విద్యార్థిని పై లైంగికదాడి
వేలూరు: తిరువణ్ణామలైలో పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాలు.. తిరుకోవిలూర్ సారోన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని మంగళవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి బయలుదేరింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కత్తి చూపించి ఆమెను కిడ్నాప్ చేశారు. సమీపంలోని పాడుబడిన భవనంలోకి ఎత్తుకెళ్లి పాడుచేశారు. ఆపై అదే ఆటోలో తీసుకొచ్చి రోడ్డుపై వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ విద్యార్థిని రోడ్డు పక్కన ఏడుస్తూ ఉండిపోరుుంది. గమనించిన స్థానికులు వాకబు చేయగా అసలు విషయం బయటపడింది.
గ్రామస్తులు ఆటోను వెంబడించి లైంగికదాడికి పాల్పడిన వారిని పట్టుకున్నారు. విచారణలో తిరువణ్ణామలై త్యాగీ, అన్నామలై నగర్‌కు చెందిన అశ్వీన్(20) అని తేలింది. అతన్ని పట్టుకుని చితకబాదారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వినోద్‌ను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో బాలిక బంధువులు రెండు పెట్రోల్ బాబులు విసిరారు. అందులో ఒకటి ఆటోపైన, మరొకటి పోలీస్‌స్టేషన్‌పై పడ్డారుు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ అశ్వీన్, వినోద్‌లను కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో బాలిక బంధువులు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు.