వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌.. | Tamil nadu Police Transfer to CBCID Blackmail Kasi Case | Sakshi
Sakshi News home page

వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌.. మహిళా డాక్టరు ఫిర్యాదు

Published Fri, May 29 2020 7:33 AM | Last Updated on Fri, May 29 2020 8:01 AM

Tamil nadu Police Transfer to CBCID Blackmail Kasi Case - Sakshi

కాశి

సాక్షి, చెన్నై: యువతుల్ని మాయమాటలతో లొంగదీసుకుని, వీడియో చిత్రీకరణ ద్వారా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతూ, అందింది దోచుకుంటూ వచ్చిన కన్యాకుమారి మన్మ థుడు కాశీ లీలలు సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. ఇతగాడిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతుండడంతో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  (సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అడ్జెస్ట్‌మెంట్‌ )

చెన్నైకు చెందిన మహిళా డాక్టరు ఒకరు గత నెల ఇచ్చిన ఫిర్యాదుతో కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ కేంద్రంగా మన్మథుడు కాశి(26) సాగిస్తూ వచ్చిన లీల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, సంపన్న మహిళల్ని గురి పెట్టి, వారితో సన్నిహితం పెంచుకుని, లొంగ దీసుకోవడమే కాదు, వీడియో చిత్రీకరించి బ్లాక్‌ మెయిలింగ్‌ తో సొమ్ము చేసుకుంటూ వచ్చిన ఈ మన్మథుడు కుమరి ఎస్పీ శ్రీనాథ్‌కు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతగాడ్ని గూండా చట్టంలో అరెస్టు చేసి విచారించగా, ల్యాప్‌టాప్, పెన్‌ డ్రైవ్‌లో పదుల సంఖ్యలో యువతులతో గడిపిన వీడియోలు బయట పడ్డాయి. రెండు సార్లు ఇతడ్ని కస్టడికి తీసుకుని విచారించారు.(రఫికా కూతురుపైనా ఆత్యాచారం..? )

ఈ సమయంలో ఐదుగురు యువతులు, ఇద్దరు మహిళలు, ఓ బాలిక, ఓ యువకుడు సైతం కాశిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం కుమరికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరిస్తున్నది. దీంతో కేసును సీబీసీఐడీకి అప్పగించాలని కుమరి ఎస్పీ శ్రీనాథ్‌ డీజీపీ త్రిపాఠిని కోరారు. ఇందుకు తగ్గ నివేదికను డీజీపీకి పంపించారు. తాము కాశి మీద నమోదు చేసిన గూండా చట్టం, ఇప్పటి వరకు కుమరిలో వచ్చిన ఫిర్యాదులు, ఇతర జిల్లాల్లో వస్తున్న ఫిర్యాదుల గురించి వివరించారు. ఈ కేసులో కాశి అనుచరుడు ఒకడ్ని అరెస్టు చేశామని, మరొకడు విదేశాల్లో ఉన్నాడని, అతడు తప్పించుకోకుండా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసినట్టు వివరించారు. దీంతో ఈకేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీసీఐడీ ఎస్పీ లేదా, ఏఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈకేసును ముందుకు తీసుకెళ్లనుంది. కాశీని మళ్లీ కస్టడికి తీసుకుని విచారించేందుకు సీబీసీఐడీ కసరత్తులు చేపట్టనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement