వెదుకుతున్నాను.. ఇప్పుడు కనపడ్డారు.. తీసుకోండి’’ అన్నాడు.‘ఇన్నివేలమందిలో పోయిన వస్తువు దొరకటం చిన్నవిషయం ఏమీకాదు. ఇదే నిజమైన అదృష్టం..’’ అంటూ ఆ వృద్ధునికి నమస్కరించాడు. అతను వెళ్ళిపోయాకా..మూటలోని బంగారునాణెం బయటికి తీసి చూస్తూ..‘‘మాటల్లో మీరూ, చేతల్లో ఆ వృద్ధుడు నా కళ్ళు తెరిపించారు. దీనిని తిరుగు ప్రయాణంలో ఆ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చి అతణ్ణి నా అంత అదృష్టవంతుణ్ణి చేస్తాను..’’ అన్నాడు పశ్చాత్తాపపడుతూ..‘‘అదే అసలైన భక్తి..’’ అన్నాడు సోమయ్య. కన్నెగంటి అనసూయ -
కాశీలో ‘మోక్ష’ భవనాలు
లక్నో: కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని. చావు పుట్టుకల నుంచి విముక్తి లభిస్తోందని కొంతమందిలో నమ్మకం. ఆ భావనతోనే చనిపోయేందుకు కాశీ వెళుతున్నారు. కాశీకి వెళ్లిన వాళ్లు కాటికి వెళ్లిన వాళ్లు ఒక్కటే అని గతంలో ఓ నానుడి ఉండేది..అయితే కాటికి వెళ్లేందుకే ఇప్పుడు చాలా మంది కాశీకి వెళుతున్నారు. మోక్షం కోసం వచ్చే ఇలాంటి వారికి వసతి కల్పించేందుకు అక్కడ ప్రత్యేకంగా భవనాలు కూడా ఉన్నాయి. చనిపోయే వారి కోసం ముక్తి భవన్ పారిశ్రామికవేత్త విష్ణుహరి దాల్మియా 1958లో ఈ ముక్తి భవన్‌ను ప్రారంభించారు. కాశీలో చనిపోవాలని వచ్చే వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. చావుకు దగ్గిరగా ఉన్న వాళ్లు ఇక్కడికి వస్తారు. ముక్తి భవన్లో ఉచితంగానే వసతి కల్పిస్తారు. అయితే ఇక్కడికి వచ్చే వారికి తప్పనిసరిగా ఓ సహాయకుడు ఉండాలి. వీరికి ఓ రూమ్ కేటాయిస్తారు. కనీసంగా 15 రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ లోపు చనిపోతే సరేసరి. లేదంటే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, రూమ్‌ల ఖాళీని బట్టి మరోసారి వసతి అవకాశం ఇస్తామని నలభై ఏళ్లుగా ముక్తి భవన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మేనేజర్ భైరవ్నాథ్ శుక్లా తెలిపారు. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ కాశీలో చనిపోవాలనే తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఓ కుమారుడు తండ్రిని తీసుకుని మోక్ష భవన్‌కు వచ్చాడు. అయితే అక్కడ కుమారుడు చనిపోయాడు. తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. మరో సంఘటనలో ఓ కొడుకు తన తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు. పదిహేను రోజులు అక్కడే ఉన్నా తండ్రి చనిపోలేదని కొడుకు విసుగ్గా ఆ తండ్రిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ తండ్రి కనీసం మరో ఐదేళ్లు బతికే అవకాశం ఉందని, ఇలా రకారకాల ఆలోచనలతో ఇక్కడికి వస్తుంటారని శుక్లా తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కాశీభవన్‌లో తన ఆఖరి మజిలీని గడుపుతున్నారు. వీరిరువురూ విద్యాశాఖలో పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరచుగా కాశీ వెళ్తుండేవారు. రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చి కాశీ భవన్లో ఓ గదిని తీసుకున్నారు. మిగతా జీవితాన్ని అక్కడే సంతోషంగా గడిపేస్తామని చెబుతున్నారు. 20 ఏళ్లుగా అక్కడే నివాసం అస్సీ ఘాట్‌కు సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ముముక్షు భవన్ ఉంది. ఇందులోనే ప్రాథమికోన్నత పాఠశాల, ఓ గుడి, 60 రూములు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన గులాబ్ బాయ్ అనే మహిⶠ20 ఏళ్లుగా ఈ భవన్‌లోనే ఉంటున్నారు. భర్త మరణానంతరం తన కోరిక మేరకు పిల్లలు ఇక్కడికి తీసువచ్చి వదిలి వెళ్లారని, ఢిల్లీలో కంటే ఇక్కడే తనకు హాయిగా ఉందంటున్నారు గులాబ్. పైగా, ఢిల్లీలో నివశించేవారికి రక్షణ లేకుండా పోయిందని, అక్కడ జరుగుతున్న హత్యల వార్తలను టీవీల్లో చూస్తున్నానని చెప్పారు. ‘ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తోందని చాలామంది ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అయితే కొన్ని లాడ్జీలు చావులను వ్యాపారంగా మార్చేశాయని’ సీనియర్ జర్నలిస్ట్ అమితాబ్ భట్టాచార్య విమర్శించారు. -
కాశీ ఏం చేశాడు?
నటుడిగా, సంగీత దర్శకుడిగా తమిళంలో, తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకున్నారు విజయ్ ఆంటోని. సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘కాశి’. అంజలి, సునైన కథానాయికలు. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 18న విడుదలవుతోంది. లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కాశీ ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడగా, ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాం. తమిళంలో ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
మళ్లీ మదర్ సెంటిమెంట్
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘కాశి’. తెలుగమ్మాయి అంజలి, సునయన కథానాయికలు. క్రితిక ఉదయనిధి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు హక్కులను పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత విలియమ్ అలెగ్జాండర్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ‘కాశి’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. విలియమ్అలెగ్జాండర్ మాట్లాడుతూ –‘‘బిచ్చగాడు’ చిత్రం తర్వాత విజయ్ ఆంటోని మదర్ సెంటిమెంట్‌లో మరో కోణం చూపించనున్న చిత్రమిది. ఆయన తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ, చక్కటి సంగీతం అందించారు. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్‌కి తెలుగులో చాలా మంచి క్రేజ్ రావడంతో ట్రేడ్‌లో బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఆయన వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం వల్లే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘బిచ్చగాడు’ కంటే ‘కాశి’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
కామాంధులకు 20 ఏళ్ల కారాగారం
ఓ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయస్థానం జడ్జి చిదానందం సోమవారం తీర్పు చెప్పారు. 2013లో చిత్తూరు జిల్లాలోని పెనుమూరు ప్రాంతంలో ఓ మహిళను తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన సంపత్, కాశి బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
శివం శంకరం శ్రీముఖం
పుణ్యతీర్థం కాశీలో శివలింగ దర్శనం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో స్వామి ముఖదర్శనం మోక్షప్రదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వంశధార తీరాన ఉంది. మిగిలిన శైవక్షేత్రాల్లో శివుడు లింగాకృతిలో పూజలందుకుంటూ ఉంటే, ఇక్కడ మాత్రం ముఖాకృతిలో పూజలందుకోవడం విశేషం. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో వెలసిన పరమశివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. ఈ క్షేత్రంలో సదాశివుడు కృతయుగంలో గోవిందేశ్వరుడనే పేరుతో కనకాకృతిలో, త్రేతాయుగంలో మధుకేశ్వరుడనే పేరుతో రజతాకృతిలో, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడనే పేరుతో కాంస్యాకృతిలో పూజలందుకున్నాడని, కలియుగంలో శిలాకృతిలో ముఖలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడని ప్రతీతి. ఇదీ చరిత్ర శ్రీముఖలింగం ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన నగరం. కళింగ రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగవంశపు రాజులకు ఇది రాజధానిగా ఉండేది. శ్రీముఖలింగంలోని ఆలయాన్ని క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో రెండవ కామార్ణవుడు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత పర్లాకిమిడి మహారాజు విష్ణువర్ధన మధుకర్ణ గజపతి దీనిని పునరుద్ధరించాడు. వంశధార నదీతీరంలో వెలసిన ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. ప్రాచీన శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచిన శ్రీముఖలింగ క్షేత్రంలో గర్భాలయాన్ని రెండువందల అడుగుల ఎత్తున నల్లరాతితో నిర్మించారు. ఇరవైనాలుగు రాతి స్తంభాలపై అడుగడుగునా శిల్పకళా విన్యాసం సందర్శకులను అబ్బురపరుస్తుంది. ముఖద్వారంలో రాతిపై నిశితంగా తీర్చిదిద్దిన లతలు నాటి శిల్పుల నైపుణ్యానికి అద్దంపడతాయి. ఆలయ ప్రాంగణంలో శివతాండవం, పార్వతీ పరమేశ్వరుల జూదం, గంగావతరణం, అంధకాసుర వధ వంటి పురాణ ఘట్టాలకు చెందిన శిల్పాలు, ఉగ్రనరసింహుడు, ఆది వరాహమూర్తి, ఆదిశక్తి, కుమారస్వామి, దత్తాత్రేయుడు, కాలభైరవుడు వంటి దేవతా విగ్రహాలు చూపరులకు కనువిందు చేస్తాయి. పర్వదినాల్లో శ్రీముఖలింగేశ్వరుడు నందివాహనం, సింహవాహనం, ఐరావత వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా కార్తీకమాసంలో, మహాశివరాత్రి పర్వదినాన పెద్దసంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అనుబంధ క్షేత్రాలు శ్రీముఖలింగానికి చేరువలో పలు అనుబంధ క్షేత్రాలు ఉన్నాయి. తూర్పున కరకవలస గ్రామానికి చేరువలో రత్నగిరిపై పద్మనాభుడిగా వెలసిన శ్రీమహా విష్ణువు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తాడు. ఈ ఆలయంలో కృష్ణార్జునులు కొలువుదీరి ఉండటం విశేషం. దానికి దక్షిణాన వటాద్రిపై సదాశివుడు లింగాకృతిలో పూజలందుకుంటూ ఉంటాడు. దీనికి చేరువలోనే స్వప్నేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దుస్వప్న దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దీనికి సమీపాన గల మధుకేశ్వర ఆలయానికి ఉత్తరాన సూర్యతీర్థం ఉంది. ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందువల్ల ఈ శివలింగాన్ని పూజిస్తే చర్మవ్యాధులు నశిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యతీర్థానికి చేరువలో కుబేరుడు యాగం చేసి శ్రీముఖలింగేశ్వరుడిని అర్చించుకున్న తర్వాత అతడికి అష్టసిద్ధులూ చేకూరినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ ప్రాంతంలో సూర్యతీర్థంతో పాటు కోటి, జంబు, సోమ, పుష్కర, కుబేర, హంస, గయ, చక్రపద్మ సరోవర, బిందు, పక్షి అక్షిణ, సంజీవని తదితర తీర్థాలు ఉన్నాయి. భక్తులకు సౌకర్యాలు కరువు శ్రీముఖలింగేశ్వర ఆలయ పరిరక్షణ బాధ్యతలను కేంద్ర పురాతత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ మినీ మ్యూజియం, ప్రహరీగోడ నిర్మాణం, ఇనుప గ్రిల్స్ ఏర్పాటు, పూలవనం, ఫ్లోరింగ్ వంటి పనులు జరిపించాలని దాదాపు దశాబ్దం కిందటే నిర్ణయం తీసుకుని, నిధులు కూడా కేటాయించినా, ఇంతవరకు ఎలాంటి పనులూ జరగలేదు. కనీసం భక్తుల కోసం స్నానాల గదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు తదితరమైన వాటి నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. ఇక్కడి పరిసరాలు ఆకర్షణీయంగా ఉన్నా, పర్యాటకులు బస చేసేందుకు ఎలాంటి సౌకర్యాలూ అందుబాటులో లేవు. అందువల్ల వసతి సౌకర్యాల కోసం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంపై ఆధారపడక తప్పదు. - ఎస్.శాంత భాస్కరరావు, జలుమూరు, శ్రీకాకుళం ఫోటోలు: కె. జయశంకర్ ముక్కోణాకారంలో మూడు ఆలయాలు శ్రీముఖలింగంలో మూడు ఆలయాలు ఉన్నాయి. ముఖలింగేశ్వరాలయం, భీమేశ్వరాలయం, సోమేశ్వరాలయం ముక్కోణాకారంలో కనిపిస్తాయి. వీటితో పాటు ఇక్కడ అనేక శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలు కోటికి ఒకటి తక్కువగా ఉండటం వల్ల కాశి స్థాయిని అందుకోవలసిన ఈ క్షేత్రం దక్షిణకాశిగా మాత్రమే మిగిలిపోయిందని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ముఖలింగేశ్వరాలయం గర్భగుడిలోని గోలేన్ని ముట్టుకుని నమస్కరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని క్షేత్రపురాణం చెబుతోంది. ముఖలింగేశ్వరాలయానికి తూర్పున భీమేశ్వరాలయం, దక్షిణాన సోమేశ్వరాలయం ఉన్నాయి. ఇలా చేరుకోవచ్చు దేశంలోని దాదాపు అన్ని ప్రధాన మార్గాల నుంచి శ్రీకాకుళం వరకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. విమాన మార్గాన్ని ఎంచుకునే వారు విశాఖపట్నంలో దిగి అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీముఖలింగానికి దాదాపు ప్రతి అరగంటకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. -
విశ్వశాంతి కోసం..
-
శివయ్య తిరిగొస్తాడా?!
ఊళ్లో దేవుడున్నన్నాళ్లూ ఒక్కరూ పట్టించుకోలేదు. అసలా గుడివైపునకే వెళ్లలేదు. దేవుడు మాయమయ్యాడని తెలియగానే ఆయనను చూడాలని తపిస్తున్నారు! పూజలు చెయ్యాలని ఆరాటపడుతున్నారు. శివయ్య మళ్లీ తమ ఊళ్లోకి వచ్చేయాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వెయ్యేళ్లనాటి శివుడి విగ్రహాన్ని కోల్పోయిన ఆ ఊళ్లో ఇప్పుడు అందరూ అనాథలే! అంటే శివనాథుడు లేనివారే!! పళనిసామి కాశి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించి వస్తాడు. దైవపీఠం మీద దేవుడు ఉండడు. అయినా ప్రార్థించి వస్తాడు. అది ప్రార్థనలా ఉండదు. మొరపెట్టుకున్నట్లుగా ఉంటుంది! అతడి ప్రార్థన మొదట దిగంతాలలోని శివుడికి చేరుతుంది. తర్వాత హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి ఆస్ట్రేలియా ఖండం చేరుకుంటుంది. అక్కడి నుంచి రాజధాని కాన్బెర్రాలో ఉన్న ‘నేషనల్ ఆర్ట్ గ్యాలరీ’ ద్వారాలను తోసుకుని మరీ లోపలికి వెళుతుంది. శ్రీపురంధ గ్రామ శివాలయంలో మాయమైన నటరాజ కాంస్య విగ్రహం ఆ గ్యాలరీలోనే ఉందని గ్రామస్థుల నమ్మకం మరి. ఒక్క పళనిసామి మాత్రమే కాదు, గ్రామంలోని వారంతా శివయ్య రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శివయ్య తిరిగొస్తే పాప పరిహారం చేసుకుందామని ఊరు ఊరంతా తొందరపడుతోంది. ఇంతకీ వారు చేసిన పాపం? శివయ్యకు ఒక్కనాడైనా పూజ చేయకపోవడం. శిథిలావస్థలో ఉన్న గుడిని తరతరాలుగా నిర్లక్ష్యం చేయడం. విగ్రహం మాయమయ్యాక మాత్రమే వారు శివుడి గురించి, శివాలయం గురించీ పట్టించుకోవడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం వరకు శ్రీపురంధలో ఎవరూ పళనిసామి కుటుంబంతో మాట్లాడేవారు కాదు. పళనిసామి కుటుంబ సభ్యులే ఆ శివాలయంలోని నటరాజును, మరో ఏడు విగ్రహాలను మాయం చేసి ఉంటారని వారందరికీ అనుమానం! గ్రామం ఆ కుటుంబం మీద నింద వేయడానికి కారణం ఉంది. ఆలయం ప్రహరీ పళనిసామి ఇంటి గోడను అనుకునే ఉంటుంది. పళనిసామి, అముదల పెళ్లి కూడా 1994లో ఆ ప్రాంగణానికి సమీపంలోనే జరిగింది. అది ఆ కుటుంబానికి బాగా అలవాటైన ప్రదేశం. అందువల్ల వారికి తెలియకుండా బయటివాళ్లు వచ్చి 900 ఏళ్ల క్రితం నాటి శివుడి విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని గ్రామస్థుల నమ్మకం. చెన్నయ్‌కి నైరుతి దిశగా ఐదు గంటలు ప్రయాణిస్తే అరియాళూరు జిల్లాలోని శివారు గ్రామమైన శ్రీపురంధ వస్తుంది. శివాలయమూ వస్తుంది. ఇప్పుడంటే పళనిసామి రోజూ గుడికి వెళ్లి, అక్కడ లేని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు కానీ 2008లో చోరీ జరిగి, ఆ విషయం 2011లో బయటపడే వరకు ఎవరూ గుడి తలుపులే తెరవలేదు. ‘‘గుడిలోపల పెద్ద తేళ్ల గుట్ట ఉండేదట. అవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో భక్తులు, ఆలయ అర్చకులు తేలు కాటుకు గురయ్యి ప్రాణం మీదకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందుకే ఆలయాన్ని శాశ్వతంగా మూసేశారని మా పెద్దలు అనుకోవడం విన్నాను’’ అని గ్రామ పెద్ద రామాయణ్ ఉలగనాథన్ చెబుతుంటారు. మొత్తానికి 2012లో విగ్రహం దొంగలు పట్టుబడడంతో వారి ద్వారా అశోకన్ అనే తమిళనాడు వ్యాపారి, అతడి ద్వారా అంతర్జాతీయ పురావస్తు అక్రమరవాణాలో పేరుమోసిన స్మగ్లర్ సుభాస్ చంద్ర కపూర్ పోలీసులకు పట్టుపడ్డారు. ప్రస్తుతం కపూర్ రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవలే స్థానిక మేజిస్ట్రేటు అతడి రిమాండును మార్చి 21 వరకు పొడిగించారు. ‘‘ఇప్పుడంటే గ్రామస్తులు శాంతించారు కానీ, గత రెండేళ్లగా మాకెంత నరకం చూపించారో, ఎంతగా అవమానించారో మాటల్లో చెప్పలేను. ఆ శివయ్యే మమ్మల్ని కాపాడాడు. దోషుల్ని బయటపెట్టి, మా నిర్దోషిత్వాన్ని గ్రామస్థులకు రుజువు చేశాడు’’ అని చెబుతూ కన్నీళ్ల పర్యంతం అవుతుంటారు పళనిసామి భార్య అముద. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఇంత విషం తాగి చనిపోదామనుకున్న రోజులు కూడా ఈ దంపతుల జీవితంలో ఉన్నాయి. శ్రీపురంధలో ఇప్పుడు గ్రామస్థులంతా పళనిసామి కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అలా పలకరించడంలో పరిహారం ఏదో చేసుకుంటున్న భావన వారిలో వ్యక్తమవుతుంటుంది. ఊళ్లోకి మళ్లీ శివయ్య వచ్చేరోజు కోసం శ్రీపురంధ ఎదురుచూస్తూ ఉంది. ముఖ్యంగా పళనిసామి, ఆయన భార్య. శివయ్య తిరిగి వస్తాడా? చెప్పలేం. నేషనల్ ఆర్ట్ గ్యాలరీలోని నటరాజ విగ్రహం, శ్రీపురంధ విగ్రహం ఒకటి కాదని గ్యాలరీ డెరైక్టర్ రాన్ రాఫోర్డ్ పేచీ పెడుతున్నారు. ‘‘లక్షల డాలర్లు పోసి ఓపెన్ మార్కెట్లో మేము ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాం’’ అని ఆయన అంటున్నారు. ఏమైనా, నిజానిజాలు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా తమ ఊరికి శివయ్య వస్తాడని శ్రీపురంధ గ్రామస్థులు భావిస్తున్నారు. దైవపీఠంపై శివయ్య లేకపోతే ఊరిలో మనుషులున్నా లేకున్నా ఒకటేనని ఇప్పుడా గ్రామం నమ్ముతోంది. అందుకే శివయ్య కోసం వారి కళ్లు కాయలు కాస్తున్నాయి. -
శివప్రీతికర క్షేత్రం... ముక్తిధామం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా విఖ్యాతిగాంచిన కాశీక్షేత్ర మహిమ, విశ్వనాథలింగ విశిష్టత విశేషమైనవి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నిరంతరం శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి మహాశ్మశానమని పేరు వచ్చింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెబుతున్నాయి. పురాతన శైవాధామాలలో ఒకటైన కాశీ సకల పాతక నాశినిగా, జ్ఞానప్రదాయినిగా, ముక్తిదాయినిగా పేరు గాంచింది. పావన గంగానదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శివపురి, ముక్తిభూమి, తపఃస్థలి, అవిముక్త్, వారణాసి తదితర పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య ఈ క్షేత్రం గురించి కాశీఖండంలో ప్రముఖంగా ప్రస్తావించారు. గంగానదీమతల్లి ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోనే ‘వరుణ’, ‘అసి’ నదులు గంగలో కలుస్తాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరొచ్చింది. ఇక్కడ మూడువేల సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతివారు నివసించేవారు. అందువల్ల దీనికి కాశీ అని పేరొచ్చింది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ కథనం. పురాతన కాలంలోని ఆలయాన్ని శివభక్తురాలైన అహల్యాబాయి హొల్కర్ 1777లో తిరిగి నిర్మించగా, పంజాబ్ కేసరి మహరాజా రణ్‌జీత్ సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకును తాపడం చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాశీక్షేత్రంలో కొలువైన కాశీవిశ్వనాథ లింగదర్శనం సర్వపాపహరణం. శివకైవల్య ప్రాప్తికి మూలం. గర్భాలయంలో కొలువైన విశ్వేశ్వరలింగం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఫలితాన్నివ్వడంలో మాత్రం పెద్దది. ఈ పవిత్రక్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంలో స్త్రీ పురుష భేదంతో రెండు రూపాల ధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి- శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై తపస్సు చేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమ స్థానం ఎంపిక చేశాడు. అప్పుడు నిర్గుణ శివుడు తన నుంచి సమస్త తేజస్సును ప్రోదిచేసి అత్యంత శోభాయమానమైన పంచకోశ నగరాన్ని నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచి శివునికై తపస్సు చేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి విస్మయం చెందిన విష్ణువు తల ఆడించగా ఆయన చెవి నుంచి ఒక మణి కింద పడింది. అప్పటినుంచి ఆ స్థానం మణికర్ణికగా పేరుగాంచింది. మణికర్ణిక ఐదుక్రోసుల విస్తారం గల సంపూర్ణ జలరాశిని శివుడు తన త్రిశూలంతో బంధించాడు. దానిలో విష్ణువు సతీసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞమేరకు విష్ణువు నాభినుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ ద్వారా అద్భుత సృష్టి జరిగింది. బ్రహ్మ, విష్ణు పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా శివకేశవుల దర్శనం కోరుకుంటారు. మోక్షప్రదాయిని అయిన ఈ క్షేత్రంలో చేసిన ఏ సత్కార్యమైనా సహస్ర కల్పాలలో కూడా క్షయం కాదు. బనారస్ అనే పేరు ఎందుకంటే..? బనారి నామధేయుడైన ఒక రాజు ఈ తీర్థస్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల ఆయన పేరుమీదుగా కాశీని బనారస్ అని కూడా పిలుస్తారు. బనారస్‌లో పదిహేనువందల దివ్య ఆలయాలున్నాయి. కాశీలోని గంగాజలాన్ని రామేశ్వర క్షేత్రాన ఉన్న రామేశ్వర లింగానికి అభిషేక జలంగా వినియోగిస్తారు. కాశీనగరంలో కాలభైరవుడు శునకవాహనుడై గస్తీ తిరుగుతుంటాడని ప్రతీతి. ఈ నగరం బ్రహ్మ సృష్టి కాకపోవడం వల్ల బ్రహ్మ ప్రళయానికి ఇది నశించదు. అలాగే గంగానదీ తీరాన కాశీక్షేత్రాన 64 స్నానఘట్టాలున్నాయి. ఇవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. అసీఘాట్, దశాశ్వమేద ఘాట్, వర్ణ సంగమ, పంచగంగ, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ముఖ్యమైనవి. ఈ దివ్యక్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయాలున్నాయి. వీటిలో బిందుమాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్వరుడి ఆలయాలు ముఖ్యమైనవి. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగాలలో హరిశ్చంద్రాది మహారాజులతోపాటు రామాయణ భారత భాగవత ప్రాశస్త్యం గల అపురూప క్షేత్రమిది. మోక్షపురాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి అక్షత్రయంలో ఒకటి , అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. మాతా అన్నపూర్ణేశ్వరాలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. కాశీపుణ్యక్షేత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్రమైన స్థానాలు. కాశీక్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తిమార్గాలుగా భావిస్తారు. కాశీక్షేత్ర సందర్శనం, కాశీవిశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యపలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు అంటుంటారు. - దాసరి దుర్గాప్రసాద్