iit guwahati
-
మన చదువుకు కీర్తి కిరీటం!
అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులీనుతున్న వైనాన్ని వరసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ (క్వాక్వరెలీ సైమండ్స్) జాబితా నిరూపించింది. బుధవారం ప్రకటించిన ఆ జాబి తాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో 20వ ర్యాంకు సాధించి తనకెవరూ సాటిలేరని నిరూపించింది. వామపక్ష భావజాలం బలంగావున్న విద్యాసంస్థగా ముద్ర వున్న జేఎన్‌యూ ప్రతియేటా విద్యాప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తోంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంకు, బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలోనూ వున్నాయి. డేటా సైన్స్‌లో, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో గువాహటి ఐఐటీ క్యూఎస్ జాబితాలో చోటు సంపాదించుకుంది. పరిశోధనా రంగంలో మన దేశం నాలుగో స్థానంలో వుండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనం బ్రిటన్ను అధిగమించటం గమనించదగ్గది. ఒకప్పుడు మన పరిశోధనలకు పెద్ద విలువుండేది కాదు. రెండేళ్లుగా ఈ ధోరణి మారడం మంచి పరిణామం. క్యూఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైనది. 96 దేశాల్లోని 1,559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలావున్నవో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు క్యూఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యాసంస్థలు వాటిని గమనిస్తే మన విద్యావ్యవస్థ ఎంతోకొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్య క్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలావున్నదో అంతర్జాతీయంగా భిన్నరంగాల్లో నిష్ణాతులైనవారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీనుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలూ, సామర్థ్యమూ ఎలావున్నాయో వివిధ కంపెనీలనూ, సంస్థలనూ అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరా తీస్తారు. అధ్యాపకుల ప్రమాణాలతోపాటు అధ్యాపకవర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యంవున్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారన్నది లెక్కేస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభావ్యుత్పత్తులు సాటిలేనివన్న ఖ్యాతి వుండేది. ఐటీరంగంలో మనవాళ్ల బుద్ధికుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖ లాలు కనబడుతూనే వున్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో మన విశ్వవిద్యాల యాలు వెనకబడివుండేవి. ఆ కొలమానాలు, అందుకనుసరించే పద్ధతులు సక్రమంగా వుండవనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవటం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా వుండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మన గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యాసంస్థలందించే విద్య ఎలావున్నదో తులనాత్మక అధ్యయనం చేయటంవల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో వున్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకెళ్లే విద్యార్థులకు మాత్రమే కాదు... పరిశోధకులకూ ప్రయోజనకారిగా వుంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. అయితే సంపన్న, వర్ధమాన దేశాల విశ్వవిద్యాలయాల మధ్య పోటీ పెట్టడం ఎంత మాత్రమూ సరైంది కాదన్న వాదనలు ఎప్పటినుంచో వున్నాయి. పరిశోధనలకూ లేదా పరికల్పనలకూ సంపన్న దేశాల్లో ప్రభుత్వాలనుంచీ, ప్రైవేటు వ్యక్తులనుంచీ నిధుల రూపంలో అందే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇక్కడ అది చాలా అరుదు. మన విశ్వవిద్యాలయాలు వెనకబడి వుండటానికి అదొక కారణం. ఇక ఇతర విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని తొలి యూపీఏ ఏలుబడిలో 2005లో దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ–గాట్స్ సంభాషణల్లో సూత్రప్రాయంగా అంగీకరించిన పర్యవసానంగా ఇతర రంగాలతోపాటు విద్య కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విదేశీ వర్సిటీలకు మన దేశం తలుపులు తెరిచింది. 2017లో నైరోబీలో జరిగిన డబ్ల్యూటీఓ సమావేశంలో ఎన్డీఏ సర్కారు సంతకం చేశాక 62 ఉన్నత విద్యాసంస్థలకు ‘ఆర్థిక స్వయంప్రతిపత్తి’ మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించటమే. పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవటం నిరుపేద వర్గాలకు కష్టమవుతోంది. దానికితోడు అధ్యాపక నియామకాల్లోనూ, మౌలిక సదుపాయాలు కల్పించటంలోనూ ప్రభుత్వాలనుంచి మద్దతు కొరవడుతోంది. ఏతావాతా చాలా విశ్వవిద్యాలయాలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. ఇప్పుడు ఉన్నత శ్రేణి ర్యాంకులు పొందిన విద్యాసంస్థలకు దీటుగా ఇతర సంస్థలను కూడా తీర్చిదిద్దకపోతే, అన్ని వర్గాలకూ అందుబాటులోకి రాకపోతే ‘స్కిల్ ఇండియా’ వంటివి నినాదప్రాయమవుతాయని పాలకులు గుర్తించాలి. ఉన్నత విద్యను అందుకోవాలనుకునే పేద వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ విధానం కింద దేశంలోనే కాదు... అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల్లో సీటు సంపాదించుకునేవారికి సైతం భారీ మొత్తాల్లో ఫీజులు చెల్లించటానికి సిద్ధపడుతోంది. వారు చదువుకునే కాలంలో అయ్యే వ్యక్తిగత ఖర్చు కూడా భరిస్తోంది. ఈ మాదిరి విధానం ఇతర రాష్ట్రాల్లో లేదు. క్యూఎస్ ర్యాంకుల జాబితా ఇలాంటి అంశాలపై పాలకులు దృష్టి సారించేలా చేయగలిగితే, లోపాలను సరిదిద్దగలిగితే అది మన విద్యా, వైజ్ఞానిక రంగాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం (నేడు) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ గౌహతి నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఉదయం సెషన్ ఉ.9 నుంచి మ.12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ పరీక్ష మ.2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు.. 2021లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.6 లక్షల మంది, 2022లో 1.7 లక్షల మంది రిజిస్టర్ కాగా.. ఈసారి మరో 20వేల మందికి పైగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య 25 శాతం వరకు పెరిగినట్లు ఐఐటీ గౌహతి విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపు 50వేల మంది వరకు అభ్యర్థులు ఉండనున్నారు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా. మెయిన్ 2 సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్ష రాశారు. ఇందులో కటాఫ్ మార్కులు సాధించిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించారు. బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులుంటేనే.. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉండేది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు సరిగా నిర్వహించని సమయంలో ఈ నిబంధన నుంచి రెండేళ్లుగా మినహాయింపునిచ్చారు. ఇప్పుడా పరిస్థితులు చక్కబడడంతో ఈసారి బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించడాన్ని మళ్లీ పునరుద్ధరించారు. అలాగే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆన్లైన్ మోడ్ (కంప్యూటర్ బేస్డ్)లో నిర్వహించనున్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్ల పరీక్షలూ రాయాల్సి ఉంటుంది. మరోవైపు.. జేఈఈ అడ్వాన్స్డ్–2023 సిలబస్‌లో పలు మార్పులు చేశారు. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా బోర్డు పరీక్షల్లో ఉండే ఎన్సీఈఆర్టీ సిలబస్‌లోని అంశాలను ఎక్కువగా పొందుపరిచారు. జేఈఈ మెయిన్‌లోనూ ఇవే అంశాలు ఉండగా కొంత లోతైన తీరులో అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నల సరళి ఉండనుంది. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు బోర్డు పరీక్షలు, ఇటు మెయిన్ పరీక్షలతో పాటు అడ్వాన్స్డ్ పరీక్షలకు ఒకేరకమైన సిలబస్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఒత్తిడికి గురవ్వకుండా ఉండేలా ఈ సిలబస్‌లో మార్పులు చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐఐటీ గౌహతి సంస్థ అడ్మిట్ కార్డులలో వివరంగా పొందుపరిచింది. మే 29న అడ్వాన్స్డ్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను పొందుపరిచింది. ఈనెల 4వరకు వీటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘ఒక్క నిమిషం’ నిబంధన అమలు ► అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలని నిర్వహణ సంస్థ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించరు. ► అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, అధికారిక ఫొటో ఐడీ కార్డును విధిగా తీసుకురావాలి. ► అడ్మిట్‌కార్డు జిరాక్సు కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్ కాపీని తమ వద్దనే భద్రపరచుకోవాలి. ► అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలుని శుభ్రం చేసుకోవాలి. ► అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. ► అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్ వస్త్రాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. ► బాల్‌పాయింట్ పెన్నును వినియోగించాలి. ► పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఇతర డిజిటల్ వాచీలు, పరికరాలను అనుమతించబోరు. ► అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
ఐఐటీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ.. తగ్గనున్న ఎలక్ట్రికల్ వాహన ధరలు!
IIT Researchers Develop New Tech: కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న రంగం ఏదైనా ఉంది అంటే? అది, ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. ఈ రంగంలో తమ మార్క్ చూపించేందుకు దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు, ఐఐటీ విశ్వవిద్యాలయాలు పోటీ పడుతున్నాయి. తాజాగా మన దేశంలోని రెండు ప్రముఖ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఆన్-బోర్డ్ ఛార్జర్ టెక్నాలజీలో సగం ఖర్చు అవుతుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల్లో ఒక కంపెనీ ఈ కొత్త టెక్నాలజీపై ఆసక్తి చూపినట్లు పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ టెక్నాలజీ వినియోగించడానికి, పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ బృందం పేర్కొంది. ఐఐటీ గౌహతి & ఐఐటీ భువనేశ్వర్ నిపుణులతో కలిపి వారణాసిలోని ఐఐటి(బిహెచ్‌యు) వద్ద ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. "దేశంలో పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధర పెరగడం, కాలుష్య స్థాయి అసాధారణ రీతికి పెరగడం మధ్య, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు) సంప్రదాయ ఐసీ వాహనలకు ఉత్తమ ప్రత్యామ్నాయం. కానీ, అధిక ధరల వల్ల వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు " అని ఐఐటీ బిహెచ్‌యు చీఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ రాజీవ్ కుమార్ సింగ్ అన్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఖర్చు దాదాపు 40-50 తగ్గుతుందని సింగ్ వివరించారు. దీనివల్ల అంతిమంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. (చదవండి: బేర్ దెబ్బకు కుదేలైన దలాల్ స్ట్రీట్.. ఒక్కరోజులో రూ.10లక్షల కోట్లు ఆవిరి) -
ఐఐటి గువహతి పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సురక్షితంగా సమాచారాన్ని బదిలీ చేసే సాంకేతిక వ్యవస్థను ఐఐటి గువహతి భౌతిక శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ బోసంతా రంజన్ బోరువా మరియు అస్సాంలోని అభయపురి కళాశాల భౌతిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతను కొన్వర్ నేతృత్వంలోని పరిశోధనా బృందం అభివృద్ధి చేసింది. "ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్"గా పిలుస్తున్న ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా 'వాయిస్, టెక్స్ట్ లేదా ఇమేజ్' రూపంలో ఉన్న సమాచారాన్నిఎలాంటి అవాంతరాలు లేకుండా పంపించవచ్చని పరిశోధనా బృందం తెలిపింది. సమాచార బదిలీ కోసం ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కాకుండా కాంతిని ఉపయోగించి ప్రసారం ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇది రాబోయే కొత్త తరం కమ్యూనికేషన్ టెక్నాలజీని సూచిస్తుంది అని పేర్కొన్నారు. వీటి ఫలితాలు ఇటీవల కమ్యూనికేషన్స్ ఫిజిక్స్‌లో ప్రచురించబడ్డాయి. (చదవండి: ప్లే స్టోర్ నుంచి మరో ఐదు యాప్స్ తొలగింపు) గత రెండు దశాబ్దాలుగా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్లో అసాధారణ పరిస్థితుల కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన చాలా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డేటాను ఎన్కోడ్ చేయడానికి "వోర్టెక్స్ బీమ్" అని పిలువబడే ఒక రకమైన కాంతి పుంజాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వాతావరణంలో మార్పులు, గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటే కొంత సమాచారం నష్టపోయే ప్రమాదమున్నదని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి, ఐఐటి గువహతి పరిశోధకులు ఫ్రీ-స్పేస్ వ్యవస్థ ద్వారా సమాచారం నిక్షిప్తమైన కాంతి కిరణాన్ని ‘జెర్నిక్ పద్ధతి’ (ఆర్థోగోనల్గా కాంతిని ప్రసరింపజేయడం)లో పంపిస్తామని వివరించారు. తాము అభివృద్ధి చేసిన వ్యవస్థ ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాచార మార్పిడి జరుగుతుందని వెల్లడించింది. -
కరోనా వ్యాప్తిపై కొత్తలెక్క!
సాక్షి, హైదరాబాద్ : కరోనా విస్తరణకు సంబంధించి ప్రస్తుతమున్న అంచనాలు, అధ్యయన పద్ధతులను క్రోడీకరిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గువాహటి కొత్త అధ్యయన విధానాన్ని రూపొందించింది. కరోనా విస్తరణను రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఆధారంగా (డీఐఆర్) ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఈ రకమైన లెక్కల ద్వారా కరోనా విస్తరణను శాస్త్రీయంగా అంచనా వేయడం సాధ్యం కాదని ఐఐటీ గువాహటి భావిస్తోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని డ్యూక్–ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సహకారంతో కొత్త విధానాన్ని రూపొందించింది. కరోనా విస్తరణ వేగం (ఎక్స్పొనెన్షియల్ మోడల్), ఒక చోట నుంచి మరో చోటకు ఎలా వ్యాపిస్తోంది (లాజిస్టిక్ గ్రోత్), ఏ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది వంటి అంశాలతో పాటు డీఐఆర్ డేటాను ఆధారంగా చేసుకుని కొత్త విధానం రూపొందించారు. (3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం) డీఐఆర్ ఆధారంగా అంచనాలు కరోనా డెయిలీ ఇన్ఫెక్షన్ రేట్ (డీఐఆర్) ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండగా, డీఐఆర్ ఆధారంగా రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తున్నారు. గత 2 వారాలుగా డీఐఆర్ పెరుగుతూ ఉంటే ఎక్కువ ‘తీవ్రమైన’(సివియర్).. డీఐఆర్ రెండు వారాలుగా స్థిరంగా ఉంటే ‘మోస్తరు’(మాడరేట్), రెండు వారాలుగా తగ్గుతూ ఉంటే నియంత్రిత (కంట్రోల్డ్)గా పరిగణిస్తున్నారు. డీఐఆర్ ఆధారంగా కాకుండా ఐఐటీ గువాహటి పరిశోధకుల విశ్లేషణ ప్రకారం లాజిస్టిక్ గ్రోత్‌ను ఆధారంగా చేసుకుంటే.. వచ్చే నెల రోజుల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని, ఎక్స్పొనెన్షియల్ మోడల్ పరంగా చూస్తే పరిస్థితి మరింత దిగజారుతోందని తేలింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తుండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా డీఐఆర్ సగటును 0.10గా తీసుకుని మే 1న రాష్ట్రాల వారీగా నమోదైన కేసుల సంఖ్యను ఆధారంగా తీసుకుని లెక్కలు వేస్తే శాస్త్రీయమైన ఫలితాలు రావట్లేదు. రాష్ట్రాల వారీగా అంచనాలు రాష్ట్రాల వారీగా డీఐఆర్ విలువ ఆధారంగా లాజిస్టిక్, లాజిస్టిక్– ఎక్స్పొనెన్షియల్, ఎక్స్పొనెన్షియల్ పద్ధతుల్లో మే 31 నాటికి కరోనా పరిస్థితిని ఐఐటీ గువాహటి పరిశోధకులు అంచనా వేశారు. నమోదయ్యే కేసుల సంఖ్యను వివిధ పద్ధతుల్లో అంచనా వేస్తూ, కరోనా వేగంగా విస్తరిస్తే మహారాష్ట్రలో 2 లక్షలు, గుజరాత్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యే అవకాశముందని తేలింది. -
కరోనా : ఐఐటీ విద్యార్థుల నూతన ఆవిష్కరణ
గువాహటి (అసోం) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐఐటీ గువాహటి విద్యార్థులు పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని వారికి పనికి వచ్చేలా తక్కువ ఖర్చుతో ఇంట్యూబేషన్ బాక్స్‌లకు రూపకల్పన చేశారు. ఇంట్యూబేషన్ అంటే ఎండో ట్రాషియల్ ట్యూబ్ అనే ఓ గొట్టాన్ని నోటి ద్వారా వాయునాళం గుండా పంపిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నసమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈ బాక్స్‌లను పేషెంట్ తలపై భాగంలో అమర్చుతారు. దీంతో అతడి తుంపరల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ బాక్సులు ఉపయోగపడతాయి. దీని వల్ల పేషెంట్ పక్కనున్నవారికి, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని సులభంగా తయారు చేసే వీలుండటమే కాకుండా, వివిధ ప్రాంతాలకు సులువుగా సరఫరా చేసే అవకాశం ఉంది. ఒక ఇంట్యూబేషన్ బాక్స్ తయారు చేయడానికి దాదాపు 2వేల రూపాయలు ఖర్చుఅవుతుందని అంచనా వేశారు. అంతే కాకుండా ఈ ఇంట్యూబేషన్ బాక్స్‌లను శుభ్రపరిచి తిరిగి వాడుకోవొచ్చు. ఇంట్యూబేషన్ బాక్స్‌ల తయారీకి ఐఐటీ గువాహటీ విద్యార్థులు విరాళాల కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం 6 గంటల్లోనే రూ. 50 వేలు విరాళంగా సమకూరాయి. వీరు తయారు చేసిన ఇంట్యూబేషన్ బాక్స్‌లను ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. -
కరోనా రోగులకు రోబోలతో సేవలు..
ముంబై : కోవిడ్-19 రోగులకు సేవలందించేందుకు ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు రెండు రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. కరోనా పాజిటివ్ రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడం వంటి పనులను ఈ రోబోలు చేపడతాయి. ఐసోలేషన్ వార్డుల్లో వైద్య సిబ్బందికి వైరస్ ముప్పును తగ్గించేందుకు రోబోలు ఉపకరిస్తాయని ఐఐటీ గౌహతికి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ర్టిక్ ఇంజనీరింగ్ విభాగాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రి అవసరాలకు తగిన విధంగా కరోనా రోగులకు ఆహారం, మందులు అందించే రోబోతో పాటు ఐసోలేషన్ వార్డుల్లో వైరస్ వ్యాప్తి చెందే రిస్క్ పొంచి ఉన్న వ్యర్థాల సేకరణ కోసం మరో రోబోను అభివృద్ధి చేయడంపై కసరత్తు చేస్తున్నామని గౌహతి ఐఐటీ టీం ప్రతినిధులు వెల్లడించారు. రెండు వారాల్లో ఈ రోబోలకు సంబంధించిన నమూనాలు తయారవుతాయని, అనంతరం సంస్థ ఆస్పత్రిలో, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే సెంటర్ ఆఫ్ నానోటెక్నాలజీలో టెస్ట్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. ఇవి పూర్తయిన తర్వాత రోబో ఆధారిత స్క్రీనింగ్ యూనిట్ల తయారీని కూడా చేపట్టే ప్రణాళికలున్నాయని పేర్కొన్నారు. వైరస్‌ను గుర్తించి, చికిత్స అందించేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ఉపకరించే రీతిలో కోవిడ్-19 విశ్లేషణ కోసం ఆధునిక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఐఐటీ గౌహతి సంసిద్ధమైంది. చదవండి: కరోనా వ్యాప్తి: ఐరాస సిబ్బందికి పాజిటివ్! -
నిలకడగా ఉన్న నీటితోనూ విద్యుత్తు!
గువాహటి: ఇళ్లల్లో, వీధుల్లో, పల్లెల్లో, పట్టణాల్లోనూ కనిపించే అతి సాధారణ దృశ్యమేది? జల వనరులు! కుండల్లో, కుంటల్లో, చెరువుల్లో ఇలా అన్నిచోట్ల నిలకడగా ఉండే నీరు కనిపిస్తూనే ఉంటుంది. ప్రవహించే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు ఉండగా.. నిలకడగా ఉన్న నీటితోనూ కరెంటు పుట్టించే అవకాశమేర్పడింది. ఇందుకు అవసరమైన వినూత్నమైన పదార్థాలను ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేయడం దీనికి కారణం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పదార్థాలను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ చిన్న స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలగడం. ఏసీఎస్ అప్లైడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. పదార్థాల ధర్మాలు స్థూల ప్రపంచంలో ఒకలా.. సూక్ష్మ ప్రపంచంలో మరోలా ఉంటాయని నానో టెక్నాలజీ గతంలో తేల్చింది. నానోస్థాయిలో వ్యక్తమయ్యే ఇలాంటి ధర్మమే ‘ఎలక్ట్రో కైనెటిక్ స్ట్రీమింగ్ పొటెన్షియల్’. ఈ ధర్మాన్ని వాడి ఇంటి నల్లాల్లో ప్రవహిస్తున్న నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. ‘కాంట్రాస్టింగ్ ఇంటర్‌ఫేషియల్ ఆక్టివిటీస్’అనే మరో నానోస్థాయి ధర్మం ఆధారంగా సిలికాన్ వంటి అర్ధవాహకాలను ఉపయోగించుకుని నిలకడగా ఉన్న నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని చెబుతున్నారు. ముప్పు ముంచుకొస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభిృవృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతి వినూత్నమైనదీ.. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించనిది. ‘విద్యుత్తు చార్జ్ ఉన్న సూక్ష్మస్థాయి కాలువల్లాంటి నిర్మాణాల ద్వారా ద్రవాలు ప్రవహిస్తున్నప్పుడు వోల్టేజీ ఉత్పత్తి అవుతుంది. అతిసూక్ష్మమైన జనరేటర్లను తయారుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కళ్యాణ్ రైడోంగియా తెలిపారు. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చాలా తక్కువ కావడంతో ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు. నానోస్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా తాము మునుపటి సమస్యలను అధిగమించగలిగామని, విద్యుదుత్పత్తిని వేలరెట్లు ఎక్కువ చేయవచ్చునని తాము గుర్తించామని కళ్యాణ్ వివరించారు. నిలకడగా ఉన్న నీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు తాము గ్రాఫీన్ పెచ్చులతో పరికరాలను తయారు చేశామని, దీన్ని నీటిలో ముంచడం ఆలస్యం... విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గ్రాఫీన్‌లో మార్పులు చేసి తాము ఫిల్టర్ పేపర్లపై ఏర్పాటు చేశామని, వీటికి నీరు తాకినప్పుడు సుమారు 570 మిల్లీ వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి అయిందని వివరించారు. -
అయిదింట్లో మూడు జిల్లాలు.. కరువును ఎదుర్కోలేవు..!
దేశంలోని 60 జిల్లాలు దుర్భిక్షపరిస్థితులను తట్టుకోలేవు...ప్రతీ అయిదు జిల్లాల్లో మూడు కరువును ఎదుర్కొనే స్థితిలో లేవు...మొత్తం 634 జిల్లాల్లో 241 మాత్రమే దుర్భిక్షం నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలున్నాయి.... ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావం మనదేశంపైనా పడుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది కరువు కారణంగా వివిధ రాష్ట్రాలు తీవ్రమైన సమస్యల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను పకడ్బందీగా ఎదుర్కునేందుకు మరింత మెరుగైన వ్యవసాయ, నీటి నిర్వహణ పద్ధతులను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఇటీవల ఐఐటీ ఇండోర్, గువహటి పరిశీలనలో వెల్లడైంది. ఇటీవల . కరువు పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంగా పర్యావరణ వ్యవస్థలోని ఉత్పాదకతను కాపాడే చర్యలు చేపట్టకపోతే ఆహారభద్రతకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇదీ అధ్యయనం... నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కి చెందిన మోడరేట్ రెసల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియో మీటర్ సెన్సర్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఐఐటీ ఇండోర్, గువహటి ఈ అధ్యయనానికి ఉపయోగించారు. ఈ డేటా ద్వారా 2002014 మధ్యకాలానికి ’హై రెసల్యూషన్ ఎకోసిస్టమ్ రిసిలియన్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా’ రూపొందించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 6.955 వర్ష గణనకేంద్రాల (భారత వాతావరణ శాఖ పరిధిలోని) నుంచి 19012015 మధ్యకాలంలో రోజువారి వర్షపాత గణాంకాలు పరిశీలించారు. ఈ అధ్యయనం సందర్భంగా కరువు ఏర్పడిన సంవత్సరంలో దేశంలోని 68 శాతం ప్రాంతం సాగు సంబంధిత అంశాలకు ఏమాత్రం సహాయకారిగా అందించలేదని తేలింది. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పరిశీలనలో పదిరాష్ట్రాలు మాత్రమే 50 శాతం మేర ఈ పరిస్థితులను తట్టుకునే స్థితిలో ఉన్నట్టు వెల్లడైంది. రాజస్థాన్, చత్తీస్గడ్లలోని అన్ని జిల్లాలు దుర్భిక్షాన్ని ఏ మాత్రం తట్టుకోలేని విధంగా ఉంటే సిక్కింలోని నాలుగుజిల్లాలు తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. గతేడాది ఐఐటీ గువహటి నిర్వహించిన మరోసర్వేలో దేశంలోని నాలుగు నదీపరీవాహక ప్రాంతాల్లో ఒకటి మాత్రమే (మొత్తం 22 బేసిన్లలో ఆరుమాత్రమే) కరువు సందర్భంగా పంటలతో పాటు పచ్చదనానికి తగిన సహకారాన్ని అందించగలిగినట్టు తెలిసింది. 2016లో ఐఐటీ గాంధీనగర్, కాన్పూర్ సంయుక్త అధ్యయనంలో గత కొన్నేళ్లుగా కరువు పరిస్థితులు పెరగడంతో తీవ్రత కూడా పెరుగుతున్నట్టు, గంగానది మైదాన ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, దక్షిణ భారత తీరప్రాంతాల వైపు ఇవి కదులుతున్నట్టు వెల్లడైంది. పుణేలోని భారత వాతావరణ 2014లో జరిపిన విశ్లేషణ మేరకు దేశంలోని మొత్తం 103 వాతావరణ కేంద్రాల్లో 57 మార్చిజులై మధ్యలో వడగాల్పులు రికార్్డ చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలు ఏ మేరకు కరువు తట్టుకునేంత స్థాయిలో ఉన్నాయన్న దానిపై చేసిన పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలోని జిల్లాల్లో ఎక్కడైతే అడవులు, పచ్చదనం శాతం ఎకు్కవగా ఉందో ఆయా ప్రాంతాల్లోనే దుర్భిక్షాన్ని తట్టుకునే పరిస్థితులున్నాయని ఈ అధ్యయనంలో మరోసారి రుజువైంది. ఐఐటీ ఇండోర్, గువహటి బృందం ’డిస్ట్రిక్ట్లెవల్ అసెస్మెంట్ ఆఫ్ ఎకోహైడ్రోలాజికల్ రిసిలీయెన్స్ టు హైడ్రోక్లైమాటిక్ డిస్టర్బెన్సన్ అండ్ ఇట్స్ కంట్రోలింగ్ ఫాక్టర్స్ ఇన్ ఇండియా’ శీర్షికతో తమ అధ్యయనాన్ని ఇటీవల హైడ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. -
ఐఐటీల్లో 34 శాతం అధ్యాపకుల కొరత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు. ఏడాదికేడాది ఆ సంస్థల్ని విస్తరిస్తూ పోతున్న కేంద్ర ప్రభుత్వం అందులో అధ్యాపకుల నియామకంపై దృష్టి పెడుతున్నట్టుగా లేదు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉంటే అన్ని సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య అధ్యాపకుల కొరత. అన్ని సంస్థల్లో కలిపి మొత్తంగా చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 34 శాతం అధ్యాపకుల కొరత పట్టిపీడిస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థులకు పాఠం చెప్పేవాళ్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పాలక్కడ్, తిరుపతి, గోవా వంటి కొత్తగా ఏర్పాటైన ఐఐటీల్లోనే కాదు ఎంతో ఘనతవహించిన ముంబై, ఖరగపూర్, కాన్పూర్ వంటి సంస్థల్లోనూ ఇదే దుస్థితి. ఎప్పట్నుంచో ఉన్న ఈ పాత సంస్థల్లోనే అధ్యాపకుల కొరత 25 శాతం నుంచి 45శాతం వరకు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఏ ఐఐటీలో అధ్యాపకుల కొరత ఎంత? ఐఐటీ–గోవా 62 % ఐఐటీ–భిలాయ్ 58 % ఐఐటీ–ధర్వాడ్ 47 % ఐఐటీ–ఖర్గపూర్ 46 % ఐఐటీ–కాన్పూర్ 37 % ఐఐటీ–ఢిల్లీ 29 % ఐఐటీ–చెన్నై 28 % ఐఐటీ–ముంబై 27 % ఎందుకీ పరిస్థితి ? ఐఐటీల్లో ఫాకల్టీ కొరత కొత్త సమస్యేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుల కొరత, సదుపాయాల లేమితో ఐఐటీల ప్రతిష్ట మసకబారుతోంది. ఐఐటీల్లో డిగ్రీలు తీసుకుంటున్న వారు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లిపోతున్నారే తప్ప, తిరిగి ఆ సంస్థల్లో ఫాకల్టీగా చేరుదామని అనుకోవడం లేదు. ఒకప్పుడు ఐఐటీలో విద్యాభ్యాసం చేసినవారిలో 15 శాతం మంది అదే సంస్థల్లో అధ్యాపకులగా చేరేవారు. కానీ ఇప్పుడది గణనీయంగా తగ్గిపోయింది. ఐఐటీ విద్యార్థుల్లో 50శాతం మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిపోతూ ఉంటే మిగిలిన వారిలో అత్యధిక శాతం భారత్‌లోని ప్రైవేటు కంపెనీల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అధ్యాపక వృత్తి పట్ల యువతరంలో ఆకర్షణ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రప్రభుత్వం అందులో మౌలిక సదుపాయాలపై మాత్రం దృష్టి సారించడంలేదు. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఐఐటీలను మంజూరు చేస్తూ ఉండడంతో బోధనా నైపుణ్యం కలిగిన అధ్యాపకులెవరూ అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ‘కర్ణాటకలోని ధర్వాడ్ వంటి పట్టణాల్లో సదుపాయాలే ఉండవు. పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైనవి లేని పట్టణాలకు నైపుణ్యం కలిగిన బోధకులు ఎందుకు వస్తారు’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి ? ఐఐటీల్లో అధ్యాపకుల కొరత అధిగమించడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీలో ఒక నియామకం జరగాలంటే ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ఐఐటీల సంఖ్యమాత్రమే పెంచితే సరిపోదు. అధ్యాపకుల్ని ఆకర్షించేలా వేతనాలు పెంచడం, గ్యాడ్యుయేషన్‌తో చదువు ఆపేయకుండా విద్యార్థులు పీహెచ్డీ చేసేలా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ కొరతని అధిగమించగలం’ అని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐటీల్లోకి ఫారెన్ ఫాకల్టీని కూడా తీసుకురావడానికి వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు పదవీవిరమణ చేసిన అధ్యాపకుల్ని తిరిగి తీసుకోవడం, ఉన్నవారికి మరి కొన్నేళ్లు పదవీకాలం పొడిగింపు వంటి చర్యలు కూడా తీసుకోనుంది. ఏదిఏమైనా ఐఐటీల ప్రతిష్ట మరింత మసకబారకుండా కేంద్రమే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐఐటీ విద్యార్థులపై అత్యాచారం కేసు
ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ గువాహటిలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను అత్యాచారం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమానికి వేరే సంస్థ నుంచి వచ్చిన ముగ్గురు మహిళలపై వాళ్లు అత్యాచారం చేశారు. ఆ బీటెక్ విద్యార్థులిద్దరూ తమకు తెలుసని, అయితే తమకు మంచినీళ్లలో డ్రగ్స్ కలిపి ఇచ్చి ఆ తర్వాత అత్యాచారం చేశారని మహిళలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోజు రాత్రి తమకు ఉండేందుకు బస చూపించాలని కోరగా, సరేనన్న వాళ్లు ముందుగా మంచినీళ్లు ఇచ్చారని, అవి తాగి తాము స్పృహ కోల్పోయిన తర్వాత తమపై అత్యాచారం చేసి, అక్కడినుంచి వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాతిరోజు ఉదయం వాళ్లిద్దరూ స్పృహ కోల్పోయి పడి ఉండగా ఒక సెక్యూరిటీ గార్డు చూడటంతో వాళ్లను ఆస్పత్రికి తరలించినట్లు ఐఐటీ గువాహటి అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విద్యార్థులిద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను అరెస్టు చేసేందుకు తగిన సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూస్తామని ఐఐటీ ప్రతినిధి చెప్పారు. -
23న జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన
ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపునకు షెడ్యూల్ విడుదల 24 నుంచి ఆప్షన్లు.. 30న తొలివిడత సీట్ల కేటాయింపు వె బ్‌సైట్‌లో వివరాలను వెల్లడించిన ఐఐటీ గువాహటి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శనివారం ఐఐటీ గువాహటి ప్రకటించింది. ఈ నెల 23న జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 24 నుంచి కళాశాలలను, కోర్సులను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. 30న తొలిరౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. తొలిరౌండ్ లో సీటు ఆమోదం కోసం 4 లేదా ఐదు రోజులు గడువు ఇస్తారు. ఆపై ఒకరోజు తర్వాత రెండోరౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం నాలుగు రౌండ్లలో సీట్ల కేటాయింపునకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం 22 ఐఐటీలు, ఒక ఐఎస్ఎం, 31 ఎన్ఐటీలు, 18 ఐఐఐటీలు, మరో 18 కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థ ల్లో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) నిర్ణయించిందని ఐఐటీ గువాహటి వెల్లడించింది. షెడ్యూల్ ఇదీ.. జూన్ 23న: జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకుల ప్రకటన 24 నుంచి 28 వరకు: ఆప్షన్ల ప్రక్రియ 27న : సీట్ల కేటాయింపు నమూనా ప్రదర్శన 30న : తొలిరౌండ్ సీట్ల కేటాయింపు -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: గత నెల 22న జరిగిన జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువాహటి ప్రకటించింది. ప్రాథమిక్ ‘కీ’ పై అభ్యంతరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 7వరకు స్వీకరిస్తారు. జూన్ 12న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఫలితాలను ప్రకటించనున్నారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో బయోమెట్రిక్
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సమయంలో విద్యార్థులందరి బయోమెట్రిక్ డాటాను సేకరించేందుకు ఐఐటీ గౌహతి నిర్ణయించింది. ఈనెల 22న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే పేపరు-1 పరీక్షకు హాజరయ్యే వారు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారు మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష హాల్లో రిపోర్టు చేయాలని వెల్లడించింది. పరీక్ష నిర్ణీత సమయానికి మించి ఆలస్యం అయితే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వాచీలను కూడా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని పేర్కొంది. ఫుల్ షర్ట్, కోట్స్ వేసుకొని వస్తే అనుమతించరని వెల్లడించింది. ఆఫ్ షర్టులు, కుర్తాలు, టీషర్ట్స్ మాత్రమే అనుమతిస్తారని వివరించింది. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకురావాలని పేర్కొంది. క్యాల్కులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్నమెంట్స్ అనుమతించరని తెలిపింది. తమ వెబ్సైట్నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా లింకును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. -
మైనింగ్ ఇంజనీరింగ్‌కు బాలికలు అర్హులే
- జేఈఈ రివైజ్డ్ షెడ్యూల్ జారీ - ఈసారి నాలుగు కొత్త ఐఐటీల్లోనూ ప్రవేశాలు - 29 నుంచి దరఖాస్తులు - వచ్చే నెల 22న అడ్వాన్స్డ్ పరీక్ష - మహబూబ్‌నగర్, తిరుపతిలోనూ పరీక్ష కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ఐఐటీ గువాహటి జారీ చేసింది. ఈ నెల 29 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో బాలికలు కూడా అర్హులేనని ప్రకటించింది. ఈసారి పాత ఐఐటీలతోపాటు 4 కొత్త ఐఐటీల్లోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఐఐటీ ఛత్తీస్‌గఢ్, ఐఐటీ గోవా, ఐఐటీ కర్ణాటక, ఐఐటీ జమ్మూల్లోనూ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ, ఏపీలోని పాత కేంద్రాలతో పాటు మరో రెండు అదనంగా కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ , వరంగల్‌లో పరీక్ష కేంద్రాలుండగా, మహబూబ్‌నగర్‌లో అదనంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక ఏపీలో విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించగా, ఇప్పుడు తిరుపతిలోనూ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 102 రకాల కోర్సుల్లో ప్రవేశాలు చేపడతామని వెల్లడించింది. జేఈఈ మెయిన్ ఫలితాల్లో అత్యధిక స్కోర్ సాధించిన టాప్ 2 లక్షల మందిలో ఏ కేటగిరీలో ఎందరిని తీసుకుంటారనే వివరాలను తెలిపింది. ఇక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో) కార్డు కలిగిన వారు జనరల్, ఓపెన్ కేటగిరీ సీట్లకు కూడా అర్హులేనని ప్రకటించింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే వారు సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని ఐఐటీ గువాహటి పేర్కొంది. ఇందులో ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) వారిని 27 శాతం, ఎస్సీలను 15 శాతం, ఎస్టీలను 7.5 శాతం, ఓపెన్ కేటగిరీలో 50.5 శాతం మందిని తీసుకుంటామని వెల్లడించింది. వీటి ప్రకారం ఓపెన్ కేటగిరీలో 1,01,000 మంది, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 54 వేల మంది, ఎస్సీల్లో 30 వేల మంది, ఎస్టీల్లో 15 వేల మందిని ఎంపిక చేస్తారు. పరీక్ష ఫీజు కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.1000, ఇతర అభ్యర్థులు రూ.2 వేలు, దుబాయిలో పరీక్ష కేంద్రం కావాలనుకునే వారు 220 అమెరికా డాలర్లు చెల్లించాలి. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే 70 శాతం మార్కులు సాధించాలి. లేదా ఆ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. టాప్-20 పర్సంటైల్ నిర్ధారణకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఒక భాష, మరొక సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను తీసుకొని లెక్కిస్తారు. -
జేఈఈ పరీక్ష ప్రశాంతం
♦ 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష.. 27న ఫలితాలు ♦ అడ్వాన్స్డ్ కు అనుమతించే విద్యార్థుల సంఖ్యపై గందరగోళం ♦ టాప్ 2 లక్షల మంది విద్యార్థులని ప్రకటించిన గౌహతి ఐఐటీ ♦1.5 లక్షలే అని పేర్కొన్న సీబీఎస్ఈ ♦ ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 30న ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.07 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి 59,731 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆఫ్‌లైన్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన వారిలో 98 శాతం మంది విద్యార్థులు ఆదివారంనాటి ఎగ్జామ్‌కు హాజరైనట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వర్గాలు వెల్లడించాయి. ఇక ఆన్లైన్ పరీక్ష ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తారు. గతంతో పోల్చుకుంటే ఈసారి పరీక్షలో ప్రశ్నల సరళి కాస్త సులభంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఎప్పట్లాగే ఫిజిక్స్‌లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఇచ్చినట్లు వెల్లడించారు. అడ్వాన్స్‌డ్‌కు ఎందరు? ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతించే విద్యార్థుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. మే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనున్న గౌహతి ఐఐటీ.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతిస్తామని తెలిపింది. జేఈఈ మెయిన్ నిర్వహించిన సీబీఎస్ఈ మాత్రం తన బులెటిన్‌లో టాప్ 1.50 లక్షల మందినే అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. అడ్వాన్స్డ్ నిర్వహించే ఐఐటీ గౌహతి... ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించినందున ఆ సంఖ్యే ఫైనల్ అవుతుందని నిఫుణులు వెల్లడించారు. 27న జేఈఈ మెయిన్ ఫలితాలు... ఈ నెల 27న జేఈఈ మెయిన్ స్కోర్‌ను సీబీఎస్ఈ ప్రకటించనుంది. విద్యార్థులు ఈ నెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గౌహతి చర్యలు చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌లో భాగంగా మే 22న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడించి, జూన్ 20 నుంచి సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. మరోవైపు ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ 30న లేదా అంతకంటే ముందే జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను సీబీఎస్ఈ ప్రకటించనుంది. ఈ ర్యాంకుల ఖరారులో జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తారు. వాటి ఆధారంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలు చేపడతారు. జేఈఈలో ఫిజిక్స్ కఠినం జేఈఈ మెయిన్ పరీక్షలో ఈసారి ఫిజిక్స్ పేపర్ కొంత కఠినంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష మాత్రం సులభంగానే ఉందని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే గణితం తేలి గ్గానే ఉంది. చాప్టర్లు-వెయిటేజీకి సంబంధించి దాదాపు విద్యార్థుల అంచనాల ప్రకారమే ప్రశ్నలు వచ్చాయి. 16 ప్రశ్నలు డెరైక్ట్‌గా రాగా, 10 ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. 4 ప్రశ్నలు మాత్రం క్యాలిక్యులేషన్ నిడివి పరంగా పెద్దగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కటాఫ్ పెరిగే అవకాశముందని నిపుణలు అంచనా. పాఠ్యపుస్తకాల పరిధిలోనే ప్రశ్నలు.. గతేడాదితో పోలిస్తే కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ రకం ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా, ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాల పరిధిలోనే ప్రశ్నలు వచ్చాయి. 80-85 మార్కులు తెచ్చుకుంటే గట్టెక్కొచ్చని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్ల నుంచి క్రమేణా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజీ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ విభాగం ర్యాంకింగ్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 8, ఆర్గానిక్ నుంచి 10, ఇన్ఆర్గానిక్ నుంచి 12 ప్రశ్నలు వచ్చాయి. కాగా, గణితం, రసాయనశాస్త్రంతో పోలిస్తే ఫిజిక్స్ కాస్త కఠినంగానే ఉంది. కానీ గతేడాది ఫిజిక్స్ ప్రశ్నలతో పోలిస్తే ఈసారి కాస్త తేలిగ్గానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. పది ప్రశ్నలు ఎంసెట్ స్థాయిలోనే వచ్చాయి. సగటు విద్యార్థి 70 మార్కుల వరకు స్కోర్ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థి 100కు పైగా స్కోర్ చేయగలిగేలా ప్రశ్నపత్రం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో రెండు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నందున చాలా మంది విద్యార్థుల రాయలేదు. ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నవి మరో రెండు ప్రశ్నలు ఇచ్చారు. ఏపీలోనూ ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించినజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్-2016 పరీక్ష ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి అభ్యర్థుల మార్కుల స్కోరింగ్ బాగా పెరుగుతుందని, ఫలితంగా గతేడాది జేఈఈ అడ్వాన్సుకు 105గా ఉన్న కటాఫ్ మార్కులు కూడా పెరగనున్నాయని చెబుతున్నారు. -
ఆఫ్‌లైన్‌లోనే జేఈఈ అడ్వాన్స్డ్
♦ 2016 ప్రవేశాలకు పాత పద్ధతిలోనే పరీక్ష, ప్రవేశాలు ♦ జేఈఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల ♦ పూర్తిస్థాయి సిలబస్‌ను అందుబాటులో ఉంచిన గౌహతి ఐఐటీ ♦ ఏప్రిల్ 3న జేఈఈ మెయిన్ పరీక్ష, 27న ఫలితాలు ♦ ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు ♦ మే 11 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం, 22న పరీక్ష ♦ తెలంగాణ, ఏపీల్లో 5 కేంద్రాల్లో రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2016లో ప్రవేశాల కోసం ఈసారి ఆఫ్‌లైన్‌లోనే రాత పరీక్ష నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. అడ్వాన్స్‌డ్‌లో అబ్జెక్టివ్ విధానం రద్దు చేయాలన్న ఆలోచనలను పక్కనపెట్టింది. పాత పద్ధతిలోనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుందని వెల్లడి ంచింది. ఈ పరీక్షకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇదివరకే పూర్తిస్థాయి షెడ్యూలును తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన గౌహతి ఐఐటీ ఇప్పుడు సిలబస్, పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాల వివరాలు, పరీక్ష ఫీజు తదితర వివరాలను వెల్లడించింది. మరోవైపు జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 3న, ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అడ్మిషన్ నోటీసు జారీ చేసింది. అయితే అందులో ఫలితాల వెల్లడి తేదీని ప్రకటించలేదు. పూర్తిస్థాయి సమాచారాన్ని డిసెంబర్ 1న ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ప్రకటిస్తామని, అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా జేఈఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో జేఈఈ మెయిన్ పరీక్ష తేదీతోపాటు ఫలితాల ప్రకటన తేదీని కూడా వెల్లడించారు. జేఈఈ మెయిన్ ఫలితాలు ఏప్రిల్ 27న వెల్లడిస్తారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్లోని ప్రధానాంశాలివీ... ► జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు. వారు 2016 ఏప్రిల్ 29 నుంచి ఆన్లైన్లో (www.jeeadv.ac.in) మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 11 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం. ► అడ్వాన్స్డ్ మే 22న ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపరు-2 పరీక్ష. ఈ రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాలి. ఫలితాల వెల్లడి జూన్ 12న. ► పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమయ్యాక హాల్లోకి అనుమతించరు. ► అంధులకు గంట సమయం అదనంగా ఇస్తారు. ఇందుకోసం జేఈఈ అడ్వాన్స్డ్ చైర్మన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ►{పశ్నపత్రం ఇంగ్లిషు లేదా హిందీలో ఉంటుంది. విద్యార్థులు ఏ భాష అన్నది ముందుగానే ఎంచుకోవాలి. ► పరీక్ష ఫీజు కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ. 1,000, ఇతర అభ్యర్థులు రూ. 2 వేలు, దుబాయ్‌లో పరీక్ష కేంద్రం కావాలనుకునే వారు 220 అమెరికా డాలర్లు చెల్లించాలి. ► ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు 12వ తరగతి/ ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం మార్కులు సాధించాలి. లేదా ఆ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో టాప్ -20 పర్సంటైల్‌లో ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు తెలంగాణలో: హైదరాబాద్, వరంగల్ ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ. ఆబ్జెక్టివ్ రద్దు పక్కకు... ఆబ్జెక్టివ్ విధానం వల్ల ప్రశ్నపత్రంలో ఇచ్చే నాలుగు ఆప్షన్లలో (జవాబులు) ఏదో ఒక దానిని విద్యార్థులు ఊహించి సమాధానాన్ని టిక్ చేస్తుండటం వల్ల దానిపై పూర్తి అవగాహన ఉండటం లేదని, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు సంబంధించిన పూర్తి ఫార్ములా తెలియకుం డానే ఐఐటీల్లోకి వచ్చేస్తున్నారన్న భావన జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రతినిధు ల్లో నెలకొంది. అందుకే ఆబ్జెక్టివ్ విధానం రద్దు చేసి, ప్రశ్నపత్రంలో కేవలం ప్రశ్నలు మాత్రమే (నాలుగు ఆప్షన్లు ఇవ్వకుండా) ఇచ్చి జవాబును విద్యార్థే రాసేలా విధానం తీసుకురావాలని భావించారు. అయితే ప్రస్తుతానికి దానిని జేఏబీ పక్కనపెట్టింది. -
మే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
♦ పరీక్ష తేదీని ప్రకటించిన గౌహతి ఐఐటీ ♦ అడ్వాన్స్‌డ్‌కు 2 లక్షల మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 2016 మే 22న నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ ప్రకటించింది. తొలుత మే 22 లేదా 24న ఈ పరీక్ష ఉండొచ్చని ఐఐటీ వర్గాలు పేర్కొన్నప్పటికీ మే 22నే పరీక్ష జరుపుతామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులనే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ప్రకటిస్తుండగా ఇకపై జేఈఈ మెయిన్‌లో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా గౌహతి ఐఐటీ పేర్కొంది. మరోవైపు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2016 నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు (స్కోర్) ఇస్తున్న 40 శాతం వెయిటేజీని (మరో 60 శాతం జేఈఈ మెయిన్ స్కోర్‌కు ఇస్తారు) రద్దు చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సమర్పించిన సిఫార్సు నివేదికలో పేర్కొనగా.. దీనిపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మరో మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఆ తరువాత సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జేఈఈ మెయిన్-2016 నోటిఫికేషన్‌ను జారీ చే సే అవకాశం ఉంది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలను రెండు, మూడు రోజుల్లో గౌహతి ఐఐటీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
17న జేఈఈ మెయిన్ నోటిఫికేషన్?
♦ కసరత్తు చేస్తున్న సీబీఎస్ఈ ♦ ఈసారి ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలే! ♦ ఇంటర్ మార్కులకు వెయిటేజీ రద్దుపై త్వరలోనే స్పష్టత సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు క్రమంగా తెరపడుతోంది. వాటిల్లో ప్రవేశాల కోసం ఒకే పరీక్ష నిర్వహిస్తారా? పాత విధానంలోనే వేర్వేరు పరీక్షలు ఉంటాయా? అన్న గందరగోళం తొలగిపోనుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై పరీక్షల నిర్వహణ సం స్థలు వేర్వేరుగా చర్యలు దిగాయి. దీంతో 2016-17 విద్యా సంవత్సరంలో వేర్వేరు పరీక్షలే జరుగుతాయన్నది స్పష్టం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలు, 18 ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే మరో 18 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 17న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం సీబీఎస్ఈ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన టెండర్ నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ వెల్లడించింది. ఆన్‌లైన్‌ద్వారా అందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఇప్పటికే గౌహతి ఐఐటీ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా మే 22 లేదా 24వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తామంటూ తేదీని కూడా ఐఐటీ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఈ చర్యల నేపథ్యంలో ఈసారి ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు వేర్వేరు పరీక్షలే ఉంటాయని స్పష్టమవుతోంది. ఒకే పరీక్షకు జేఏబీ ప్రతిపాదన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చేపడుతోంది. ఇందుకోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ స్కోర్‌కు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేస్తోంది. ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతోంది. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏటా ఏదో ఒక ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఇక అన్ని ఐఐటీలు, సీబీఎస్ఈలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రవేశాలు చేపడుతోంది. అయితే జేఈఈ మెయిన్‌లో అత్యధిక మార్కులు సాధించిన 1.5 లక్షల మందిని మాత్రమే ఐఐటీ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇలా వేర్వేరు పరీక్షల విధానం వల్ల ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయని, సీట్లు మిగిలిపోతున్నాయన్న వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే పరీక్ష, ఒకే ర్యాంకు, ఒకే కౌన్సెలింగ్ విధానం అమల్లోకి తేవాలని జేఏబీ ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన అక్టోబర్ 1న వరంగల్ నిట్‌లో, 6వ తేదీన ముంబై ఐఐటీలో జరిగిన సమావేశాల్లో వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీల నివేదికలు ఇంకా రాలేదు. ఒకే పరీక్షతోపాటు ఎన్ఐటీ ప్రవేశాల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీని కూడా రద్దు చేయాలన్న ఆంశంపై అధ్యయనం చే యాలని స్పష్టం చేశారు. అయితే ఆ కమిటీల నివేదికల పరిస్థితి ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని పక్కనబెట్టి పాత పద్ధతిలోనే ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహణ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇంటర్ మార్కుల వెయిటేజీ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. -
‘ఐఐటీ’లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
అస్సాంలోని గువాహటి ఐఐటీలో దుర్ఘటన గువాహటి/కె.కోటపాడు(విశాఖ): అస్సాంలోని ఐఐటీ-గువాహటిలో బీటెక్ తుది సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పరమేశ్వరరావు గురువారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఐఐటీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకోడానికిగల కారణాలు తెలియాల్సి ఉందని, తనకు తక్కువ మార్కులు వచ్చిన నేపథ్యంలోనే పరమేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. చేతికందిన కొడుకుని కోల్పోయాం: చిన్ననాటి నుంచి ప్రతిభావంతుడిగా రాణించిన తమ కుమారుడి ఆత్మహత్యతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికంది వస్తాడని ఎదురు చూస్తుండగా ఇలా ఆత్మహత్యకు పాల్పడి తమకు తీరని శోకం మిగిల్చాడంటూ పరమేశ్వరరావు తండ్రి వెంకటరావు కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖ జిల్లా కె.కోటపాడుకు చెందిన చిరు వ్యాపారి వెంకటరావు కుమారుడు పరమేశ్వరరావు చిన్ననాటి నుండి చదువులో మేటి. విశాఖ జిల్లా కొమ్మాది నవోదయలో 10వ తరగతిలో 94.6% మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్లో 950 మార్కులు సాధించాడు. అనంతరం ఐఐటీ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు రావడంతో గువాహటి-ఐఐటీలో సీటు సాధించి మెకానికల్ బ్రాంచికి ఎంపికయ్యాడు. ఇటీవలే ఇంట్లో ఓ కార్యక్రమానికి వచ్చి వెళ్లిన పరమేశ్వరరావు మళ్లీ సంక్రాంతికి వస్తానని చెప్పినట్టు శోకతప్త హృదయంతో అతని తల్లి వెల్లడించారు. -
అత్యాచారం కేసులో ఐఐటీ ప్రొఫెసర్ అరెస్టు
ప్రతిష్ఠాత్మక ఐఐటీ సంస్థకు డీన్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రొఫెసర్‌ను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టుచేశారు. తమ వద్ద పనిచేసే ఓ మహిళా ఉద్యోగిపై ఐఐటీ విద్యావ్యవహారాల డీన్ అలోక్ కుమార్ ఘోషల్ దాదాపు నెల రోజుల పాటు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను సోమవారం నాడు ప్రశ్నించి, మంగళవారం సాయంత్రం ఐఐటీ క్యాంపస్ నుంచే అరెస్టుచేసి తీసుకెళ్లారు. నాలుగు రోజుల క్రితమే తమకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేశామని, సాక్ష్యాలు అందిన తర్వాత మరింత దర్యాప్తు కోసం ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆంద ప్రకాష్ తివారీ అనే సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కెమికల్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన ప్రొఫెసర్ ఘోషల్, తమ శాఖలోనే ఉండే ఆఫీసు అసిస్టెంటుపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఆయనను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆయనను డీన్ పదవినుంచి తొలగించారు. -
ర్యాగింగ్ ఫలితం:ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ గువాహటిలో మొదటి సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్గావ్ ప్రాంతానికి చెందిన తుషార్ యాదవ్ అనే ఈ విద్యార్థి తాను తీవ్ర డిప్రెషన్‌కు లోనైనట్లు తన సూసైడ్ నోట్లో రాసినా, ర్యాగింగ్ వల్లే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తుషార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, ఐఐటీ అధికారవర్గాలు మాత్రం తుషార్ ర్యాగింగ్‌కు గురికాలేదని అంటున్నారు. ఆత్మహత్య చేసుకోడానికి కొన్ని గంటల ముందు తుషార్ తన తల్లితో మాట్లాడాడని, అప్పుడు అతడు సాధారణంగానే కనిపించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ముందురోజు రాత్రి తుషార్ తన హాస్టల్ గదిలో లేడన్న విషయాన్ని తాము కనుగొన్నట్లు ఐఐటీ గువాహటి పీఆర్వో లబను కొన్వర్ తెలిపారు. గత మార్చి నెలలో కూడా ఎంఎస్సీ చదువుతున్న ఓ బెంగాలీ విద్యార్థి ఉరేసుకుని ఇదే ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు.