
బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరుగుతున్న ‘ఏరో ఇండియా 2025’లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. సాయుధ దళాల సామర్థ్యాలను పెంపొందించడంలో బీఈఎల్ సేవలందిస్తోంది. ఈ ఏడాది జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో కంపెనీ అధునాతన ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.
కమ్యూనికేషన్ సిస్టమ్స్..
బీఈఎల్ ఏరో ఇండియా 2025లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఇందులో సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో (ఎస్‌డీఆర్), రేడియో ఆన్ ది మూవ్ (ఆర్‌ఓఎం), హై కెపాసిటీ రేడియో రిలే (హెచ్‌సీఆర్) టెక్నాలజీలున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ అధునాతన ఉత్పత్తులు సైనిక కార్యకలాపాలకు విశ్వసనీయ, సురక్షితమైన కమ్యూనికేషన్ మార్గాలను అందించడానికి రూపొందించినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణంలోనూ అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఈ వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలతో పాటు అసాల్ట్ రైఫిల్స్ కోసం అన్ కూల్డ్ థర్మల్ ఇమేజర్ సైట్, పాసివ్ నైట్ విజన్ గాగుల్స్, బోర్డర్ అబ్జర్వేషన్ సర్వైలెన్స్ సిస్టమ్‌తో సహా ఎలక్ట్రో-ఆప్టిక్ పరికరాలను బీఈఎల్ ప్రదర్శిస్తుంది.
ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలు
హెలికాప్టర్ల కోసం స్టాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, నావల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం వ్యూహాత్మక డేటా లింక్ వంటి ఎయిర్‌బోర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఏవియానిక్స్ డొమైన్‌లో ప్రత్యేక ఉత్పత్తులను బెల్ ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థలు విమానాలు, నౌకల భద్రతను, వాటి పనితీరును మెరుగుపరచడానికి రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. షిప్ బోర్న్ సిస్టమ్స్‌లో పాసివ్ హైడ్రోఫోన్ ఎలిమెంట్ (లో అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ), HUMSA-NG ట్రాన్స్ డ్యూసర్ ఎలిమెంట్, షిప్ ఆధారిత SIGINT EW సిస్టమ్‌లను బెల్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థలు నీటి అడుగున నిఘాకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం అధునాతన సామర్థ్యాలను అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment