Vellore
-
డీఎంకే ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. శుక్రవారం(జనవరి3) ఉదయం వెల్లూరు జిల్లాలోని కదిర్ ఆనంద్ ఇంట్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితులు,బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో గతంలో ఆనంద్ దగ్గరి బంధువుల ఇళ్లలో రూ.11.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచిపెట్టేందుకే దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019లో ఆనంద్‌తో పాటు అతని బంధువులపై క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ కేసు నమోదైంది.ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ కుమారుడే కదిర్ ఆనంద్.ఇదీ చదవండి: దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు -
గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు
చెన్నై: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని ఆక్షేపిస్తూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ ఘటన జరిగింది. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకున్ని అరుణ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఉందని పోలీసులు తెలిపారు. వినాయక ఉత్సవాల్లో మతపరమైన భావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డ్యాన్స్‌లో పాల్గొన్న ఇతర యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్ షా
వెల్లూరు(చెన్నై): కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వారసత్వ రాజకీయాలు సాగిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. తాను 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై మాట్లాడడంలేదని, ఆయా పార్టీల్లో రెండు, మూడు, నాలుగో తరాల గురించి మాట్లాడుతున్నానని వివరించారు. ఆ పార్టీలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని మండిపడ్డారు. మారన్ కుటుంబం రెండు తరాలుగా, కరుణానిధి కుటుంబం మూడు తరాలుగా, సోనియా గాంధీ కుటుంబం నాలుగు తరాలుగా అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడులోని వెల్లూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. చదవండి: గిన్నిస్ పెళ్లిళ్లు -
మాస్టారు అవతారం ఎత్తిన కలెక్టర్!
వేలూరు(చెన్నై): వేలూరు కలెక్టర్ కుమరవేల్ పాండియన్ మాస్టారు అవతారం ఎత్తారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. సత్‌వచ్చారిలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఉదయం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల మరుగుదొడ్లు, వంట గదిలో దుర్వాసన రావడంతో టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. పాఠశాలలో విద్యార్థులకు తయారు చేసిన వంటను రుచి చూసి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. పాఠశాలకు బెంచ్‌లు కావాలని విద్యార్థులు కోరగా వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చదవండి Pawan Khera: విమానం నుంచి దించేసి మరీ అరెస్ట్! -
ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి..
సాక్షి, చెన్నై(వేలూరు): ప్రియుడు మాట్లాడలేదని ఓ ప్రియురాలు విషం తాగుతూ వీడియో తీసి, ప్రియుడికి పంపి, ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసుల కథ నం మేరకు.. తిరుపత్తూ రు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని కరుణానిధి గ్రామానికి చెందిన తిరుమాల్ కుమార్తె శరణ్య(23) కృష్ణగిరిలోని ప్రైవేటు కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదిలాఉండగా ఈమె అదే గ్రామానికి చెందిన ఆర్మీ సిపాయి అరుణ్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మనస్పర్థల కారణంగా ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు. దీంతో మనోవేదనకు గురైన శరణ్య ఈనెల 11వ తేదీన శీతల పానీయంలో విషం కలిపి తాగి, ఆ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేసి ప్రియుడికి పంపింది. అపస్మారక స్థితికి చేరుకున్న శరణ్యను కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరణ్య శుక్రవారం ఉదయం మృతి చెందింది. ప్రియుడిని బెదిరించేందుకు విషం తాగిన శరణ్య చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ ప్రాంతంలోని వారిని కలిచి వేసింది. ఈ మేరకు నాట్రంబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Darshit: కన్నా..ఇక కనిపించవా..) -
బాబోయ్.. ఇదేం ర్యాగింగ్!
చెన్నై: తమిళనాడులోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్లు ర్యాగింగ్ పేరిట జూనియర్లను శారీరకంగా వేధించారు. ఇందుకు సంబంధించిందిగా చెబుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సీనియర్లు దారుణానికి తెగ పడ్డారు. జూనియర్ స్టూడెంట్స్‌ను కేవలం అండర్ వేర్‌పై నిలబెట్టి.. క్యాంపస్‌లోనే దారుణమైన పనులు చేయించారు. అర్థనగ్నంగా క్యాంపస్ రోడ్లపై రౌండ్లు వేయించడంతో పాటు బురదలో బస్కీలు, పుషప్స్ తీయించడం, వాటర్ పైపులతో నీళ్లను చల్లడం లాంటివి చేశారు. చేతికి దొరికిన వస్తువులను వాళ్ల మీదకు విసిరేశారు. మరోవైపు జూనియర్లను అర్థనగ్నంగానే ఒకరినొకరు కౌగిలించుకోవమని చెప్పడం, ప్రైవేట్ పార్ట్‌లపై కొట్టడం లాంటివి చేశాడు ఓ సీనియర్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కేసు నమోదు అయ్యింది. సీఎంసీ వెల్లూరు యాజమాన్యం.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, ఓ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సీనియర్లపై వేటు పడినట్లు తెలుస్తోంది. వెల్లూరు ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ర్యాగింగ్ వీడియో నిజమైందేనా? నకిలీదా? తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. Christian Medical College in Vellore has suspended seven senior medical students for ragging after videos of first-year MBBS students being beaten up, stripped & tortured went viral on social media.#TamilNadu #Vellore #CMC #CMCVellore #CMCRagging #MBBS #Ragging #ViralVideo pic.twitter.com/m5jkjMyUNf — Hate Detector 🔍 (@HateDetectors) November 9, 2022 ఇదీ చదవండి: కరగాట్టంలో ఇక అశ్లీలత ఉండకూడదు! -
ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం
సాక్షి, చెన్నై(వేలూరు): కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్పాప్ చేసి, ఆపై ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన కత్తారి కుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఒడుగత్తూరు సమీపంలోని మేల్ అరసంబట్టు పంచాయతీలోని కత్తారి కుప్పం గ్రామానికి చెందిన శరత్‌కుమార్(27) ఊసూరు వద్ద ఉన్న ఒక బేకరి దుకాణంలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం జరిగి గతవారం ఆడశిశువు పుట్టింది. కాగా ఊసూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి గుడియాత్తంలోని కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో విద్యార్థిని శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ఊసూరులోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలో శరత్‌కుమార్ కన్ను ఆమెపై పడింది. ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం చేయాలని నిర్ణయిచుకుని, ఏడాదిగా ఆ విద్యార్థిని ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను వెంబడిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం విద్యార్థిని వస్త్రదుకాణంలో పని ముగించుకుని, బస్సు కోసం వేచి ఉన్న సమయంలో శరత్‌కుమార్ అక్కడ వేచి ఉంటూ ఎవరూ లేని సమయంలో విద్యార్థిని చేతులు పట్టుకుని ముళ్ల చెట్ల మధ్యకు తీసుకెళ్లడంతో విద్యార్థిని కేకలు వేసింది. వెంటనే చేతులు కట్టి, నోట్టో గుడ్డపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట పెడితే హత్య చేస్తానని బెదిరించాడు. అనంతరం జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి పొక్సో చట్టం కింద అరెస్టు చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు. చదవండి: (రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక..) -
మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?
సాక్షి, చెన్నై(వేలూరు): ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రానికి చెందిన గాయత్రి (32) వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న తూత్తుకుడికి చెందిన సెల్వకుమార్‌ను ప్రేమించి, నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ తొర్రపాడిలోని గాంధీనగర్‌లో కాపురం ఉంటున్నారు. దంపతులకు సంతానం లేక పోవడంతో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దంపతులు ఇద్దరికీ మార్చి, మార్చి డ్యూటీలు ఉండడంతో వీరు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉండడం లేదు. ఇదిలా ఉండగా సెల్వకుమార్ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆదివారం సాయంత్రం భార్యకు సెల్వకుమార్ ఫోన్ చేయగా ఫోన్ తీయలేదు. దీంతో ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ సెల్వకుమార్ ఇంట్లో పరిశీలించగా అప్పటికే గాయత్రి ఒక గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించి, బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. మహిళా డాక్టర్ సంతానం లేకపోవడంతోనే మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేక వేరే ఏమైనా కారణాలున్నాయా ?అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చదవండి: (Khammam: వివాహేతర సంబంధమే ఆమె ప్రాణం తీసిందా..?) -
ఆ యువతితో ఉన్న 10 రోజులు మరుపురానివి.. తల్లిదండ్రులు..
వేలూరు (చెన్నై): రాణిపేట జిల్లా వాలాజ పేట మండపం వీధికి చెందిన శక్తివేల్(26) సుంగాసత్రంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమించి.. ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చర్చించుకుని ఇద్దరిని ఒకటిగా చేర్చారు. ఇటీవల భార్యతో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో చేరేందుకు బస్సులో వెళ్లాడు. గమనించిన యువతి బంధువులు కారులో వెంబడించి శక్తివేలుపై దాడి చేసి యువతిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీటిపై శక్తివేల్ వాలాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి మనో వేదనతో ఉన్న శక్తివేల్ ఇంటిలో ఓ లేఖ రాసి పెట్టి ఎలుకల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వేలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన శక్తివేల్ ఇంటిలో ఒక లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో తన వివాహానికి సాయం చేసిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తాను యువతితో జీవించిన 10 రోజులు మరుపురానివని, అయితే వారి తల్లిదండ్రులు ఇంతటి దారుణం చేస్తారని అనుకోలేదని వాపోయినట్లు తెలుస్తోంది. చదవండి: (స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ) -
యాచకురాలికి ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుల్
సాక్షి, చెన్నై: వేలూరు సౌత్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువరాణి శనివారం రాత్రి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రముఖ వస్త్ర దుకాణం వద్ద 35 ఏళ్ల యాచకురాలు ప్రసవం నొప్పులతో ఇబ్బంది పడుతోంది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.అత్యవసర పరిస్థితిని గుర్తించిన యువరాణి మరో పీసీతో కలిసి ఆమెకు ప్రసవం చేసింది. ఆడ శిశువు జన్మించింది. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందజేసి వేలూరు పెంట్‌ల్యాండ్ ఆసుపత్రికి తల్లీ, బిడ్డను తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె వద్ద విచారణ జరపగా భర్త వదిలి వెళ్లి పోవడంతో దిక్కులేక భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. మహిళా పోలీసులు ఆమెకు దుస్తులు, వస్తువులను అందజేశారు. పీసీ యువరాణిని అధికారులు ప్రశంసించారు. కాగా నవజాత శిశువును పట్టుకుని ఉన్న పోలీసు ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం -
టీఎన్పీఎస్సీ కోచింగ్.. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి..
వేలూరు (తమిళనాడు): బావిలో శవమై తేలిన సంతోష్ ప్రియ(22) కేసును పోలీసులు చేధించారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్ ప్రియ తాతయ్యతో కలిసి నివసిస్తోంది. ప్రస్తుతం టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత నెల 23వ తేదీన సమీపంలోని బావిలో శవమై కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..) పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలియడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కొద్ది రోజులుగా స్విచ్ఛాఫ్‌లో ఉన్న మృతురాలి సెల్‌ఫోన్ సోమవారం తిరుపత్తూరు కోట సమీపంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకుని ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువకుడు కొరియర్ కంపెనీలో పనిచేసే మహేంద్రన్‌గా తెలిసింది. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగికదాడి చేసి అనంతరం బయటకు తెలియకుండా ఉండేందుకు గొంతు నులిమి మృతదేహాన్ని బావిలో వేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
దూకుడే ప్రాణాలు తీసింది
మారేడుమిల్లి: ఇద్దరు యువకుల మృతితో విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నుంచి వచ్చిన ఆరుగురు యువకుల్లో కాళిదాస్ సందీప్ (24), దాన అరుణ్ కుమార్ (22 ) ఆదివారం పాములేరు వాగులో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వాగులో స్నానం ప్రమాదకరమని హెచ్చరికలున్నా దూకుడుగా వ్యవహరించి దిగడం వల్లే ప్రాణాలు కోల్పోయారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మృతుల్లో సందీప్ డిగ్రీ పూర్తి చేశారు. అరుణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తోటి స్నేహితులు తెలిపారు. వల్లూరు.. కన్నీరు. వాగుల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకుల స్వగ్రామం మండలంలోని వల్లూరు కన్నీరుమున్నీరైంది. రెండు ఆటో కార్మిక కుటుంబాలను పెను విషాదంలో ముంచింది. మండలంలోని వల్లూరుకు చెందిన మృతులు కాళిదాస్ సందీప్ (20), దాన అరుణ్‌కుమార్ (22) అవివాహితులు. అరుణ్ కుమార్ తండ్రి సత్యనారాయణ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సీత గృహిణి. వీరికి ముగ్గురు కొడుకులు. ఆఖరి కొడుకైన అరుణ్ కుమార్ కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పాములేరు ఘటనలో మృత్యువాత పడ్డాడు. విహారానికి వెళ్లి విగత జీవిగా మిగిలావా అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మరో మృతుడు సందీప్ తండ్రి చంటిదొర కూడా ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి మేరీ కువైట్‌లో ఉంటోంది. ఐదు నెలల క్రితం అక్కడకు వెళ్లింది. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ పాములేరు వెళ్లారు. పెద్ద కుమారుడైన సందీప్ వాగుకు బలయ్యాడు. నిత్యం ఎంతో సందడిగా ఉండే సందీప్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు గుండెలు బద్దలయ్యేలా రోదిస్తున్నారు. (చదవండి: ఇన్ఫోసిస్ @ వైజాగ్!) -
మాజీ జవాన్ నిర్వాకం.. మద్యంమత్తులో కలెక్టరేట్‌కి వచ్చి..!
వేలూరు: వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవాన్ని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యతో కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ వద్దకు వెళ్లి.. మద్యం మత్తులో సెల్‌ఫోన్‌ను చూస్తూ నిలుచున్నాడు. ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్ మాజీ జవాన్‌ను కోరగా అందుకు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. గమనించిన జిల్లా అధికారులు వెంటనే పోలీసులను రప్పించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో అతను కింద పడి పోయాడు. అనంతరం పోలీసులు విచారణ జరపగా అతను వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన మాజీ జవాన్ వేల్మురుగన్ తేలింది. ఇతని కుటుంబ ఆస్తి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు చేసేది లేక అతన్ని కారులో ఇంటికి పంపించి వేశారు. -
మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..
వేలూరు (చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడి–తిరువలం రోడ్డులోని ఒక సినిమా థియేటర్లో గత నెల 17వ తేదీన వేలూరులోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసే మహిళా డాక్టర్‌తో పాటు ఆమె స్నేహితుడు కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. రాత్రి 1 గంట సమయంలో ఇద్దరూ థియేటర్ ముందు ఆటో కోసం వేచి ఉండగా ఐదుగురు యువకులు వారిని ఆటోలో ఎక్కించుకుని కలెక్టరేట్ సమీపంలో ఉన్న పాలారు వద్దకు తీసుకెళ్లి మహిళా డాక్టర్‌తో వచ్చిన వ్యక్తి గొంతుపై కత్తి పెట్టి బెదిరించి మహిళా డాక్టర్‌పై నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం వారిని అదే ఆటోలో ఎక్కించుకుని వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డులో నుంచి రూ.40 వేలు డ్రా చేయించుకుని, వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని లాక్కున్నారు. అయితే ఈ ఐదుగురు యువకులు డబ్బులు పంచుకోవడంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆంజనేయులు స్వామి ఆలయం ముందు మద్యం మత్తులో ఘర్షణ పడుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వావుసి నగర్‌కు చెందిన పార్తీబన్(20), సంతోష్‌కుమార్(22), నెహ్రూ నగర్‌కు చెందిన భరత్(18), మణిగండన్(22), 17 ఏళ్ల మైనర్ బాలున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మహిళా డాక్టర్ వద్ద నుంచి ఆన్లైన్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు మైనర్ నిందితున్ని చెన్నైలోని బాలుర శిక్షణా కేంద్రంలోకి చేర్చారు. నలుగురు యువకులపై రౌడీషీట్ నమోదు చేయాలని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ ఆదేశించారు. చదవండి: (నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్) -
ఈవీ బైక్ ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
Electric Bike Explodes: తమిళనాడులో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బండి పేలుడు ఘటనలో తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. వెల్లూరు అల్లపురం ఏరియాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో బైక్ ఓనర్ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు. కొత్తగా బైక్ కొన్న దురై.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలో బైక్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకుంది. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి బాత్రూం నుంచి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు ఈ తండ్రీకూతుళ్లు. మంటల్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు.. రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే లోపే.. ఆ పొగలో దురై, ప్రీతీలు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
ఆటోను దారి మళ్లించి.. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం.. అడ్డొచ్చిన స్నేహితునిపై..
వేలూరు(చెన్నై): వేలూరు సత్‌వచ్చారిలో ఓ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం రేపింది. వివరాలు.. వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ యువతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి కాట్పాడిలోని సినిమా థియేటర్లో సెకెండ్‌షోకు వెళ్లారు. అనంతరం స్నేహితులతో కలిసి వేలూరుకు షేర్ ఆటోలో బయలు దేరింది. (చదవండి: Mysterious Death: ప్రేమ పెళ్లి.. పుట్టింటి నుంచి భర్తతో కలిసి వెళ్లి.. ) ఆ ఆటోలో అప్పటికే నలుగురు వ్యక్తులున్నారు. వారంతా కలసి ఆటోను సత్‌వచ్చారిలోని మరో రోడ్డుకు మళ్లించారు. యువతి డ్రైవర్‌ను నిలదీయగా సమాధానం ఇవ్వకుండా ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లారు. యువతి స్నేహితునిపై దాడి చేసి అక్కడ నుంచి బెదిరించి తరిమి వేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు కలిసి ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. బాధితురాలు సత్వచ్చారి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
లక్షలాది రూపాయలు వడ్డీకిచ్చి.. మనోవేదనతో
వేలూరు (చెన్నై) : వేలూరు జిల్లా గుడియాతం సమీపంలోని పుదుపేట గ్రామానికి చెందిన లారీ యజమాని ప్రభు, భార్య శ్రీలక్ష్మీ (37)కి రూపేష్, ధన్సిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తలు బంధువులకు లక్షలాది రూపాయలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పు తీసుకున్నవారిలో అనేకమంది వడ్డీ ఇవ్వకపోగా, కొందరు పూర్తి నగదును ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీ అప్పు ఇచ్చిన వారిని నిలదీసింది. ఆ సమయంలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మనోవేదనతో ఉన్న శ్రీలక్ష్మీ గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీలక్ష్మీ ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీలతో కూడిన లేఖను తెలుగులో రాసి పెట్టి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఎవరెవరికి ఎంత ఇచ్చారో పేర్లతో సహా ఉండడంతో పాటు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. చదవండి: (కన్నీరు పెట్టిస్తున్న వినయ్ సూసైడ్ లేఖ.. ఆ 14 మందే కారకులు..) -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ స్వాధీనం
చెన్నై: వేలూరు సమీపంలోని మూంజూరుపట్టుకి చెందిన ఇందుమది (30) వేలూరు రిజర్వ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2010లో ప్రైవేటు ఉద్యోగి క్రిష్ణమూర్తితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య, భర్తలు ఇద్దరూ పనిచేస్తుండడంతో పిల్లలు ఇడయంబట్టు గ్రామంలోని క్రిష్ణమూర్తి తల్లిదండ్రుల వద్ద ఉన్నారు. ఈమె పోలీస్ క్యార్టర్స్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఆమె విధులకు హాజరు కాకపోవడంతో అనుమానించిన సహ కానిస్టేబుళ్లు.. ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాత్రి పోలీస్ క్యార్టర్స్‌కు వచ్చి చూడగా ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని గుర్తించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని రాసి ఉంది. కాగా పనిభారం, సెలవులు దొరక్కపోవడంతో పిల్లలను చూసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. చదవండి: (Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం) -
కబడ్డీ... కబడ్డీ...
‘కబడ్డీ.. కబడ్డీ’.. అని కూత పెట్టే ఆటగాళ్లు పాయింట్ కోసం బరిలో దిగుతారు. వేగం, ఒడుపు ఉండే ఆ ఆటలో తప్పొప్పులను ఎంచే రిఫరీ పని చాలా కష్టమైనది. నేడు ప్రో కబడ్డీ లీగ్‌లో పని చేస్తున్న పది మంది మహిళా రిఫరీలలో సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా, గృహిణిగా, తల్లిగా ఉంటూనే ఆమె కబడ్డీ రిఫరీగా ఆ ఉపాధి పట్ల యువతులకు కుతూహలం రేపుతోంది. కూత ఆపకూడదు. ప్రత్యర్థి శిబిరానికి చిక్క కూడదు. ఒకరినో ఇద్దరినో చిరుతలా తాకి సొంత శిబిరానికి చేరుకోవాలి. కబడ్డీ అసలు సిసలు భారతీయ పల్లె క్రీడ. ప్రధానంగా పురుష క్రీడ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆట ఆ తర్వాత క్రికెట్ దెబ్బకు చతికిల పడింది. తిరిగి కార్పొరేట్ అవసరాల కొద్దీ ప్రాణం పోసుకుంది. ఇసుక మైదానాల నుంచి ఖరీదైన ఇండోర్ స్టేడియంలలోకి, లైవ్ టెలికాస్ట్లలోకి, స్పాన్సరర్ల పూనికలోకి మారిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను అలరిస్తోంది. అందుకు కొత్త కొత్త మార్గాలను అవలంబిస్తోంది. 2014లో ‘ప్రో కబడ్డీ లీగ్’ మొదలైతే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఈ ఆటలో ఉపయోగిస్తున్నారు. అందుకు సాగిన సెలక్షన్లలో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన రిఫరీయే ఎంకె. సంధ్య. సీజన్ 6తో మొదలయ్యి ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి సాగుతున్న సీజన్ 8లో కూడా రిఫరీగా పని చేస్తున్న సంధ్య అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కబడ్డీ ప్లేయర్ ‘8వ తగతిలో ఉండగా మా స్కూల్ మైదానంలో కొంత మంది సీనియర్ అమ్మాయిలు కబడ్డీ ఆడటం చూశాను. నాకు ఆ ఆట నచ్చింది. అక్కా... నన్ను కూడా చేర్చుకోండి అని అడిగితే చిన్న పిల్లవు... వచ్చే సంవత్సరం టీమ్‌లోకి వద్దువులే అన్నారు. నేను వినలేదు. పీటీని అడిగి వెంటనే చేరిపోయాను’ అంటుంది సంధ్య. మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న సంధ్య తాను మాత్రమే ఈ ఆటను ఎంచుకున్నందుకు ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇంటర్లో చేరగానే సబ్ జూనియర్స్ నేషనల్ జట్టుకు ఆ తర్వాత జూనియర్స్ నేషనల్ జట్టుకు (2008) ఆడింది. ఆ తర్వాత కూడా ఆమె ఆట జోరుగా సాగేదేమో కాని జీవితం మారింది. ప్రేమ పెళ్లి సీనియర్ ఇంటర్లో ఉండగా సంధ్యకు కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్తో పరిచయమైంది. వెంటనే ప్రేమ ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. ‘మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. అందుకని మేము వెల్లూరు వదిలి చెన్నైకు వచ్చేశాము’ అంది సంధ్య. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు కొడుకు పుట్టాడు. జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంతివరన్కు సంధ్య టాలెంట్ తెలుసు. ‘మళ్లీ నువ్వు కబడ్డీ ఆడు’ అని ఆమెతో చెప్పాడు. ఆమెను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కాని వివాహం అయ్యి, బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి పూర్వపు ఫిట్నెస్తో ఆడటం అంత సులభం కాదు. ‘మేమిద్దం చాలా కష్ట పడ్డాం. ఉదయం 5 నుంచి ఆరున్నర వరకూ కబడ్డీ ఆడేదాన్ని. తిరిగి నా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఆడేదాన్ని. అతను నా కోసం స్పెషల్ డైట్ కూడా ఫిక్స్ చేశాడు. కొత్తల్లో ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. కాని పట్టుదలగా ఫిట్నెస్ సాధించి తిరిగి కబడ్డీ ప్లేయర్‌గా మారాను’ అంది సంధ్య. ఇప్పుడు సంధ్య దక్షిణ భారత మహిళ కబడ్డీ టీమ్‌లతో కలిసి కబడ్డీ ఆడటం మొదలెట్టింది. అంతే కాదు భర్త ప్రోత్సాహంతో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేసింది. 2015 వరకూ మహిళా కబడ్డీ ప్లేయర్‌గా ఉన్న సంధ్య వెల్లూరులో తల్లి అనారోగ్యం వల్ల కొంత, పిల్లాణ్ణి ఒక్కణ్ణే వదిలేసి టోర్నమెంట్లకు వెళ్లే వీలు లేక కొంత కబడ్డీ ఆటకు దూరమైంది. తిరిగి ఆ దంపతులు వెల్లూరు చేరుకున్నారు. పిఈటీగా... వెల్లూరులో స్ప్రింగ్ డేస్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరింది సంధ్య. వెల్లూరులో పని వెతుక్కున్న భర్త ‘కబడ్డీ రిఫరీలకు డిమాండ్ ఉంది. ఆ పరీక్షలు రాయి’ అని ప్రోత్సహించాడు. సంధ్య ‘అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే రిఫరీ పరీక్షను రాసి పాసైంది. ఆ వెంటనే ఆమెకు డిస్ట్రిక్ లెవల్, ఇంటర్ జోన్ మేచ్లకు రిఫరీగా ఉండే అవకాశాలు రావడం మొదలయ్యింది. స్కూల్లో పని చేస్తూనే, కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే, మేచ్ ఉన్నప్పుడు రిఫరీగా బయలుదేరి వెళుతోంది సంధ్య. ప్రొ కబడ్డీ లీగ్ రిఫరీగా ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ కోసం మహిళా రిఫరీల సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి వాటిలో పాల్గొని ఎంపికైంది సంధ్య. ఇది పెద్ద విజయమే. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ చాలా ప్రొఫెషనల్‌గా సాగుతాయి. స్పాన్సర్‌షిప్‌లతో ముడిపడిన వ్యవహారం. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కనుక రిఫరీలు తప్పులు చేయడానికి లేదు. ‘టోర్నమెంట్ సాగుతున్నన్ని రోజులు మేము ఉదయాన్నే మా ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ముందు రోజు ఆటను అవలోకించాలి. ఆ రోజు జరిగే ఆటను అంచనా వేయాలి. అప్పుడు మేము మేచ్‌కు రెడీ అవుతాం’ అంటుంది సంధ్య. ప్రతి మేచ్‌కు ఒక మెయిన్ రిఫరీ, ఇద్దరు అంపైర్లు, ఇద్దరు లైన్ రిఫరీలు, ఇద్దరు అసిస్టెంట్ రిఫరీలు ఉంటారు. మెయిన్ రిఫరీగా వీరిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యకు. ‘మేచ్లలో సిగ్నల్స్‌ను సాధన చేస్తాం మేము. అలాగే ఒక్కోసారి ఆటగాళ్లు పాయింట్స్ కోసం వాదనకు దిగుతారు. వారికి మా నిర్ణయం సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. వారు ఆగ్రహంలో ఉంటారు. మేము స్థిమితంగా మాట్లాడాలి. మేము కూడా కోప్పడితే అంతా రసాభాస అవుతుంది’ అంటుంది సంధ్య. మారుతున్న కాలానికి మారుతున్న మహిళా క్రీడా ప్రతినిధి సంధ్య. -
Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ!
చెన్నై: వెల్లూరులోని ఓ నగల దుకాణంలో వారంరోజుల క్రితం గోడకు కన్నం వేసి 15 కిలోల బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే! ఐతే ఈ దోపిడీకి పాల్పడిన నిందితుడిని తమిళనాడు పోలీసులు అనతికాలంలోనే అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు ముమ్మర గాలింపులు చేసిన పోలీసులు నిందితుడి పట్టుకుని, అతని వద్ద బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే... యూట్యూబ్ వీడియోలు చూసి దోచుకోవడం ఎలాగో నేర్చుకుని పక్కాప్లాన్‌తో పనికానించాడీ ఈ ఘరానా దొంగ. డిసెంబర్ 15న జోస్ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపు గోడ పగులగొట్టి, లోపలున్న15 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఐతే సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్‌తో సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసులకు మాత్రం అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడే అందుకు కారణం. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన 8 పోలీస్ టీమ్‌లు ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలించి సోమవారం నాడు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు కూచిపాళయం గ్రామానికి చెందిన టిఖారాం (22)గా గుర్తించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు, జ్యువెలరీ షాపు గోడకు రంధ్రం చేసి, శబ్దం రాకుండా షాపులోకి ప్రవేశించేందుకు10 రోజులపాటు ప్రాక్టీస్చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే సీసీటీవీని ఎలా బ్లాక్ చేయాలో కూడా యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాడట. వీలైనంత త్వరగా సంపన్నుడు కావాలని ఇంతటి పన్నాగంపన్నిన టిఖారాం అనూహ్యంగా పోలీసుల వలలో చిక్కుకోవడంతో గుట్టురట్టయ్యింది. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనంచేసుకుని, ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు. -
16 కిలోల బంగారు, అరకిలో వజ్రాలు చోరీ.. అనుమానాస్పద ప్రాంతంలో..
సాక్షి, వేలూరు: వేలూరు –కాట్పాడి రోడ్డులోని జోస్ అలుక్కాస్ బంగారు దుకాణంలో ఈనెల 16వ తేదీన దుండగులు గోడకు రంధ్రం చేసి దుకాణంలోని 16 కిలోల బంగారు నగలు, అర్ధకిలో వజ్రాలు చోరీ చేశారు. చోరీ ఘటన పూర్తిగా సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో వీటిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా నలుగురు డీఎస్పీలతో కూడిన ఎనిమిది బృందాలు ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టారు. అదే విధంగా కాట్పాడి రోడ్డులో అక్కడక్కడ దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చదవండి: (జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..) ఆ సమయంలో చోరీ జరిగిన సమయంలో సంబంధం లేని ప్రాంతంలో ఓ ఆటో నిలిచి ఉండడాన్ని పోలీసులు కెమెరాల్లో గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో సంబంధం లేని ప్రాంతంలో ఆటో ఎందుకు నిలిచి ఉందని పోలీసులు ప్రశ్నించారు. చోరీ జరిగిన దుకాణం పక్కనే ఒక విశ్రాంతి గది ఉండటం, అందులో అనేక మంది కార్మికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడంతో కార్మికుల వద్ద విచారణ చేపట్టారు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) అదే విధంగా 25 మంది కార్మికులు వేలి ముద్రలు, ఫొటోలు, ఆధార్ కార్డులను సేకరించి విచారణ చేపట్టగా అందులో వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని కుచ్చిపాళ్యంకు చెందిన టీకారామన్(28) నిందితుడిగా తెలిసింది. దీంతో ఇతన్ని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. చోరీ చేసిన 16 కిలోల బంగారం, వజ్రాలను ఎక్కడ దాచి పెట్టాడనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. -
తమిళనాడులో ఆంధ్రా ఆర్టీసీ బస్సు సీజ్
వేలూరు( చెన్నై): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును తమిళనాడు అధికారులు గురువారం సీజ్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన సుబ్రమణ్యం నాయుడు(57). ఇతను తన రోజువారీ వ్యాపారాన్ని పూర్తి చేసుకొని 2010 డిసెంబర్ 17వ తేదీన గుడియాత్తం నుంచి ఆంబూరుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. గుడియాత్తం బస్టాండ్ సమీపంలోకి బస్సు వస్తుండగా డ్రైవర్ ఉన్న ఫలంగా బ్రేక్ వేయడంతో ముందు ఉన్న సీటు కమ్మీ తల తగిలి అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో 2019 ఆగస్టు 7న వానియంబాడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో న్యాయమూర్తి ఆంధ్ర రాష్ట్ర ఆర్టీసీ బస్సు యాజమాన్యం రూ. 15 లక్షలు బాధిత కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఎటువంటి నష్ట పరిహారం చెల్లించక పోవడంతో సుబ్రమణ్యం నాయుడు కుమారుడు దనకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సదరు ఆంధ్రా ఆర్టీసీ బస్సును జప్తు చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో బుధవారం రాత్రి వానియంబాడికి వచ్చిన ఆంధ్ర ప్రభుత్వ బస్సును కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. చదవండి: ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్, యూపీ -
ఆన్లైన్ రమ్మీకి బానిసై ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, వేలూరు: ఆన్లైన్ రమ్మీకి బానిసై రూ. 10 లక్షల నగదును పోగొట్టకోవడంతో.. జీవితంపై విరక్తి చెంది చెన్నై ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో చోటు చేసుకుంది. కాటుకొల్లై గ్రామానికి చెందిన ఆనందన్(31) చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఆన్లైన్ ద్వారా సెల్ఫోన్లో రమ్మీకి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు ఖండించారు. అయినప్పటికీ రమ్మీ ఆడేవాడు. గత వారంలో మాత్రం ఆన్లైన్ రమ్మీ ఆడి రూ. 10 లక్షల నగదు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్నేహితుల వద్ద రూ. 6 లక్షల అప్పు కూడా ఉంది. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల ఓటు వేసేందుకు ఆనందన్ సొంత గ్రామమైన కాట్టుకొల్లై గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఓటు హక్కు వినియోగించుకొని ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆనందన్ ఆన్లైన్ రమ్మీ ద్వారా భారీగా నగదు పోగొట్టుకున్న విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనోవేదనకు గురై ఆనందన్ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్ రూం నుంచి బయటకు రాక పోవడంతో కుటుంబ సభ్యులు కిటికీల ద్వారా చూడా ఆనందన్ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. వానియంబాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి
సాక్షి, వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి తాలుకా ఉల్లిపుదూరు గ్రామానికి చెందిన జయప్రకాష్(30) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య లక్ష్మి(26). వీరికి వివాహం జరిగి ఏడాది అవుతుంది. సోమ వారం రాత్రి జయప్రకాష్ భార్యతో కలిసి వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువును పట్టుకొచ్చేందుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారిలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి పశువుతో పాటు దంపతులు జయప్రకాష్, లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. బావి వద్దకు వెళ్లిన దంపతులు రాత్రి ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయం బంధువులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూశారు. వారు విగత జీవులుగా పడి ఉండడాన్ని గుర్తించి తిరువలం పోలీసులకు సమాచారం అందించారు. పందుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) -
Gagandeep Kang: వాక్సినాలజిస్ట్ చల్లనమ్మ
థర్డ్ వేవ్ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది! కరోనా వ్యాప్తి ఈ నెల మధ్యలో తగ్గడం ప్రారంభించి, నెలాఖరుకు క్షీణ దశకు చేరుకుంటుందని గగన్‌దీప్ కాంగ్ అనే వ్యాక్సినాలజిస్ట్ గురువారం ఓ వెబినార్‌లో చెప్పారు! ఊరికే ధైర్యం చెప్పడం కోసం ఆమె ఆ మాట అనలేదు. నిరుడు మార్చి నెలలో దేశంలో కరోనా కేసులు అరవైకి చేరి, ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనకు చేరువవుతున్న దశలో సైతం గగన్‌దీప్ మరీ బెంబేలెత్తి పోనవసరం లేదని భరోసా ఇవ్వడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అలెర్ట్ చేశారు మంచి మాటల చల్లనమ్మ గగన్ దీప్ కాంగ్! గగనదీప్ వైరాలజిస్ట్. వైరస్ల మీద పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో ‘గ్యాస్ట్రోఇంటెస్టెనల్ సైన్సెస్’ విభాగం ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. బ్రిటన్‌లోని ‘రాయల్ సొసైటీ’ ఫెలోషిప్‌ను పొందిన తొలి భారతీయ మహిళ గగన్‌దీప్. అయితే ఆమె అసలైన గుర్తింపు మాత్రం ఐదేళ్ల చిన్నారులకు సోకే రోటా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తగానే! రోటా వైరస్ వల్ల వచ్చే డయారియాతో ఏటా లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవారు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్టవేశారు గగన్‌దీప్. ఏడాదిన్నరగా ఆమె కరోనా వైరస్ స్వభావాన్ని పరిశోధిస్తున్నారు. ఆ ఫలితాల గురించి ఉమెన్ ప్రెస్ కోర్స్ వెబినార్‌లో చెబుతున్నప్పుడే.. ‘‘ఇప్పుడు మేము పరిశీలిస్తున్న కరోనా వైరస్ గుణాలను బట్టి మే నెల మధ్య నుంచీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని గగన్‌దీప్ చెప్పారు. ∙∙ ఏ విషయాన్నైనా ‘భయం లేదు’ అన్నట్లే ప్రకటిస్తారు గగన్‌దీప్. అదే సమయంలో ‘నిర్లక్ష్యంగా ఉండేందుకూ లేదు’ అని భుజం తట్టినట్లు చెబుతారు. ‘‘శాస్త్రవేత్తలుగా మా దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మీ దగ్గర జాగ్రత్తలు ఉండాలి’’ అంటారు. ఇప్పుడీ కరోనా పరిస్థితులకు చక్కగా సరిపోయే మాటే. భయం అక్కర్లేదు. కానీ అతి ధైర్యమూ పనికి రాదు. ఇక ఆమె చెప్పే ఏ మాటైనా మనం నిశ్చింతగా ఎందుకు నమ్మేయాలంటే.. తను వైరాలజిస్ట్, వాక్సినాలజిస్టు కూడా కాబట్టి. గగన్‌దీప్‌కు చిన్నప్పట్నుంచీ.. రూఢీ కానిదేదీ నమ్మదగినది కాదనే నమ్మకం ఉంది. ఆమె తండ్రి రైల్వేస్‌లో మెకానికల్ ఇంజనీరు. తల్లి ఇంగ్లిష్, మేథ్స్ సబ్జెక్టుల టీచర్. íసిమ్లాలో పుట్టారు గగన్‌దీప్. తండ్రి ఉద్యోగంలో ఉండే బదిలీల వల్ల పదో తరగతికి వచ్చేలోగా పది స్కూళ్లు మారారు. దేశమంతటా తిరిగి చదివినట్లు లెక్క. బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ ఆమెకు ఇష్టమైన పాఠ్యాంశాలు. తండ్రి చేత ఇంట్లోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేయించుకుని పరిశీలనలు, ప్రయోగాలు చేస్తుండేవారు. ఆ ఆసక్తే ఆమె చేత మెడిసిన్ చదివించింది. మైక్రో బయాలజీలో పీహెచ్డీ చేయించింది. ఇక పలు రకాలైన వైరస్లు, బాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ఆమె చేసిన పరిశోధనలు, వాక్సిన్లు కనిపెట్టేందుకు చేసిన కృషి ఆమెకు 2019లో రాయల్ సొసైటీ గౌరవాన్ని సాధించిపెట్టాయి. గగన్‌దీప్ ప్రస్తుతం వెల్లూరులో ప్రొఫెసర్‌గా ఉంటూనే కరోనాను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు. -
భర్త మరణించిన 10 నిమిషాలకే భార్య సైతం
వేలూరు: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. వానియంబాడి తాలుకా కచ్చేరి రోడ్డుకు చెందిన అన్నామలై(78), లక్ష్మమ్మాల్(65) దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అన్నామలై వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. శుక్రవారం అన్నామలై గుండె పోటుతో మృతి చెందారు. అన్నామలై మృతదేహంపై రోదిస్తూ లక్ష్మమ్మాల్ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అన్నామలై మృతి చెందిన పది నిమిషాల్లోనే లక్ష్మమ్మాల్ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేసింది. వివాహిత ఆత్మహత్య టీ.నగర్: కరోనాతో భర్త మృతి చెందడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చెన్నైలో జరిగింది. ఐనావరానికి చెందిన రాజ్‌కుమార్(45) భార్య కల్పన (36). వీరి రెండేళ్ల కుమార్తె 2016లో అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా వైరస్ సోకి ఈ నెల 26న రాజ్‌కుమార్ మృతిచెందారు. కుమార్తె, భర్త మృతిని కల్పన తట్టుకోలేకపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందింది. ఐనావరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కల్పన తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ విద్యార్ధినితో ప్రేమ.. పెద్దలు ఒప్పుకోలేదని.. -
అప్పటి వరకూ కోయంబత్తూరే..
కోయంబత్తూర్ ఇప్పుడు కోయంపుత్తూరు. వెల్లూర్ ఇప్పుడు వీలూరు. ఇంకా 1016 ఊళ్లు తమిళనాడులో ఇంగ్లిష్ నుంచి అచ్చ తమిళ్లోకి మారిపోతున్నాయి. అయితే ఈ మార్పులు ఏమంత సవ్యంగా లేవని తమిళ చరిత్రకారులు, భాషాపండితులు అంటుండటంతో తమిళనాడు ప్రభుత్వం మునుపు తనిచ్చిన ‘ఊళ్ల పేర్ల మార్పు జీవో’ ను ఉపసంహరించుకుంది. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చాక కొత్త జీవోను జారీ చేస్తామని తమిళభాష, తమిళ సంస్కృతి శాఖల మంత్రి పాండియరాజన్ ఒక ట్వీట్ ఇచ్చారు. మయిలాప్పూర్ (మైలాపుర్), తూత్తుక్కుడి (ట్యూటికొరిన్), మథురై (మదురై), తండయియార్పేట్టయ్ (తొండయిర్ పేట్) వంటి చాలా ప్రాంతాల ఉచ్చారణ తమిళంలోకి మార్చిన తర్వాత కూడా ఇంగ్లిషుకు ఆనుకుని ఉండటమే తమిళ భాషాభిమానులకు నచ్చడం లేదు. -
ఆమెకు 25.. అతడికి 18..
సాక్షి, చెన్నై: కారు, బంగ్లా, బంగారం ఆశ చూపించి 18 ఏళ్ల యువకుడికి 25 ఏళ్ల యువతిని ఇచ్చి వివాహం చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులను అధికారులు అడ్డుకున్నారు. వివరాలు.. వేలూరు సమీపంలోని అరియూర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు. ఇతని బంధువైన 25 ఏళ్ల యువతికి ఇది వరకే వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు కుమార్తెకు మరో వివాహం చేయాలని నిర్ణయించారు. ఇందుకు తమ బంధువుల్లో ఒకరికి కారు, బంగారం, బంగ్లాను కట్నంగా ఇస్తానని ఆశ చూపించి 18 ఏళ్ల యువకుడితో పెళ్లి నిర్ణయించారు. వివాహ ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. అయితే ఇందుకు యువకుడి తల్లి, సోదరి వ్యతికించారు. వీటిని పట్టించుకోకుండా యువకుడి తండ్రి ఈనెల 12న వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశాడు. దీనిపై యువకుడి తల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు, అరియూర్ పోలీసులు గురువారం ఉదయం యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. యువకుడికి 18 ఏళ్లు పూర్తి అయినట్లు తెలిసింది. అయితే పురుషుడికి వివాహ వయస్సు 21 ఏళ్లు పూర్తి అయ్యి ఉండాలని ఆ లోపు వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు యువకుడి తండ్రిని హెచ్చరించారు. వివాహాన్ని ఆపేయాలని సూచించారు. చదవండి: మిస్డ్‌కాల్‌తో పరిచయం.. వివాహేతర సంబంధం.. ఆపై..! -
సబ్ కలెక్టర్ బ్యాంకు ఖాతాలు సీజ్!
వేలూరు: వేలూరులో రూ.50 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడిన సబ్ కలెక్టర్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ పూరీ్వకుల ఆస్తులను తన పేరుపై మార్చుకొని పత్రాలు తీసుకునేందుకు సబ్‌కలెక్టర్ దినకరన్ సంప్రదించారు. ఆయన రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. వేలూరు ఏసీబీ అధికారులు వలపన్ని సబ్‌కలెక్టర్ దినకరన్‌తో పాటు ఆయన డ్రైవర్ సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో సుమారు రూ.80 లక్షల నగదు పట్టుపడిన విషయం తెలిసిందే. కార్యాలయంలో ఆయనకు సహకరిస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. (లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్ రాసలీలలు) వారి వద్ద విచారణ చేపట్టారు. విచారణలో సబ్ కలెక్టర్ దినకరన్ లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడడంతో పాటు పలువురి మహిళలతో రాసలీలలు జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి ఏయే బ్యాంకుల్లో ఎంత నగదు ఉంది, ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చింది అనే కోణంలో విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏసీబీ అధికారి మాట్లాడుతూ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో దినగరన్ పలు కోట్ల రూపాయలను బ్యాంకులో పొదుపు చేయడంతో పాటు అనేక చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. వెంటనే ఆయన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి.. అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు వివరించారు. -
బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి.. యువతిపై అత్యాచారం
చెన్నై : తమిళనాడులోని వెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను కూడా చితకబాదారు. వెల్లూరు కోట సమీపంలో శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, వస్తువులను తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోకరి కోసం గాలిస్తున్నారు. కాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2018లో భారత్‌లో 34 వేల అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. అలాగే 2018లో సరాసరిన దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఓ అత్యాచార ఘటన చోటుచేసుకుందని కేంద్ర ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. -
జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి
వెల్లూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా తమిళనాట జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో కొన్ని చోట్ల అపశ్రుతులు చోటుచేసుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఎద్దులు పొడవడంతో ఇప్పటికే నలుగురు మృతిచెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే వెల్లురులో మాత్రం జల్లికట్టు పోటీ జరిగే చోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారిపైకి ఎద్దు దూసుకోచ్చింది. అక్కడ జనాలను అదుపుచేస్తున్న పోలీసును వెనకనుంచి దూసుకొచ్చిన ఎద్దు ఢీకొట్టింది. కొమ్ములతో పైకి లేపడంతో.. ఆ పోలీసు కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో పోలీసుతో పాటుమరికొంతమంది ప్రజలు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరిలించారు. జల్లికట్టు పోటీల కోసం 200 ఎద్దులను ఒకచోట చేర్చడంతో వాటిని అదుపు చేయడం కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవేశంగా బయటకు దూసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ అధికారిని ఎద్దు ఢీ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కూతురు పెళ్లి; అమితానందంలో కుటుంబం!
