ఐఐటీ విద్యార్థులపై అత్యాచారం కేసు
ఐఐటీ విద్యార్థులపై అత్యాచారం కేసు
Published Thu, Feb 9 2017 1:03 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ గువాహటిలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను అత్యాచారం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి వేరే సంస్థ నుంచి వచ్చిన ముగ్గురు మహిళలపై వాళ్లు అత్యాచారం చేశారు. ఆ బీటెక్ విద్యార్థులిద్దరూ తమకు తెలుసని, అయితే తమకు మంచినీళ్లలో డ్రగ్స్ కలిపి ఇచ్చి ఆ తర్వాత అత్యాచారం చేశారని మహిళలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరోజు రాత్రి తమకు ఉండేందుకు బస చూపించాలని కోరగా, సరేనన్న వాళ్లు ముందుగా మంచినీళ్లు ఇచ్చారని, అవి తాగి తాము స్పృహ కోల్పోయిన తర్వాత తమపై అత్యాచారం చేసి, అక్కడినుంచి వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాతిరోజు ఉదయం వాళ్లిద్దరూ స్పృహ కోల్పోయి పడి ఉండగా ఒక సెక్యూరిటీ గార్డు చూడటంతో వాళ్లను ఆస్పత్రికి తరలించినట్లు ఐఐటీ గువాహటి అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విద్యార్థులిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను అరెస్టు చేసేందుకు తగిన సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూస్తామని ఐఐటీ ప్రతినిధి చెప్పారు.
Advertisement
Advertisement