చౌక ఉపగ్రహం సిద్ధం
వాషింగ్టన్: అత్యంత చౌకయిన చిన్న ఉపగ్రహాన్ని అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీని పేరు ‘సన్ క్యూబ్ ఫెమిటో శాట్’. ఇది 3 ఘనపు సెంటీ మీటర్ల పరిమాణంలో, 35 గ్రాముల బరువుతో తయారైంది. దీనికి కమ్యూనికేషన్ వ్యవస్థ, సమాచార సేకరణ, చోదన సామర్థ్యం ఉంది. కిలో బరువైన ఉపగ్రహ ప్రయోగానికి రూ. 46 లక్షలు ఖర్చవుతుంది. కానీ సన్ క్యూబ్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపడానికి రూ. 66 వేలు, భూకక్ష్యలోకి పంపడానికి రూ. 2 లక్షలు, భూగురుత్వాకర్షణను దాటి పంపడానికి రూ. 17 లక్షలే ఖర్చవుతుందట.