చెన్నై : ఇంట్లో వివాహం వంటి శుభకార్యం జరిగితే ఇళ్లంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువులతో పెళ్లింట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఓ కుటుంబానికి తమ ఇంట్లో వివాహం జరుగుతుందనే ఆనందం కంటే అత్యున్నత పదవిలోని వ్యక్తి పంపిన సందేశం వారిని ఉద్వేగానికి లోనుచేసింది. వివరాలు.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన రాజశేఖరన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహాన్ని సెప్టెంబర్ 11న నిశ్చయించాడు. పెళ్లికి బంధువులు, తెలిసిన వాళ్లతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆహ్వనించాడు. ఇందులో భాగంగా ప్రధానికి లేఖ రాశాడు. తరువాత కుటుంబం పెళ్లి పనుల్లో మునిగిపోయిన కుటుంబం ఈ విషయం గురించి మరిచిపోయింది. అయితే గత శనివారం ప్రధాని నుంచి కుటుంబానికి ఓ లేఖ అందింది. అది చదివిన కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయారు. ప్రధాని పంపిన లేఖలో ‘‘మీ కుమార్తె వివాహం గురించి నాకు తెలియపరచడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ ఇంట్లో జరిగే శుభ సందర్భానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నూతన వధువరులకు నా శుభాకాంక్షలు, నవ జంట ఎల్లప్పుడు శ్రేయస్సు, ఆనందాలతో జీవించాలి’’ అని ప్రధాని లేఖలో ఆశీర్వదించారు. ఏకంగా ప్రధాని నుంచి వధూవరులను ఆశీర్వదిస్తూ లేఖ రావడంతో రాజశేఖరన్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. ప్రధాని పంపించిన లేఖను ఫ్రేమ్ కట్టించాలని నిర్ణయించుకున్నట్లు సదరు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వేలూరులో డీఎంకే ఘనవిజయం
చెన్నై : వేలూరు పార్లమెంట్ స్ధానానికి జరిగిన ఎన్నికలో డీఎంకే విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని అన్నాడీఎంకే కాపాడుకోలేక పోయింది. డీఎంకే పార్టీ అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అన్నాడీఎంకే అభ్యర్ధి ఏసీ షణ్ముగంపై 8,142 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆనంద్‌కు 4,85,340 ఓట్లు రాగా, షణ్ముగం 4,77,199 ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య మొదటి నుంచీ విజయం దోబూచులాండింది. తొలుత అన్నాడీఎంకే అభ్యర్ధి షణ్ముగం ఆధిక్యంలో కొనసాగగా డీఎంకే అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అనూహ్యంగా పుంజుకున్నారు. చివరి వరకు ఆయన ఆధిక్యంలో కొనసాగారు. భారీ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ 24 రౌండ్లపాటు సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వేలూరులో గత ఏప్రిల్ 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. డీఎంకే అభ్యర్ధి గోడౌన్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడటంతో ఎన్నిక వాయిదా పడింది. డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈసీ అక్కడి ఎన్నికను వాయిదా వేసింది. ఇక ఆగస్టు 5న ఈ స్థానానికి ఎన్నిక జరిగింది. ఏఐఏడీఎంకే, డీఎంకే అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. -
వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడు వేలూరు వాలజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రోడ్డుపై దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనం వృద్దున్ని ఢీ కొట్టి.. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న లారీని కూడా ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న దంపతులు, వారి కుమారుడు మృతిచెందారు. బైక్ ఢీ కొట్టడంతో వృద్దుడు కూడా ప్రాణాలు విడిచాడు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఆయుష్షు హరించారు!
సాక్షి, బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. 15 రోజుల పాటు వివిధ పరీక్షలు చేసి, అనేక ముందులు ఇచ్చి చివరి క్షణంలో ఇక తాము ఏమీ చేయలేమని వైద్యులు చేతులెత్తేసిన సంఘటన ఆయుష్మాన్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తమ కుమారుడిపై వైద్యులు ప్రయోగం చేసి, మంచాన పడేశారని ఆయన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన అఖిల్ సాయి(21) అక్కడే ఉన్న జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈయనకు తరచూ జ్వరం వస్తుందని విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆస్పత్రిలో గత నెల 30న జాయిన్ చేశారు. కొద్ది రోజులకు కోలుకుంటున్నాడు అనుకున్న తురుణంలో పిట్స్ వచ్చింది. తరువాత కళ్లు కనిపించడం లేదు. ఇలా ఒక్కో అవయవం పని చేయటం మానేశాయి. ఈలోగా అఖిల్‌కు వైద్యులు బోన్‌మారో పరీక్ష చేశారు. మొదటి ఒకసారి ఈ పరీక్ష చేసినా రిపోర్ట్ రాలేదు. మరోసారి ఈ పరీక్ష చేశారు. ఈ రెండు వైద్య పరీక్షల నివేదిక 10 రోజుల తరువాత ఒకేసారి వచ్చాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఈలోపు అఖిల్‌కు సంబంధం లేని వైద్యం అందించి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశారు. చివరికి ఇక చేసిందేమీ లేక ఈ నెల 16న సీఎంసీ వెల్లూరుకు వెంటిలేటర్‌పై పంపించారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని, ఇక తాము ఏమీ చేయలేమని అక్కడి వైద్యలు చెప్పడంతో మంగళవారం అఖిల్ సాయిని మళ్లీ ఆయుష్మాన్‌కు తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందళోనకు దిగారు. అఖిల్ పరిస్థితికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు. అఖిల్‌పై ప్రయోగం చేశారు.. అఖిల్ సాయికు వచ్చిన జబ్బు గురించి మాకు చెప్పకుండా అనేక మందుల ప్రయోగం చేశారు. వాళ్ల ప్రయోగానికి మేము రూ.8 లక్షలు వరకు చెల్లించాం. మేము ఎన్నిసార్లు అడిగినా రోగం గురించి చెప్పలేదు. చివరి క్షణంలో మాత్రం పరిస్థితి చేజారిపోయింది సీఎంసీకు తీసుకొని వెళ్లండి అని చెప్పారు. అక్కడికి వెళ్లినంత వరకు అఖిల్‌కు సోకిన జబ్బు మాకు తెలియలేదు. అక్కడ డాక్టర్లు చెప్పిన దానిబట్టి సరైన వైద్యం అందక పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమైంది. కేవలం వైద్యుల ప్రయోగానికి మా అఖిల్ బలైపోయాడు. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డాక్టర్లను శిక్షించి మాకు తగిన న్యాయం చేయాలి. – అఖిల్ బంధువులు చివరి క్షణంలో తీసుకొని వెళ్లామన్నారు.. చివరి క్షణం వరకు ఏమీ కాదు.. అంత బాగానే ఉంటుంది.. మంచి మందులు ఇస్తున్నాం... మీ వాడు నడుస్తాడు అని చెప్పుకొచ్చారు. రెండు రోజుల తరువాత ఒక్కసారిగా వెంటనే మీరు సీఎంసీకి తీసుకొని వెళ్లిపోవాలి లేదంటే బతకడం కష్టమని చెప్పారు. దీంతో ఏమీ చేయాలో తెలియక వెల్లూరు తీసుకుని వెళ్లాం. అక్కడ వైద్యులు మీరు చాలా ఆలస్యం చేశారు కొద్ది రోజుల ముందు తీసుకొని వస్తే బాగున్ను అని చెప్పారు. కేవలం వైద్యల నిర్లక్ష్యమే నా బిడ్డను మింగేసింది. – ప్రసాద్, అఖిల్ తండ్రి ఆ వ్యాధికి వైజాగ్‌లో చికిత్స లేదు.. అఖీల్‌కు వచ్చిన వ్యాధి మైలోడిస్ప్లషియా. ఇది 5 లక్షల మందిలో ఒకరికి వస్తుంది. రక్తనాళాల పూర్తిగా పనిచేయడం మానేశాయి. ఈ వ్యాధికి ఎముక బదిలీ వైద్యం(బోన్ ట్రాన్స్ప్లంటేషన్) తప్పించి మరొకటి లేదు. అది కూడా వైజాగ్‌లో అందుబాటులో లేదు. అందుకే వెల్లూరు పంపించాం. అప్పుడు కూడా ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుందని ముందే చెప్పాం. దానికి వారు అంగీకరించే తీసుకొని వెళ్లారు. మా వంతు ప్రయత్నం చేశాం. రోగి పట్ల ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. – స్వామి, ఆయుష్మాన్ ఆస్పత్రి ఎండీ -
భార్య ప్రియుడితో ప్రాణహాని..కాపాడండి!
సాక్షి, చెన్నై : భార్య ప్రియుడితో తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి వేలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ధర్నా చేశాడు. వేలూరు జిల్లా, భారతీదాసన్ వీధికి చెందిన సతీష్‌కుమార్ (40)కు, అదే ప్రాంతానికి చెందిన మహిళతో గత ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడటంతో ఇరువురు తరచుగా గొడవపడేవారు. ఇలా ఉండగా సతీష్‌కుమార్ భార్యకు అదే ప్రాంతానికి చెందిన సిలంబరన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో సతీష్‌కుమార్ భార్యను మందలించాడు. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. అంతేకాకుండా సతీష్‌కుమార్‌ను చంపేస్తానంటూ సిలంబరసన్ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో సతీష్‌కుమార్ సోమవారం వేలూరు కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా చేశాడు. తనకు సిలంబరసన్తో ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని నినాదాలు చేశాడు. -
వేలూరు ఎన్నికల రద్దు సబబే: మద్రాసు హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేలూరు లోక్‌సభ ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఎన్నికలు జరపాలంటూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినపుడు ఎన్నికలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని, రాష్ట్రపతి ఆమోదం పొందినందున ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. వేలూరు నియోజకవర్గంలో డీఎంకే నేతల ఇళ్లల్లో రూ.11.10 కోట్ల నగదు స్వాధీనం నేపథ్యంలో వేలూరు లోక్‌సభ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఈసీ ప్రకటించడం తెల్సిందే. డబ్బు పంపిణీ వల్ల తమిళనాడులో ఎన్నికలు వాయిదాపడటం ఇదే తొలిసారి కాదు. జయలలిత మరణానంతరం ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఆసెంబ్లీ స్థానానికి 2017లో జరగాల్సిన ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఆ ఏడాది డిసెంబర్లో ఆ ఉప ఎన్నిక జరిగింది. 2016 మే నెలలోనూ తంజావూరు, అరవకురుచ్చిల్లో జరగాల్సిన ఎన్నికలను ధనప్రవాహం కారణంగానే ఈసీ వాయిదా వేసింది. -
వెల్లూరు లోక్‌సభ స్ధానంలో ఎన్నిక రద్దు
-
వెల్లూరు లోక్‌సభ స్ధానంలో రద్దయిన ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరగనున్న ఎన్నికలను రద్దు చేయాలన్న ఈసీ ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అంగీకరించారు. రెండో విడత పోలింగ్‌లో ఈనెల 18న వెల్లూరులో పోలింగ్ జరగాల్సి ఉండగా, ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నగదు లభ్యం కావడంతో ఈసీ ఎన్నికల రద్దుకు నిర్ణయం తీసుకుంది. వెల్లూరులో కొద్ది వారాల కిందట డీఎంకే అభ్యర్ధి కదిర్ ఆనంద్ కార్యాలయంలో పెద్దమొత్తంలో నగదును అధికారులు సీజ్ చేశారు. డీఎంకే అభ్యర్థి వద్ద దాదాపు 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్టు సమాచారం. ఈనెల 10న ఐటీ శాఖ నివేదిక ఆధారంగా డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ సహా మరో ఇద్దరు ఆ పార్టీ నేతలపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. -
వెల్లూరులో లోక్‌సభ ఎన్నికల రద్దుపై ఈసీ క్లారిటి
-
వెల్లూరులో ఎన్నికల రద్దుపై స్పందించిన ఈసీ
న్యూఢిల్లీ: తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికలను రద్దు వేస్తున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ఎన్నికలను రద్దు చేయనుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి ఎస్ శరణ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నికల సంఘం అలాంటి ఉత్తర్వులు జరీ చేయలేదని వెల్లడించారు. ఇటీవల తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వెల్లూరు పార్లమెంట్ డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ కార్యలయం నుంచి భారీగా నగదు పట్టుబడింది. దీంతో అతనిపై జిల్లా అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లపై డబ్బు ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఈసీ వెల్లూరులో ఎన్నిక రద్దు చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా తమిళనాడులోని అన్ని పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 18న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. -
ప్రియుడితో దొరికిన మహిళ.. ఆపై...
వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పరాయి వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం భర్త కంటపడింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయిన సమయంలో అడ్డంగా దొరికిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. వారిని ఊరి ముందు నిలబెట్టేందుకు యత్నించాడు. కానీ, అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ భార్య.. భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది. వెల్లూరులోని గుడియాతం మండలం తురైమూలై గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... సెంథామరై(55) అనే రైతు తన భార్య జయంతితో కలిసి ఊళ్లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యాడు. ఆ సమయంలో జనసందోహంలో భార్య తప్పిపోగా.. కంగారుపడ్డ సెంథామరై ఆమె కోసం అంతా గాలించాడు. ఆ ప్రాంతానికి కాస్త దూరంలోని ఓ మండపంలో ధచ్ఛనమూర్తి అనే వ్యక్తితో ఆమె అభ్యంతరకర స్థితిలో కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెంథామరై వారిని నిలదీశాడు. గ్రామస్థుల కోసం కేక వేయగా.. విషయం తెలిస్తే ఊరంతా చితకబాదుతుందన్నన భయంతో వారిద్దరూ పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి మధ్య పెనుగులాట చోటుచేసుకోగా.. సెంథామరై పంచె ఊడిపోయింది. (భార్య అశ్లీల వీడియో.. తట్టుకోలేక...) భయంతో ఏం చేయాలో పాలుపోని జయంతి.. భర్తపై పడి మర్మాంగాన్ని కొరికి పడేసింది. ఆపై ప్రియుడితో అక్కడి నుంచి పరుగు అందుకుంది. ఉత్సవాల వేడుకల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులెవరూ సెంథామరై కేకలను వినలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న సెంథామరైను గమనించి ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ధచ్ఛనమూర్తి, జయంతిలను గురువారం వెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ అశ్లీలత, హత్యాయత్నం తదితర కేసులు వారిద్దరిపై నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెల్లడించారు. -
అందరూ ఉన్నా అనాథే..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నతల్లి రుణం తీర్చుకోవాలనే విచక్షణ ఆ సంతానానికి లేకుండా పోయింది. కనికరం లేని 13 మంది సంతానం వల్ల ఆ తల్లి అనాథగా మారింది. భిక్షాటన చేస్తూ బతుకీడుస్తున్న క్రమంలో కాలు విరిగడంతో అనాథ శరణాలయంలో చేరిపోయింది. తమిళనాడుకి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలి దీనగాథ ఇది. దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్‌కు చెందిన అంతోనియమ్మాళ్ (95) ఇరవై ఏళ్ల కిందట భర్త దేవరాజ్ వేధింపులు తట్టుకోలేక వేలూరు జిల్లా కాట్పాడిలోని తన కుమార్తె జయ్సీరాణి ఇంటికి వచ్చింది. అల్లుడు నందకుమార్ కూడా బాగా చూసుకోవడంతో కుమార్తె వద్దే స్థిరపడిపోయింది. ఐదేళ్ల క్రితం నందకుమార్ చనిపోవడంతో కుమార్తె జయ్సీరాణి తల్లిని వదిలించుకుంది. దీంతో అంతోనియమ్మాళ్ ఐదేళ్లుగా వేలూరులోని ఓ చర్చి వద్ద భిక్షాటన చేస్తూ కాలం గడిపేది. భిక్షాటనతో వచ్చిన సొమ్మును కుమార్తె తీసుకెళ్లేది. ఈ స్థితిలో ఈ వృద్ధురాలు వారం రోజుల కిందట కిందపడడంతో కుడికాలి ఎముక విరిగింది. విషయం తెలుసుకున్న మణిమారన్ అనే సామాజిక కార్యకర్త వృద్ధురాలిని కలెక్టర్ వద్దకు మోసుకెళ్లి వినతిపత్రం అందజేసి వృద్ధురాలికి ఆహారం, వసతి కల్పించాల్సిందిగా కోరాడు. వృద్ధురాలిని అనాథగా వదిలేసిన 13 మంది సంతానంపై వేధింపుల చట్టం కింద అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. స్పందించిన కలెక్టర్ సాంఘిక సంక్షేమశాఖాధికారిని పిలిపించి ఆంతోనియమ్మాళ్ను వృద్ధుల శరణాలయంలో చేర్పించాలని ఆదేశించారు. అంతోనియమ్మాళ్ శుక్రవారం మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ‘నాకు 13 మంది పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. వారంతా నన్ను వదిలేయడంతో అనాథగా మారాను. దేవుడే దిక్కుగా బతుకీడుస్తున్నా. నేను చనిపోయే వరకు ఇంత అన్నం పెడితే చాలు. కాలు విరగడం వల్ల కాలకృత్యాలకు కూడా పోలేకపోతున్నాను. అందుకే అన్నం కూడా మానేశాన’ ని ఆవేదన వ్యక్తం చేసింది. బతికి ఉన్నపుడు తనను పట్టించుకోని కుమారులు, కుమార్తెలు, బంధువులు తాను చనిపోయిన తరువాత వచ్చి చూడకూడదని కన్నీటి పర్యంతమైంది. -
బాల్య వివాహాన్ని ఆపాలని వెళితే..
వేలూరు(తమిళనాడు): బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులకు వింత అనుభవం ఎదురయింది. అధికారులు, పోలీసులు వస్తారని పసిగట్టిన పెళ్లివారు కళ్యాణ మండపాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. వివరాలివీ.. వేలూరు జిల్లా కాట్పాడి కయుంజూరుకు చెందిన క్రిష్ణమూర్తి కుమారుడు గణేష్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు సమీపంలోని కొత్తూరు గ్రామానికి చెందిన బాలిక(17)తో పెళ్లి నిశ్చయమయింది. కయుంజూరు రాధాక్రిష్ణ కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం పెళ్లి కుమార్తె తరఫు వారు కయుంజూరుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, బాలికకు వివాహం చేస్తున్నట్లు కాట్పాడి తహశీల్దార్ జగదీశన్‌కు బుధవారం వేకువ జామున 3 గంటలకు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి కళ్యాణ మండపానికి వెళ్లారు. అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న పెళ్లి వారు వధువు, వరుడు సహా అందరూ మండపాన్ని ఖాళీ చేసి పరారయ్యారు. అధికారులు వెళ్లి మండపంలో ఎవరూ లేకపోవటంతో వంట తయారు చేస్తున్న వారిని విచారించారు. పెళ్లి వారంతా ఎక్కడికో వెళ్లిపోయారని వారు చెప్పినట్లు తెలిసింది. అయితే, వారంతా పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లి ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కళ్యాణ మండపానికి రూ: 4 వేలు అడ్యాన్స్ ఇచ్చి ఉన్నారు. మండపంలో వంటకు ఉపయోగ పడే వస్తువులను పూర్తిగా అక్కడిక్కడే వదిలి వెళ్లడంతో ఎలాగైనా వారంతా తిరిగి వస్తారని అక్కడే పోలీసు కాపలా కాశారు. అయితే, వారు తిరిగి రాలేదు. అయితే, బాల్య వివాహానికి ప్రయత్నించిన పెళ్లి పెద్దలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం పెళ్లికని వచ్చిన వరుడి స్నేహితులు, బంధువులు మండపం బోసిపోయి ఉండటం చూసి అవాక్కయ్యారు -
శశికళ దిష్టి బొమ్మల దహనం
వేలూరు: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా వేలూరులో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టరాదని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ మాజీ కౌన్సిలర్ ముత్తు ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. వేలూరు జిల్లాలోని ఆర్కాడు, తిరుపత్తూరు వంటి ప్రాంతాల్లోను ఆ పార్టీ కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా బుధవారం ఉదయం నుంచి నినాదాలు చేయడంతో పాటు ఆమె దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. గురువారం ఉదయం కూడా వేలూరు సైదాపేటలోని మురుగన్ గుడి వెనుక వైపున దీప పేరవై కార్యకర్తలు సుమారు 20 మంది కలిసి శశికళ దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శశికళకు అర్హత లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగిదపట్టరైలో కూడా శశికళకు వ్యతరేకంగా నిరసనలు కార్యక్రమాలు జరిగాయి. -
మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై కిరాతకం
వెల్లూరు : సాధారణ స్త్రీలకే కాక, మహిళా పోలీసు కానిస్టేబుళ్లకు సైతం దేశంలో భద్రత కరువైంది. వెల్లూరు జిల్లా తిరుప్పతూర్లో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేసి కిరాతకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. లావణ్య అనే పోలీసు కానిస్టేబుల్, రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. లావణ్యకు, తన భర్తకు గత కొంతకాలంగా గొడవలు ఉండటంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. చికిత్స నిమిత్తం లావణ్యను వెంటనే వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. లావణ్య ముఖం, చేతులు యాసిడ్ దాడితో తీవ్రంగా గాయపడ్డాయని పోలీసులు చెప్పారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కనుగొనేందుకు వెంటనే దర్యాప్తు ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. -
అమ్మకు ఘననివాళి
► వేలూరు, తిరువణ్ణామలైల్లో పార్టీలకతీతంగా జన నివాళి ► అమ్మ మరణవార్తతో భావోద్వేగానికి గురైన మహిళలు వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతికి పార్టీలకతీతంగా వ్యాపారులు, ప్రజలు, కార్యకర్తలు నివాళుర్పించారు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి మృతి చెందారనే విషయం తెలుసుకున్న ఆమె అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఇక , మంగళవారం కూడా టీవీల ముందు నుంచి వారు లేవలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బయటకు వెళ్లకుండా టీవీల్లో ప్రచారమయ్యే అమ్మ అంత్యక్రియలు తదితర వాటిని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలాఉండగా, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని వాడ వాడల అమ్మ చిత్ర పటాలను ఉంచి కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారులు పార్టీలకతీతంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మ చిత్ర పటాన్ని ఉంచి నివాళులు అర్పించారు. వేలూరు నేతాజీ మార్కెట్లో పూల వ్యాపారుల ఆధ్వర్యంలో సుమారు 500 కిలోల పుష్పాలతో అమ్మకు నివాళుర్పించారు. ఈ నేపథ్యంలో కాట్పాడి, ఆంబూరు, వానియంబాడి ప్రాంతాల్లో పెద్ద పెద్ద టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే, కాంగ్రెస్, తామాకా తదితర పార్టీల కార్యకర్తులు అమ్మకు నివాళుర్పించారు. ప్రతి ఇంట్లోనూ అమ్మ చిత్ర పటాలను ఏర్పాటుచేసి నివాళుర్పించడం గమనార్హం. ప్రతి ఇంటికీ ఫలాలు అమ్మవల్లనే వేలూరు: ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత వల్లనే తమ ఇళ్లకు సంక్షేమ ఫలాలు చేరాయని మహిళలు అంటున్నారు. వేలూరు సమీపంలోని సత్వచ్చారికి చెందిన రాణి మాట్లాడుతూ అమ్మ వల్లనే తమ పిల్లలకు ల్యాప్‌ట్యాప్‌లు వచ్చాయన్నా రు. తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనేక సదుపాయాలను అమ్మ కల్పించిందన్నారు. రాష్ట్రంలోని మహిళలకు గౌరవాన్ని తీసుకొచ్చిన ఏకై క నాయకురాలు అమ్మ ఒక్కరే అటూ అమ్మను కొనియాడారు. జీవితాంతం రుణపడి ఉంటాం కూలీ పనులు చేసుకుంటున్న తమ లాంటి పేదవాళ్లకు సీమంతం జరి పించి పుట్టింటి వరస తరహాలో అన్ని తాంబూలాలు అందించిన అమ్మకు జీవితాంతం రుణపడి ఉంటామని వానియంబాడికి చెం దిన సమీనా బేగం తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఇస్లామియులకు ప్రత్యేక స్థానం కల్పించడంతో అమ్మ జయలలిత ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గర్భిణీలకు సీమంతం జరిపించడంతో పాటు ఫల పుష్పాదులను అందించి పుట్టింటి స్థానాన్ని భర్తీ చేశారని ఆమె కంటడి పెట్టుకున్నారు. - సమీనాబేగం, వానియంబాడి -
తమిళనాడు వేలూరులో ఉగ్రజాడలు...!
-
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్
వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని ఇద్దరు పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే... రంగాపురానికి చెందిన ట్రావెల్స్ యజమాని మురుగేషన్ కుమారుడు జగదీశన్, గాంధీనగర్‌కు చెందిన జాన్‌బాషా కుమారుడు మహ్మద్ అజీష్ వీరిద్దరూ గాంధీనగర్‌లోని ప్రవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. దీంతో వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. పాఠశాల పూర్తి చేసుకొని మహ్మద్ అజీష్ మాత్రం ఇంటికి వెళ్లేవాడు, జగదీశన్ ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ అజీష్ శుక్రవారం సాయంత్రం రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అజీష్ కోసం పాఠశాలకు వెళ్లారు. తరగతి ముగిసిన వెంటనే అజీష్ ఇంటికి వెళ్లినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ట్యూషన్‌కు వెళ్లిన జగదీశన్ కూడా ఇంటికి రాక పోవడంతో ఇద్దరు తల్లిదండ్రులు వారి పిల్లలు కనిపించలేదని రాత్రి పూర్తిగా కుమారులను వెతకసాగారు. శనివారం మద్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు విద్యార్థుల నుంచి ఒక సెల్ నెంబర్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. పాఠశాల ను ంచి బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు ఆ టోలో తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఆర్కాడు మణిగుండు వద్ద త మను దించి వేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తీసుకెళ్లినట్లు తె లిపారు. దీంతో తల్లి దండ్రులు ఆర్కాడుకు వెళ్లి విద్యార్థులను పట్టుకున్నారు. సత్‌వాచ్చారి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు. దీ ంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థులను విచారిస్తున్నారు. -
పీహెచ్సీలో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
వేలూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించిన రోగులు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వేలూరు అడుకంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేలసంఖ్యలో రోగులు వస్తుంటారు. కాగా ఆసుపత్రిలోని ప్రసవ వార్డులో ఆర్కాడు తాలుకా కలవైకి చెందిన కల్పన ఎనిమిది రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కల్పన శనివారం ఉదయం చిన్నారిని బెడ్‌పైనే ఉంచి మరుగుదొడ్డికి వెళ్లింది. అనంతరం బయటకు వచ్చిన ఆమెకు చిన్నారి కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి తెలిపింది. సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలాఉండ గా చిన్నారిని ఒక మహిళ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దీంతో రోడ్డుపై వెళుతున్న సదరు మహిళను అడ్డుకుని సహరోగులు విచారించారు. విచారణలో తన పేరు మహేశ్వరి అని, చిన్నారి తన కుమార్తెకు జన్మించినందువల్లే తీసుకెళుతున్నట్లు తెలిపింది. అయితే మహేశ్వరి కుమార్తె ఎనిమిది నెలల గర్భవతి గుర్తించిన వారు చిన్నారిని ఆమె నుంచి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తరహాలోనే తరచూ చిన్నారులు మాయమవుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు
వేలూరు: కార్పొరేషన్‌లోని ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్‌లోని మొత్తం 24 వార్డుల్లో రూ.40 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ కాలువకు ప్రతి ఇంటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు పూర్తిగా పైప్‌లైన్ ఏర్పాటు చేసి కలపాల్సి ఉంది. వీటిపై కార్పొరేషన్ అధికారుల బృందం ఇళ్ల యజమానులకు అవగాహన కల్పిం చారు. కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ కాలువల్లో లింకు చేసేందుకు అతి తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్ద పరిశీలించి వారందరికీ కాలువల్లో లింకులు ఇచ్చామని తెలిపారు. దీనిపైఆయా వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని భూగర్భ డ్రైనేజీ కాలువలకు అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ పథకంలో లింకు చేసేందుకు ఒక ఇంటికి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఒకే సారి చెల్లించక పోయినా నాలుగు దఫాలుగా కూడా నగదు చెల్లించవచ్చన్నారు. అనంతరం కొసపేటలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికీ వెళ్లిన కార్పొరేషన్ అధికారుల బృందం భూగర్భ డ్రైనే జీ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆ ప్రాంతంలో 450 ఇళ్ల పైపు లైన్లను లింకు చేసేందుకు దరఖాస్తులు అందజేశారు. ఆయనతో పాటు కార్పొరేషన్ ఇంజినీర్ బాలసుబ్రమణియన్, ఆరోగ్యశాఖ అధికారి బాలమురుగన్ ఉన్నారు. -
పేకాటలో రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడు
చిత్తూరు (అర్బన్): పేకాట వ్యసనంతో దాదాపు రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడో వ్యాపారి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తమిళనాడులోని వేలూరు ఎస్పీ పగలవన్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాకాల మండలానికి చెందిన ఓ వ్యాపారి తిరుపతిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి పేకాట బలహీనత. ఈ నేపథ్యంలో చిత్తూరుకు చెందిన బీగాల్ సురేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సురేష్ పేకాట జరిపిస్తూ రోజుకు జరిగే లావాదేవీల్లో 10 శాతం కమిషన్ తీసుకుంటాడని, పేకాటలో డబ్బు పోగొట్టుకున్న వాళ్లకు రోజుకు రూ.10 వడ్డి చొప్పున అప్పులు ఇస్తుంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇతని మాయలో పడ్డ తాను ఆరు నెలలుగా పేకాటకు మరింత బానిస అయినట్లు ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే సురేష్‌ను చిత్తూరు పోలీసులు పలుమార్లు అరెస్టు చేసినట్లు చెప్పాడు. కొంత కాలంగా సురేష్.. పొన్నై, వేలూరు, గుడియాత్తం ప్రాంతాల్లో ఓ వాహనం తిప్పుతూ అందులో పేకాట నిర్వహించి తన వద్ద రూ.5 కోట్ల వరకు కాజేసినట్లు వాపోయాడు. ఈ విషయం చిత్తూరు పోలీసులకు చెప్పడంతో.. పేకాట తమిళనాడులో సాగడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారన్నాడు. బీగాల్ సురేష్ ఫొటోను సైతం ఎస్పీకి అందజేశాడు. కేసు నమోదు చేసిన వేలూరు పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇతనితో పాటు పేకాట స్థావరాల్లో అధిక వడ్డీలకు నగదు ఇచ్చే మరో ముగ్గురు వ్యక్తుల కోసం సైతం తమిళనాడు పోలీసులు చిత్తూరులో గాలిస్తున్నారు. -
గుట్టుగా లింగ నిర్ధారణలు
వేలూరు: తిరువణ్ణామలైలో పది సంవత్సరాలుగా గుట్టుగా మహిళలకు అబార్షన్ చేస్తున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ బండారం బైటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తిరువణ్ణామలై అవుల్పురం వీధిలోని ఓ ఇంట్లో మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖా అధికారులకు సమాచారం అందింది. దీంతో వైద్య సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ గురునాథన్, అసిస్టెంట్ కమిషనర్ నరసింహన్, సూపరింటెండెంట్ కమలకన్నన్‌తో కూడిన పది మంది బృందం తిరువణ్ణామలైకి వచ్చారు. వీరు తిరువణ్ణామలైలోని ఆరోగ్య జిల్లా జాయింట్ డెరైక్టర్, పోలీసులతో సమీక్షించి అవుల్పురంలోని ఇంట్లో అకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారుల తనిఖీ సమయంలో అక్కడున్న కొంతమంది మహిళలను విచారించగా అబార్షన్ కోసం వచ్చినట్లు తెలిసింది. వీరిలో కొంతమంది పరీక్షలు వికటించి బాధపడుతుండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఇంటిలో పరిశీలించగా అబార్షన్ చేసేందుకు అవసరమైన మాత్రలు, స్కానింగ్ మిషన్లు, ఇంజెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. మరోగదిలో లింగనిర్ధారణ చేయడానికి అవసరమైన మిషన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై తిలగవతి వద్ద విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా అధికారుల విచారణలో తిలగవతి పదేళ్ల క్రితం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసినట్లు తెలిసింది. లింగ నిర్ధారణతో పాటు అబార్షన్ చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ విధంగా ఇప్పటివరకూ వేలల్లో అబార్షన్లు చేసి, పలు లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
నడిరోడ్డుపై ప్రేమికుల ‘అతి’
వేలూరు: మద్యం మత్తులో బైకు నడిపి, ఎస్ఐపై దాడికి పాల్పడిందో బెంగళూరు యువతి. అదే సమయంలో తన ప్రియుణ్ని ముద్దాడుతూ వెకిలిచేష్టలు చేసింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. తుత్తిపట్టుకు చెందిన వివేకానందన్, బెంగళూరుకు చెందిన యువతి అర్చన ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. ప్రియుడిని కూర్చోబెట్టుకుని ఆమె నిర్లక్ష్యంగా బైక్ నడిపింది. దీన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తికి దాడికి పాల్పడింది. ఆమెకు సముదాయించేందుకు వేలూరు కోట వద్ద ఎస్ఐ రామ్‌కుమార్ ప్రయత్నించారు. ఆగ్రహించిన యువతి అతనిపై దాడి చేసి, ప్రియుడిని ముద్దుపెట్టుకుంటూ హంగామా సృష్టించింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లోనూ మహిళా ఎస్ఐపై అర్చన దాడి చేసింది. ఆమె ప్రియుడు ఫర్నీచర్ ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. -
పెంపుడు కుక్కల దాడిలో యజమాని హతం
వేలూరు: పెంపుడు కుక్కల పాశవికదాడిలో యజమాని ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తోన్న కృపాకరం అనే వ్యక్తి.. రాట్ వీలర్ జాతికి చెందిన ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. వేలూరుకు సమీపంలోని తన మామిడి తోటలో కుక్కను కాపాలగా ఉంచి, రోజూ వస్తూ పోతూఉండేవాడు. దాదాపు 50 కేజీల బరువు, అరమీటరు ఎత్తుండే ఆ కుక్కను క్రాసింగ్ చేసే నిమిత్తం.. ఇటీవల అదే జాతికి చెందిన ఓ మగకుక్కను తీసుకొచ్చాడు. రెండు కుక్కలకు తానే స్వయంగా ఆహారం పెట్టేవాడు. మంగళవారం డ్యూటి నుంచి ఆలస్యంగా వచ్చిన కృపాకరం రాత్రి 10 గంటల సమయంలో మామిడితోటకు వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టే ప్రయత్నం చేశాడు. ఏరకమైన చిరాకులో ఉన్నాయోగానీ.. రెండు రాట్ వీలర్ కుక్కలు ఒక్కసారే యజమాని మీద దాడిచేశాయి. ముఖం, ఎద, పొట్ట భాగాన్ని ఖండఖండాలుగా పీకిపారేశాయి. కృపాకరం హాహాకారాలు చేయడంతో తోట పరిసర ప్రాంతాల్లోని రైతులు పరుగుపరుగున వచ్చి.. కుక్కలను అదిలించి, రక్తపు మడుగులో పడిఉన్న అతనిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడం కృపాకరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మాయదారి కుక్కలు ఎంతపని చేశాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న బానవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర పళ్లు, బలమైన దవడలు కలిగిన రాట్ వీలర్ (జర్మన్) జాతి కుక్కల పెంపకంలో అసమాన శ్రద్ధ అవసరమని, ఆదేశాలు పాటించడం నేర్పకపోతే అవి యజమానిపైనే దాడికి దిగుతాయని వేలూరు వణ్యప్రాణి సంరక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ చెబుతున్నారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌పై హిజ్రా దాడి చేయడంతో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే కొత్త బస్టాండ్‌కు చెన్నై నుంచి ప్రభుత్వ బస్సును డ్రైవర్ రమేష్ మధ్యాహ్నం 1.30 గంటలకు నడుపుకుంటూ వచ్చి నిలిపాడు. అనంతరం ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లేందుకు బస్సు ను నిలిపాడు. ఆ సమయంలో బస్టాండ్‌లోని ఒక హిజ్రా బస్సులోనికి ఎక్కి ప్రయాణికుల వద్ద డ బ్బులు వసూలు చేస్తున్నారు. ఆ సమయంలో బస్సు డ్రై వర్ రమేష్ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా బస్సు నుంచి కిందకు దిగాలని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన హిజ్రా డ్రైవర్‌పై దాడికి దిగి అసభ్య పదజాలంలో దూషించింది. దీంతో హిజ్రా, డ్రైవర్ మద్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో బస్సు డ్రైవర్ రమేష్ షర్టును హిజ్రా చించివేసింది. అనంతరం కండక్టర్ అడ్డగించడంతో కండక్టర్ బ్యాగులో ఉన్న రూ.2500 నగదును దోచేసి పరారయ్యేందుకు ప్రయత్నించింది. వెంటనే ప్రయాణికులు హిజ్రాను అడ్డుకొని అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సహ డ్రైవర్లు చెన్నై బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. వెంటనే హిజ్రాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు ప్రభుత్వ బస్సు డ్రైవర్లను అడ్డుకొని చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణికుల చర్చల అనంతరం బస్సు డ్రైవర్ బస్సును నడిపాడు. దీంతో అరగంట పాటు కొత్త బస్టాండ్‌లోని ప్రభుత్వ బస్సులు నిలిచి పోయింది. -
గత హామీలు ఏమయ్యాయి?
వేలూరు: 110వ చట్టం ప్రకారం ప్రకటించిన పథకాలన్నీ అమలు చేశారా? దీనిపై చర్చించేందుకు జయలలిత సిద్ధమేనా? అని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ప్రశ్నించారు. ఆయన బుధవారం తిరువణ్ణామలై, కల శపాక్కం, పోలూరు, సెంగం నియోజక వర్గాల్లో డీఎం కే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మేనిఫెస్టోలో 54 పథకాలను ప్రకటించారని, 600కు పైగా తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు. అయితే అవేవి అమల్లో లేవన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి బహిరంగంగా చర్చించేందుకు జయలలిత తిరువణ్ణామలైకి రాగలరా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి జరగలేదని, అయితే ప్రస్తుతం జయలలిత వంద యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రుణాలను రద్దు చేస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటూ పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. ప్రచారంలో ఆయా నియోజక వర్గాల అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉక్రెయిన్ యువతితో వేలూరు యువకుడి వివాహం
వేలూరు : ఉక్రెయిన్ యువతిని వేలూరు యువకుడు ప్రేమించి... హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కాట్పాడికి చెందిన బలరామన్ కుమారుడు బాలాజీ జర్మనీలో ఐటీ కంపెనీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఉక్రెయిన్ దేశానికి చెందిన లసియా అనే యువతి కూడా పని చేస్తోంది. భారతీయ సంప్రదాయంపై మక్కువ కలిగిన లసియా తరచూ ఆ విషయాలను బాలాజీని అడిగి తెలుసుకునేది. ఈ సందర్భంగా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని బాలాజీ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు అంగీకరించారు. వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థినుల మృతి
వేలూరు: కాట్పాడి సమీపంలో ఇద్దరు విద్యార్థినులు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కాట్పాడి తాలుకా లత్తేరి సమీపంలోని కాగుంట గ్రామానికి చెందిన మణి కుమార్తె పుణిదవల్లి(19) జంగాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. ఈమె పక్కనున్న ఇంటికి చెందిన అరుల్ కుమార్తె సౌందర్య(15) అదే పాఠశాలలో టెన్త్ చదువుతుంది. సోమవారం సాయంత్రం పాఠశాల ముగించుకొని ఇంటికి వచ్చిన ఇద్దరూ పుణిదవల్లి, సౌందర్య కలిసి బయటకు వెళ్లారు. అయితే రాత్రి అయినప్పటికీ ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కరశమంగళం రైలు పట్టాల పక్కన రెండు మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారించగా మృతి చెందిన వారు పుణిదవల్లి, సౌందర్యగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసి జోలార్‌పేట రైల్వే పోలీసులు కరశమంగళం వద్దకు చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికల్లో ప్రత్యేక కెమెరాలతో నిఘా
వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడులోని ఆంధ్ర సరిహద్దులోని 11 ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా నిఘా ఉంచనున్నట్లు ఎస్పీ సెంథిల్‌కుమారి తెలిపారు. వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న వేలూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పోలీసులతో శాంతి భద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్విహ స్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రతి విషయాన్ని గమనించనున్నట్లు తెలిపారు. వేలూరులో కొంత మంది చోరీలు, అలజడి సృష్టించి చిత్తూరులో వె ళ్లి తల దాచుకుంటున్నారని అటువంటి వారిని పట్టుకునేందుకు చిత్తూరు పోలీసులు సహకరించాలన్నారు. వేలూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన సేర్కాడు, క్రిష్టియన్‌పేట, పరదరామి, మాదకడప వంటి నాలుగు ప్రాంతాల్లో మొదటి విడతగా సిసిటీవి కెమరాలను అమర్చనున్నట్లు తెలిపారు. అనంతరం మిగిలిన ప్రాంతాల్లో కెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ వేలూరు, చిత్తూరు జిల్లాల్లో చోరీలు, నేరాలను అదుపు చేసేందుకు ఇరు జిల్లాల పోలీసులు సలహాలను ఇవ్వడంతోనే పలు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం నరికి తెచ్చే వారిలో వేలూరు జిల్లాకు చెందిన వారు అధికంగా ఉన్నారని ఈ తరలింపును అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వేలూరు నుంచి చిత్తూరుకు రిజిస్ట్రేషన్ వాహనాలు అధికంగా వస్తున్నాయని వాటిని స్వాధీనం చేసుకొని మీకు సమాచారం అందజేస్తామని వేలూరు పోలీసులు నేరుగా వచ్చి వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు అడిషనల్ ఎస్పీ అభిషేక్ మొహంతి, డీఎస్పీలు బాలక్రిష్ణన్(వేలూరు) రత్నా(చిత్తూరు) వేలూరు డీఎస్పీలు పన్నీర్‌సెల్వం, వరదరాజన్, మదివాణన్‌లతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన డీఎస్పీలు, ఇన్సెపెక్టర్లు పాల్గొన్నారు. -
విలేకరి హత్య
వేలూరు: వేలూరులోని కస్పా ప్రాంతం లో ఇంటిలో నిద్రిస్తున్న పత్రికా విలేకరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కస్పా ప్రాంతంలోని ధర్మకర్త పరమశివం వీధికి చెందిన గోపి కుమారుడు సతీష్‌కుమార్(24). ఇతని తండ్రి మృతి చెందడంతో తల్లి వనజ సీఎంసీ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అవ్వ, తాత, అన్న వసంత్‌కుమార్ కలిసి ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. సతీష్‌కుమార్ వేలూరులో దినకరన్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వనజ విధులకు వెళ్లడంతో సతీష్‌కుమార్,అన్న వసంత్‌కుమార్ కలిసి ఇంటి మిద్దెపైన నిద్రించారు. అవ్వ, తాత బయట హాలులో పడుకుని నిద్రించారు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో సతీష్‌కుమార్ అవ్వను లేపి టీ కావాలన్నాడు. అమ్మ వచ్చిన వెంటనే చేసి ఇస్తామని చెప్పి నిద్రించారు. అనంతరం సీఎంసీ ఆసుపత్రిలో ఉన్న వనజకు వసంత్‌కుమార్ ఫోన్ చేసి సతీష్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చంపేశారని తెలిపాడు. వనజ ఇంటికి వచ్చి చూడగా సతీష్‌కుమార్ శరీరంపై బట్టలు లేకుండా మెడ, కడుపు, చేతులపై కత్తులతో నరికి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయం తెలుసుకొని హత్య జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అన్న వసంత్ కుమార్ కూడా తలుపులు వేసుకొని నిద్రిస్తున్న సమయంలో ఎవరు హత్య చేసి ఉండవచ్చునని విచారణ జరిపారు. ఇంటి వెనుక వైపున సతీష్‌కుమార్‌ను హత్య చేసిన కత్తులు, మిద్దెపైన రక్తపు మరకలు ఉన్నట్లు గమనించారు. సతీష్‌కుమార్‌కు సెల్‌ఫోన్ ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు బహిష్కరించారు
వేలూరు: ప్రేమ వివాహం చేసుకున్నందుకు గ్రామ బహిష్కరణ చేయడంతో తమ చిన్నారికి పాలు కూడా తీసి ఇవ్వలేక పోతున్నామని ఒక ప్రేమ దంపతులు కలెక్టరేట్‌కు చేరుకొని జిల్లా రెవెన్యూ అధికారి మణివణ్ణన్‌కు వినతి పత్రం అందజేసి కన్నీరు మున్నీరయ్యారు. అరక్కోణం తాలుకా మేలపులం మోటూరు గ్రామానికి చెందిన యువన్య, ఈమె భర్త పార్తిబన్ వేర్వేరు కులాలకు చెందిన వారు అయినప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వంత్ అనే ఎనిమిది నెలల కుమారుడున్నారు. ఈ నేపథ్యంలో యువన్య భర్త కుమారుడితో కలిసి కలెక్టరేట్ చేరుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా యువన్య ఇచ్చిన ఫిర్యాదులో తాను తన భర్త వేర్వేరు కులాలకు చెందిన వారు తాము 2014 ఫిబ్రవరి 2వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నాం. వేర్వేరు కులాలు కావడంతో గ్రామ పెద్దలు తమను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామంలో నీరు పట్టేందుకు నిబందన ఉంచారు, గ్రామంలో ఎటువంటి వసతులు పొందలేక తమను బహిష్కరణ చేశారని దీంతో తమ కుమారునికి పాలు కూడా కొనలేక పక్క గ్రామంలోకి వెళ్ళి పాలను తీసుకురావాల్సి ఉందని అధికారులు స్పందించి తమకు అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన డీఆర్వో మణివణ్ణన్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యువ దంపతులు వెనుతిరిగి వెళ్లారు. -
ప్రేమజంట ఆత్మహత్య
- పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని రైలు కిందపడి బలవన్మరణం వేలూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కాట్పాడిలో చోటు చేసుకుంది. కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురం గ్రామానికి చెందిన రాబర్ట్ కుమారుడు వర్కీస్(25) పట్ట భద్రుడు. అదే గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు మణికుమార్తె కలైఅరసి(24). వీరు పాఠశాల విద్య నుంచే ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకలేదు. కలైఅరసికి మరొకరితో వివాహం జరిపేందుకు నిశ్చితార్థం నిర్వహించారు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మనస్తాపం చెంది శనివారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా వర్కీస్, కలైఅరసి ఇద్దరూ బ్రహ్మపురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి కాట్పాడి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
వేలూరు: ప్లస్‌టూ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో గుడియాత్తం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం విడుదల చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఉప్పరపల్లికు చెందిన కూలీ కార్మికుడు జయపాల్ కుమారుడు రఘు(18) ప్లస్‌టూలో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని లేఖ రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా గుడియాత్తం సమీపంలోని మూంగపట్టు గ్రామానికి చెందిన నాగరాజ్ కుమారుడు గుణశేఖరన్(17)ప్లస్‌టూ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది గుణశేఖరన్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన బంధువులు గుణశేఖరన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గుణశేఖరన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కుమారుడు ప్లస్‌టూ పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి నాగరాజన్ గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ విజయకుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థులు గుడియాత్తం నెల్లూరు పేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కావడం గమనార్హం. -
మృత్యు కుహరం
రెండేళ్ల బాలుడిని మింగిన బోరుబావి బాలుడిని రక్షించేందుకు కృషి చేసిన యంత్రాంగం వేలూరు జిల్లా ఆర్కాడులో ఘటన వేలూరు: ఆర్కాడు సమీపంలోని సాంబశివపురం గ్రామానికి చెందిన కుట్టి విదేశాల్లో ఉన్నాడు. ఇతని భార్య గీత, కుమారుడు తమిళరసన్(2) ఇక్కడే ఉన్నారు. తమిళరసన్ అమ్మమ్మ, తాతయ్యల ఊరు కూరంబాడి. తమిళరసన్ అమ్మ గీతతోపాటు తాతగారింటికి ఆదివారం ఉదయం వెళ్లాడు. ఉదయం 8.10 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. చిన్నారి కనిపించక పోవడంతో తల్లి గీత, అవ్వ వెతుకుతుండగా, బోరు బావి నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆర్కాడు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా చిన్నారి 40 అడుగుల లోతులో ఉన్న ట్లు గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలానికి జేసీబీలు, ప్రొక్లెయిన్లు రప్పించి బోరు బావి చుట్టూ మట్టి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 20 అడుగులు తవారు. చిన్నారికి బోరు బావిలో శ్యాస ఆడేందుకు ఆక్సిజన్‌ను వదిలారు. వెంటనే వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి రప్పించారు. మంత్రి వీరమణి, ఎమ్మెల్యేలు శ్రీనివాసన్, మహ్మద్‌జాన్, కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ సెంథిల్‌కుమారి, ఆరోగ్యశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోర్‌వెల్‌లో చిన్నారి పడిన నాలుగు గంటల్లోనే ఎటువంటి శబ్దం రాకపోవడంతో అధికారులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బండ రావడంతో మట్టి తొలగించడానికి అంతరాయం కలిగింది. వెంటనే డ్రిల్లింగ్ ద్వారా బండను తొలగించి మట్టిని తీశారు. ఆ వెంటనే వర్షం రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా తవ్వకాలు మాత్రం ఆపలేదు. మధ్యాహ్నం వరకు నుంచి సాయంత్రం వరకు బోరు బావి చుట్టూ తవ్వకాలు సాగించారు. సాయంత్రం 6.10 గంటలకు బాలుడిని వెలుపలికి తీశారు. వెంటనే అంబులెన్స్‌లో ఎక్కించి, ప్రథమ చికిత్స అందిస్తూ వాలాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చేరిన కొంత సేపటికే బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం బాలుడి తాత కనగసబ వ్యవసాయ భూమిలో 400 అడుగుల బోరు వేశాడు. బోరులో నీరు రాక పోవడంతో వాటిని రాళ్లతో మూసి వేసినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆ రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినట్లు తెలుస్తుంది. ఉదయం 8.00 - చిన్నారి ఇంటి ముందు ఆటలాడుతున్నాడు 8.10 - బోర్‌బావిలో బాలుడు పడ్డాడు 8.30 - పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు 8.35 - బోరుబావిలో దారం వదిలారు 9.00 - అంబులెన్స్ వచ్చింది 9.20 - బోరుబావిలోకి ఆక్సిజన్ వదిలారు 9.30 - తవ్వకాలు కొనసాగించారు సాయంత్రం 6.10 - బాలుడి వెలికి తీత 6.30 - వాలాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు 6.45 - బాలుడు కన్నుమూసినట్లు అధికారుల ప్రకటన -
ఆలయ పూజారికి 23 ఏళ్ల జైలు
వేలూరు: అభం శుభం ఎరుగని బాలి కపై అత్యాచారం చేసి, హత్య చేసి మృత దేహాన్ని బావిలో వేసిన ఆల య పూజారికి వేలూరు మహిళా కోర్టు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వేలూ రు జిల్లా గుడియాత్తం పాండియనగర్ వినాయక గుడి వీధికి చెందిన కుమార్(50) అదే గ్రామంలోనే ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని ఇంటి ముందున్న ప్రభుత్వ పాఠశాలలో కాళియమ్మన్ పట్టణం గ్రామానికి చెందిన రాజ కుమార్తె రాజేశ్వరి(7) రెండో తరగతి చదువుతుంది. 2011 సెప్టెంబర్ 19న పాఠశాలకు వెళ్లిన రాజేశ్వరి ఇంటికి రాలేదు. మూడు రోజుల అనంతరం అదే ప్రాంతంలోని ఒక వ్యవసాయ బావిలో రాజేశ్వరి మృతదేహం లభ్యమైంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరి హత్య కేసుపై విచారణ చేపట్టారు. విచారణలో రాజేశ్వరిని అదే ప్రాంతానికి చెందిన ఆలయ పూజారి కుమార్ చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఇంటిలోని పెద్దవారికి విషయం చెబుతుందని భయపడి, హత్య చేసి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో వేసిన ట్లు నిర్ధారణ అయింది. దీంతో కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు వేలూరు మహిళా కోర్టుకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తి నజీర్ అహ్మద్ కుమార్ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు పది సంవత్సరాలు, హత్య చేసినందుకు పది సంవత్సరాలు, హత్య ను చెప్పకుండా దాచినందుకు మూడేళ్లు మొత్తం 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా అపరాధ రుసుముగా రూ.5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చా రు. దీంతో కుమార్‌ను పోలీసులు వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
విద్యార్థిని పై లైంగికదాడి
వేలూరు: తిరువణ్ణామలైలో పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాలు.. తిరుకోవిలూర్ సారోన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని మంగళవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కత్తి చూపించి ఆమెను కిడ్నాప్ చేశారు. సమీపంలోని పాడుబడిన భవనంలోకి ఎత్తుకెళ్లి పాడుచేశారు. ఆపై అదే ఆటోలో తీసుకొచ్చి రోడ్డుపై వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ విద్యార్థిని రోడ్డు పక్కన ఏడుస్తూ ఉండిపోరుుంది. గమనించిన స్థానికులు వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. గ్రామస్తులు ఆటోను వెంబడించి లైంగికదాడికి పాల్పడిన వారిని పట్టుకున్నారు. విచారణలో తిరువణ్ణామలై త్యాగీ, అన్నామలై నగర్‌కు చెందిన అశ్వీన్(20) అని తేలింది. అతన్ని పట్టుకుని చితకబాదారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వినోద్‌ను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో బాలిక బంధువులు రెండు పెట్రోల్ బాబులు విసిరారు. అందులో ఒకటి ఆటోపైన, మరొకటి పోలీస్‌స్టేషన్‌పై పడ్డారుు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ అశ్వీన్, వినోద్‌లను కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో బాలిక బంధువులు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు. -
కీర్తిక హత్య కేసులో టెన్త్ విద్యార్థి అరెస్ట్
వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లాలోని కేవీ కుప్పంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అతనికి సాయం అందించిన మరో విద్యార్థిని కూడా విచారిస్తున్నారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ రెండో కుమార్తె కీర్తిక(11) మాచనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం కీర్తిక పాఠశాల నుంచి సైకి ల్‌పై ఒంటరిగా వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి తోటలోకి తీసుకెళ్లి కీర్తిక కాళ్లు, చేతులు కట్టి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. అదే విధంగా వేలూరు నుంచి రప్పించిన డాగ్ స్క్వాడ్తోను తనిఖీలు చేపట్టారు. కీర్తిక ఇంటికి పాఠశాలకు మూడు కిలో మీటర్ల దూరం ఉండడంతో ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఈ సంఘటన జరగడం గమనార్హం. విద్యార్థి పాఠశాల నుంచి ఎవరితో వచ్చిందనే విషయాలను ఉపాధ్యాయుల వద్ద పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం పాఠశాల ఎదుట జామ పండ్లు విక్రయించే మహిళ వద్ద విచారణ చేపట్టారు. ఆ సమయంలో కీర్తికతో పదో తరగతి విద్యార్థి వెళ్లినట్లు మహిళ తెలిపింది. వెంటనే పోలీసులు పదో తరగతి విద్యార్థి ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందినటెన్త్ విద్యార్థి శరణ్‌రాజ్ మంగళవారం పాఠశాలకు రాలేదని తెలుసుకున్నారు. శరణ్‌రాజ్ తల్లిదండ్రుల వద్ద విచారణ జరపగా మాటలు తడబడి మాట్లాడారు. విచారణలో శరణ్‌రాజ్ హొసూరులోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ప్రత్యేక పోలీసుల బృందం హొసూరుకు వెళ్లి శరణ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కీర్తికను హత్య చేసినట్లు అంగీకరించాడు. మరిన్ని వివరాల కోసం శరణ్‌రాజ్‌ను పరదరామి పోలీస్ స్టేషన్‌కు తీసుకె ళ్లి రహస్యంగా విచారణ చేస్తున్నారు. శరణ్‌రాజ్ కొద్ది రోజులుగా కీర్తికపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న కీర్తిక వద్ద శరణ్‌రాజ్ తాను ఇంటికి వెళుతున్నానని ఇద్దరూ కలిసి వెళదామని చెప్పాడు. అనంతరం పాఠశాల ముందున్న మహిళ వద్ద జామ పండు తీసి ఇచ్చాడు. జామ పండు తింటూ కీర్తిక శరణ్రాజ్తో కలిసి ఇంటికి బయల్దేరింది. ఇంటికి వెళ్లే దారిలోని మామిడి తోటలో కాసేపు ఆటలాడుకుని వెళదామని శరణ్‌రాజ్ తెలిపాడు. మామిడి తోటలోకి కీర్తిక వెళ్లడంతో కాళ్లు, చేతులు కట్టి ఆటలాడుతామని శరణ్‌రాజ్ తెలపడంతో ఇవేమీ తెలియని తెలియని కీర్తిక తన రిబ్బన్, దుప్పట్టా (చున్నీ) ఇచ్చింది. దీంతో కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తన మనసులో ఉన్న మాటను చెప్పాడు. ఇందుకు కీర్తిక అంగీకరించక పోవడంతోపాటు కేకలు వేయడంతో ఆగ్రహించిన శరణ్‌రాజ్ కీర్తిక నోటికి చున్నీని కట్టేసి, బట్టలు ఊడదీశాడు. పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కీర్తికను లొంగదీసుకునేందుకు శరణ్‌రాజ్ వల్ల కాలేదు. అరుుతే ఇంటికి వెళ్లి విషయాన్ని చెపుతుందని పక్కనున్న మద్యం బాటిళ్లతో కీర్తిక తలపై కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కీర్తిక గుండెపై బాటిల్‌తో కోశాడు. వెంటనే కీర్తిక మృతి చెందిన విషయాన్ని గమనించిన శరణ్‌రాజ్ మృత దేహాన్ని ముళ్ల చెట్ల వద్ద వేసి ఇంటికి వెళ్లిపోయాడు. రక్తపు మరకతో వచ్చిన శరణ్‌రాజ్‌ను చూసిన తల్లిదండ్రులు ఏమి జరిగిందని విచారించకుండా బంధువుల ఊరికి పంపించేశారు. అరుుతే ఈ హత్యలో శరణ్‌రాజ్‌కు సాయం మరెవరో సాయం అందించినట్లు పోలీసులకు అనుమానం వచ్చి మరో పదో తరగతి విద్యార్థిని పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. మృతదేహం తీసుకోకుండా బంధువుల రాస్తారోకో కీర్తిక మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కీర్తిక బంధువులు కేవీ కుప్పం -గుడియాత్తం రోడ్డులో రాస్తారోకో చేశారు. దీంతో కలెక్టర్ నందగోపాల్, డీఐజీ తమిళ్‌చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి కీర్తిక బంధువులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. కీర్తిక బంధువులకు మద్దతుగా పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు రాస్తారోకోలో పాల్గొన్నారుు. దీంతో ఆ ప్రాంతంలో దుకాణాలు మూసివేశారు. పాఠశాలకు సెలవు: కీర్తిక చదువుతున్న మాచనూర్ పాఠశాలకు బుధవారం సెలవు ప్రకటించారు. ముం దుగా సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు. అదే విధంగా కేవీ కుప్పంలోని రెండు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
ఆరంభం
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యూ యి. వేలాది మంది భక్తజనుల మధ్య ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ ఉత్సవాలు పది రోజులు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగనున్నారు. వేలూరు:తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధిగాంచాయి. ఉత్సవాలకు నాందిగా ఆలయంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు ధ్వజారోహణం నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గం టలకు మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధన లు జరిగాయి. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్, చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. ఈ వేడుకలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హరోం హరా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. చివరగా ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అగ్రి క్రిష్ణమూర్తి, కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ తమిళ్‌చంద్రన్, ఎస్పీ ముత్తరసి, ఎమ్మెల్యే అరంగనాథన్, ఆలయ జాయింట్ కమిషనర్ సెంథిల్వేలవన్, జడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా వాహనసేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, నంది, చిన్న వృషభ వాహనాల్లో ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 2న రథోత్సవం నిర్వహించనున్నారు. 5న ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు కొండపై మహా దీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు విదేశాల నుంచి సైతం భక్తులు తరలిరానున్నారు. -
తిరుపత్తూరులో అమ్మ మెడికల్ షాప్
వేలూరు: ఇండియాలోనే తమిళనాడులో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ షాపు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూ రు జిల్లా తిరుపత్తూరులో అమ్మ మెడికల్ షాపును కలెక్టర్ నందగోపాల్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ మెడికల్ షాపుల ద్వారా కొనుగోలు దారులకు 12 శాతం డిస్కౌంట్‌తో మందులను విక్రయించనున్నట్లు తెలిపారు. రోగులకు అందుబాటులో ఉండే విధంగా బస్టాండ్ ప్రాంతంలోనే ఈ దుకాణం ఏర్పా టు చేశామన్నారు. ఇప్పటికే కో-ఆపరేటివ్ ద్వారా వేలూరు కొత్త బస్టాండ్‌లో మందుల షాపును ప్రారంభించి రోగులకు అవసరమైన అన్ని మందులను విక్రయిస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పేర్నంబట్టులోనూ అమ్మ మెడికల్ షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే రమేష్, కో-ఆపరేటివ్ చైర్మన్ గణేశన్, యూనియన్ అధ్యక్షులు శరవణన్, జెడ్పీ చైర్మన్ లీలాసుబ్రమణ్యం, కో-ఆపరేటివ్ జాయింట్ డెరైక్టర్ తిరుగుణ అప్పాదురై, జాయింట్ రిజిస్ట్రార్ భాస్కర్ మోహన్ పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని వరదలాంబట్టు గ్రామానికి చెందిన మునస్వామి(60) గురువారం ఉదయం మృతి చెందా డు. ఈయన దహన క్రియలకు పేర్నంబట్టు సమీపంలోని పల్లాలకుప్పం గ్రామానికి చెందిన మునస్వామి బంధువులు సుమారు 45 మంది మినీ లారీలో గురువారం మధ్యాహ్నం బయ లు దేరారు. ఆ మినీ లారీలో అందరూ నిల్చొని ప్రయూణిస్తున్నారు. చిన్న ఒంగపాడి గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే సమయంలో, లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న సుమారు 10 అడుగుల లోతు లో బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వారందరూ లారీ కింద ఇరుక్కు పోయారు. వీరిని గమనించిన స్థానికులు వేపకుప్పం పోలీసులకు, ఒడుగత్తూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రైవేటు జేసీబీ యజమానికి సమాచారం అందించారు. జేసీబీ ద్వారా మినీ లారీని ఆ ప్రాంతం నుంచి తొలగించారు. అప్పటికే లారీకింద చక్రవర్తి(50) స్వామి కన్ను(56), కుప్పుస్వామి(60), రాజమ్మాల్(75), సంపూర్ణం(45), రుక్మణి(45), ఆనుముత్తు(55) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 23 మంది పురుషులు, 12 మంది మహిళలు మొత్తం 35 మందికి తీవ్ర గాయాలయ్యూయి రిని వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఏడు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. మృత దేహాలను వారి ఇళ్ల ముందు ఉంచి దహన క్రియలు నిర్వహించారు. దీంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. కలెక్టర్, ఎమ్మెల్యేల పరామర్శ: మినీ లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ నందగోపాల్, ఎమ్మెల్యే కలైఅరసన్, పాల డైరీ చైర్మన్ వేలయగన్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలిని పరిశీలించారు. అదే విధంగా వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. లారీ డ్రైవర్, యజమాని అరెస్ట్: గూడ్స్ తరలించే మినీ లారీలో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వెంకటేశన్, యజమాని వెంకటేశన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. లారీ, మినీ లారీల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వెళితే పర్మిట్‌ను రద్దు చేయనున్నట్లు కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. -
మినీ లారీ బోల్తా; ఏడుగురు మృతి
వేలూరు: తమిళనాడులోని వేలూరు సమీపంలోగురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. మినీలారీ లోయలోకి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లారీ లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో దాదాపు 40 మంది ఉన్నారు. వీరందరూ వేలూరు సమీపంలోని ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్నారు. గాయపడిన వారిని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఏసి పేలి నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఎయిర్ కండిషనర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. ఓ వ్యాపారవేత్త ఇంటిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. హైఓల్టేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. ఒక ఎయిర్ కండిషనర్ పేలడం వల్ల నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతవాసులు విస్తుపోయారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వేలూరు: ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ గణేషన్ తెలిపారు. శనివారం ఉదయం వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు, యజమానులతో డీఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆటో యజమానులు, డ్రైవర్లను పనిలో చేర్పించే ముందు వారి పూర్తి చిరునామాను తెలిసి ఉంచుకోవాలన్నారు. డ్రైవర్లు తప్పక యూనిపామ్‌లను ధరించి ఆటోలను నడపాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో ఆటోలను నడిపితే లెసైన్స్‌లను రద్దు చేస్తామన్నారు. ఆటోలో ముగ్గురికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను కూర్చో పెట్టరాదన్నారు. అనుమానం వచ్చే విధంగా ఎవరైనా ఆటోలో ప్రయాణం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఆటోలను కేటాయించిన ప్రాంతంలోనే నిలపాలని, ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారిని ఆసుపత్రిలో చేర్పించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రయాణికుల వద్ద అధిక రుసుము వసూలు చేయరాదని తదితర నిబందనలను తెలిపారు. ఈసందర్భంగా డ్రైవర్లు పలు సమస్యలను పోలీసులకు వివరించారు. -
అవమానం భరించలేక తండ్రి ఆత్మహత్య
వేలూరు: ప్రియుడితో కుమార్తె పరార్ కావడంతో అవమానం భరించలేక తండ్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని చిన్నవెంకటసముద్రం గ్రామానికి చెందిన పన్నీర్‌సెల్వం(50) కుమార్తె ఇలవరసి(20). వానియంబాడిలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు విఘ్నేష్(23)తో పరిచయమేర్పడింది. కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ప్రేమికులిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలవరసి ఈనెల 20వ తేదీన కరుంబూరులోని బ్యాంక్‌లో నగదు డ్రా చేసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. పన్నీర్‌సెల్వం బంధువుల ఇళ్లలో వెతికినా కనిపించలేదు. ఇలవరసి, విఘ్నేష్‌లు పెళ్లి చేసుకునేందుకు పరారైనట్లు తెలిసింది. పన్నీర్ సెల్వం ఉమరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున విఘ్నేష్ స్నేహితులు ఆ దారిలో వస్తుండగా పన్నీర్‌సెల్వం వారి వద్ద కుమార్తె ఆచూకీ గురించి ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆ ముగ్గురు స్నేహితులు మీ కుమార్తెకు మేము దగ్గరుండి విఘ్నేష్‌తో వివాహం చేయించామని తెలిపారు. అవమానం భరించలేక పన్నీర్‌సెల్వం విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించి పన్నీర్‌సెల్వంను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పన్నీర్‌సెల్వం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పన్నీర్‌సెల్వం బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే పన్నీర్‌సెల్వం ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇలవరసిని తీసుకొస్తేనే మృతదేహాన్ని తీసుకెళతామని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న డీఆర్వో బలరామన్ ఘటనా స్థలానికి చేరుకొని పన్నీర్‌సెల్వం భార్య సెల్వి వద్ద విచారణ జరపగా జరిగిన విషయాన్ని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కోర్టులో ప్రేమజంట హాజరు పోలీసులు విచారణ జరిపి ప్రేమజంట ఇలవరసి, విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకొని బుధవారం ఉదయం డీఎస్పీ మాణిక్యం అధ్యక్షతన వానియంబాడి కోర్టులో హాజరు పరిచారు. ఇలవరసి తండ్రి మృత దేహాన్ని చూసేందుకు అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రేమజంటను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఇరు కులాలు వేరు కావడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం
వేలూరు:స్థల విక్రయంలో మోసం చేసిన వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆటోడ్రైవర్ కుటుంబసభ్యులతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాట్పాడి తారాపడవేడు ఇలంగో వీధికి చెందిన మణిగండన్ ఆటోడ్రైవర్. భార్య రేఖ, కుమారుడు నగేష్, తల్లి పొన్ని. వీరు గురువారం ఉదయం 11 గ ంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ వంటిపై కిరోసిన్ పోసుకున్నారు. గమనించిన ఎస్పీ కార్యాలయంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల విచారణలో కాట్పాడి హౌసింగ్ బోర్డు వెనుక వైపున మణిగండన్‌కు సొంతమైన 50 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని విక్రయించాలని కాట్పాడికి చెందిన కేజీ కుమార్, శరవణన్ తరచూ బెదిరించడంతో స్థలాన్ని వారికి విక్రయించాడు. పత్రాలు రాసి న అనంతరం రూ.3.5 లక్షల నగదు ఇచ్చారు. మిగిలిన నగదును ఇవ్వాల ని కోరడంతో చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీనిపై విరుదంబట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కోర్టులో పరిష్కరించుకోవాలని చెప్పారన్నా రు. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో తమను తరచూ బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో పోలీసులకు తెలిపారు. పోలీసు లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్పీ విజయకుమార్ విరుదంబట్టు పోలీసులను ఆదేశించారు. మణిగండన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రాజీవ్‌గాంధీ హంతకులకు పరామర్శ
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లను తమిలగ వాయువు ఉరిమై పార్టీ అధ్యక్షులు వేల్మురుగన్ మంగళవారం మధ్యాహ్నం పరామర్శించారు. మద్యాహ్నం 11.35 గంటలకు సెంట్రల్ జైల్లోకి వెళ్లిన ఆయన 12 గంటల వరకు ఉరిశిక్ష ఖైదీలను పరామర్శించి వారితో పలువిషయాల గురించి చర్చించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జైలులోని మురుగన్, శాంతన్, పేరరివాలన్ విడుదల అవుతారని నమ్మకంతో ఉన్నారన్నారు. గతంలో వారిని విడుదల చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో పెండింగ్‌లో పడిందన్నారు. ప్రస్తుతం నరేంద్రమోడి ప్రభుత్వం వారిని విడుదల చేస్తుందని నమ్మకం ఉందన్నారు. కావేరి, ముల్లై పెరియార్ విషయంలో చట్టపరంగా జయలలిత విజయం సాధించారన్నారు. ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్, కార్యకర్తలు జై ల్లోకి వెళ్లారు. వేల్మురగన్ జైలుకు రాక సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. -
కోర్టుకు మోహనాంబల్ హాజరు
వేలూరు: వేలూరు సమీపంలోని తారాపడవేడులో రూ.4 కోట్ల 4లక్షల 73,500 నగదు, 73 సవరాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో వసంతపురానికి చెందిన కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ బుధవారం మధ్యాహ్నం కాట్పాడి కోర్టులో హాజరయ్యారు. కరగ డ్యాన్సర్ మోహనాంబాల్ ఇంటిలో ఈనెల 4న పోలీ సులు తనిఖీలు నిర్వహించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న మోహనాంబాల్, సోదరి నిర్మల ఈనెల 9వ తేదీన వేలూరు కోర్టులో లొంగిపోయారు. అయితే విచారణ జరిపిన న్యాయమూర్తి కాట్పాడి కోర్టులో 11వ తేదీన హాజరు కావాలని తీర్పు నిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మోహనాంబాల్, సోదరి నిర్మల కాట్పాడి కోర్టులో హాజరయ్యారు. మోహనాంబల్ను పోలీస్ కస్టడికీ ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు నిచ్చారు. మోహనాంబాల్ మాత్రం తాను వడ్డీ వ్యాపారం చేసి నగదు, బంగారం సంపాదించానని తెలిపినా పోలీసులు నమ్మడం లేదు. పరారీలో ఉన్న మోహనాంబాల్ సోదరి కుమారుడు శరవణన్ వద్ద విచారణ జరిపితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మోహనాంబాల్, సోదరి నిర్మల వద్ద మూడు రోజుల పాటు రహస్య విచారణ జరపనున్నారు. -
బాలిక మృతదేహం లభ్యం
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరులో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ కాలువలో కొట్టుకు పోయిన బాలికను 60 గంటలు పోరాడిన అనంతరం కలెక్టరేట్ సమీపంలో గురువారం ఉదయం ఏడు గంట లకు మృత దేహంగా కనుగొన్నారు. జార్ఖండ్ రాష్ట్రం కిరిడి జిల్లాకు చెందిన ప్రియాంక (14) ఈనెల 2వతేదీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలూరు ప్యాలెస్ క్యాప్ వద్ద గాలించినప్పటికీ బాలిక ఆచూకీ తెలియరాలేదు. దీంతో కాలువ ఎక్కెడెక్కడ వెళుతుందో ఆ ప్రాంతాలన్నీ జేసీబీ ప్రొక్లెయినర్ ద్వారా డ్రైనేజీ కాలువలతోపాటు, కట్టడాలను కూడా తొలగించి గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా సీఎంసీ ఆస్పత్రి రోడ్డు, కాట్పాడి రోడ్డులను మూసివేసి గుంతల వద్ద పూర్తిగా తవ్వి గాలించినా ఫలితం లేదు. దీంతో మంగళవారం సాయంత్రం అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాళీ నౌకా సిబ్బంది 10 మందిని రంగంలోకి దింపారు. నౌకా సిబ్బంది మూడు టీమ్‌లుగా ఏర్పడి బేరి సుబ్రమణ్య స్వామి వీధి నుంచి సీఎంసీ రోడ్డు, ప్యాలెస్ క్యాప్, తోటపాళెంం, రివరీ హోటల్, కలెక్టరేట్ సమీపంలోని డ్రైనేజీ కాలువలు ఎక్కెడెక్కడ వెలుతాయో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. రాజాళీ నౌకా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో బుధవా రం సాయంత్రం అరక్కోణం వెనుతిరిగి వెళ్లా రు.దీంతో కార్పొరేషన్ కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపుచర్యలను బుధవారం సా యంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగించారు. కాంట్రాక్టు కార్మికులు గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికులు సుకుమార్ అధ్యక్షతన ముగ్గురు రివేరా హోటల్ నుంచి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కలెక్టరేట్ వెనుక వైపున ఉన్న డ్రైనేజీ కాలువలోని కుప్పల్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అగ్నిమాపక సిబ్బందికి, కార్పొరేషన్ అధికారులకు కార్మికులు సమాచారం అందించారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు ప్రొక్లెయినర్ సాయంతో ఉదయం 7.30 గంటల సమయంలో ప్లాస్టిక్ కుప్పలను తొలగించారు. బాలిక మృతదేహం ఉన్నట్లు గుర్తించి దారం సాయంతో ప్రొక్లెరుునర్ ద్వారా కాలువ నుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ విజయకుమార్, మేయర్ కార్తియాయిని, కమిషనర్ జానకి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహం బేరి సుబ్రమణ్యస్వామి వీధిలో బాలిక గల్లంతు కావడంతో ఆ ప్రాంతం నుంచి సుమారు ఒక కిలో మీటరు వ రకు జేసీబీల సాయంతో డ్రైనేజీ కాలువలను తవ్వి గాలించారు. అయినప్పటీకీ ఆచూకీ తెలియక పోవడంతో మట్టిలో కూరుకుపోయి ఉండవచ్చని జేసీబీ ద్వారా మట్టిని పూర్తిగా తొలగించారు. అయితే బాలిక మూడు కిలో మీటర్ల దూరం వరకు వరద నీటిలో కొట్టుకుపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. వేలూరులోనే అంత్యక్రియలు జార్ఖండ్‌కు చెందిన బాలిక ప్రియాంక మృతదేహానికి వేలూరులోనే అంత్యక్రియలు చేసేందు కు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ విజయకుమార్, మేయర్, కమిషనర్ ప్రియాంక మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. టోల్‌గేట్‌లోని సీఎస్ఐ కల్లరలో క్రైస్తవ లాంఛనాల మధ్య ప్రత్యేక ప్రార్థనలు చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. కన్నీరు మున్నీరైన ప్రియాంక కుటుంబ సభ్యులు బాలిక ప్రియాంక మృత దేహాన్ని చూసిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తండ్రి ఇంద్రజిత్ ముఖర్జీ, తల్లి సుచిత్ర, ప్రియాంక అన్న అమిదీశ్వరన్, వదిన సీమా కన్నీరు మున్నీరు అయ్యారు. మూడు రోజులుగా తమ కుమార్తె సజీవంగా దొరకాలని చేసిన ప్రార్థనలన్నీ వృథా అయ్యూరుు. కుటుంబీకులు మృత దేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్ బాలిక కోసం రాత్రి, పగళ్లు కష్టపడి గాలింపు చర్యలు చేపట్టిన పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులను కలెక్టర్ అభినందించారు. ఆ కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నట్లు కలెక్టర్‌కు తెలిసింది. దీంతో కాంట్రాక్టు కార్మికులు కుమా ర్, మదన్, సంతోష్‌ను పర్మినెంట్ చేయాలని కమిషనర్ జానకిని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులుగా గాలింపు చర్యల్లో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులతోపాటు, పోలీస్, రెవె న్యూ, అగ్నిమాపక అధికారులను కలెక్టర్ అభినందించారు. -
అవినీతి పాలనను తరిమేద్దాం
వేలూరు, న్యూస్‌లైన్: దేశంలో అవినీతి పాలనను తరిమేసి, అభివృద్ధి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ క్రిష్ణ అద్వానీ పేర్కొన్నారు. వేలూరులో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రచార సభకు అద్వానీ హాజరయ్యూరు. ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ అధ్యక్షతన దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని దేశంలోని అన్ని మీడియాలు, సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో పదేళ్లుగా అవినీతి పాలన సాగించిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ను ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే పోటీ ఉండేదని ప్రస్తుతం బీజేపీ కూటమితో పరిస్థితి మారిందన్నారు. రాష్ట్రంలోని విజయకాంత్, వైగో, రామదాస్, ఐజెకే వంటి కూటమి కొత్త చరిత్రను సృష్టించనుందన్నారు. తాను ఉప ప్రధానిగా పనిచేసిన కాలంలో విద్యాభివృద్ధి కోసం పలు పథకాలను తీసుకొచ్చానని గుర్తు చేశారు. అదే తరహాలో వేలూరు లోక్‌సభకు బీజేపీ కూటమి నుంచి పోటీచేస్తున్న ఎసి షణ్ముగం కూడా పేద విద్యార్థులకు విద్యను అందిస్తుండడం అభినందనీయమన్నారు. వేలూరులోని ప్రజా బలాన్ని చూస్తే షణ్ముగం విజయం సాధించి, జూన్‌లో బీజేపీ మంత్రి వర్గంలో చోటు సంపాదించి దేశంలోని అన్ని పథకాలను వేలూరుకు వర్తింప జేస్తారన్న నమ్మకం ఉందన్నారు. గుజరాత్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నరేంద్రమోడీ ఎంతో అభివృద్ధి చేశారని అదే తరహాలోనే దేశాన్ని కూడా అభివృద్ధి చేయగలిగే శక్తి సామర్థ్యాలున్నాయన్నారు. తమిళ భాష అంటే ఎంతో ఇష్టం: తనకు తమిళ భాష అంటే ఎంతో ఇష్టమని కానీ మాట్లాడలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు. తాను తొలిసారిగా తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్తోమాట్లాడానన్నారు. తాను చూసిన తమిళ సినిమా కూడా శివాజీదేనన్నారు. తాను 1952లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల నుంచి పార్టీలో పనిచేస్తున్నానని ప్రస్తుతం 16వ ఎన్నికల్లోను పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న మురళీధర రావ్ వేలూరు పార్లమెంట్ నియోజక వర్గంలో దాదాపు 30 శాతం తెలుగు ప్రజలు ఉండడంతో ప్రచార సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావ్ తెలుగులో ప్రసంగించారు. రాష్ర్టంలో ఎన్డీఏ కూటమి అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాత్రి వేళల్లో డబ్బులు పంచే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. అవకాశం కల్పించండి వేలూరును అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశం కల్పించాలని బీజేపీ కూటమి అభ్యర్థి ఏసీ షణ్ముగం పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారులున్నాయంటే అందుకు బీజేపీనే కారణమన్నారు. కాంగ్రెస్‌లో అవినీతి పేరుకు పోయిందని ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలన్నారు. వేలూరులో ఐటీ పార్కు ఏర్పాటు చేసి 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఉచిత కల్యాణ మండ పాలు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అద్వానీ రాకను పురస్కరించుకుని వేలూరు ఎస్పీ విజయకుమార్ నేతృత్వంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుగా చెన్నై నుంచి వేలూరు వీఐటీ మైదానానికి హెలికాప్టర్లో అద్వానీ వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సభా స్థలికి చేరుకున్నారు. సభ ముగిసినానంతరం మళ్లీ వీఐటీ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్లర్లో తంజావూరు బయలుదేరి వెళ్లారు. తంజావూరులో తమ పార్టీ అభ్యర్థి కరుప్పు మురుగానందన్కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో అద్వానీ ప్రసంగించారు. -
అమ్మ అంటే అంత అభిమానం
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలూరులో మంగళవారం అన్నాడీఎంకే బహిరంగ సభ జరిగింది. ఆ సభకు పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పాల్గొన్నారు. ఆ సభలో రెండాకుల గుర్తును శరీరంపై వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు ఓ కార్యకర్త. ఎండను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. -
దుప్పటిలో ఎమ్మెల్యే తరలింపు
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు రెండు వేల అడుగుల ఎత్తుగల కొండపైకి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను దుప్పటిలో కూర్చోబెట్టి కర్రలతో అటవీవాసులు మోసుకెళ్లారు. వేలూరు జిల్లా వాణియంబాడి నియోజక వర్గం ఆలంగాయం యూనియన్ పరిధిలోని నెగ్నకొండ ఉంది. ఈ కొండపై 900 మందికి పైగా నివసిస్తున్నారు. మొత్తం 600 మంది ఓటర్లున్నారు. నిగ్నకొండకు వెళ్లాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సి ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామానికి రోడ్డు వసతి మాత్రం ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో వానియంబాడి ఎమ్మెల్యే కోవై సంపత్‌కుమార్ ఆలంగాయం యూనియన్ పరిధిలో కరపత్రాలు అందజేశారు. ఆ ప్రాంతంలో ఆలంగాయం సర్పంచ్ గోపాల్ నె గ్న కొండలో 600 ఓట్లు ఉన్నాయని అక్కడ ప్రచారం నిర్వహించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తన కాలికి గాయం కావడంతో అంత ఎత్తునకు నడవ లేనని చెప్పారు. దీంతో అటవీ ప్రాంత గ్రామస్తులు కర్రపై దుప్పట్టి కట్టుకొని అందులో ఎమ్మెల్యేను కూర్చోబెట్టి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతవాసులు మోసుకెళ్లారు. మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే నెగ్నకొండకు వెళ్లడంతో అటవీ ప్రాంతవాసులు సంతోషించారు. వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు సమస్యలను వివరించారు. -
కోటీశ్వరుడు
సాక్షి, చెన్నై:రాష్ర్టంలో కోటీశ్వర అభ్యర్థుల జాబితాలో ఏసీ షణ్ముగం అగ్ర స్థానానికి చేరారు. బీజేపీ అధిష్టానం వద్ద పట్టు బట్టి మరీ వేలూరు సీటు దక్కించుకున్న పుదియ తమిళగం అధినేత ఏసీ షణ్ముగం తన ఆస్తులు రూ.106 కోట్లుగా ప్రకటించారు. నామినేషన్ పత్రంలో వివరాల్ని పొందుపరిచారు. రాష్ర్టంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. బీజేపీ 8 స్థానాల బరిలో అభ్యర్థులను నిలబెట్టేందుకు నిర్ణయించింది. ఆరు స్థానాలకు ముందుగానే ప్రకటించినా, రెండు స్థానాల్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇందులో వేలూరు స్థానం ఒకటి. తనకు బీజేపీ తరపున సీటు ఇవ్వాలంటూ పుదియ తమిళగం పార్టీ అధినేత ఏసీ షణ్ముగం కమలనాథులకు విన్నవించారు. ఈ గట్టి పోటీ పెరగడంతో ఎట్టకేలకు తన ఆర్థిక బలంతో ఏసీ షణ్ముగం సీటు దక్కించుకున్నారు. వేలూరు సీటు దక్కించుకున్న ఏసీ షణ్ముగం గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. విద్యా సంస్థల అధినేతగా ఉన్న ఆయన ఒకప్పుడు అన్నాడీఎంకేలో యువజన నాయకుడు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక కొత్తగా పుదియ నిధి కట్చి ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా పార్టీని నడిపిస్తున్నప్పటికీ, బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగాలన్న ఆశతో వేలూరు సీటు కోసం యత్నించి సఫలీకృతుడయ్యారు.ఎన్నికల బరిలో దిగిన షణ్ముగం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఇందులో ఆయన పేర్కొన్న గణాంకా లు ఎన్నికల అధికారుల్ని విస్మయంలో పడేశాయి. తన, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాల్ని అందులో ప్రకటించారు. రూ.22. 87 లక్షల నగదు తన పేరిట, రూ.7.12 లక్షల నగదు తన భార్య పేరిట ఉన్నట్టు పేర్కొన్నారు. డిపాజిట్లు, వాటాలు తన పేరిట రూ.20.96 కోట్లు, తన భార్య పేరిట రూ.11.07 కోట్లు, తన పేరిట రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి, తన భార్య పేరిట 3 కిలోల బంగారం, కిలో వెండి ఉన్నట్టు వివరించారు. ఆరణిలో పంట పొలాలు, బెంగళూరు ప్రాంతాల్లో స్థిర ఆస్తులు ఉన్నట్టు వివరించారు. మొత్తంగా రూ.106 కోట్లు ఉన్నట్టు ప్రకటించిన ఆయన అప్పులు రూ.24 కోట్లు తన పేరిట, రూ.10.43 కోట్లు తన భార్య పేరిట ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. -
ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలి
వేలూరు, న్యూస్‌లైన్: వాణియంబాడిలో విద్యార్థిని వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయాలని కోరుతూ విద్యార్థులు పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. వాణియంబాడి సమీపం పుదూరు గ్రామంలోని ప్రైవేటు హైస్కూల్లో వాణియంబాడికి చెందిన గోపి ప్లస్‌టూ గణితం టీచర్‌గా పనిచేస్తున్నాడు. గోపి ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ చెపుతుంటాడు. అక్కడకు వచ్చే విద్యార్థినుల పట్ల గోపి అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదాలతో దూషిం చడం చేశాడు. విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు పాఠశాల ఆవరణ వద్దకు చేరుకొని ఉపాధ్యాయున్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలను ముట్టడించారు. విషయం తెలుసుకున్న వాణియంబాడి పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పరారీలో ఉన్న నిందితున్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోండి
సవేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పాఠశాల శాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలెక్టరేట్లో తాళికి బంగారం పథకం కింద లబ్ధిదారులకు నాలుగు గ్రాముల బంగారం, నగదు చెక్కులను మంత్రి అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఇటువంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత అన్నాడీఎంకే పార్టీకి మాత్రమే చెల్లిందన్నారు. మహిళల కష్టాలు సాటి మహిళకే తెలుసుననే అనే విధంగా రాష్ట్రంలోని మహిళల కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. వేలూరు జిల్లాలోని ఎనిమిది తాలుకాల్లో 1874 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల 51లక్షల 21వేల విలువ చేసే బంగారం, నగదును అందజేస్తున్నామన్నారు. డిగ్రీ చదివిన పేద వారికి వివాహం కోసం రూ.50 వేలతో పాటు నాలుగు గ్రాముల బంగారం అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, అన్నాడీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శులు ఏయుమలై, ఎస్ఆర్కే అప్పు, తిరుపత్తూరు సబ్ కలెక్టర్ శిల్పా ప్రభాకరన్, సాంఘిక సంక్షేమ అధికారి గోమది, అధికారులు, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు. -
ఆరు లక్షల మందికి పల్స్‌పోలియో
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఆరు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యశాఖ మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రభుత్వ ఆస్పతిలో కలెక్టర్ నందగోపాల్ అధ్యక్షతన మంత్రి కేసీ వీరమణి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల 73,971 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరికి పోలియో చుక్కలు వేసేందుకుగాను 2216వ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 9,157 మంది సిబ్బంది, 305 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. కలెక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఆదివారం చుక్కలు వేసుకోని చిన్నారుల కోసం వైద్య సిబ్బందిచే మూడు రోజుల పాటు ఇంటింటికి వెల్లి చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అస్లాంబాషా, మున్సిపల్ చైర్మన్ సంగీత పాల్గొన్నారు. అలాగే వేలూరు పెడ్‌లాండ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ విజయ్, మేయర్ కార్తియాయిని పోలియో చుక్కలను వేశారు. వీరితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో జిల్లాలో రెండు లక్షల 28,069 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు కలెక్టర్ జ్ఞానశేఖరన్ తెలిపారు. ఇందుకోసం 1,885 పోలియో కేంద్రాలు, 866 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో పల్స్ పోలియో చుక్కలను కలెక్టర్ ప్రారంభించారు. అలాగే సెయ్యారు ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి ముక్కూరు సుబ్రమణియన్ పల్స్ పోలియోను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధి కారులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత కు మారథాన్
