ప్రతీకాత్మకచిత్రం
వేలూరు (చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడి–తిరువలం రోడ్డులోని ఒక సినిమా థియేటర్‌లో గత నెల 17వ తేదీన వేలూరులోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసే మహిళా డాక్టర్‌తో పాటు ఆమె స్నేహితుడు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో ఇద్దరూ థియేటర్ ముందు ఆటో కోసం వేచి ఉండగా ఐదుగురు యువకులు వారిని ఆటోలో ఎక్కించుకుని కలెక్టరేట్ సమీపంలో ఉన్న పాలారు వద్దకు తీసుకెళ్లి మహిళా డాక్టర్‌తో వచ్చిన వ్యక్తి గొంతుపై కత్తి పెట్టి బెదిరించి మహిళా డాక్టర్‌పై నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం వారిని అదే ఆటోలో ఎక్కించుకుని వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డులో నుంచి రూ.40 వేలు డ్రా చేయించుకుని, వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని లాక్కున్నారు.
అయితే ఈ ఐదుగురు యువకులు డబ్బులు పంచుకోవడంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆంజనేయులు స్వామి ఆలయం ముందు మద్యం మత్తులో ఘర్షణ పడుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వావుసి నగర్‌కు చెందిన పార్తీబన్(20), సంతోష్‌కుమార్(22), నెహ్రూ నగర్‌కు చెందిన భరత్(18), మణిగండన్(22), 17 ఏళ్ల మైనర్ బాలున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మహిళా డాక్టర్ వద్ద నుంచి ఆన్‌లైన్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు మైనర్ నిందితున్ని చెన్నైలోని బాలుర శిక్షణా కేంద్రంలోకి చేర్చారు. నలుగురు యువకులపై రౌడీషీట్ నమోదు చేయాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment