Communication system
-
నాసా వ్యోమనౌక నుంచి సిగ్నల్స్ కట్, వోయేజర్–2కు మళ్లీ జీవం!
ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది. ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపు 12 బిలియన్ల మైళ్ల (దాదాపు 2,000 కోట్ల కిలోమీటర్లు) దూరంలో ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల గత నెల 21 తేదీన వోయేజర్–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి. కంట్రోలర్లు పొరపాటున తప్పుడు కమాండ్ పంపించడమే కారణమని సమాచారం. ఫలితంగా వోయేజర్–2 యాంటెనా స్వల్పంగా పక్కకు జరిగింది. దాంతో సంకేతాలు నిలిచిపోయాయి. నాసా సైంటిస్టులు వెంటనే రంగంలో దిగారు. సంకేతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ రేడియో యాంటెనాలతో కూడిన డీస్ స్పేస్ నెట్వర్క్ ద్వారా కమాండ్ పంపించారు. దీనికి వోయేజర్–2 స్పందించి 18 గంటల తర్వాత భూమిపైకి సంకేతాలను పంపించింది. నాసా శాస్త్రవేత్తలు వోయేజర్–2 యాంటెనాను సరిచేసే పనిలో విజయం సాధించారు. ఇందుకోసం కమాండ్‌ను పంపించారు. స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్‌ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. వోయేజర్–2 ఎప్పటిలాగే పనిచేస్తోందని, యధావిధిగా సేవలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేసింది. ఏమిటీ వోయేజర్–2? అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్ 5న వోయేజర్–1, 1977 ఆగస్టు 20న వోయేజర్–2 వ్యోమనౌకలను పంపించింది. కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో వీటిని రూపొందించారు. భూమికి సంబంధించిన శబ్ధాలు, చిత్రాలు, సందేశాలను ఇందులో చేర్చారు. గత 36 ఏళ్లుగా నిరి్వరామంగా పనిచేస్తున్నాయి. ఇతర గ్రహాల సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి. 2012 ఆగస్టులో వోయేజర్–1 ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. అంటే అంతరిక్షంలో లక్షల కోట్ల ఏళ్ల క్రితం కొన్ని నక్షత్రాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. ఆ తర్వాత వోయేజర్–2 కూడా ఈ స్పేస్‌లోకి ప్రవేశించింది. వోయేజర్–2 1986లో యురేనస్ గ్రహం సమీపానికి వచి్చంది. దాని ఉపగ్రహాలను గుర్తించింది. గురు, శనిగ్రహాలకి సంబంధించిన యూరోపా, ఎన్సిలాడస్ అనే ఉపగ్రహాలపై మంచు కింద సముద్రాల ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఐటి గువహతి పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సురక్షితంగా సమాచారాన్ని బదిలీ చేసే సాంకేతిక వ్యవస్థను ఐఐటి గువహతి భౌతిక శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ బోసంతా రంజన్ బోరువా మరియు అస్సాంలోని అభయపురి కళాశాల భౌతిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతను కొన్వర్ నేతృత్వంలోని పరిశోధనా బృందం అభివృద్ధి చేసింది. "ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్"గా పిలుస్తున్న ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా 'వాయిస్, టెక్స్ట్ లేదా ఇమేజ్' రూపంలో ఉన్న సమాచారాన్నిఎలాంటి అవాంతరాలు లేకుండా పంపించవచ్చని పరిశోధనా బృందం తెలిపింది. సమాచార బదిలీ కోసం ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కాకుండా కాంతిని ఉపయోగించి ప్రసారం ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇది రాబోయే కొత్త తరం కమ్యూనికేషన్ టెక్నాలజీని సూచిస్తుంది అని పేర్కొన్నారు. వీటి ఫలితాలు ఇటీవల కమ్యూనికేషన్స్ ఫిజిక్స్‌లో ప్రచురించబడ్డాయి. (చదవండి: ప్లే స్టోర్ నుంచి మరో ఐదు యాప్స్ తొలగింపు) గత రెండు దశాబ్దాలుగా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్లో అసాధారణ పరిస్థితుల కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన చాలా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డేటాను ఎన్కోడ్ చేయడానికి "వోర్టెక్స్ బీమ్" అని పిలువబడే ఒక రకమైన కాంతి పుంజాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా వాతావరణంలో మార్పులు, గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటే కొంత సమాచారం నష్టపోయే ప్రమాదమున్నదని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి, ఐఐటి గువహతి పరిశోధకులు ఫ్రీ-స్పేస్ వ్యవస్థ ద్వారా సమాచారం నిక్షిప్తమైన కాంతి కిరణాన్ని ‘జెర్నిక్ పద్ధతి’ (ఆర్థోగోనల్గా కాంతిని ప్రసరింపజేయడం)లో పంపిస్తామని వివరించారు. తాము అభివృద్ధి చేసిన వ్యవస్థ ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాచార మార్పిడి జరుగుతుందని వెల్లడించింది. -
మావోయిస్టుల కట్టడిపై కేంద్రం నజర్
భద్రాచలం: మావోయిస్టుల కట్టడిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాలను స్థావరాలుగా చేసుకుని.. కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులను నియంత్రించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల సరిహద్దులో ప్రస్తుతం 20 సెల్‌టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఏకకాలంలో పెద్ద మొత్తంలో బీఎస్ఎన్ఎల్ టవర్ల నిర్మా ణం జరగటం ఇదే ప్రథమం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగంగా మంజూరైన నిధులతో ప్రస్తుతం బీఎస్ఎన్ ఎల్ సెల్టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భద్రాచలం టెలికాం డివిజన్ పరిధిని విస్తరించి ఉన్న జిల్లాలోని గోదావరి నదికి ఇరువైపులా ఉన్న మండలాలతో ఏపీలో విలీనమైన మండలాల్లో కూడా టవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తు తం ఈ ప్రాంతంలో 50 బీఎస్ఎన్ఎల్ టవర్లు అందుబాటులో ఉన్నాయి. సోలార్ సిస్టమ్‌తో సిగ్నల్ వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టవర్ల ద్వారా విద్యుత్ సరఫరా ఉంటేనే సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ.. నూతన టవర్లు సోలార్ సిస్టమ్‌తో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో తరచూ తలెత్తే విద్యుత్ అవాంతరాలతో కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం లేకుండా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక టవర్ 4 నుంచి 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో సిగ్నల్ పనిచేస్తుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కూడా ఇదే రీతిన టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్లయితే అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో సెల్ హల్చల్ చేయనుంది. అడ్డుకట్ట వేయడమే లక్ష్యం కూంబింగ్ కోసం అటవీ ప్రాంతాల్లోకి వెళ్తున్న పోలీసు, సీఆర్పీ ఎఫ్, ప్రత్యేక బలగాలు సమాచారం కోసం వైర్లెస్ సిస్టమ్‌తో పనిచేసే వాకీటాకీలను ఉపయోగిస్తున్నారు. అలాగే గ్లోబల్ పొజిషన్ సిస్టం(జీపీఎస్) ద్వారా ముందుకు సాగుతూ.. అత్యవసర సమయంలో సంఘటనా స్థలం నుంచి సమాచారం చేరవేసేందుకు శాటిలైట్ ఫోన్లను ఇటీవల వినియోగిస్తున్నారు. వివిధ పోలీసు బలగాల జాయింట్ ఆపరేషన్లతో ఇటీవల కాలంలో మావోయిస్టులకు తీవ్ర నష్టమే వాటిల్లింది. గ్రామాల్లో బలంగా ఉన్న కొరియర్ వ్యవస్థ ద్వారా మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని మరింతగా రాబట్టి, వారికి అడ్డుకట్ట వేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎదురుదాడి తప్పదా? సమాచారాన్ని సత్వరమే రాబట్టుకునేందుకు ఒకేసారి పెద్ద ఎత్తున సెల్టవర్ల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ మావోయిస్టుల ఎదురుదాడి నుంచి వాటిని కాపాడుకోవటం సాధ్యమేనా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో నిర్మించే సెల్టవర్ల ద్వారా జరిగే నష్టాన్ని ముందుగానే ఊహించిన మావోయిస్టులు గతంలో దుమ్ముగూడెం మండలం చినబండిరేవు, ఆర్లగూడెం, కొత్తపల్లి, ఏపీలో విలీనమైన ఎటపాక మండలం లక్ష్మీపురం, గన్నవరం టవర్లు పనిచేయకుండా నిప్పంటించారు. భవిష్యత్‌లో కూడా ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని గిరిజనులు అంటున్నారు. -
‘సమాచార’ బంధం తెగింది!
- ఈదురుగాలుల దెబ్బ నుంచి ఇంకా కోలుకోని హైదరాబాద్ - రాజేంద్రనగర్ ప్రాంతంలో మూడో రోజూ వీడని అంధకారం - విద్యుత్ సరఫరా చేసినా.. సర్వీసు వైర్ల పునరుద్ధరణ మరిచారు - నగరవ్యాప్తంగా దెబ్బతిన్న చానెల్ యాంటెన్నా రిసీవర్లు, డిష్‌లు - తెగిపడిన కేబుళ్లతో చాలా చోట్ల టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ బంద్ - చార్జింగ్ లేక మూగబోయిన ఫోన్లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈదురుగాలులు, జడివాన దెబ్బకు అటు విద్యుత్ వ్యవస్థతో పాటు ఇటు సమాచార వ్యవస్థకూ తీవ్ర అంతరాయం కలిగింది. చార్జింగ్ లేక సెల్ఫోన్లు మూగబోయాయి. పలు చోట్ల సెల్‌ఫోన్ సిగ్నళ్లకూ అంతరాయం కలిగింది. రాజేంద్రనగర్ ప్రాంతంలోనైతే మూడో రోజూ అంధకారమే అలుముకుంది. విద్యుత్ సరఫరా లేక జనం నానా అవస్థలూ పడ్డారు. ఇక గాలుల తీవ్రతకు కేబుల్ ఆపరేటర్లతోపాటు ఇళ్లలోని డీటీహెచ్ యాంటెన్నాలు, కేబుళ్లు దెబ్బతిన్నాయి. దీంతో అంతో ఇంతో విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాల్లోనూ జనం టీవీలను వినియోగించుకోలేకపోయారు. మరోవైపు వివిధ ఇంటర్నెట్ సర్వీసు సంస్థలకు చెందిన తీగలు తెగిపోవడం, బాక్స్‌లకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు చోట్ల ఇంటర్నెట్ కూడా నిలిచిపోయింది. సర్వీసు వైర్లు దెబ్బతినడంతోనే.. విద్యుత్ లైన్లను పునరుద్ధరించి సరఫరా చేసినప్పటికీ... స్తంభాల నుంచి ఇళ్లలోకి విద్యుత్ సరఫరా చేసే సర్వీసు వైర్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. దాంతో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకుండా పోయింది. ఫలితంగా రాజేంద్రనగర్, బండ్లగూడ, శాంతినగర్, హైదర్‌గూడ, ఉప్పర్‌పల్లి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, శివరాంపల్లి, హ్యాపీహోమ్స్, గోల్డెన్‌హైట్స్ తదితర ప్రాంతాల్లోని వినియోగదారులు ఆదివారం రాత్రి కూడా అంధకారంలోనే మగ్గాల్సి వచ్చింది. మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవ డంతో బోర్లు పనిచేయలేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికే కాదు, తాగడానికి కూడా మంచినీరు లేక జనం ఇబ్బందులు పడ్డారు. చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. కొత్త వైరు తెచ్చుకుంటే కనెక్షన్ ఇస్తాం ‘‘ఈదురుగాలి వర్షానికి విద్యుత్ తీగలు, స్తంభాలేకాదు వినియోగదారుల సర్వీసు వైర్లు కూడా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి, విద్యుత్ కూడా సరఫరా చేశాం. సర్వీసు వైర్లు దెబ్బతిన్న చోట కొత్తవి తెచ్చుకుంటే వెంటనే కనెక్షన్ ఇచ్చాం. అక్కడక్కడ కొంత మంది ఇంకా తెచ్చుకోలేదు. సర్వీసు వైరు తెచ్చుకుని సమాచారమిస్తే లైన్మెన్ వచ్చి కనెక్షన్ ఇస్తారు..’’ - రఘుమారెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ -
చౌక ఉపగ్రహం సిద్ధం
వాషింగ్టన్: అత్యంత చౌకయిన చిన్న ఉపగ్రహాన్ని అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీని పేరు ‘సన్ క్యూబ్ ఫెమిటో శాట్’. ఇది 3 ఘనపు సెంటీ మీటర్ల పరిమాణంలో, 35 గ్రాముల బరువుతో తయారైంది. దీనికి కమ్యూనికేషన్ వ్యవస్థ, సమాచార సేకరణ, చోదన సామర్థ్యం ఉంది. కిలో బరువైన ఉపగ్రహ ప్రయోగానికి రూ. 46 లక్షలు ఖర్చవుతుంది. కానీ సన్ క్యూబ్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపడానికి రూ. 66 వేలు, భూకక్ష్యలోకి పంపడానికి రూ. 2 లక్షలు, భూగురుత్వాకర్షణను దాటి పంపడానికి రూ. 17 లక్షలే ఖర్చవుతుందట. -
వైఫై కన్నా వందరెట్లు వేగంతో లైఫై..
లైఫై ఇప్పుడు వైఫై కి దీటుగా మార్కెట్లోకి రాబోతోంది. 2011 లో లాబ్ లో కొత్తగా ఆవిష్కృతమై... 224 గిగాబైట్స్ వేగంతో పలు పరీక్షల అనంతరం ప్రపంచానికి పరిచయం కాబోతోంది. కార్యాలయాలు, పారిశ్రామిక వాతావరణంలో శాస్త్రవేత్తలు లైఫై పై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్ ఈ డీ లైట్ల కాంతి తరంగాలతో ఈ కొత్త వ్యవస్థ.. కమ్యూనికేషన్ కు ఎంతో ఉపయోగంగా ఉండటంతోపాటు.. సురక్షితంగా కూడ ఉంటుందని భావిస్తున్నారు. 'విజిబుల్ లైట్ కమ్యూనికేషన్' తో పనిచేసే కొత్త లైఫై... వైఫై కన్నా వంద రెట్టు వేగంగా పనిచేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాంతిని ఉపయోగించి సమాచారాన్ని డేటాగా ప్రసారం చేసేందుకు ఇప్పుడు ట్వాలిన్, ఎస్టోనియాలోని కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో దీన్ని పరీక్షించారు. ఈ లైఫై...లో ఇంటర్నెట్ వినియోగంలోనే విప్లవాత్మక మార్పును తెచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త వైర్ లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్ తో (సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో) కాంతి.. బైనరీ కోడ్ లో సందేశాలను బదిలీ చేస్తుంది. ఈ విజిబుల్ లైట్ గోడలనుంచి ప్రసారం కాదు. పైగా సురక్షితంగా ఉండటంతోపాటు ఎటుపడితే అటు ప్రసరించేందుకు వీలుగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఇప్పటికిప్పుడు వైఫైని భర్తీ చేయకపోయినా.. కొద్ది రోజుల్లో దానికి దీటుగా పనిచేసే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. స్కాట్ ల్యాండ్ ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011 లో లైఫైని కొత్తగా కనుగొన్నారు. ఒకే ఎల్ ఈ డీ నుంచి ప్రసారమయ్యే మినుకు మినుకుమనే కాంతి ద్వారా సెల్యులార్ టవర్ కంటే ఎక్కువగా డేటా ప్రసారం అవుతుందని హాస్ ప్రదర్శించారు. మోర్స్ కోడ్ మాదిరిగానే ఈ వ్యవస్థ కాంతిని ఉపయోగించి ప్రసారం చేసినా.. కంటితో గుర్తించలేనంత వేగంతో కమ్యూనికేషన్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పలు పైలట్ ప్రాజెక్ట్ లను నిర్వహించిన పరిశోధకులు...ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతంలో సులభంగా ప్రసారాలకోసం ఓ స్మార్ట్ లైట్ సొల్యూషన్ ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఈ సురక్షిత వైర్ లెస్ యాక్సిస్ కోసం హాస్ టీమ్ ఓ ప్లే ప్లగ్ ను, అప్లికేషన్ ను రూపొందించారు. 'ఒలెడ్ కాం' అనే ఓ ఫ్రెంచ్ సంస్థ లైఫై వాడకంతోపాటు.. ఈ వ్యవస్థను స్థానిక ఆసుపత్రుల్లో కూడ ఇన్ స్టాల్ చేసింది. ఈ లైఫై వైర్ లెస్ డేటా ట్రాన్స్ మిషన్ భవిష్యత్తును మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా చేస్తుందని సైంటిస్ట్ హాస్ ఆశిస్తున్నారు. -
చేరువయ్యే వేళ.. ఏం చేస్తుందో?
* జిల్లావ్యాప్తంగా ‘హుదూద్’ కలవరం * భీతిల్లుతున్న తీరప్రాంతవాసులు * కాకినాడ పోర్టులో 3వ నంబర్ హెచ్చరిక * తీర ప్రాంత మండలాల్లో అధికారుల హై అలర్ట్ * నేడు అన్ని పాఠశాలలకూ సెలవు * కలెక్టరేట్లో ‘1949’తో శాటిలైట్ ఫోన్ ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సోమవారం కూడా సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. తుపాను వల్ల జిల్లాలో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దెబ్బతిన్నా.. పనిచేసే శాటిలైట్ ఫోన్‌ను ‘1949’ నంబర్‌తో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటుచేశారు. కలెక్టర్ నీతూప్రసాద్ బీఎస్ఎన్ఎల్ అధికారులతో మాట్లాడి ఈ సదుపాయం కల్పించారు. కాకినాడకు హోప్ ఐలాండ్వాసులు తుపాను విశాఖ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ జిల్లాకు ఆనుకుని ఉన్న కోటనందూరు, తొండంగి, తుని, రౌతులపూడి మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తీరప్రాంతంలోని ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, అర్బన్, తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందనే నిర్ధారణకు వచ్చిన యంత్రాంగం ఆ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ మండలాలతో పాటు కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి, మలికిపురం తీర మండలాలనూ అప్రమత్తం చేశారు. కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్‌లో రాకపోకలను నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా 188 జనావాసాల్లోని 1.95 లక్షల మంది తుపాను తాకిడికి గురయ్యే అవకాశం ఉందన్న అంచనాతో వారి పునరావాసానికి 126 భవనాల్ని గుర్తించినట్టు జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు అమలాపురంలో తెలిపారు. తీరానికి కిలోమీటరు దూరంలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్ వాసులను కూడా కాకినాడకు తరలించనున్నారు. జిల్లాకు ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాగా ఇప్పటికే వేటకు వెళ్లి సముద్రంలో ఉన్న 20 బోట్లలోని మత్స్యకారులతో శుక్రవారం మాట్లాడిన అధికారులు వారిని తీరానికి రప్పించడంలో నిమగ్నమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ ధార్ ఆధ్వర్యంలో ఆరు బృందాలు జిల్లాకు వచ్చాయి. వాటిని తుని, తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రిజర్వుగా మంగళగిరిలో ఉంచారు. 45 మంది ఉండే ప్రతి బృందానికీ నాలుగు బోట్లు సమకూర్చారు. ఈ బృందాలు తీరం దాటే సమయంలో అవసరమైన తావుల్లో ప్రజలకు రక్షణ కల్పిస్తాయి. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కోస్టుగార్డు, నేవీ తదితర శాఖల అధికారులు తీర గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 60 టన్నుల బియ్యం సిద్ధం తుపానుతో బాధితులయ్యే వారి కోసం పౌరసరఫరాల జిల్లా అధికారి రవికిరణ్ ఆధ్వర్యంలో 60 మెట్రిక్ టన్నుల బియ్యం, 168 కిలో లీటర్ల కిరోసిన్ సిద్ధం చేశారు. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనా పనిచేసే ఆరు ఆస్కా దీపాలను అగ్నిమాకశాఖ సిద్ధం చేసింది. జిల్లాలో అన్ని మండలాల అధికారులు 48 గంటల పాటు విధుల్లోనే ఉండాలని జిల్లా కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. తుపాను ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కలెక్టరేట్లో శుక్రవారం రాత్రి డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.