వేలూరు, న్యూస్‌లైన్: రోడ్డు భద్రతపై అవగాహ నకల్పించేం దుకు మినీ మారథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. వేలూరు కరుగంబత్తూరులో ఎకే గ్రూప్స్ చారిటబుల్ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మినీ మారథాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్‌ఓబీ జిల్లా అధ్యక్షుడు శరవణ కుమార్ అధ్యక్షతన కలెక్టర్ నందగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి మినీ మారథాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం నిర్వహిం చిన ఈ పోటీలకు సుమారు మూడు వేల మంది విద్యార్థులు కలుసుకున్నారని చెప్పారు. వికలాంగుల కోసం ప్రత్యేక మినీ మారథాన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దేవసహాయం, పారిశ్రామిక వేత్త విఎం బాలాజీ మొదలియార్, సినీ డెరైక్టర్ గోపాల్ క్రిష్ణన్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఖైదీలు చేసిన వస్తువుల విక్రయం
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు సెంట్రల్ జైలులోని ఖైదీలు తయారు చేసిన వస్తువుల విక్రయాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. సెంట్రల్ విశ్రాంతి భవనంలో ఉంచిన ఈ స్టాల్స్‌ను కార్మిక సంక్షేమ న్యాయమూర్తి మంజు ల ప్రారంభించారు. అనంతరం జైలు ఆవరణలో ఖైదీల బంధువుల కోసం విశ్రాంతి గదిలో ఫ్రీడమ్ అమ్మ క్యాంటీన్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాలాన్ని వృథా చేయకుండా జైలులోపల లెదర్ చెప్పులు, షూలు, కీచైన్, బెల్టు వంటివి తయారు చేయడం అభినందనీయమన్నారు. అలాగే జైలు ఆవరణలో ముళ్లంగి, ఉర్లగడ్డలను పండించి స్టాల్స్‌లో ఉంచారన్నారు. ఖైదీల కోసం ఈ నెల 8వ తేదీన బార్బర్ షాప్, పురుషుల బ్యూటీ పార్లర్ ను ప్రారంభించనున్నారని తెలిపారు. ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రజలకు తక్కువ ధరకు విక్రయించేందుకు జైలు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. మదురైలో మహిళల కోసం ప్రత్యేక జైలును ఏర్పాటు చేస్తున్నారని ఇందుకోసం అక్కడ అవసరమైన ఫర్నీచర్ పూర్తిగా ఖైదీలు తయారు చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన క్యాంటీన్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఖైదీల బంధువులకు అవసరమైన ఆహారం, తిను బండారాలను ఈ క్యాంటీన్లో ఉంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఖైదీలు తయారు చేసి స్టాల్స్‌లో ఉంచిన వస్తువులను ఆమె పరిశీలించారు. జైలు సూపరింటెండెంట్ కరుప్పన్, అడిషనల్ సూపరింటెండెంట్ క్రిష్ణకుమార్, మహిళా జైలు సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, జైలు అధికారులు పాల్గొన్నారు. -
పురిటి బిడ్డల కోసం 108 సేవలు
వేలూరు, న్యూస్‌లైన్: పురిటి బిడ్డల కోసం ప్రత్యేక 108 అంబులెన్స్ సేవ లు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక అంబులెన్స్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో108 అంబులెన్స్‌లు సేవలు 36 వాహనాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పురిటి బిడ్డల కోసం ప్రత్యేకంగా ఈ అంబులెన్స్‌ను ఉపయోగిం చాలన్నారు. పురిటి బిడ్డల కోసం జిల్లాలో రెండు 108 ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రారంభించామన్నారు. ఒక అంబులెన్స్ వాలాజ ప్రభుత్వ ఆస్ప త్రి, మరొక వాహనం తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటుందన్నారు. అనంతరం అంబులెన్స్‌లో ఉంచిన అధునూతన పరికరాలను కలెక్టర్, అధికారులు పరిశీలించారు. జిల్లా ఆరోగ్యశాఖ ఆర్గనైజర్ డాక్టర్ కెనడి, అంబులెన్స్ మేనేజర్ శ్రీరామ్, వైద్యులు పాల్గొన్నారు. -
భర్తను హత్యచేసి కనిపించలేదని ఫిర్యాదు
వేలూరు, న్యూస్‌లైన్: స్నేహితుడి మోజులోపడి భర్తను కడతేర్చి, కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలయం వద్ద ఈనెల 9న మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో మృతు డు క్రిష్ణగిరి జిల్లా చిన్నరామనూర్ గ్రామానికి చెందిన సోమసుందరం(37)అని తెలిసింది. ఇతనికి భార్య కస్తూరి, నలుగురు పిల్లలున్నారు. సోమసుందరం కమ్మీ మేస్త్రీగా పనిచేసి ప్రతిరోజూ మద్యం సేవించే వాడు.ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గోవిందరాజ్‌తో కస్తూరికి వివాహేత ర సంబంధం ఏర్పడింది. ఈ విషయం విషయం తెలిసి సోమసుందరం ప్రతిరోజూ మద్యం సేవిం చి కస్తూరితో గొడవపడేవాడు. దీంతో గోవిందరా జ్, కస్తూరి కలిసి సోమసుందరాన్ని హత్య చేసేం దుకు ప్రణాళిక సిద్ధ్దం చేసుకున్నారు. మద్యం మానిపించేందుకు గుడియాత్తంలో మందులు ఇస్తారని కస్తూరి, సోమసుందరాన్ని ఒంటరిగా తీసుకొచ్చింది. అనంతరం గుడియాత్తం చిత్తాతూర్ వద్దనున్న కొబ్బరి తోపునకు తీసుకెళ్లింది. అప్పటికే గోవింద్రాజ్ అక్కడ ఉన్నాడు. కస్తూరి, గోవింద్రాజ్ ఇద్దరు కలిసి సెల్‌ఫోన్ చార్జర్‌తో గొంతు బిగించి హత్యచేసినట్లు కస్తూరి పోలీసులకు తెలిపింది. పోలీసులు కస్తూరి, గోవిందరాజ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువ ణ్ణామలై జిల్లా లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఐజీ తమిళ్‌చంద్రన్ తెలిపారు. వేలూరు డీఐజీగా తమిళ్‌చంద్రన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరు,తిరువణ్ణామలై జిల్లా లో మామూళ్లు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరులో ట్రాఫిక్ సమస్య ను పోలీసు అధికారులతో చర్చించి వాటిని మార్పుచేసేందుకు కృషి చేస్తానన్నారు. రాత్రి వేళల్లో చోరీలు అధికంగా జరుగుతున్నట్లు, పట్టణంలో కార్పొరేట్, బంగారు దుకాణాల్లో చోరీలు జరిగినప్పటికీ ఇంతవరకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయలేదని అటువంటి కేసులను పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహన తనిఖీలు, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేలూ రు జిల్లా సరిహద్దు ప్రాంతాల ద్వారా ఎర్రచందనం, నాటు సారా ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు విమర్శలున్నాయని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనవెంట ఎస్పీ విజయకుమార్, డీ ఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
వేలూరు, న్యూస్‌లైన్: దేశంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోనే దేశాభివృద్ధి తప్పక సాధ్యమని వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. వీఐటీ లో గురువారం ఉదయం జీన్స్, పర్యావరణం, శరీరక వ్యాధి సంబంధమైన మూడు రోజుల సదస్సు ప్రారంభమైంది. వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దేశంలో ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయని వాటికి పరిశోధకులు మందులు కనిపెట్టాలన్నా రు. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల ను కొంతవరకు తగ్గించవచ్చునన్నారు. ఇతర దేశాలకు దీటుగా మన దేశంలో కూడా పర్యావరణం అభివృద్ధి చెందాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు పుస్తకాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో బెంగళూరు జాతీయ విద్యా కమిటీ సభ్యులు లత పిళ్లై, భారతీయార్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ మారిముత్తు, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, ప్రొఫెసర్ నారాయణన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. టాస్మాక్ దుకాణాలకు బాటిళ్లను తీసుకు వెళుతున్న మీనీ వ్యాన్‌ను ఆర్కాడ్ సమీపంలో లారీ ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.తిరువణ్ణామమలై జిల్లా మునియతాం గాల్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్మాక్ బాటిళ్లతో మినీ వ్యాన్ బుధవారం ఉదయం వేలూరు నుంచి ఆర్కాడుకు బయలుదేరింది. మినీ వ్యాన్ ఆర్కాడు సమీపంలోని బైపాస్ రోడ్డు దాటుతుండగా ఆర్కాడు నుంచి వేలూరు వైపు వస్తున్న కంటైనర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్కాడు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా వేలూరు శలవన్‌పేటకు చెందిన సెంథిల్(20), నాథన్(28) దిండివనానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ అరివయగన్(26) అని తెలిసింది. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆర్కాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. తిరువణ్ణామలై జిల్లాలో... తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సందవాసల్లో సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నారుు. రోడ్డు పనులు చేసేందుకు అనంతల, చిన్న అనంతల గ్రామాల నుంచి 15 మంది కార్మికులు వెళ్లారు. మంగళవారం సాయంత్రం పనులు ముగించుకొని మినీ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. మినీ వ్యాన్ మునియ తాంగల్ గ్రామం వద్ద వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదపుతప్పడంతో వ్యాన్ డ్రైవర్ గావు కిర ణ్ మట్టి రోడ్డుపక్కకు తిప్పాడు. దీంతో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏలుమలై(45), తంగం(35), తిరుమలై(38) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన కార్మికులు కావడంతో గ్రామంలోని వారు శోక సముద్రంలో మునిగి పోయారు. గాయపడ్డవారినికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కన్నమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యూరుు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనులు తరలివచ్చారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ఆవరణం మార్మోగింది. వేలూరు, న్యూస్‌లైన్: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఎంతో ఇష్టం. ప్రతి ఏటా పది రోజులు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 8 నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా అధికారులు నిర్ణరుుంచారు. శుక్రవారం ఉదయం 6.21 గంటలకు ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచి మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధనలు చేశారు. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్,చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తుల హరోంహర నామస్మరణతో ఆలయ ఆవరణం మార్మోగింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ మురుగన్, ఎస్పీ ముత్తరసి, జిల్లా రెవెన్యూ అధికారి వలర్మధి, ఆర్డీవోలు ప్రియ, ఆలయ జాయింట్ కమిషనర్ తిరుమగల్, ఎమ్మెల్యే అరంగనాథన్, జెడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా వాహనసేవలు బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం వివిధ వాహనసేవలు నిర్వహించారు. ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, అధికార నంది, చిన్న వృషభ వాహనాల్లో స్వామివారు ఊరేగారు. ఈ నెల 14న రథోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. అలాగే 17వ తేదీ ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు ఆలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తు గల కొండపై మహాదీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఇరవై లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. -
సీవీ.రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
వేలూరు, న్యూస్‌లైన్: విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్‌ను ఆదర్శంగా తీసకుని పరిశోధనలు చేయాలని జిల్లా విద్యాశాఖ సీఈవో మది అన్నారు. శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకటరామన్ 120వ జయంతి సందర్భంగా వేలూరు జిల్లా సైన్స్ సెంట ర్లో వీఐటీ విద్యార్థులు వివిధ పరిశోధనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మది ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా నోబుల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సీవీ.రామన్ అని గుర్తుచేశారు. ఆయన్ను ప్రతి విద్యార్థీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు పరిశోధనలు చేసేందుకు అన్ని సదుపాయాలున్నాయని పేర్కొన్నారు. సర్ సీవీ. రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం అభినందనీయమన్నారు. అనంతరం వీఐటీ విద్యార్థులు పది రకాల పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ప్రొఫెసర్ మురగేశ్వరి, చెన్నై సైన్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అయ్యం పెరుమాల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ బస్సు ఢీకొని ఒకరి మృతి
వేలూరు, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాన్ని ప్రభుత్వ బస్సు ఢీకొంది. దీంతో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఫటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వేలూరు సేన్‌బాక్కంకు చెందిన ఆనందన్ కుమారుడు లింగేశ్వరన్(23) ఎద్దుల బండి కార్మికుడు, అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు కార్తీతో ఉదయం ద్విచక్ర వాహనంలో పట్టణానికి బయలుదేరారు. కొనవట్ట సమీపంలోని మసీదు వద్ద వెళుతున్న సమయంలో వేలూరు వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొంది. లింగేశ్వరన్ అక్కడికక్కడే మృతి చెందాడు, వెనుక వైపు కూర్చొన్న కార్తీ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నడిరోడ్డుపై ప్రమాదం జరగడంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను మళ్లించారు. -
సమస్యలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కారం కావడంలేద ని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీ శారు. కార్పొరేషన్ పరిధిలో మూడో మండల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి మండల కమిటీ చైర్మన్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సూర్యాచారి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. చర్యలు తీసుకుంటామని అంటున్నారు తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అదే విధంగా పట్టణంలోని వీధుల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు నిర్మించ డం ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండకుండా పాలారుకు వెళుతోందని, డ్రైనేజి కాలువల్లో కింది బాగంలో సిమెంట్ వేయకుండా ఉండాలన్నారు. దీనిపై డెప్యూటీ మేయర్ ధర్మలింగం కలుగజేసుకొని వీటిని అమలు చేయడం కుదరదన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మండల కమిటీ అధికారి కరుణాకరన్ కలుగజేసుకొని ప్రతిపాదన చేసి అధికారులకు పంపుతామన్నారు. కౌన్సిలర్ రాజ మాట్లాడుతూ ఓటేరిలోని పార్కును నిర్మించి రెండు సంవత్పరాలు కావస్తున్నా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని మండల చైర్మన్ కుమార్ తెలిపారు. కౌన్సిలర్ శ్రీనివాస గాంధీ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వీధుల్లో దోమలు చేరకుండా బ్లీచింగ్ చల్లాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం రూ75 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేం దుకు సభ్యులు తీర్మానించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు భరత్‌కుమార్, సూలైరవి, అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పత్రికా విలేకరి మృతి
వేలూరు, న్యూస్‌లైన్: ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పత్రికా విలేకరి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి వేలూరులో చోటు చేసుకుంది. సేలం జిల్లా మోటూరు సమీపంలోని కరంగాల్‌పాడి గ్రామానికి చెందిన శశికుమార్(30) వేలూరు జిల్లా జూనియర్ విగడన్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శశికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సత్వచ్చారి పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్ శరవణన్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సేలం నుంచి ఆదివారం ఉదయం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. -
వీరరాఘవుని ఆలయంలో భక్తుల రద్దీ
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: మహాలయ అమావాస్య సందర్భంగా వీరరాఘవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పెరటాసి నెలలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా భావించి భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తుంటారు. ఇందులో భాగంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రి నుంచే భక్తులు రాక మొదలైంది. ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఇదిలావుండగా గురువారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదు కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు, పెట్రోల్‌బంక్ తదితర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం వీరరాఘవుని సన్నిధిలో పుణ్యస్నానాలు ఆచరించి తమ పితృదేవతలకు పిండాలు ప్రదానం చేశారు. అనంతరం బెల్లం, పాలు, ఉప్పు తదితరాలను పుష్కరిణిలో వదిలి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాంచీపురం, వేలూరు, చెన్నై, ఆంధ్రా, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
అనుమానాస్పద స్థితిలో మాజీ సైనికుడి మృతి
వేలూరు, న్యూస్‌లైన్: గుడియాత్తంకు చెందిన టీచర్ హత్య కేసులో పోలీసు విచారణకు వెళ్లిన మాజీ సైనికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఇన్స్పెక్టర్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ మంజునాథన్ ఆదేశాలు జారీ చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం కామాక్షిమ్మన్పేటకు చెందిన సుకుమార్(41) కొట్టారమడుగులో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. సుకుమార్ 28వ తేదీన కట్టాగుట్ట చెరువులో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుకుమార్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్న అదే ప్రాంతానికి చెందిన హోమియోపతి డాక్టర్ ధరణిని విచారించారు. సుకుమార్‌కు విషపు ఇంజక్షన్ వేసి హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం ఆటో డ్రైవర్ తెన్కొడియన్ సాయంతో కట్టాగుట్ట చెరువులో పడేసినట్టు తేలింది. వీరిని అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన మాజీ సైనికుడు గోపి అలియాస్ గోపాల్(41)ను పోలీసులు విచారణ పేరుతో మేల్ పట్టి పోలీస్ స్టేషన్‌కు మంగళవారం సాయంత్రం తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల సమయంలో గోపాల్ స్పృహతప్పి పడి ఉన్నాడని పోలీసులు గుడియాత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గోపాల్ మృతి చెంది ఉన్నాడని వైద్యులు తెలిపారు. అనంతరం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న కామాక్షిమ్మన్ పేట గ్రామస్తులు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ గజేంద్రన్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. గోపాల్ భార్య లత మాట్లాడుతూ తన భర్త ఆర్మీలో హవల్దార్‌గా పనిచేసి సంవత్సరం క్రితమే ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. తన భర్త గోపాల్ చేతులకు పోలీస్ స్టేషన్లో బేడీలో వేశామని, బేడీలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారని వాపోయారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. మృతి చెందిన తన భర్త మృతదేహాన్ని గుడియాత్తం ఆస్పత్రి నుంచి వేలూరు ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంపై తహశీల్దార్ గజేంద్రన్ పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఈ మేరకు ఐజీ మంజునాథన్, డీఐజీ మురుగన్, ఎస్పీ విజయకుమార్ మేల్పట్టి పోలీస్ స్టేషన్, గ్రామస్తుల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. అనంతరం మేల్పట్టి ఇన్స్పెక్టర్ మురళీధరన్, ఎస్ఐ ఇన్బరసన్, హెడ్‌కానిస్టేబుల్ ఉమాశంకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
దొంగ టీచర్ అరెస్ట్
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే దారి తప్పి దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం జైలు ఊచల్ని లెక్కిస్తున్నాడు. తమళనాడులోని వేలూరు జిల్లాలో మదన్ మారన్ (34) అనే వ్యక్తి స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తొందరగా ధనవంతుడు కావాలనే దురాశతో చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. 73 విలువైన బంగారు ఆభరణాలను తస్కరించాడు. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుంది. శుక్రవారం రాత్రి పోలీసులు మారన్‌ను అరెస్ట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనూ దొంగతనం తదితర కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. 2004లో మారన్ హోసూర్ సమీపంలోని ఓ గ్రామీణ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆయనపై దొంగతనం కేసు నమోదవడంతో గతేడాది ఉద్యోగం నుంచి తొలగించారు. రెణ్నెళ్ల క్రితం వేలూరు వెళ్లి ఓ పాఠశాలలో టీచర్‌గా చేరాడు. దొంగతనాలకు అలవాటు పడ్డ మారన్ అక్కడా అదే ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన పది రోజులు సెలవు పెట్టి పక్క జిల్లా కాంచీపురానికి దొంగతనం చేయడానికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 18 కేసులు నమోదయ్యాయని చెప్పారు. -
రైలులో వధువుపై లైంగికదాడికి యత్నం
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు నుంచి అరక్కోణానికి వెళుతున్న రైలులో వధువుపై లైంగికదాడికి యత్నించిన ఇద్దరు యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వేలూరు జిల్లా అరక్కోణం ప్రాంతానికి చెందిన వ్యవసాయ కూలీ తంగవేలు(27). ఇతనికి అదే ప్రాంతానికి చెందిన షర్మిల(23)తో 15 రోజుల క్రితం వివాహం జరిగింది. మంగళవారం తిరువళ్లూరులోని వీరరాఘవ స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం పట్టణంలోని పోస్టాఫీసు వద్దనున్న బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 11.30 గంటలకు చెన్నై నుంచి అరక్కోణం వైపు వెళుతున్న రైలు ఎక్కారు. వీరిద్దరూ ఒంటిరిగా వెళుతున్న విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు అదే రైలు పెట్టేలో ఎక్కారు. రైలు తిరువళ్లూరు నుంచి యాగట్టూరు వద్దకు రాగానే రైలులో ఉన్న తంగవేలును చితకబాది షర్మిలను బలవంతంగా రైలులో నుంచి దింపారు. భార్యను కిందకు దింపుతున్న విషయాన్ని గ్రహించిన తంగేవుల వారి వెంబడించారు. రైలు వెళ్లిపోవడంతో షర్మిలను పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లేందకు యత్నించారు. తంగవేలు గట్టిగా కేకలు వేశారు. దీని గమనించిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. గామస్తులు వస్తున్న విషయాన్ని గమనించిన యువకులు షర్మిలను వదిలి పెట్టి పరారయ్యారు. అయితే టార్చ్లైట్ల సహా యంతో గ్రామస్తులు నిందితులను పట్టుకుని చితకబాది కడంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యువకులు తిరువళ్లూరు జిల్లా పెరియకుప్పం ప్రాంతానికి చెందిన లారన్స్, సాలమాన్గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. రాత్రుళ్లు రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
నడిరోడ్డుపై కారు దగ్ధం
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చెన్నై త్యాగరాజనగర్‌కు చెందిన ధనంజయన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం హోసూర్‌కు వెళ్లారు. సాయంత్రం తిరిగి కారులో బయలు దేరారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జిపై వస్తున్న సమయంలో కారు నుంచి చిన్నగా మంటలు వచ్చాయి. దీనిని గమనించిన ధనంజయన్ కారును ఆపి వెంటనే కిందకు దిగాడు. మంటలు పెద్దవి కావడంతో కారులోని భార్య, ఇద్దరు పిల్లలను కిందకు దింపి కారులోని విలువైన సామాగ్రిని కిందకు వేసి పరుగులు తీశారు. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చే సరికి కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ మేరకు సత్‌వాచ్చారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడి రోడ్డుపై కారు దగ్ధం కావడంతో సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ఘనంగా వినాయకుని నిమజ్జనం
వేలూరు, న్యూస్‌లైన్: హిందూ మున్నని ఆధ్వర్యంలో వేలూరు పట్టణంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జనం భారీ పోలీస్ బందోబస్తు నడుమ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మున్నని, హిందూ మక్కల్ పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వినాయక చవతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. వేలూరు జిల్లాలో సుమారు రెండువేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించగా హిందూ మున్నని అధ్వర్యంలో 1200 విగ్రహాలను ప్రతిష్టిం చారు. వీటిని ప్రతి సంవత్సరం మూడు, ఐదు, ఏడవ రోజున విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సదుపేరి చెరువులో నిమజ్జనం చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సత్‌వాచ్చారి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సుమారు 150 పెద్ద వినాయకుని విగ్రహాల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హిందూ మున్నని నేత మహేష్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ ఊరేగింపు సైదాపేట మురుగన్ ఆలయం, మెయిన్ బజారు వీధి, కిరుబానంద వారియార్ వీధి, కొనవట్టం తదితర ప్రాంతాల మీదుగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ సదుపేరి చెరువు వద్దకు చేరుకుంది. అనంతరం చెరువు వద్ద విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నడిరోడ్డుపై కారు దగ్ధం
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చెన్నై త్యాగరాజనగర్‌కు చెందిన ధనంజయన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం హోసూర్‌కు వెళ్లారు. సాయంత్రం తిరిగి కారులో బయలు దేరారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జిపై వస్తున్న సమయంలో కారు నుంచి చిన్నగా మంటలు వచ్చాయి. దీనిని గమనించిన ధనంజయన్ కారును ఆపి వెంటనే కిందకు దిగాడు. మంటలు పెద్దవి కావడంతో కారులోని భార్య, ఇద్దరు పిల్లలను కిందకు దింపి కారులోని విలువైన సామాగ్రిని కిందకు వేసి పరుగులు తీశారు. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చే సరికి కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ మేరకు సత్‌వాచ్చారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడి రోడ్డుపై కారు దగ్ధం కావడంతో సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
కొంపముంచిన అవినీతి!
అవినీతి వ్యవహారాల కారణంగానే వైగై సెల్వన్‌ను మంత్రి వర్గం నుంచి ఇంటికి సాగనంపినట్లు తెలుస్తోంది. సహచర మంత్రులతోనూ ఈయనకు సఖ్యత లేనట్లు సమాచారం. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న జయలలిత వైగై సెల్వన్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాల విద్య, క్రీడలు, మహిళా సంక్షేమం, అధికార తమిళభాష, సంస్కృతి శాఖల మంత్రిగా డాక్టర్ వైగెసైల్వన్ వ్యవహరించేవారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ప్రకటించారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం కలిగించింది. అదే సమయంలో వైగెసైల్వన్కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నా రుు. మదురై, మేలూరు, ఉసిలంపట్టిలోని ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్, పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో ప్రభుత్వాధినేతల సిఫార్సుల ప్రమేయం, అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఉసిలంపట్టికి చెందిన గణేశన్ అనుమానించాడు. సమాచార హక్కు చట్టం కింద ఆయూ నియామకాల వివరాలు కోరుతూ మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. మదురె, మేలూరు అధికారులు స్పందించలేదు. ఉసిలంపట్టి అధికారి ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లు తేటతెల్లమైంది. దీంతో బాధితుడు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు మండల విద్యాశాఖాధికారులు సైతం వివరాలను కోర్టుకు సమర్పించారు. తాము సూచించినవారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు ఆదేశించారని అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. తమకు చెన్నై నుంచి ఎవరో ఫోన్ చేశారని అధికారులు సమాధానం ఇచ్చారు. వీరి సమాధానంతో ఆగ్రహించిన న్యాయమూర్తి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదంటూ నిలదీశారు. ప్రభుత్వంలోని వారు ఉద్యోగాలు పంచుకోవడంపై ధర్మాసనం మండిపడింది. ఫలితంగా గురువారం సాయంత్రానికి కల్లా మంత్రి వర్గం నుంచి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి వైగై సెల్వన్ ఉద్వాసనకు గురయ్యూరు. అవినీతి బద్ఙిలీలలురూ. ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే మంత్రి వైగైను తప్పించడానికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. వైగై పట్ల సహచర మంత్రివర్గ సభ్యులు, పార్టీనేతలే గుర్రుగా ఉంటున్నట్లు ఉద్వాసన తర్వాత వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుల బదిలీ, పాఠశాలల అప్‌గ్రేడ్ వ్యవహారాల్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో వైగై తీరు వివాదాస్పదంగా మారింది. రెండురోజుల క్రితం తన సొంతూరుకు బయలుదేరిన వైగై సెల్వన్ వెంట 500 కారులు అనుసరించినట్లు, కారు దిగగానే గజరాజు చేత ఆయన మెడలో స్వాగత మాల వేయించుకున్నట్లు అమ్మకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇన్నిరకాల వివాదాల్లో కూరుకుపోయి ఉన్న వైగై సెల్వన్‌ను నియామకాల ఆరోపణలే అదునుగా ఉద్వాసన పలికినట్లు వెల్లడైంది. -
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి
వేలూరు, న్యూస్‌లైన్: త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి జగత్క్ష్రగన్ పిలుపు నిచ్చారు. వేలూరులో మంగళవారం డీఎంకే కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు, నేతలు పాటు పడాలన్నారు. రాష్ట్రప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. వేలూరుకు కరుణానిధి వస్తున్నారని, ఈ సందర్భంగా బ్యానర్లు కట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదన్నారు. దీనికి కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు. ముందుగా డీఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని, అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పనిచేయాలని రాష్ట్ర మాజీ మంత్రి దురైమురగన్ పిలుపు నిచ్చారు. కార్యకర్తలు పదవుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలన్నారు. ఈనెల 15వ తేదీన వేలూరు ఊరీస్ డిగ్రీ కళాశాలలో జరిగే కార్యకర్తల సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలన్నారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హాజరవుతారన్నారు. జిల్లా సరిహద్దు వాలాజ నుంచి రాణిపేట, విషారం మీదుగా వేలూరు రానున్నారని ఆయా ప్రాంతాల ఇన్చార్జిలు కరుణానిధికి ఘన స్వాగతం పలకాలన్నారు. రాష్ట్రంలోనే డీఎంకు వేలూరు కోటగా వుందని ఇక్కడ మన సత్తా చూపించాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు డీఎంకే కైవసం చేసుకోవడానికి యూనియన్ కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, యువత కష్ట పడి పనిచేయాలన్నారు. కరుణానిధికి వేలూరు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంద ని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్ట పడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆర్.గాంధీ, మాజీ మేయర్ కార్తికేయన్, మాజీ ఎంపీ అబ్దుల్ రహమాన్, యూనియన్ కార్యదర్శి ఆర్పీ ఏయుమలై, పట్టణ కార్యదర్శి రామలింగం, డీఎంకే నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆరు ఏనుగుల పట్టివేత
వేలూరు, న్యూస్‌లైన్: తిరువణ్ణామలై, ధర్మపురి, క్రిష్ణగిరి, విల్లుపురం జిల్లాల్లో తిరుగుతూ సంచలనం సృష్టించిన ఆరు అడవి ఏనుగులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకొన్నారు. ఈ జిల్లాల్లో సాగులో ఉన్న పంటలను ఈ ఏనుగులు ధ్వంసం చేసేవి. అలాగే ఇప్పటి వరకు ఈ ఏనుగుల దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మల్కాణి, కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఏనుగులను పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి ఆపరేషన్ హిల్‌గా పేరుపెట్టారు. ఈ నెల 27 నుంచి ఆఫరేషన్లు ప్రారంభిం చారు. మత్తు మందును తూటాల ద్వారా వేసి నాలుగు ఏనుగులను పట్టుకున్నారు. మగ ఏనుగును మాత్రం బుధవారం ముదుమలైకి లారీలో తరలించారు. మిగి లిన ఏనుగులను పట్టుకునేందుకు ఆడ ఏనుగులను తండ్రాంబట్టు ప్రాంతం వద్ద చెట్లుకు కట్టి ఉంచారు. ఆడ ఏనుగు వద్దకు మిగిలిన రెండు పిల్ల ఏనుగులు చేరుకున్నాయి. ఈ సమయంలో వెటర్నరీ వైద్యాధికారి మనోహరన్ ఆధ్వర్యంలో పిల్ల ఏనుగులకు తక్కువ మో తాదుతో ఇంజెక్షన్ వేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో వాటిని పట్టుకున్నారు. అనంతరం అన్ని ఏనుగులనూ ఇనుప గొలుసులతో కట్టి పెట్టారు. ఆపై గురువారం ఉదయం ఒక్కో ఏనుగును వేర్వేరు లారీల్లో పెలైట్ వాహనాల మధ్య తరలించారు. వీటిలో రెండు ఏనుగులను ఆనమలైకి, మరో నాలుగు ఏనుగులను ముదుమలైకి తరలించారు. ఈ ఏనుగులకు మత్తు వ ది లేలోపు 12 గంటల సమయంలోనే ఆయా శిక్షణ కేంద్రాలకు తరలించారు. రైతుల హర్షం తండ్రాబట్టు ప్రాంతంలో ఆరు ఏనుగులను ఆపరేషన్ హిల్ ద్వారా పట్టుకొని విజయం సాధించడంతో అటవీశాఖ అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సమయంలో ఎప్పుడేమి జరుగుతుందోనని అటవీశాఖ అధికారులు గాబరాపడ్డారు. ఎట్టకేలకు ఏనుగులను పట్టుకొని విజయం సాధించడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. -
ఘనంగా మహా కుంభాభిషేకం
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు మేల్ చెంగానత్తం కొండపై వెలిసిన మారియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకాన్ని శుక్రవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శశికుమార్ స్వాముల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్, యూనియన్ మాజీ అధ్యక్షులు దేవేంద్రన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కళశాలలో ఉంచిన పుణిద నీటిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ గోపురంపై పోశారు. అనంతరం భక్తులపై చల్లారు. అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ మహా కుంభాభిషేకంలో సర్పంచ్ రవి పాల్గొన్నారు. అదేవిధంగా వేలూరు రంగాపురం పూంగావనతమ్మన్ ఆలయంలో అమ్మవారికి 108 పాల బిందెలతో అభిషేకం చేశారు. అంతకుముందు మహిళలు పాల బిందెలను తలపై పెట్టుకుని మేళ తాళాల నడుమ ప్రదర్శనగా ఆలయానికి వచ్చా రు. ఆపై పూజలు నిర్వహించారు. -
ప్రభుత్వాస్పత్రిలో దారుణం
వేలూరు, న్యూస్‌లైన్: ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రెండు రోజులు కిందట జన్మించిన చిన్నారిని కన్నతల్లే విక్రయించేందుకు యత్నించింది. వేలూరు జిల్లా ఆంబూరు తిరువళ్లువర్ నగర్‌కు చెందిన రవి భార్య లత ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. వివాదం కారణంగా లత భర్త రవిని విడిచి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో చిన్నారిని పెంచడం కష్టంగా భావించింది. పసిబిడ్డను రూ. 10 వేలకు విక్రయించేందుకు యత్నించింది. ఇదే సమయంలో వాణియంబాడికి చెందిన ముత్తప్ప, సరస్వతి దంపతులకు పిల్లలు లేక పోవడంతో ఆసుపత్రిలోని మగబిడ్డను కొనుగోలు చేసేందుకు వచ్చారు. బ్రోకర్ల సాయంతో బేరం కుదుర్చుకున్నారు. వారు బ్రోకర్లకు రూ. 50 వేలు చెల్లించారు. తల్లి లతకు రూ. 10 వేలు ఇచ్చి మిగిలిన వాటిని బ్రోకర్లు పంచుకునేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. బ్రోకర్లు వాటా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆసుపత్రి సిబ్బంది ఆంబూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ముత్తప్ప, సరస్వతి న్యాయవాదితో కలిసి రూ. 20 బాండు పేపర్ ను తీసుకొచ్చిలత వద్ద సంతకం చేసుకొన్నారు. ఆంబూరు పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారిని విక్రయించేందుకు ప్రయత్నించిన తల్లి లత, కొనుగోలు చేసేందుకు వచ్చిన సరస్వతి, ముత్తప్పలను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్రోకర్లు పరారయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రోకర్లు అరెస్టయితే ఎంతకాలంగా ఈ తంతంగం సాగుతోంది? ఎంత మంది చిన్నారులను విక్రయించారు? అనే విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
నాంతమిళర్ పార్టీ నేత దారుణ హత్య
తిరుత్తణి, న్యూస్‌లైన్: నామ్‌తమిళర్ పార్టీకి నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తిరుత్తణి పట్టణంలో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. తిరుత్తణిలోని పెద్ద వీధికి చెందిన వ్యక్తి జయరామన్. అన్నాడీఎంకే రెండవ వార్డు కార్యదర్శిగా ఉంటున్నాడు. ఇతని కొడుకు పశుంపొన్‌రాజా(28) నామ్‌తమిళర్ పార్టీలో తిరువళ్లూరు జిల్లా పడమర విభాగ ఉప కార్యదర్శిగా ఉంటున్నాడు. తిరుత్తణిలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూవచ్చాడు. ఎంపిఎస్సాలైలో ప్రైవేటు కొరియర్ సర్వీస్, స్థానిక అగూరు వద్ద గోనె సంచుల వ్యాపారం చేస్తూ వచ్చాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన పశుంపొన్‌రాజా తిరిగి ఇంటికి తిరిగిరాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికారు. చిత్తూరు రోడ్డు, పట్టణ శివారు ప్రాంతమైన అగూరు సమీపంలోని విత్తనాల గోడౌన్ వద్ద రోడ్డు పశుంపొన్‌రాజా హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. తిరుత్తణి పోలీసు లు వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన పశుంపొన్రాజాను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు అన్న విషయం తెలియరాలేదు. తిరువళ్లూరు ఎస్పీ రూపేష్‌కుమార్ మీనా పర్యవేక్షణలో తిరుత్తణి డీఎస్పీ గోపాల్, ఇన్స్పెక్టర్ విమారాజ్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోను, తిరుత్తణి పట్టణంలోను అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం పసుంపొన్‌రాజా మృతదేహాన్ని సొంత ఊరైన పుదుకోట్టైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీకి చెందిన నిర్వాహకుడు తిరుత్తణి ప్రాంతంలో హత్యకు గురి కావడం ఇదే మొదటిసారి. సీమాన్ నివాళి పొన్‌రాజా మృతికి అంజలి ఘటించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు సీమాన్ మంగళవారం సాయంత్రం తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. పోస్టుమార్టం గది నుంచి తీసుకొచ్చిన పశుంపొన్‌రాజా మృత దేహానికి ఆయన పూలమలవేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ నేతలతో కలసి తమిళ తల్లికి కూడా అంజలి ఘటించారు. విలేకరులతో మాట్లాడుతూ, పశుంపొన్‌రాజా తమ పార్టీ అభివృద్ధి కోసం తిరుత్తణి ప్రాంతంలో చురుగ్గా పనిచేశారని తెలిపారు. పశుంపొన్‌రాజా హత్య కేసుపై పోలీసులకు కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని సీమాన్ తెలిపారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంజలి ఘటించారు. -
పరవళ్లు తొక్కుతున్న నదులు
తిరుచ్చి, తంజావూరు, అరియలూరు, నాగపట్నం, కరూర్ జిల్లాల్లోని నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. మెట్టూరు ఉబరి నీరు, కొల్లిడం నది, ముక్కొంబు, కళ్లనై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కావేరి మంగళవారం కాస్త శాంతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, చెన్నై: కర్ణాటక, కేరళలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. ప్రధానంగా మెట్టూరు డ్యాం పొంగి పొర్లుతోంది. కావేరి ఉగ్ర తాండవంతో డ్యాం నీటిమట్టం 121 అడుగులు దాటింది. పూర్తిస్థాయిలో 120 అడుగులు మాత్రమే నీటి నిల్వలు ఉండాల్సిన దృష్ట్యా మిగులు జలాల్ని బయటకు విడుదల చేస్తున్నారు. మెట్టూరు డ్యామ్‌లోకి మంగళవారం సెకనుకు 1.36 లక్షల ఘనపుటడుగుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అలాగే సెకనుకు 1.21 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కావేరి మంగళవారం సాయంత్రానికి కాస్త శాంతించింది. కృష్ణరాయసాగర్, కపిని డ్యామ్‌ల నుంచి నీటి విడుదల శాతాన్ని సెకనుకు 90 వేల ఘనపుటడుగులకు తగ్గించడమే ఇందుకు కారణం. అయితే కావేరిలో అంతకంటే ఎక్కువగా నీరు ప్రవహిస్తోంది. నదీ తీరంలో కురుస్తున్న వర్షాలే ఈ పరిస్థితికి కారణం. పొంచివున్న ముప్పు కావేరి నీటితో మెట్టూరు డ్యాం నిండింది. ఈ నీటిని సాగుబడి నిమిత్తం కాలువల ద్వారా ఓ వైపు, ఉబరి నీటిని 16 గేట్ల ద్వారా మరోవైపు బయటకు పంపుతున్నారు. దీంతో మెట్టూరు నుంచి సేలం, నామక్కల్, ఈరోడ్, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, అరియలూరు తదితర 11 జిల్లాల గుండా కావేరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఈ తీరంలోని కొల్లినడం నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అలాగే కళ్లనై, ముక్కోం బు, మాయనూరు, పడనై డ్యామ్‌లు, ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కావేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుచ్చి వద్ద లక్ష ఘనపుటడుగుల మేరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడి పురాతన వంతెనల మీదుగా రాకపోకల్ని నిలుపుదల చేశారు. తీరవాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత కావేరి కళకళలాడుతుండడంతో తిరుచ్చి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా తంజావూరు, అరియలూరు మీదుగా నాగపట్నం వద్ద సముద్రంలో నీళ్లు కలవనున్నాయి. వృథా కాని రీతిలో తీరంలోని చెరువులు, చిన్నచిన్న జలాశయాలకు కాలువల ద్వారా నీటిని మళ్లించే పనిలో నీటిపారుదల శాఖ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు కుట్ర
సాక్షి, చెన్నై: డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తి రునల్వేలి వేదికగా వ్యూహ రచన జరిగినట్టు, ఇంటెలిజెన్స్ దృష్టికి ఈ కుట్ర సమాచారం చేరినట్టు ఓ మీడియాలో వచ్చిన కథనం ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ డీజీపీ రామానుజంను ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సభ్యులు 29 మంది అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీలో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పక్షాన చేరారు. పార్టీకి రెబల్‌గా వీరు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తిరునల్వేలి వేదికగా కుట్ర జరిగి ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. ఆ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఓ మీడియాలో కథనం సైతం వెలువడింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో పార్టీ రెబల్ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను తిరువణ్ణామలై కీల్ నాచ్చుపట్టు వద్ద ఓ వ్యాన్ ఢీకొట్టి వెళ్లి పోవడం అనుమానాలకు దారి తీసింది. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రెట్టింపు అయింది. దీంతో ఆపార్టీ నాయకుడు బాలాజీ నేతృత్వంలో పలువురు డీజీపీ కార్యాలయానికి శనివారం చేరుకున్నారు. అక్కడి ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేల హత్యకు కుట్ర జరిగినట్టు సమాచారం అందిందన్నారు. ప్రధానంగా చెంగల్పట్టు ఎమ్మెల్యే అనగై మురుగేషన్, తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రహ్మణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్‌లను టార్గెట్ చేసి కుట్ర జరిగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరునల్వేలి వేదికగా ఈ కుట్రకు పథకం రచించబడి ఉందని, ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని విన్నవించారు. -
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యార్థులతోనే ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కమిటీ సోమవారం సమావేశం కానుంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ కీలకం. ఎన్నో కలలతో, లక్ష్యాలతో విద్యార్థులు కళాశాలలకు వస్తుంటారు. అరుుతే ర్యాగింగ్ భూతం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా కళాశాల జీవితంలోకి అడుగుపెట్టే విద్యార్థులను సీనియర్లు చిన్నపాటి అల్లరి చేష్టలతో సరదాగా ఆట పట్టించడం ర్యాగింగ్‌గా ముద్రపడింది. ఈ సరదా కొన్ని సమయూల్లో శ్రుతి మించుతోంది. అసంబద్ధ, అసభ్యకరమైన ప్రశ్నలేగాక, దుస్తులను విప్పించడం వంటి చేష్టలకూ కొందరు సీనియర్లు వెనకాడడం లేదు. ర్యాగింగ్ విషయంలో విద్యార్థినులూ తక్కువేం కాదు. ర్యాగింగ్ భూతం దెబ్బతో ఇటీవలే చెన్నైలో ఓ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ మిద్దెపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ర్యాగింగ్‌ను కొందరు సరదాగా తీసుకుంటున్నారు. సున్నితమనస్కులైన విద్యార్థులు మాత్రం బెదిరిపోతున్నారు. మరికొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాలు దృష్టి సారించారుు. అస్సోంలో 1988 డిసెంబరు 17న ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లో దీనిని అమలు చేయడం ప్రారంభించారు. కలెక్టర్ నేతృత్వంలో కమిటీ తమిళనాడులోని అన్ని కళాశాలలు, యూని వర్సిటీల్లో ఈ నెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యూరుు. దేశం నలుమూలల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ చేరారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై కలెక్టర్ సుందరవల్లి నేతృత్వంలో ర్యాగింగ్ నిరోధక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో జిల్లా రెవెన్యూ అధికారి, నగర కమిషనర్, మీడియా ప్రతినిధులు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడికల్, సాంస్కృతిక కళాశాలల విద్యార్థులను సభ్యులుగా చేర్చారు. ర్యాగింగ్ బాధితుల సౌకర్యార్థం 1077 నెంబర్‌తో టోల్ ఫ్రీ ఫోన్ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులతో ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సమావేశం కానున్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ను అదుపుచేసే బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం, ఆపైన అధికారుల పర్యవేక్షణగా నిర్ణయించడం విశేషం.