అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సురక్షితంగా సమాచారాన్ని బదిలీ చేసే సాంకేతిక వ్యవస్థను ఐఐటి గువహతి భౌతిక శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ బోసంతా రంజన్ బోరువా మరియు అస్సాంలోని అభయపురి కళాశాల భౌతిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతను కొన్వర్ నేతృత్వంలోని పరిశోధనా బృందం అభివృద్ధి చేసింది. "ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్"గా పిలుస్తున్న ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా 'వాయిస్, టెక్స్ట్ లేదా ఇమేజ్' రూపంలో ఉన్న సమాచారాన్నిఎలాంటి అవాంతరాలు లేకుండా పంపించవచ్చని పరిశోధనా బృందం తెలిపింది. సమాచార బదిలీ కోసం ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కాకుండా కాంతిని ఉపయోగించి ప్రసారం ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇది రాబోయే కొత్త తరం కమ్యూనికేషన్ టెక్నాలజీని సూచిస్తుంది అని పేర్కొన్నారు. వీటి ఫలితాలు ఇటీవల కమ్యూనికేషన్స్ ఫిజిక్స్‌లో ప్రచురించబడ్డాయి. (చదవండి: ప్లే స్టోర్ నుంచి మరో ఐదు యాప్స్ తొలగింపు)
గత రెండు దశాబ్దాలుగా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్‌లో అసాధారణ పరిస్థితుల కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన చాలా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డేటాను ఎన్కోడ్ చేయడానికి "వోర్టెక్స్ బీమ్" అని పిలువబడే ఒక రకమైన కాంతి పుంజాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వాతావరణంలో మార్పులు, గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటే కొంత సమాచారం నష్టపోయే ప్రమాదమున్నదని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి, ఐఐటి గువహతి పరిశోధకులు ఫ్రీ-స్పేస్ వ్యవస్థ ద్వారా సమాచారం నిక్షిప్తమైన కాంతి కిరణాన్ని ‘జెర్నిక్ పద్ధతి’ (ఆర్థోగోనల్‌గా కాంతిని ప్రసరింపజేయడం)లో పంపిస్తామని వివరించారు. తాము అభివృద్ధి చేసిన వ్యవస్థ ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాచార మార్పిడి జరుగుతుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment